దేశ వ్యాప్తంగా ఉన్న నేషనల్ లా యూనివర్సిటీలలో బ్యాచిలర్ ఆఫ్ లా (యూజీ) మరియు మాస్టర్ ఆఫ్ లా(పీజీ) కోర్సుల యందు ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్ ఎగ్జామ్) 2024 నోటిఫికేషన్ వెలువడింది.
నేషనల్ లా యూనివర్సిటీల ఆధ్వర్యంలో జరిగే ఈ పరీక్షలో అర్హుత సాధించటం ద్వారా దేశంలో ఉన్న 24 నేషనల్ లా యూనివర్సిటీలతో పాటుగా ఇంకో 50 పైగా ప్రైవేట్ లా ఇనిస్టిట్యూట్లలో ఎల్‌ఎల్‌బీ, ఎల్ఎల్ఎం వంటి కోర్సుల యందు ప్రవేశాలు పొందొచ్చు.
Exam Name | CLAT 2024 |
Exam Type | Entrance Test |
Admission For | LLB, LLM |
Exam Date | 03/12/2023 |
Exam Duration | 2 Hours |
Exam Level | National Level |
నేషనల్ లా యూనివర్సిటీల లిస్ట్
క్లాట్ ఎలిజిబిలిటీ
- బ్యాచిలర్ ఆఫ్ లా(ఎల్‌ఎల్‌బీ): నేషనల్ యూనివర్సిటీలలో యూజీ కోర్సుల ప్రవేశల కోసం దరఖాస్తు చేసే వారు 45 శాతం మార్కులతో 10+2 లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత అయి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 40శాతం మార్కులు తప్పనిసరి.
- ఇంటర్మీడియట్ చివరి ఏడాది చదువుతున్న వారు లేదా పూర్తి అయి ఫలితాల కోసం వేచిచూస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- దరఖాస్తు చేసేందుకు ఎటువంటి గరిష్ట వయోపరిమితి లేదు.
- మాస్టర్ ఆఫ్ లా (ఎల్ఎల్ఎం): నేషనల్ యూనివర్సిటీలలో యూజీ కోర్సుల ప్రవేశల కోసం దరఖాస్తు చేసే వారు 55 శాతం మార్కులతో బ్యాచిలర్ ఆఫ్ లా లేదా దానికి సమానమైన కోర్సులలో ఉత్తీర్ణతై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 50శాతం మార్కులు తప్పనిసరి.
- చివరి ఏడాది చదువుతున్న వారు లేదా కోర్సు పూర్తి అయి ఫలితాల కోసం వేచిచూస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- దరఖాస్తు చేసేందుకు ఎటువంటి గరిష్ట వయోపరిమితి లేదు.
క్లాట్ 2024 షెడ్యూల్
దరఖాస్తు ప్రారంభ తేదీ | 01 జులై 2023 |
దరఖాస్తు చివరి తేదీ | 10 నవంబర్ 2023 |
హాల్ టికెట్ డౌన్‌లోడ్ | 28 నవంబర్ 2023 |
పరీక్ష తేదీ | 03 డిసెంబర్ 2023 |
ఫలితాలు | డిసెంబర్ 2023 |
కౌన్సిలింగ్ | జనవరి 2024 |
క్లాట్ దరఖాస్తు ఫీజు
దరఖాస్తు రుసుములు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ లేదా ఈ చలానా విధానంలో చెల్లించవచ్చు. చెల్లింపు సమయంలో సర్వీస్ చార్జీలు, జీఎస్టీ వంటి అదనపు చార్జీలు ఉంటె అభ్యర్థులనే భరించాలి.
ఎస్సీ, ఎస్టీ, బీపీఎల్ కేటగిరి అభ్యర్థులు | 3,500/- |
జనరల్ కేటగిరీల అభ్యర్థులు | 4,000/- |
మునపటి ప్రశ్న పత్రాలు | 500/- |
క్లాట్ ఎగ్జామ్ దరఖాస్తు ప్రక్రియ
క్లాట్ దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది. క్లాట్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసే ముందు సంబంధిత సర్టిఫికేట్లు అన్ని అందుబాటులో ఉంచుకోవాలి. దరఖాస్తు సమయంలో అందించే సమాచారంకు పూర్తి జవాబుదారీ మీరే కాబట్టి ఇచ్చే సమాచారంలో తప్పులు దొర్లకుండా చూసుకోండి.
ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీలు, రిజర్వేషన్ కేటగిరి, భాష ఎంపిక, పరీక్ష కేంద్రం వంటి వివరాలు దరఖాస్తు పూర్తిచేసేముందు పునఃపరిశీలించుకోండి. దరఖాస్తు పూర్తిచేసాక మూడు లేదా నాలుగు కాపీలు ప్రింట్ తీసి భద్రపర్చండి.
- మీరు ప్రాధాన్యత ఇచ్చే నేషనల్ యూనివర్సిటీ ఎంపికను దరఖాస్తు సమయంలో ఎంచుకోవాల్సి ఉంటుంది.
- వైట్ బ్యాక్ గ్రౌండ్ తో ఈమధ్య కాలంలో తీసుకున్న పాసుపోర్టు సైజు ఫోటో అందుబాటులో ఉంచుకోండి. కంప్యూటర్ లో డిజైన్ లేదా ఎడిట్ చేసిన ఫోటోలు అనుమతించబడవు.
- మీ సొంత దస్తూరితో చేసిన సంతకాన్ని అప్‌లోడ్ చేయండి. కాపిటల్ లేటర్స్ తో చేసిన సంతకం చెల్లదు.
- ఫొటోగ్రాఫ్, సంతకం వాటికీ సంబంధించిన బాక్సుల్లో మాత్రమే అప్‌లోడ్ చేయండి. అవి తారుమారు ఐతే దరఖాస్తు పరిగణలోకి తీసుకోరు. ఈ ఫైళ్ల సైజు 10-200 కేబీల మధ్య ఉండేలా చూసుకోండి.
- దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేసిన ఫొటోగ్రాఫ్ కు సమానమైనది ఇంకో ఫొటోగ్రాఫ్ ను పరీక్ష రోజు ఆయా పరీక్షకేంద్రంలో ఇవ్వాల్సి ఉంటుంది.
- అడ్మిట్ కార్డు అందుబాటులో ఉండే తేదిలో పిడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్‌లోడ్ చేసుకోండి.
- పరీక్ష రోజు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది.
- అడ్మిట్ కార్డు, ఫొటోగ్రాఫ్ తో పాటు వ్యక్తిగత ఐడెంటి కార్డుతో పరీక్షకు హాజరవ్వాలి.
- నిషేదిత వస్తువులు పరీక్ష కేంద్రంలోకి ఎట్టి పరిస్థితిల్లో అనుమతించబడవు.
తెలుగు రాష్ట్రాలలో క్లాట్ ఎగ్జామ్ సెంటర్లు
- విజయవాడ
- విశాఖపట్నం
- హైదరాబాద్
క్లాట్ ఎగ్జామ్ నమూనా
క్లాట్ యూజీ ఎగ్జామ్ నమూనా
బ్యాచిలర్ అఫ్ లా ప్రవేశాల కోసం జరిగే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ ఆఫ్‌లైన్ లో రాతపరీక్ష విధానం ద్వారా జరుగుతుంది. 2 గంటల నిడివితో 150 మార్కులకు జరిగే ఈ పరీక్షలో మొత్తం 150 మల్టిఫుల్ ఛాయస్ ప్రశ్నలు ఐదు సెక్షన్ లుగా విభజించబడి ఉంటాయి. సరైన సమాధానం ఇచ్చిన ప్రశ్నకు 1 మార్కు, తప్పు సమాధానం ఇచ్చిన ప్రశ్నలకు -0.25 మార్కులు ఇవ్వబడతాయి.
- సెక్షన్ 1 ఇంగ్లీష్ కంప్రెహెన్షన్: ఈ సెక్షన్ లో ఆంగ్ల బాష వ్యాకరణం కు సంబంధించి అభ్యర్థి యొక్క ప్రాథమిక జ్ఞానాన్ని పరీక్షిస్తారు. ఈ సెక్షన్ లో మొత్తం 40 ప్రశ్నలు ఇవ్వబడతయి.
- సెక్షన్ 2 జీకే మరియు కరెంటు అఫైర్స్: ఈ సెక్షన్ లో జనరల్ నాలెడ్జ్ తో పాటుగా దేశ మరియు అంతర్జాతీయంగా జరిగిన తాజా వ్యావహారాల యందు అభ్యర్థికి ఉన్న అవగాహనను అంచనా వేస్తారు. ఈ సెక్షన్ నుండి మొత్తం 50 ప్రశ్నలు ఇవ్వబడతాయి.
- సెక్షన్ 3 మ్యాథమెటిక్స్ : మ్యాథమెటిక్స్ సంబంధించి పది స్థాయిలో అభ్యర్థి యొక్క ప్రాథమిక జ్ఞానాన్ని పరీక్షిస్తారు. ఈ సెక్షన్ లో మొత్తం 20 ప్రశ్నలు ఇవ్వబడతాయి.
- సెక్షన్ 4 లీగల్ ఆప్టిట్యూడ్ : ఈ సెక్షన్ న్యాయవిద్య యందు అభ్యర్థికి ఉన్న ఆసక్తి, అభిరుచులను పరిశీలించే విధంగా ఉంటుంది. ముఖ్యంగా అభ్యర్థికి సమస్యల పట్ల ఉన్న అవగాహనా, సమస్యల పరిష్కరించే సామర్థ్యం, పరిశోధనాత్మక ఆలోచన విధానం వంటి వివిధ అంశాలను అంచనా వేస్తారు. ఈ సెక్షన్ లో 50 ప్రశ్నలు ఇవ్వబడతాయి.
- సెక్షన్ 5 లాజికల్ రీజనింగ్ సంబంధించి 40 ప్రశ్నలు ఇవ్వబడతయి .
సిలబస్ | ప్రశ్నలు సంఖ్యా | మార్కులు |
---|---|---|
ఇంగ్లీష్ కంప్రెహెన్షన్ | 20 శాతం | 30 |
జీకే మరియు కరెంటు అఫైర్స్ | 25 శాతం | 40 |
క్వాంటిటేటివ్ టెక్నిక్స్ | 10 శాతం | 10 |
లీగల్ ఆప్టిట్యూడ్ | 25 శాతం | 40 |
లాజికల్ రీజనింగ్ | 20 శాతం | 30 |
సమయం 2 గంటలు | 150 ప్రశ్నలు | 150 మార్కులు |
క్లాట్ పీజీఎగ్జామ్ నమూనా
న్యాయవిద్య లో పోస్టు గ్రాడ్యుయేషన్ ప్రవేశాల కోసం జరిగే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ ఆఫ్‌లైన్ లో రాతపరీక్ష విధానం ద్వారా జరుగుతుంది. 2 గంటల నిడివితో 120 మార్కులకు జరిగే ఈ పరీక్షలో మొత్తం 120 మల్టిఫుల్ ఛాయస్ ప్రశ్నలతో పాటుగా చట్టము మరియు సమకాలీన సమస్యల పై 800 పదాలకు తగ్గకుండా రెండు వ్యాసరూప ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
సరైన సమాధానం ఇచ్చిన మల్టిఫుల్ ఛాయస్ ప్రశ్నలకు 1 మార్కు, తప్పు సమాధానం ఇచ్చిన ప్రశ్నలకు -0.25 మార్కులు ఇవ్వబడతాయి. వ్యాసరూప ప్రశ్నలకు ఒక్కోదానికి 25 మార్కులు.
సిలబస్ | ప్రశ్నలు | మార్కులు |
---|---|---|
రాజ్యాంగ చట్టాలు | 40 ప్రశ్నలు | 40 మార్కులు |
కాంట్రాక్ట్, క్రిమినల్ లా, ఇంటర్నేషనల్ లా, ఫామిలీ లా, కంపెనీ లా, ప్రాపర్టీ లా, టాక్స్ లా, పబ్లిక్ ఇంటర్నేషనల్ లా, ఐపీఆర్ etc | 80 ప్రశ్నలు | 80 మార్కులు |
సమయం 2 గంటలు | 120 ప్రశ్నలు | 120 మార్కులు |
క్లాట్ అడ్మిషన్ విధానం
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ యొక్క తుది ఫలితాలు విడుదల అయ్యాక నేషనల్ లా యూనివర్సిటీల ఆధ్వర్యంలో కేంద్రీకృత ఆన్‌లైన్ కౌన్సిలింగ్ విధానం ద్వారా వివిధ నేషనల్ లా యూనివర్సిటీల యందు ఉన్న సీట్ల లభ్యత ఆధారంగా చేసుకుని ప్రవేశాలకు అవకాశం కల్పిస్తారు.
ఈ ప్రక్రియలో అభ్యర్థి క్లాట్ పరీక్షలో సాధించిన మెరిట్, దరఖాస్తు సమయంలో అభ్యర్థి ప్రాధాన్యత ఇచ్చిన యూనివర్సిటీ, రిజర్వేషన్ కేటగిరి, అభ్యర్థి వయసు వంటివి ప్రవేశాలు కల్పించే విషయంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి.
క్లాట్ సిలబస్ & మోడల్ పేపర్
క్లాట్ యూజీ 2024 | క్లాట్ పీజీ 2024 |
---|---|
సిలబస్ | సిలబస్ |
క్వశ్చన్ పేపర్ ఫార్మేట్ | క్వశ్చన్ పేపర్ ఫార్మేట్ |
నేషనల్ లా యూనివర్సిటీలు | దరఖాస్తు చేయండి |