Advertisement
ముఖ్యమైన రోజులు మరియు తేదీలు ఏప్రిల్ 2024
Important Dates

ముఖ్యమైన రోజులు మరియు తేదీలు ఏప్రిల్ 2024

ముఖ్యమైన రోజులు మరియు తేదీలు ఏప్రిల్ 2024 కోసం చదవండి. ఏప్రిల్ నెలలో జరుపుకునే వివిధ జాతీయ దినోత్సవాలు మరియు అంతర్జాతీయ దినోత్సవాల వివరాలు తెలుసుకోండి.

వరల్డ్ ఆటిజం అవేర్‌నెస్ డే : ఏప్రిల్ 02

  • ప్రపంచ ఆటిజం అవేర్‌నెస్ డే అనేది ప్రతి సంవత్సరం ఏప్రిల్ 2న అంతర్జాతీయంగా జరుపుకుంటారు.
  • ఈ కార్యక్రమంను ప్రపంచవ్యాప్తంగా ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్‌తో బాధపడుతున్న వ్యక్తుల గురించి అవగాహన పెంచడానికి ఐక్యరాజ్యసమితి తన సభ్య దేశాలను ప్రోత్సహిస్తుంది.
  • ఈ రోజున  పాఠశాలల్లో పిల్లలకు ఆటిజం గురించి అవగాహన కల్పిస్తారు.
  • ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ASD) అనేది నాడీ వ్యవస్థపై ప్రభావం చూపే రుగ్మత.
  • ఇది బాధిత వ్యక్తి యొక్క మొత్తం అభిజ్ఞా, భావోద్వేగ, సామాజిక మరియు శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
  • ఇది జన్యుపరమైన మార్పులు (మ్యుటేషన్లు) వలన లేదా ఇతర జెనిటిక్ రుగ్మతల వలన సంభవిస్తుంది.

ఇంటర్నేషనల్ మైన్ అవేర్‌నెస్ డే : ఏప్రిల్ 04

  • ప్రతి సంవత్సరం, ఏప్రిల్ 4వ తేదీని మైన్ అవేర్‌నెస్ మరియు మైన్ యాక్షన్‌లో అసిస్టెన్స్ దినోత్సవంగా జరుపుకుంటారు.
  • ల్యాండ్‌మైన్‌ల గురించి అవగాహన పెంచడంతో పాటుగా మందుపాతరలు మరియు ఇతర పేలుడు అవశేషాలు నిర్మూలన దిశగా పురోగతి సాధించడం కోసం ఈ వేడుకను నిర్వహిస్తారు.
  • ఈ కార్యక్రమం 8 డిసెంబర్ 2005 లో యూఎన్ జనరల్ అసెంబ్లీ తీర్మానం ద్వారా ప్రారంభించబడింది.

నేషనల్ మారిటైమ్ డే : ఏప్రిల్ 05

  • ఇండియన్ నేషనల్ మారిటైమ్ డేను ఏటా ఏప్రిల్ 5న జరుపుకుంటారు.
  • ఈ వేడుకను భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో సముద్ర వాణిజ్యం యొక్క పాత్ర మరియు ప్రపంచ వాణిజ్యంలో భారతదేశం యొక్క పాత్ర మరియు వ్యూహాత్మక స్థానంను గుర్తుచేసుకునేందుకు నిర్వహిస్తారు.
  • ఈ జాతీయ సముద్రయాన దినోత్సవాన్ని మొదటిసారిగా ఏప్రిల్ 5, 1964న జరుపుకున్నారు.

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం : ఏప్రిల్ 07

  • ఏటా ఏప్రిల్ 7వ తేదీని ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటారు.
  • 1948లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ మొదటి ప్రపంచ ఆరోగ్య సమావేశాన్ని నిర్వహించింది.
  • 1950 నుండి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7ని ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకోవాలని యూఎన్ జనరల్ అసెంబ్లీ నిర్ణయించింది.
  • ప్రజలలో శారీరిక, మానసిక ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత తెలియపర్చేందుకు ఈ వేడుకను నిర్వహిస్తారు.

ప్రపంచ హోమియోపతి దినోత్సవం : ఏప్రిల్ 10

  • ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని ఏటా ఏప్రిల్ 10వ తేదీన జరుపుకుంటారు.
  • హోమియోపతి వ్యవస్థాపకుడు డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడ్రిక్ శామ్యూల్ హానెమాన్ (1755-1843) జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
  • దీనిలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా హోమియోపతిపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
  • భారతదేశంలో హోమియోపతి ప్రస్థానం దాదాపు 200 సంవత్సరాల క్రితం జర్మన్ మిషనరీలు ద్వారా ప్రారంభమైనట్లు చరిత్ర చెప్తుంది.

వరల్డ్ పార్కిన్సన్స్ డే : ఏప్రిల్ 11

  • పార్కిన్సన్స్ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 11న ప్రపంచ పార్కిన్సన్స్ డే జరుపుకుంటారు.
  • పార్కిన్సన్స్ వ్యాధి అనేది మెదడుకు సంబంధించిన రుగ్మత. ఇది మెదడులోని సబ్‌స్టాంటియా నిగ్రా అని పిలువబడే నాడీ కణాలను కోల్పోవడం వల్ల వస్తుంది.
  • ఈ కణాలు డోపమైన్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేయడానికి బాధ్యత వహిస్తాయి.
  • మెదడులోని నరాల కణాల దెబ్బతినడం వల్ల డోపమైన్ స్థాయిలు తగ్గుతాయి, ఇది పార్కిన్సన్స్ లక్షణాలకు దారితీస్తుంది.
  • పార్కిన్సన్స్ రోగి యొక్క శారీరక సమతుల్యతను మరియు సమన్వయంను క్షిణింపజేస్తుంది.
  • పార్కిన్సన్ యొక్క లక్షణాలు ప్రారంభంలో కొద్దిగా ఉన్నప్పటికీ, కాలక్రమేణా అధ్వాన్నంగా మారి, రోగి నడవడానికి మరియు మాట్లాడటానికి ఇబ్బందిపడేలా చేస్తుంది.

జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం : ఏప్రిల్ 11

  • జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 11 వ తేదీన జరుపుకుంటారు.
  • ఇది గర్భిణీ స్త్రీకి అవసరమైన సంరక్షణ గురించి అవగాహన కల్పించడంలో భాగంగా నిర్వహిస్తారు.
  • కస్తూర్‌బాయి మోహన్‌దాస్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
  • కస్తూర్‌బాయి గాంధీ ప్రముఖ భారతీయ రాజకీయ కార్యకర్త. ఆమె 1883లో మహాత్మా గాంధీని వివాహం చేసుకున్నారు.
  • ఈమె గాంధీజీ అడుగుజాడల్లో బ్రిటిష్ ఇండియాలో భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు.

ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ : ఏప్రిల్ 12

  • ఏప్రిల్ 12, 1961 న యూరి గగారిన్ చేసిన మొదటి మానవ అంతరిక్ష విమాన వార్షికోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 12 న అంతర్జాతీయ మానవ అంతరిక్ష విమాన దినోత్సవం జరుపుకుంటారు.
  • ఈ వేడుకను 7 ఏప్రిల్ 2011న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ యొక్క 65వ సెషన్‌ తీర్మానం ద్వారా ప్రారంభించారు.

సియాచిన్ దినోత్సవం : ఏప్రిల్ 13

  • భారత సైన్యం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 13వ తేదీన సియాచిన్ దినోత్సవాన్ని జరుపుకుంటుంది.
  • "ఆపరేషన్ మేఘదూత్" కింద భారత సైన్యం యొక్క ధైర్యాన్ని స్మరించుకోవడానికి ఈ రోజును జరుపుకుంటారు.
  • ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమిలో 13 ఏప్రిల్ 1984 ఉదయం శత్రు సైనం దాడిచేసి ఆక్రమించుకుంది.
  • దీనితో భారత్ ఆర్మీ మేఘదూత్ ఆపరేషన్ పేరుతో ఈ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది.
  • ప్రస్తుతం ఈ ప్రాంతం జమ్మూ మరియు కాశ్మీర్ (ప్రస్తుతం లడఖ్) రాష్ట్రంలో విలీనం చేయబడింది.

జలియన్‌వాలాబాగ్ ఊచకోత దినోత్సవం : ఏప్రిల్ 13

  • జలియన్‌వాలాబాగ్ ఊచకోత దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 13న జరుపుకుంటారు.
  • జలియన్‌వాలాబాగ్ మారణకాండను అమృత్‌సర్ మారణకాండ అని కూడా పిలుస్తారు.
  • ఇది 1919 ఏప్రిల్ 13 న జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వం యొక్క రౌలట్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమం చేసిన సైఫుద్దీన్ కిచ్లేవ్ మరియు సత్యపాల్‌లను అరెస్టుచేయడంతో పంజాబ్‌లోని వీళ్ళ మద్దతుదారులు జలియన్‌వాలా బాగ్ వద్ద, పెద్దఎత్తున శాంతియుతమైన నిరసన తెలియజేసేందుకు గుమిగూడారు.
  • అయితే తాత్కాలిక బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ ఎడ్వర్డ్ హ్యారీ డయ్యర్ యొక్క పోలీస్ దళం వీరిని చుట్టుముట్టి దారుణమైన ఊచకోతకు పాల్పడింది.
  • ఈ ఉచకోతలో దాదాపు వెయ్యికి పైగా పౌరులు మరణించడంతో పాటుగా వేల మంది గాయపడ్డారు.
  • ఈ ఘటనకు నివాళిగా ఏటా ఏప్రిల్ 13న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
  • భారత చరిత్రలో జలియన్‌వాలాబాగ్ ఊచకోత ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది.

వరల్డ్ చాగస్ డిసీజ్ డే : ఏప్రిల్ 14

  • చాగస్ వ్యాధి గురించి అవగాహన కల్పించేందుకు ఏటా ఏప్రిల్ 14వ తేదీని ప్రపంచ చాగస్ వ్యాధి దినోత్సవంగా జరుపుకుంటారు.
  • ఇది మొదటిసారి ఏప్రిల్ 14, 2020న జరుపుకున్నారు.
  • 14 ఏప్రిల్ 1909లో దేనికి సంబంధించి మొదటి కేసును నిర్ధారించిన బ్రెజిలియన్ వైద్యుడు కార్లోస్ రిబీరో జస్టినియానో ​​చాగాస్ గౌరవర్దంగా ఈ వ్యాధికి చాగస్ డిసీజ్ అని నామకరణం చేసారు.
  • ట్రిపనోసోమా క్రూజీ అనే పరాన్నజీవి వల్ల ఈ వ్యాధి సంభవిస్తుంది.
  • ఈ పరాన్నజీవి ట్రయాటోమైన్ బగ్ యొక్క మలంలో ఉంటుంది.
  • ఇది క్రిమి వాహకాల ద్వారా జంతువులకు మరియు ప్రజలకు వ్యాప్తి చెందుతుంది.
  • ఈ వ్యాధి దక్షిణ అమెరికా, మధ్య అమెరికా మరియు మెక్సికో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది.
  • వ్యాధి తేలికపాటి వాపు మరియు జ్వరంగా బయట పడుతుంది, చికిత్స చేయకుండా వదిలేస్తే, గుండె వైఫల్యానికి కారణమవుతుంది.

అంబేద్కర్ జయంతి లేదా భీమ్ జయంతి : ఏప్రిల్ 14

  • భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని దేశం యావత్తు అంబేద్కర్ జయంతిని లేదా భీమ్ జయంతిని జరుపుకుంటుంది.
  • భారతీయ న్యాయవేత్త, రాజకీయవేత్త, తత్వవేత్త, ఆర్థికవేత్త మరియు చరిత్రకారుడు అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఏప్రిల్ 14, 1891న జన్మించారు.
  • బీఆర్ అంబేద్కర్ 140వ జయంతిని పురస్కరించుకుని, ప్రతి ఏడాది ఏప్రిల్ 14న ప్రభుత్వ సెలవుదినంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

మహావీర్ జయంతి : ఏప్రిల్ 14

  • జైన మతం యొక్క 24వ తీర్థంకరుడైన మహావీరుని బోధలను ప్రపంచమంతా వ్యాప్తి చేయడానికి మరియు శాంతి, సామరస్యాన్ని ప్రచారం చేయడానికి యేటా ఏప్రిల్ 14 తేదీని మహావీర్ జయంతిగా జరుపుకుంటారు.
  • మహావీర్ జయంతి జైనమత స్థాపకుడు లేదా మహావీర్ జన్మ కళ్యాణక్ యొక్క జన్మదినాన్ని సూచిస్తుంది. ఇది జైన సమాజానికి సంబంధించి అత్యంత పవిత్రమైన వేడుక.

వరల్డ్ ఆర్ట్ డే : ఏప్రిల్ 15

  • వరల్డ్ ఆర్ట్ డే, యేటా ఏప్రిల్ 15వ తేదీన జరుపుకుంటారు.
  • ప్రపంచవ్యాప్తంగా సృజనాత్మక కార్యకలాపాలపై అవగాహన పెంపొందించేందుకు గాను ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఆర్ట్ ఈ వేడుకను ప్రారంభించింది.
  • ఇటాలియన్ చిత్రకారుడు మరియు వాస్తుశిల్పి లియోనార్డో డా విన్సీ గౌరవార్దంగా, ఆయన జన్మదినమైన ఏప్రిల్ 15వ తేదీని వరల్డ్ ఆర్ట్ డేగా నిర్ణయించినట్లు 2012 యునెస్కో యొక్క జనరల్ కాన్ఫరెన్స్‌ ద్వారా తీర్మానించింది.

వరల్డ్ వాయిస్ డే : ఏప్రిల్ 16

  • ప్రపంచ వాయిస్ డే అనేది మానవ స్వరం యొక్క అనంతమైన పరిమితులను గుర్తించడానికి అంకితమైన ప్రపంచ వార్షిక కార్యక్రమం.
  • దీని యేటా ఏప్రిల్ 16 వ తేదీన జరుపుకుంటారు.
  • ఈ వేడుక బ్రెజిల్‌లో 1999లో బ్రెజిలియన్ నేషనల్ వాయిస్ డేగా ప్రారంభమైంది.
  • 2012లో ముగ్గురు వాయిస్ పరిశోధకులు, ప్రొఫెసర్. జోహన్ సుండ్‌బర్గ్ (స్వీడన్), ప్రొఫెసర్. టెకుమ్సే ఫిచ్ (ఆస్ట్రియా), మరియు డాక్టర్ ఫిలిపా లా (పోర్చుగల్) ప్రపంచ వాయిస్ డే వేడుకల కోసం అంతర్జాతీయ వెబ్‌సైట్ గ్రూప్‌ను ఏర్పాటు చేసారు.

ప్రపంచ హిమోఫిలియా దినోత్సవం : ఏప్రిల్ 17

  • ప్రతి సంవత్సరం ఏప్రిల్ 17 వ తేదీని ప్రపంచ హిమోఫిలియా దినోత్సవంగా జరుపుకుంటారు.
  • హీమోఫిలియా మరియు ఇతర రక్తస్రావం రుగ్మతలపై అవగాహన కల్పించేందుకు ఈ వేడుకను నిర్వహిస్తారు.
  • వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ హిమోఫిలియా వ్యవస్థాపకుడు ఫ్రాంక్ ష్నాబెల్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ తేదీని ఎంచుకున్నారు.
  • హిమోఫిలియా అనేది సాధారణంగా వారసత్వంగా వచ్చే రక్తస్రావ రుగ్మత, వీరిలో రక్తం గడ్డకట్టే ప్రోటీన్లు తగినంతగా లేనందున సాధారణ పద్ధతిలో రక్తం గడ్డకట్టదు. ఇది ఆకస్మిక రక్తస్రావంకు కారణమవుతుంది, అలాగే గాయాలు లేదా శస్త్రచికిత్స తర్వాత అధిక రక్తస్రావంకు దారితీస్తుంది.

వరల్డ్ హెరిటేజ్ డే : ఏప్రిల్ 18

  • స్మారక చిహ్నాలు మరియు వారసత్వ ప్రదేశాల యందు అవగాహన మరియు పరిరక్షణలో భాగంగా యేటా ఏప్రిల్ 18 వ తేదీని వరల్డ్ హెరిటేజ్ డే (ప్రపంచ వారసత్వ దినోత్సవం) గా జరుపుకుంటారు.
  • 1982లో యునెస్కో యొక్క జనరల్ కాన్ఫరెన్స్ ఏప్రిల్ 18ని స్మారక చిహ్నాలు మరియు ప్రదేశాల కోసం అంతర్జాతీయ దినోత్సవంగా ఏర్పాటు చేసింది.

వరల్డ్ లివర్ డే : ఏప్రిల్ 19

  • కాలేయ సంబంధిత వ్యాధులపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది ఏప్రిల్ 19 తేదీన ప్రపంచ కాలేయ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
  • కాలేయం మానవ శరీరంలో రెండవ అతిపెద్ద అవయవం.
  • ఇది ఆహారాన్ని జీర్ణం చేయడానికి, శక్తిని నిల్వ చేయడానికి మరియు విషాలను తొలగించడానికి సహాయపడుతుంది.
  • అత్యంత సంక్లిష్టమైన ఈ అవయవంపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం జరుపుకుంటారు.

నేషనల్ సివిల్ సర్వీస్ డే : ఏప్రిల్ 21

  • స్వతంత్ర భారత తొలి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జ్ఞాపకార్థం ఏప్రిల్ 21న సివిల్ సర్వీసెస్ డే జరుపుకుంటారు.
  • సివిల్ సర్వీస్ వ్యక్తులు వారి ఆదర్శప్రాయమైన సేవలను స్మరించుకోవడానికి ఈ వేడుకను ఉపయోగించుకుంటారు.
  • దీనిని మొదట 2006 లో జరుపుకున్నారు.

అంతర్జాతీయ మదర్ ఎర్త్ డే : ఏప్రిల్ 22

  • పర్యావరణ పరిరక్షణను పెంపొందించడంలో భాగంగా ప్రపంచ దేశాలు ప్రపంచ దేశాలు, రాజకీయ పార్టీలు తమ వంతు నిర్వర్తించేందుకు అంతర్జాతీయ మదర్ ఎర్త్ జరుపుకుంటారు.
  • అంతర్జాతీయ మదర్ ఎర్త్ డే 2009లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ద్వారా A/RES/63/278 తీర్మానం ద్వారా ప్రారంభమైంది.
  • ఈ రిజల్యూషన్‌ను ది ప్లూరినేషనల్ స్టేట్ ఆఫ్ బొలీవియా ప్రవేశపెట్టింది. దీనికి 50కి పైగా సభ్య దేశాలు ఆమోదం తెలిపాయి.

వరల్డ్ బుక్ డే మరియు కాపీరైట్ డే : ఏప్రిల్ 23

  • వరల్డ్ బుక్ డే మరియు కాపీరైట్ డే లేదా ఇంటర్నేషనల్ డే ఆఫ్ బుక్ జరుపుకునే ఈ వేడుకను యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ పఠనం, ప్రచురణ మరియు కాపీరైట్‌లను ప్రోత్సహించడానికి నిర్వహిస్తారు.
  • యేటా ఈ కార్యక్రమంను ఏప్రిల్ 23వ తేదీన జరుపుకుంటారు.
  • ఏప్రిల్ 23 ప్రపంచ సాహిత్యానికి ప్రతీక, ఎందుకంటే ఈ తేదీన మరణించిన మిగ్యుల్ డి సెర్వాంటెస్ మరియు విలియం షేక్స్పియర్ వంటి దిగ్గజ రచయితలకు ఇది నివాళి.

ఆంగ్ల భాషా దినోత్సవం : ఏప్రిల్ 23

  • ఆంగ్ల భాషా దినోత్సవాన్ని యేటా ఏప్రిల్ 23 వ తేదీన, విలియం షేక్స్పియర్ జయంతి మరియు అతని వర్ధంతి సందర్భంగా జరుపుకుంటారు.
  • 16 మరియు 17వ శతాబ్దాలలో షేక్స్పియర్ ఉనికిలో ఉన్న సమయంలో, ఆంగ్ల భాష చాలా మార్పులకు గురైంది. ఆయన ఆంగ్ల భాషలో గొప్ప రచయితగా మరియు ప్రపంచంలోని గొప్ప నాటకకర్తగా విస్తృతంగా కీర్తించబడ్డరు.
  • అతన్ని ఇంగ్లండ్ జాతీయ కవి లేదా "బార్డ్ ఆఫ్ అవాన్" అని పిలుస్తారు.

జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం : ఏప్రిల్ 24

  • జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24న స్థానికంగా పంచాయితీలు మరియు గ్రామసభల గురించి అవగాహన కల్పించడానికి జరుపుకుంటారు.
  • 2010 లో అప్పటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్, 24 ఏప్రిల్ 2010 న మొదటి జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ప్రకటించారు.
  • పంచాయతీ రాజ్ అనేది పట్టణ మరియు సబర్బన్ మునిసిపాలిటీలకు విరుద్ధంగా గ్రామీణ భారతదేశంలోని గ్రామాల స్థానిక స్వపరిపాలన వ్యవస్థగా రూపొందించబడింది.
  • ఇది పంచాయితీ రాజ్ సంస్థలను కలిగి ఉంటుంది. దీని ద్వారా గ్రామాల స్వయం పాలన సాకారం అవుతుంది.
  • పంచాయతీరాజ్ వ్యవస్థ 1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా భారతదేశంలో ప్రవేశపెట్టబడింది.
  • ఈ రకమైన పరిపాలన వ్యవస్థ పాకిస్థాన్, బంగ్లాదేశ్ మరియు నేపాల్‌లో కూడా కనిపిస్తుంది.

ప్రపంచ మలేరియా దినోత్సవం : ఏప్రిల్ 25

  • ప్రపంచ మలేరియా దినోత్సవంను యేటా ఏప్రిల్ 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు.
  • పంచవ్యాప్తంగా మలేరియాను నిరోధించడానికి మరియు నియంత్రించడానికి నిరంతర పెట్టుబడి మరియు నిరంతర రాజకీయ నిబద్ధత యొక్క అవసరాన్ని హైలైట్ చేయడానికి దీనిని జరుపుకుంటారు.
  • మలేరియా ప్రపంచవ్యాప్తంగా 106 దేశాలలో 3.3 బిలియన్ల మంది ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తుంది.
  • 2012లో మలేరియా 627,000 మరణాలకు కారణమైంది.
  • మలేరియా అనేది ప్లాస్మోడియం అనే పరాన్నజీవుల వల్ల కలిగే ప్రాణాంతక వ్యాధి, ఇది ఆడ అనాఫిలిస్ దోమల కాటు ద్వారా ప్రజలకు వ్యాపిస్తుంది.
  • వ్యాధి లక్షణాలు దోమ కరిచిన కొన్ని వారాల తర్వాత సంభవిస్తాయి. సరైన సమయంలో చికిత్స తీసుకోకుంటే ఇది ప్రాణాంతకం.

ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం : ఏప్రిల్ 26

  • ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవాన్ని ఏటా ఏప్రిల్ 26వ తేదీన జరుపుకుంటారు.
  • పేటెంట్‌లు, కాపీరైట్‌లు, ట్రేడ్‌మార్క్‌లు మరియు డిజైన్‌లు మన దైనందిన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనే దానిపై అవగాహన పెంచడానికి ఈ రోజు జరుపుకుంటారు.
  • మేధో సంపత్తి (ఇంటెలెక్చరల్ ప్రాపర్టీ) హక్కుల పాత్ర ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాజాలలో ప్రోత్సాహం, ఆవిష్కరణ మరియు సృజనాత్మకత కోసం ఉపయోగించబడుతుంది.
  • 1998లో వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ (WIPO) ఏర్పాటు చేయబడింది.
  • 1999 నుండి ఈ వేడుకను నిర్వహిస్తున్నారు.

ఇంటర్నేషనల్ డెలిగేట్స్ డే : ఏప్రిల్ 25

  • అంతర్జాతీయ ప్రతినిధుల దినోత్సవం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు.
  • ఇది ఐక్యరాజ్యసమితి సభ్యదేశాల ప్రతినిధులు పనితీరుపై అవగాహన పెంచడానికి జరుపుకుంటారు.
  • ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో 193 యూఎన్ సభ్య దేశాలు ఉన్నాయి.
  • ప్రతి సభ్య దేశానికి జనరల్ అసెంబ్లీలో ఒక స్థానం ఉంటుంది.
  • ఈ ప్రతినిధులు యూఎన్ జనరల్ అసెంబ్లీ మరియు యూఎన్ భద్రతా మండలి వంటి వేదికలలో తమ దేశం తరపున మాట్లాడేందుకు మరియు తీర్మానాలపై ఓటు వేసేందుకు తమ దేశాల నుండి నియమిపబడతారు.

ఇంటర్నేషనల్ డాన్స్ డే : ఏప్రిల్ 29

  • ప్రతి సంవత్సరం ఏప్రిల్ 29 న అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని జరుపుకుంటారు.
  • దీనిని మొదటిసారిగా 1982లో యునెస్కో భాగస్వామిగా ఉన్న ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా ప్రారంభించబడింది.
  • ఇది ప్రముఖ ఫ్రెంచ్ డాన్సర్, ఆధునిక బ్యాలెట్ సృష్టికర్త జీన్-జార్జెస్ నోవర్రే యొక్క జన్మదినం.

వరల్డ్ వెటర్నరీ డే : ఏప్రిల్ చివరి శనివారం

  • ప్రపంచ పశువైద్య దినోత్సవం అనేది పశువైద్యుల వృత్తిలో ఉన్న వ్యక్తులను గౌరవించటానికి కేటాయించిన రోజు.
  • దీని ప్రతి సంవత్సరం ఏప్రిల్ చివరి శనివారం జరుపుకుంటారు.
  • అలానే ఈ రోజున జంతు ఆరోగ్య సంరక్షణ మరియు జంతు హింసను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

Post Comment