టీఎస్ సెట్ 2023 నోటిఫికేషన్ విడుదల | దరఖాస్తు చేయండి
Admissions Research Entrance Exams Teaching Entrance Exams

టీఎస్ సెట్ 2023 నోటిఫికేషన్ విడుదల | దరఖాస్తు చేయండి

తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2022 నోటిఫికేషన్ వెలువడింది. రాష్ట్రంలోని యూనివర్సిటీలు మరియు కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫసర్లుగా లేదా లెక్చరర్లుగా పని చేసేందుకు అర్హుత కల్పించే ఈ పరీక్షకు ఏడాదికి ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తుంది. 2022-23 ఏడాదికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 30 నుండి ప్రారంభం కానుంది. ఈ పరీక్షను వచ్చే ఏడాది మార్చి మొదటి వారంలో నిర్వహించనున్నారు.

Advertisement
Exam Name TS SET 2022
Exam Type Eligibility Test
Eligibility For Lecturer & Ast professor
Exam Date March 2023
Exam Duration 3 Hours
Exam Level State Level (TS)

TS SET 2022

తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్టును యూనివర్సిటీలు మరియు కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫసర్లుగా లేదా లెక్చరర్లుగా అర్హుత కల్పించేందుకు నిర్వహిస్తారు. ఈ పరీక్షలో అర్హుత సాధించడం ద్వారా రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ మరియు ప్రైవేట్ యూనివర్సిటీలు & కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫసర్లుగా లేదా లెక్చరర్లుగా చేరేందుకు అర్హుత లభిస్తుంది. అలానే జూనియర్, డిగ్రీ లెక్చరర్ రిక్రూట్మెంట్ ద్వారా ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్లుగా ఉద్యోగం సాధించే అవకాశం ఉంటుంది.

టీఎస్ సెట్ ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఏడాదికోసారి నిర్వహించబడుతుంది. దాదాపు 29 స్పెషలైజ్డ్ సబ్జెక్టులలో ఈ సెట్ రాసేందుకు అవకాశం ఉంది. పరీక్ష రెండు పేపర్లుగా జరుగుతుంది. పేపర్ I జనరల్ స్టడీస్ సంబంధించి అందరికి కామనుగా ఉంటుంది. పేపర్ II, అభ్యర్థి ఎంపిక చేసుకున్న ఆప్షనల్ సబ్జెక్టులకు చెందినదై ఉంటుంది.

టీఎస్ సెట్ 2022 ఎలిజిబిలిటీ

  • అభ్యర్థులు గుర్తింపు పొందిన ఉండివర్సిటీ నుండి 55 శాతం మార్కులతో పోస్టుగ్రాడ్యుషన్ పూర్తిచేసి ఉండాలి. చివరి సెమిస్టర్ రాస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసేందుకు అర్హులు
  • 1991 తర్వాత మాస్టర్ డిగ్రీ చేసిన పీహెచ్డీ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసేందుకు అర్హులు
  • ఇంతకముందు ఒక సబ్జెక్టులో యూజీసి నెట్ లేదా సెట్ లో అర్హుత సాధించిన అభ్యర్థులు తిరిగి అదే సబ్జెక్టుకు దరఖాస్తు చేసేందుకు అనర్హులు
  • దరఖాస్తు చేసేందుకు ఎటువంటి గరిష్ట వయోపరిమితి లేదు

టీఎస్ సెట్ 2022 షెడ్యూల్

దరఖాస్తు ప్రారంభం 30 డిసెంబర్ 2022
దరఖాస్తు తుది గడువు 20 జనవరి 2023
హాల్ టిక్కెట్ల డౌన్‌లోడ్ ఫిబ్రవరి 2023
ఎగ్జామ్ తేదీ మార్చి 2023
ఫలితాలు ఏప్రిల్ / మే 2023

టీఎస్ సెట్ 2022 ఫీజు

జనరల్ కేటగిరి 2,000/-
ఓబీసీ కేటగిరి 1,500/-
ఎస్సీ, ఎస్టీ పీడీ అభ్యర్థులు 1,000/-
  • 1,500/- ఆలస్య రుసుముతో 25-01-2023 వరకు చెల్లించవచ్చు
  • 2,000/- ఆలస్య రుసుముతో 31-01-2023 వరకు చెల్లించవచ్చు
  • 3,000/- ఆలస్య రుసుముతో 05-02-2023 వరకు చెల్లించవచ్చు

టీఎస్ సెట్ 2022 ఎగ్జామ్ సెంటర్లు

ఆదిలాబాద్
హైదరాబాద్
కరీంనగర్
నల్గొండ
మహాబుబ్‌నగర్
తిరుపతి
కర్నూలు
నిజామాబాద్
వరంగల్
ఖమ్మం
మెదక్
రంగారెడ్డి
విజయవాడ
విశాఖపట్నం

టీఎస్ సెట్ 2022 దరఖాస్తు ప్రక్రియ

టీఎస్ సెట్ రాసేందుకు ఆసక్తి అర్హుత ఉన్న అభ్యర్థులు టీఎస్ సెట్ అధికారిక (www.telanganaset.org) వెబ్సైటు ద్వారా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. యూజీసీ నియమాలను అనుసరించి అభ్యర్థుల విద్య మరియు వ్యక్తిగత వివరాలను దరఖాస్తులో పొందుపర్చాలి. వీటికి సంబంధించిన డూప్లికేట్ ధ్రువపత్రాలను దరఖాస్తుతో పాటుగా అందజేయాలి.

పూర్తి వివరాలు పొందుపర్చాక అందుబాటులో ఉండే పేమెంట్ విధానంలో దరఖాస్తు రుసుము చెల్లించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది. ఆమోదం పొందిన అభ్యర్థులకు పరీక్షకు వారం రోజుల ముందు అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంచుతారు.

  • కనీసం 20 కేబీ సైజుతో జేపీజి ఫార్మేట్ పాస్‌పోర్ట్ సైజు ఫోటో అప్లోడ్ చేయాలి.
  • 20 కేబీ లోపు సైజుతో జేపీజి ఫార్మేట్ సంతకం ఫోటో అప్లోడ్ చేయాలి.
  • 50 కేబీ లోపు సైజుతో జేపీజి ఫార్మేట్ క్యాస్ట్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలి

టీఎస్ సెట్ 2022 ఎగ్జామ్ నమూనా

టీఎస్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ కంప్యూటర్ ఆధారంగా ఆన్లైన్ విధానంలో నిర్వహించబడుతుంది. పరీక్ష ఆబ్జెక్టివ్ పద్దతిలో రెండు పేపర్లుగా, 3 గంటల నిడివితో జరుగుతుంది. ప్రతి ప్రశ్న నాలుగు ఆప్షనల్ సమాదానాలు కలిగి ఉంటుంది. అందులో సరైన సమాధానం గుర్తించిన ప్రశ్నలకు 2 మార్కులు కేటాయిస్తారు. నెగిటివ్ మార్కింగ్ విధానం లేదు.

పేపర్ I అందరిక అభ్యర్థులకు కామన్ పేపరుగా ఉంటుంది. ఇందులో జనరల్ స్టడీస్ (రీసెర్చ్ & టీచింగ్ ఆప్టిట్యూడ్) నుండి మొత్తం 50 మల్టిఫుల్ ఛాయస్ ప్రశ్నలు ఇవ్వబడతయి. అన్ని ప్రశ్నలకు తప్పనిసరి సమాధానం చేయాలి. ఈ పేపర్లో అభ్యర్థి గరిష్టంగా 100 మార్కులు స్కోర్ చెయ్యొచ్చు.

పేపర్ II అభ్యర్థి ఎంపిక చేసుకున్న సబ్జెక్టుకు సంబంధించి నిర్వహించబడుతుంది. ఇందులో మొత్తం 100 మల్టిఫుల్ ఛాయస్ ప్రశ్నలు ఇవ్వబడతయి. అన్ని ప్రశ్నలకు తప్పనిసరి సమాధానం చేయాలి. సరైన సమాధానం గుర్తించిన ప్రశ్నకు 2 మార్కులు ఇవ్వబడతయి. ఈ పేపర్లో అభ్యర్థి గరిష్టంగా 200 మార్కులు స్కోర్ చెయ్యొచ్చు.

 పేపర్ ప్రశ్నలు మార్కులు సమయం
 పేపర్ I (జనరల్ స్టడీస్) 50 ప్రశ్నలు 100 3 గంటలు
 పేపర్ II (ఆప్షనల్ స్పెషలైజ్డ్ సబ్జెక్టు) 100 ప్రశ్నలు 200

టీఎస్ సెట్ 2022 అర్హుత మార్కులు

టీఎస్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్టులో అర్హుత సాధించిన అభ్యర్థుల జాబితాను సబ్జెక్టు వారీగా వివిధ రిజర్వేషన్లను ఆధారంగా గణించి ప్రకటిస్తారు. జనరల్ కేటగిరి అభ్యర్థులు అర్హుత పొందాలంటే రెండు పేపర్లలో కనీసం 40 శాతం మార్కులు స్కోరు చేసి ఉండాలి.

ఇతర కేటగిరి అభ్యర్థులు కనీసం 35 శాతం మార్కులు సాధించి ఉండాలి. అర్హుత సాధించిన అభ్యర్థులలో  సబ్జెక్టు వారీగా టాప్  6 శాతం మంది అసిస్టెంట్ ప్రొఫసర్లుగా అర్హుత పొందుతారు. మిగతా అభ్యర్థులు లెక్చరర్లుగా పని చేసేందుకు అర్హుత కల్పిస్తారు. వివిధ కేటగిర్ల వారీగా రిజర్వేషన్ కోటా ఈ కింది విధంగా ఉంటుంది.

రిజర్వేషన్ కేటగిరి రిజర్వేషన్ కోటా
ఓబీసీ 29%
ఎస్సీ 15%
ఎస్టీ 6%
మహిళలు 33% (అన్ని కేటగిర్లు కలిపి)

టీఎస్ సెట్ 2022 సబ్జెక్టుల వారీగా సిలబస్

సబ్జెక్టు సిలబస్ సబ్జెక్టు సిలబస్
హిస్టరీ
కెమికల్ సైన్సెస్
కామర్స్
కంప్యూటర్ సైన్స్ & అప్లికేషన్స్
ఎకనామిక్స్
ఎడ్యుకేషన్
ఇంగ్లీష్
ఎర్త్, అటామ్స్పిరిక్, ఓషన్ & ప్లానెటరీ సైన్స్
ఎన్విరాన్మెంటల్ సైన్సెస్
జియోగ్రఫీ
హిందీ
జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్
లా
లైఫ్ సైన్సెస్
సిలబస్
సిలబస్
సిలబస్
సిలబస్
సిలబస్
సిలబస్
సిలబస్
సిలబస్
సిలబస్
సిలబస్
సిలబస్
సిలబస్
సిలబస్
సిలబస్
లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్
మానేజ్మెంట్
మాథమేటికల్ సైన్సెస్
ఫీజికల్ సైన్సెస్
ఫీజికల్ ఎడ్యుకేషన్
ఫీలాసఫీ
పొలిటికల్ సైన్స్
సైకాలజీ
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్
సంస్కృతం
సోషియాలజీ
సోషల్ వర్క్
తెలుగు
ఉర్దూ
లింగ్విస్టిక్స్
సిలబస్
సిలబస్
సిలబస్
సిలబస్
సిలబస్
సిలబస్
సిలబస్
సిలబస్
సిలబస్
సిలబస్
సిలబస్
సిలబస్
సిలబస్
సిలబస్
సిలబస్

 

జనరల్ స్టడీస్  ఆల్ పేపర్స్ సిలబస్

Advertisement