Advertisement
ఆస్ట్రేలియాలో హయ్యర్ ఎడ్యుకేషన్ : కోర్సులు, వీసా ప్రక్రియ, స్కాలర్‌షిప్‌లు
Abroad Education

ఆస్ట్రేలియాలో హయ్యర్ ఎడ్యుకేషన్ : కోర్సులు, వీసా ప్రక్రియ, స్కాలర్‌షిప్‌లు

ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులలో, యూఎస్, యూకే తర్వాత  అత్యధిక మంది విద్యార్థులు మొగ్గుచూపే దేశం ఆస్ట్రేలియా. ఇక్కడి యూనివర్శిటీలు అందించే క్వాలిటీ హయ్యర్ ఎడ్యుకేషన్... ఏటా దాదాపు 7 లక్షల మంది విదేశీ విద్యార్థులను వివిధ దేశాల నుండి ఆస్ట్రేలియాలో అడుగుపెట్టేలా చేస్తుంది. ఇండియా నుండి ఈ సంఖ్యా లక్షకు పైగా ఉంటుంది. యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ లండన్ సెంటర్ ఫర్ గ్లోబల్ హయ్యర్ ఎడ్యుకేషన్ స్టడీ ప్రకారం వరల్డ్ 2ను మోస్ట్ పాపులర్ స్టడీ డెస్టినేషన్ ప్లేసుగా ఆస్ట్రేలియా నిలిచింది.

ఆస్ట్రేలియా వ్యాప్తంగా 1,100 లకు పైగా యూనివర్సిటీలు 22 వేలకు పైగా స్టడీ ప్రోగ్రాములను అందిస్తున్నాయి. టాప్ 100 వరల్డ్ యూనివర్సిటీలలో దాదాపు 8 ఆస్ట్రేలియన్ యూనివర్సిటీలు చోటు దక్కించుకున్నాయి. 90 శాతం విదేశీ విద్యార్థులు ఆస్ట్రేలియా ఉన్నత విద్య యందు సంతృప్తి వ్యక్తపరిచారు. ప్రశాంత వాతావరణంలో ఉన్నత విద్య పూర్తిచేసే అవకాశం, ఫ్రెండ్లీ ఆస్ట్రేలియన్ కల్చర్, అత్యాధునిక వసతులు కలిగిన యూనివర్సిటీలు, వారానికి 20 గంటల వరకు జాబ్ చేసుకునే సౌలభ్యం, సులభతర వీసా ఆమోదం, ఆస్ట్రేలియా ప్రభుత్వం అందించే ఎడ్యుకేషనల్ అసిస్టెన్స్ అన్నీ కలిసి ఆస్ట్రేలియాను మోస్ట్ పాపులర్ స్టడీ డెస్టినేషన్'గా తీర్చిదిద్దాయి.

అందుబాటులో ఉండే కోర్సులు

బిజినెస్ మానేజ్మెంట్, మెడిసిన్, ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, అగ్రికల్చర్, ఎర్త్ సైన్సెస్, అకౌంటెన్సీ, సైకాలజీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సుల యందు మెజారిటీ విదేశీ విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇదిలా ఉండగా ఆస్ట్రేలియా యూనివెర్సిటీలు వివిధ సబ్జెక్టు కేటగిర్లలో 20 వేలకు పైగా ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ అందిస్తున్నాయి. మీరు ఏమి చదువుతున్నారు లేదా ఎంతకాలం చదువుతున్నారనే దానితో సంబంధం లేకుండా, ఆస్ట్రేలియా చట్టాలు అంతర్జాతీయ విద్యార్థులకు నాణ్యమైన విద్య మరియు రక్షణను అందించేలా ప్రోత్సహిస్తాయి.

వీటితో పాటుగా ఉన్నత విద్యా సంస్థలను నియంత్రించేందుకు Tertiary Education Quality and Standards Agency (TEQSA), ఒకేషనల్ ఎడ్యుకేషన్ & ట్రయినింగ్ (VET) విద్యా సంస్థలను నియంత్రించేందుకు ఆస్ట్రేలియన్ స్కిల్స్ క్వాలిటీ అథారిటీ (ASQA) వంటి ప్రభుత్వ సంస్థలు కూడా విదేశీ విద్యార్థులకు నాణ్యమైన విద్యా అందేలా బాధ్యత తీసుకుంటాయి.

అడ్మిషన్ కోసం దరఖాస్తు

ఆస్ట్రేలియా యూనివర్సిటీకి అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసేముందు సదురు యూనివర్సిటీ Commonwealth Register of Institutions and Courses for Overseas Students (CRICOS) జాబితాలో రిజిస్టర్ అయ్యిందో లేదా నిర్దారించుకోండి. ఈ జాబితాలో లేని యూనివర్సిటీలు అందించే ఉన్నత చదువులకు చట్టబద్దత ఉండదు. మెజారిటీ ఆస్ట్రేలియా యూనివర్శిటీలు జనవరి-ఫిబ్రవరి లేదా జూన్-జులై మధ్య కాలంలో అడ్మిషన్లు నిర్వహిస్తాయి. ప్రధాన కోర్సుల ప్రవేశాలు జనవరి-ఫిబ్రవరి టర్మ్ యందు పూర్తిచేస్తారు. మరి కొన్ని యూనివర్సిటీ కొన్ని కోర్సుల కోసం సెప్టెంబర్ - నవంబర్ మధ్యలో కూడా అడ్మిషన్లు నిర్వహిస్తుంది.

ఎంపిక చేసుకున్న యూనివర్సిటీ యందు సంబంధిత ధ్రువపత్రాలతో ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. యూనివర్సిటీ మీకు సంబందించిన అకాడమిక్, ఫైనాన్సియల్ రిపోర్ట్స్, వర్క్ అనుభవాలను పరిశీలించి, ఆ కోర్సులో జాయిన్ అయ్యేందుకు అర్హుడు అని భావిస్తే లెటర్ ఆఫ్ ఆఫర్ (అడ్మిషన్ లెటర్) జారీ చేస్తాయి. కొన్ని విద్యా సంస్థలలో అడ్మిషన్ లెటర్ పొందేందుకు సగం ట్యూషన్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా పొందేందుకు యూనివర్సిటీ జారీచేసే లెటర్ ఆఫ్ ఆఫర్ (అడ్మిషన్ లెటర్) తప్పనిసరి.

వీటితో పాటుగా విద్యార్థి కోర్సులో జాయిన్ అయ్యినట్లు యూనివర్సిటీ కన్ఫర్మేషన్ ఆఫ్ ఎన్రోల్మెంట్ (COE) జారీచేస్తుంది. ఇది కూడా స్టూడెంట్ వీసా దరఖాస్తుతో జతచేయాల్సి ఉంటుంది. అలానే ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియా ఎంపిక చేసుకునేందుకు గల కారణాలు, అలానే ఎన్ని ఏళ్ళ వరకు అక్కడే ఉండే ఆలోచన ఉంది అనే అంశాలకు సంబంధించి Genuine Temporary Entrant (GTE) requirement లెటర్ రాయాల్సి ఉంటుంది.

ప్రవేశ పరీక్షలు

ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ ఉత్తీర్ణత తప్పనిసరి

యూనివర్సిటీల నుండి Letter of acceptance పొందాలంటే విద్యార్థి IELTS (International English Language Testing System), TOEFL (Test of English as a Foreign Language), PTE (Pearson Test of English) వంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అర్హుత పరీక్షలలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. మెజారిటీ ఆస్ట్రేలియా యూనివర్సిటీలు TOEFL, IELTS స్కోరును ప్రామాణికంగా తీసుకుంటాయి. 65 నుండి 80 మధ్య ToEFL లేదా 6 to 7.5 మధ్య IELTS స్కోరు సాధించిన విద్యార్థులకు అడ్మిషన్ దొరికే అవకాశం ఉంటుంది.

Apply for a Study Visa

యూనివర్శిటీ నుండి లెటర్ ఆఫ్ ఆఫర్ (అడ్మిషన్ లెటర్) అందిన వెంటనే స్టడీ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత ధ్రువపత్రాలతో ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్ పోర్టల్ లేదా దగ్గరలో ఉండే వీసా అప్లికేషన్ సెంటర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆస్ట్రేలియా వెళ్లే విద్యార్థులు స్టూడెంట్ వీసా(subclass 500) కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసే వారు ఇమిగ్రేషన్ పోర్టల్ యందు రిజిస్టర్ అవ్వాలి. దరఖాస్తు అందిన తర్వాత బయోమెట్రిక్ మరియు ఇమిగ్రేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ కోసం కబురు చేస్తారు. ఇదే సందర్భలో వీసా అధికారి దరఖాస్తు పరిశీలన చేస్తారు. దరఖాస్తులో ఉండే అంశాలు, విద్యార్థి చెప్పే సమాదానాలు ద్వారా వీసా అధికారి సంతృప్తి పొందితే 3 నుండి 4 వారాలలో స్టడీ పర్మిట్ జారీచేస్తారు.

వీసా టైప్ స్టడీ పర్మిట్ ఫీజు వీసా కాలపరిమితి
స్టూడెంట్ వీసా (Subclass 500) AUD$ 620 3 Years

స్టూడెంట్ వీసా ఆమోదం పొందేందుకు కావాల్సిన డాక్యూమెంట్స్

  • ఉన్నత విద్య కోసం దరఖాస్తు చేసుకున్న యూనివర్సిటీ నుండి Acceptance Letter.
  • కోర్సు పూర్తిచేసినందుకు అవసరమయ్యే ఆర్థిక వనరులు కలిగి ఉన్నట్లు ఖచ్చితమైన లెక్కలతో ఫైనాన్స్ రిపోర్టు.
  • ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్.
  • ఆధార్/ పుట్టిన తేదీ ధ్రువపత్రం, పెళ్ళైన వారు మ్యారేజ్ సర్టిఫికెట్.
  • 6 నెలల ముందుగా ఆమోదం పొందినా పాసుపోర్టు.
  • నేర చరిత్ర లేనట్లు police certificates.
  • హెల్త్ సర్టిఫికెట్

8 Most recognized schools in Australia

  1. Australian National University (ANU)
  2. University of Melbourne (UOM)
  3. The University of Sydney
  4. University of New South Wales (UNSW)
  5. university of queensland (uq)
  6. Monash University Clayton Campus
  7. University of Western Australia (UWA)
  8. The University of Adelaide

విద్యార్థికి ఉపయోగపడే వెబ్‌సైట్లు

Cost of study in Australia

ఆస్ట్రేలియా లో హయ్యర్ ఎడ్యుకేషన్ కొంచెం ప్రీమియంగానే ఉంటుంది. దాదాపు యూఎస్, యూకే వంటి దేశాల యందు ఖర్చు చేసే మొత్తమే ఇక్కడ కూడా చెలించాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియాలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను $20,000 నుండి $40,000 ఆస్ట్రియన్ డాలర్ల వరకు, పోస్టుగ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ $25,000 నుండి  $50,000 డాలర్లతో పూర్తిచేయొచ్చు. వీసా చార్జీలు 600 డాలర్లకు మించి ఉంటుంది. అలానే నెలవారీ జీవన వ్యయాల బడ్జెట్ $15,000 నుండి $17,000 డాలర్లకు మధ్యలో వుంటుంది.

విదేశీ విద్యార్థులకు యూనివర్సిటీ పరిధిలో వారానికి 20 గంటల వరకు పార్ట్ టైమ్ జాబ్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. వేసవి సెలవులు, ఇతర సెలవు దినాలలో పూర్తిస్థాయి ఉద్యోగం చేసే అవకాశం కూడా ఉంటుంది. అలానే ఆస్ట్రేలియా ప్రభుత్వం అందించే స్కాలర్‌షిప్‌లు, ఇతర విద్యా రాయితీలు, విదేశీ విద్యార్థులకు కొంతలో కొంత ఉపశమనం కల్గిస్తాయి.

Study program Average annual fee
Undergraduate program $20,000 to $40,000
Postgraduate master's degree $25,000 to $50,000
Doctoral degree $18,000 to $35,000
Management programs $40,000 to $50,000
Living expenses Average Budget 
Accommodation $100 to $400 pm
Living costs Up to $10,000 to $20.000 pm
visa and permit $200
Health & insurance $ and $1000 per year

Scholarships & Education Loans

Post Comment