భారతదేశ ప్రధాన మంత్రుల జాబితా | పోటీపరీక్షల ప్రత్యేకం
Study Material

భారతదేశ ప్రధాన మంత్రుల జాబితా | పోటీపరీక్షల ప్రత్యేకం

భారత ప్రధానమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యనిర్వాహకుడుగా వ్యవహరిస్తాడు. భారత రాష్ట్రపతి రాజ్యాంగ సంబంధమైన దేశాధినేత అయినప్పటికీ, కార్యనిర్వాహక అధికారం ప్రధానమంత్రికి మరియు వారు ఎన్నుకున్న మంత్రి మండలికి ఉంటుంది. భారత పార్లమెంటు దిగువసభలో మెజారిటీతో పార్టీచే ఎన్నుకోబడిన నాయకుడు ప్రధానమంత్రి అవుతాడు.

Advertisement

ప్రధానమంత్రిని భారత రాష్ట్రపతి నియమిస్తారు. ప్రధానమంత్రి రాజీనామా చేస్తే తప్ప, ప్రతి ఐదేళ్లకు ప్రత్యక్షంగా ఎన్నికయ్యే మెజారిటీ లోక్‌సభ సభ్యుల విశ్వాసాన్ని ప్రధాన మంత్రి పొందవలసి ఉంటుంది. ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వ మంత్రిమండలికి అధ్యక్షత వహిస్తారు. కౌన్సిల్ సభ్యుల ఎంపిక మరియు తొలగింపును ప్రధానమంత్రి ఏకపక్షంగా నియంత్రిస్తారు.

1947 నుండి భారతదేశానికి 14 మంది ప్రధానులు పనిచేసారు. జవహర్‌లాల్ నెహ్రూ భారతదేశపు మొదటి ప్రధానమంత్రిగా పనిచేసారు. నెహ్రూ కుమార్తె ఇందిరా గాంధీ 1966లో భారతదేశ మొదటి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు అలానే ఏకైక మహిళా ప్రధానిగా పనిచేసిన ఘనత సాధించారు. ఇందిరాగాంధీ హత్య తర్వాత ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ భారతదేశపు అతి పిన్న వయస్కుడైన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు.

భారత ప్రధాన మంత్రులు జాబితా

తేదీ & ఏడాది భారత ప్రధాన మంత్రులు
15/8/1947 - 15/4/1952
15/4/1952 - 17/4/1957
17/4/1957 - 2/4/1962
2/4/1962-  27/5/1964
జవహర్‌లాల్ నెహ్రూ (జననం 1889 - మరణం 1964 )
పదవీకాలం: 16 సంవత్సరాలు, 286 రోజులు
పార్టీ : ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
భారతదేశపు మొదటి ప్రధాని మరియు భారతదేశంలో ఎక్కువ కాలం పనిచేసిన ప్రధాని, పదవిలో ఉంటుండగా మరణించిన మొదటి ప్రధాని.
27/5/1964 - 9/6/1964 గుల్జారిలాల్ నందా (జననం 1898 - మరణం 1998 )
పదవీకాలం: 13 రోజులు
పార్టీ : ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
భారతదేశం యొక్క మొదటి తాత్కాలిక ప్రధాని (అక్టింగ్ పీఎం)
9/6/1964 - 11-1-1966 లాల్ బహదూర్ శాస్త్రి (జననం 1904 - మరణం 1966)
పదవీకాలం: 1 సంవత్సరం, 216 రోజులు
పార్టీ : ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
1965 నాటి ఇండో-పాక్ యుద్ధంలో 'జై జవాన్ జై కిసాన్' నినాదం ఇచ్చింది శాస్త్రి గారే..!
11/1/1966 - 24/1/1966 గుల్జారిలాల్ నందా (జననం 1898 - మరణం 1998 )
పదవీకాలం: 13 రోజులు
పార్టీ : ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
24/1/1996 - 4/3/1967
4/3/1967 - 15/3/1971
15/3/1971 - 24/3/1977
ఇందిరా గాంధీ (జననం 1917 - మరణం 1984 )
పదవీకాలం: 11 సంవత్సరాలు, 59 రోజులు
పార్టీ : ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
భారతదేశ మొదటి మహిళా ప్రధాన మంత్రి
24/3/1977 - 28/7/1979 మొరార్జీ దేశాయ్ (జననం 1896 - మరణం 1995 )
పదవీకాలం: 2 సంవత్సరాలు, 126 రోజులు
పార్టీ : జనతా పార్టీ
81 ఏళ్ళ వయస్సులో ప్రధాని అయినా వ్యక్తి & ప్రధాని పదవికి రాజీనామా చేసిన మొదటి వ్యక్తి.
28/7/1979 - 14/1/1980 చరణ్ సింగ్ (జననం 1902 - మరణం 1987 )
పదవీకాలం: 170 రోజులు
పార్టీ : జనతా పార్టీ (లౌకిక)
ప్రధాని మంత్రిగా ఒక్కసారిగా కూడా పార్లమెంటులో అడుగుపెట్టని పీఎం
14/1/1980 - 31/10/1984 ఇందిరా గాంధీ (జననం 1917 - మరణం 1984 )
పదవీకాలం: 4 సంవత్సరాలు, 291 రోజులు
పార్టీ : ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
31/10/1984 - 31/12/1984
31/12/1984 - 2/12/1989
రాజీవ్ గాంధీ (జననం 1944 - మరణం 1991 )
పదవీకాలం: 5 సంవత్సరాలు, 32 రోజులు
పార్టీ : ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
అతి చిన్న వయస్సులో (40 ఏళ్ళు) ప్రధాని మంత్రి అయ్యారు
2/12/1989 - 10/11/1990 విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ (జననం 1931 - మరణం 2008 )
పదవీకాలం: 343 రోజులు
పార్టీ : జనతాదళ్ ( నేషనల్ ఫ్రంట్ )
అవిశ్వాస తీర్మానం తర్వాత పదవీవిరమణ చేసిన మొదటి ప్రధాని
10/11/1990 - 21/6/1991 చంద్ర శేఖర్ (జననం 1927 - మరణం 2007 )
పదవీకాలం: 223 రోజులు
పార్టీ : సమాజ్‌వాదీ జనతా పార్టీ (రాష్ట్రీయ)
21/6/1991 - 16/5/1996 పివి నరసింహారావు (జననం 1921 - మరణం 2004)
పదవీకాలం: 4 సంవత్సరాలు, 330 రోజులు
పార్టీ : ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
దక్షిణ భారతదేశం నుండి ప్రధాన మంత్రి అయిన మొదటి పీఎం
16/5/1996 - 1/6/1996 అటల్ బిహారీ వాజ్‌పేయి (జననం 1924 - మరణం 2018 )
పదవీకాలం: 16 రోజులు
పార్టీ : భారతీయ జనతా పార్టీ
1/6/1996 - 21/4/1997 HD దేవేగౌడ (జననం 1933 )
పదవీకాలం: 324 రోజులు
పార్టీ : జనతాదళ్ ( యునైటెడ్ ఫ్రంట్ )
దక్షిణ భారతదేశం నుండి ప్రధాన మంత్రి అయిన రెండవ పీఎం
21/4/1997 - 19/3/1998 ఇందర్ కుమార్ గుజ్రాల్ (జననం 1919 - మరణం 2012 )
పదవీకాలం: 332 రోజులు
పార్టీ : జనతాదళ్ ( యునైటెడ్ ఫ్రంట్ )
19/3/1998 - 10/10/1999
10/10/1999 - 22/5/2004
అటల్ బిహారీ వాజ్‌పేయి (జననం 1924 - మరణం 2018 )
పదవీకాలం: 6 సంవత్సరాలు, 64 రోజులు
పార్టీ : భారతీయ జనతా పార్టీ (NDA)
ప్రధానిగా పూర్తి పదవి కాలాన్ని పూర్తి చేసిన మొదటి కాంగ్రెస్ యితర ప్రధాని
22/5/2004 - 22/5/2009
22/5/2009 - 26/5/2014
మన్మోహన్ సింగ్ (జననం 1932  )
పదవీకాలం: 10 సంవత్సరాలు, 4 రోజులు
పార్టీ : ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (UPA)
మొదటి సిక్కు ప్రధాన మంత్రి
26/5/2014 - 30/5/2019
30/5/2019 - ప్రస్తుతం
నరేంద్ర మోడీ (జననం 1950)
పదవీకాలం: 5 సంవత్సరాలు (మోడీ I), మోడీ II కొనసాగుతున్నారు
పార్టీ : భారతీయ జనతా పార్టీ (NDA)
వరుసగా రెండువ సారి ప్రధాని అయిన 4వ వ్యక్తి

Advertisement

Post Comment