ఫ్యూచర్ లెర్న్ కోర్సులు : ఆన్‌లైన్ ఓపెన్ డిగ్రీలు & నైపుణ్య కోర్సులు
Online Education Useful websites

ఫ్యూచర్ లెర్న్ కోర్సులు : ఆన్‌లైన్ ఓపెన్ డిగ్రీలు & నైపుణ్య కోర్సులు

ఫ్యూచర్ లెర్న్ యూకే నుండి స్థాపించబడిన మొట్టమొదటి ఆన్‌లైన్ లెర్నింగ్ వేదిక. దీన్ని ది ఓపెన్ యూనివర్శిటీ మరియు సీక్ లిమిటెడ్ సంస్థలు ఉమ్మడిగా స్థాపించాయి. ఫ్యూచర్ లెర్న్ మొదట 12 యూనివర్సిటీల భాగస్వామ్యంతో ఏర్పాటు చేయబడింది. ప్రస్తుతం ఆ సంఖ్యా 175 కి చేరింది. ఇందులో యూకే యూనివర్సిటీలతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ యూనివర్సిటీలు భాగస్వాములుగా ఉన్నాయి.

ఫ్యూచర్ లెర్న్ ఇంజనీరింగ్, బిజినెస్ మానేజ్మెంట్ సైన్స్ & టెక్నాలజీ మరియు హ్యుమానిటీస్ సంబంధిత ఆన్‌లైన్ ఫుల్ టర్మ్ & షార్ట్ టర్మ్ మరియు సర్టిఫికేటెడ్ ఓపెన్ డిగ్రీలను అందిస్తుంది. మీరు ఫ్యూచర్ లెర్న్ నుండి   యూనివర్సిటీ మెట్టు ఎక్కకుండా యూనివర్సిటీ స్థాయి బ్యాచిలర్ డిగ్రీని పొందొచ్చు.

ఫ్యూచర్ లెర్న్ కు ప్రపంచ వ్యాప్తంగా 13 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఫ్యూచర్ లెర్న్ లో 12 ప్రముఖ యూనివర్సిటీలు భాగస్వాములుగా ఉన్నయి. అవి "ది ఓపెన్ యూనివర్సిటీ, బర్మింగ్హామ్ యూనివర్సిటీ, బ్రిస్టల్ యూనివర్సిటీ , కార్డిఫ్ యూనివర్సిటీ , యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లేయ, యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటర్, కింగ్స్ కాలేజ్ లండన్ , లాంకాస్టర్ యూనివర్సిటీ , యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ , యూనివర్సిటీ సౌతాంప్టన్ , సెయింట్ ఆండ్రూస్ యూనివర్సిటీ , మరియు వార్విక్ యూనివర్సిటీ".

ఫ్యూచర్ లెర్న్ అందిస్తున్న కోర్సులు

బిజినెస్ & మానేజ్మెంట్
క్రియేటివ్ ఆర్ట్స్ & మీడియా
హెల్త్ కేర్ & మెడిసిన్
హిస్టరీ
ఐటీ & కంప్యూటర్ సైన్స్
లాంగ్వేజ్
లా
లిటరేచర్
నేచర్ & ఎన్విరాన్మెంట్
పాలిటిక్స్ & సొసైటీ
సైకాలజీ & మెంటల్ హెల్త్
సైన్స్, ఇంజనీరింగ్ & మాథ్స్
స్టడీ స్కిల్స్
టీచింగ్

ఫ్యూచర్ లెర్న్ ఉచిత మరియు ప్రీమియం కోర్సులను అందిస్తుంది. ఉచిత కోర్సులు నాలుగు వారాల యాక్సిస్ తో అనుమతి ఇస్తారు. ప్రీమియం కోర్సులు లిమిటెడ్ మరియు అపరిమిత ప్లానులుగా అందుబాటులో ఉన్నాయి.

ఏడాది వ్యవధితో $69 లకు అప్‌గ్రేడ్ ప్లాన్ అందజేస్తారు. ఇందులో నమోదు చేసుకున్న కోర్సు మాత్రమే నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఆన్ లిమిటెడ్ ప్లాన్ ఏడాది వ్యవధిలో అపరిమిత కోర్సులు మరియు ఇతర సౌలభ్యలు ఉపయోగించేనుకునే అనుమతి ఉంటుంది.

కోర్సులు సబ్జెక్టు వారి ప్రోఫిసినల్ నైపుణ్యాలు అందించే వాటితో పాటుగా పూర్తి స్థాయి యూనివర్సిటీ స్థాయి డిగ్రీ కోర్సులు అందిస్తుంది. జనరల్ కోర్సులు రెండు నుండి పది వారాల నిడివితో ఉంటాయి. కోర్సులు విజయవంతంగా పూర్తిచేసిన వారికీ ప్రింటెడ్ డిజిటల్ సర్టిఫికెట్ అందజేస్తారు. ఆన్‌లైన్ డిగ్రీలు ఏడాది (ఫుల్ టర్మ్) నుండి గరిష్టంగా 4 ఏళ్ళు (షార్ట్ టర్మ్) నిడివితో అందజేస్తారు.

ఫ్యూచర్ లెర్న్ కోర్సుల కీ పాయింట్స్

  • ప్రీమియం ఆన్‌లైన్ ఓపెన్ డిగ్రీలు కోర్సులు చేసేందుకు ఉత్తమ వేదిక
  • ఫ్యూచర్ లెర్న్ కోర్సులు క్వాలిటీ పరంగా ఉత్తమంగా ఉంటాయి
  • 4 వారాల వ్యవధితో ఉచితంగా కోర్సులు నేర్చుకునే అవకాశం ఉంది
  • ప్రతి కోర్సుకు పూర్తిస్థాయి డెడికేటెడ్ ఫార్మ్ సపోర్ట్ లభిస్తుంది
  • కోర్సులు ఇంగ్లీష్ తో పాటుగా మరో నాలుగు భాషల్లో అందుబాటులో ఉంటాయి
  • ఫ్యూచర్ లెర్న్ వెబ్సైటు ఇంటర్ఫేస్ సులభంగా ఉంటుంది
  • ఫ్యూచర్ లెర్న్ ప్రీమియం ప్లాన్స్ అందుబాటు ధరల్లో ఉంటాయి
  • పూర్తిచేసిన కోర్సులకు ప్రింటెడ్ డిజిటల్ సర్టిఫికెట్ అందజేస్తారు

ఫ్యూచర్ లెర్న్ కోర్సుల ప్రతికూలతలు

  • ఉచిత కోర్సులకు ఎటువంటి సపోర్టు అందించారు
  • కోర్సులు సభ్యులు తమ అనుకూలమైన సమయాల్లో నేర్చుకునే సదుపాయం లేదు
  • సబ్జెక్టు సంబంధిత అంశాలు నావిగేట్ చేయడం కష్టం
  • కోర్సులను స్కిప్ చేసే సదుపాయం లేదు
  • మొబైల్ యాప్ అందుబాటులో లేదు

ఫ్యూచర్ లెర్న్ కోర్సులు ప్రయోజనాలు మరియు ప్రతికూలతలు కొంచెపు పక్కన పెడితే, ఆన్‌లైన్ ద్వారా నూతన నైపుణ్యాలు నేర్చుకునే ఆలోచన ఉన్నవారికి, కెరీర్ పరమైన ప్రోఫిసినల్ స్కిల్స్ పెంపొందించుకునే వారికీ మరియు ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీల  నుండి ఆన్లైన్ ద్వారా పూర్తిస్థాయి బ్యాచిలర్ డిగ్రీ పొందాలనుకునే వారికీ ఫ్యూచర్ లెర్న్ ఉత్తమ ఎంపిక అవుతుంది. ఉన్నత విద్యకు దూరమయ్యే వారు ఈ వేదిక ద్వారా వారి ఉన్నత విద్య కలను నిజం చేసుకోవచ్చు.

Post Comment