ఇంటర్ మరియు డిగ్రీ తర్వాత ఆర్మీ ఉద్యోగాలు | కెరీర్ గైడెన్స్
Career Guidance Career Options

ఇంటర్ మరియు డిగ్రీ తర్వాత ఆర్మీ ఉద్యోగాలు | కెరీర్ గైడెన్స్

ఇంటర్, డిగ్రీ అర్హుతతో ప్రారంభంలోనే ఆఫీసర్ స్థాయి హోదాతో ప్రపంచ అత్యున్నత భారత సైన్యాన్ని ముందుండి నడిపించే అవకాసం ఇండియన్ ఆర్మీ కల్పిస్తుంది. సరిహద్దు రక్షణ వ్యవహారాలలో, దేశ విపత్తు సమయాల్లో ఇటు దేశానికీ, అటు ప్రజలకు స్పూర్తిదాయకమైన సేవలు అందించే సైన్యంలో చేరేందుకు ఉత్సవంతులైన యువకులకు ఇది గొప్ప అవకాశం. ఇటువంటి అత్యున్నత ఆఫీసర్ హోదాల్లో వివిధ విద్య అర్హుతలతో ఏవిదంగా ప్రవేశించవచ్చో వివరంగా తెలుసుకుందాం.

ఇంటర్ తర్వాత ఇండియన్ ఆర్మీలో జాబ్స్

ఇంటర్మీడియట్ (10+2) తో ఇండియన్ ఆర్మీలో ఆఫీసరుగా చేరేందుకు రెండు మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి త్రివిధ దళాలలో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు యూపీఎస్సీ నిర్వహించే NDA (నేషనల్ డిఫెన్స్ అకాడమి) ప్రవేశ పరీక్ష, రెండువది ఇండియన్ ఆర్మీ నిర్వహించే TES (టెక్నికల్ ఎంట్రీ స్కీం) పరీక్ష. ఈ రెండు పరీక్షలలో ఏదో ఒకదానిలో ఉత్తీర్ణత పొందడం ద్వారా ఆఫీసర్ హోదాతో భారత సైన్యంలో కెరీర్ ప్రారంభించవచ్చు.

NDA ఎగ్జామ్ (నేషనల్ డిఫెన్స్ అకాడమీ)

త్రివిధ దళాలలో ఇంటర్మీడియట్ అర్హుతతో ప్రారంభ దశలోనే ఆఫీసర్ హోదాల్లో విధులు నిర్వర్తించే అవకాసం ఎన్డీఏ కల్పిస్తుంది. యూపీఎస్సీ ఆద్వర్యంలో యేట జనవరి, ఆగష్టులో రెండు సార్లు జరిగే ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా యువత భారీగా హాజరవుతారు.

ఈ పరీక్షకు సంబంధించి ఒక్కో బ్యాచులో గరిష్టంగా 320 సీట్లు అందుబాటులో ఉంటాయి. అందులో ఆర్మీ కి 208 సీట్లు, ఎయిర్ ఫోర్సుకు 70, నేవీ కి42 సీట్లు కేటాయిస్తారు. రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్దులకు వ్యక్తిగత ముఖాముఖి జరిపి తుది జాబితా తయారుచేస్తారు. తుది జాబితాలో  ఉన్నా అభ్యర్దులకు మూడేళ్ళు NDA(నేషనల్ డిఫెన్సు అకాడమీ) ఇంకో ఏడాది IMA (ఇండియన్ మిలిటరీ అకాడమీ) యందు శిక్షణ అందిస్తారు.

  • అందుబాటులో ఉండే సీట్లు : 208
  • విద్య అర్హుత: ఇంటర్మీడియట్/10+2
  • వయోపరిమితి: 16 1/2 నుండి 19 1/2 ఏళ్ళ మద్య, అవివాహితలు.
  • నోటిఫికేషన్ విడుదల: జనవరి , ఆగస్ట్.
  • పరీక్షా : ఏప్రిల్, నవంబర్
  • నోటిఫికేషన్ సమాచారం స్థానిక న్యూస్ పేపర్లలో, ఎంప్లాయిమెంట్ న్యూస్ లో వస్తుంది
  • నోటిఫికేషన్ అనుచరించి UPSC వెబ్సైట్ ద్వార దరఖాస్తు  చేసుకోవాలి

TES ఎగ్జామ్ (టెక్నికల్ ఎంట్రీ స్కీం)

ఇంటర్మీడియట్ అర్హుతతో టెక్నికల్ ఎంట్రీ స్కీం ద్వార ఇండియన్ ఆర్మీ నేరుగా నిర్వహించే TES ఎగ్జామ్ కూడా యేట రెండు సార్లు జరుగుతుంది. ఇందులో 90 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఈ పరీక్షను కూడా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తుంది.

  • అందుబాటులో ఉండే సీట్లు : 90
  • విద్య అర్హుత: ఇంటర్మీడియట్/10+2
  • వయోపరిమితి: 16 1/2 నుండి 19 1/2 ఏళ్ళ మద్య, అవివాహితలు.
  • నోటిఫికేషన్ విడుదల:మే/జూన్, అక్టోబర్ /నవంబర్.
  • పరీక్షా : ఆగస్ట్ నుండి అక్టోబర్ మద్య , ఫెబ్రవరి నుండి ఏప్రిల్ మద్య
  • నోటిఫికేషన్ సమాచారం స్థానిక న్యూస్ పేపర్లలో, ఎంప్లాయిమెంట్ న్యూస్ లో వస్తుంది
  • నోటిఫికేషన్ అనుచరించి UPSC వెబ్సైట్ ద్వార దరఖాస్తు  చేసుకోవాలి

డిగ్రీ అర్హుతతో ఇండియన్ ఆర్మీ జాబ్స్

డిగ్రీ అర్హుతతో ఆర్మీ ఆఫీసర్ కొలువు సాధించేందుకు రెండు మార్గాలున్నాయి. అందులో ఒకటి IMA (ఇండియన్ మిలిటరీ అకాడమి) ప్రవేశ పరీక్ష, రెండువది OTA Non Technical (ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమి) ప్రవేశ పరీక్ష. ఈ రెండు పరీక్షల నోటిఫికేషన్లు యుపీఎస్సీ నిర్వహించే CDSE (కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్) ద్వార విడుదల అవుతాయి.

ఇండియన్ మిలిటరీ అకాడమి (IMA) 

  • అందుబాటులో ఉండే సీట్లు : 200 (ఏడాదికి రెండుసార్లు)
  • విద్య అర్హుత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ
  • వయోపరిమితి:19 నుండి 24 ఏళ్ళ మద్య, అవివాహితలు.
  • నోటిఫికేషన్ విడుదల: జూలై, నవంబర్
  • నోటిఫికేషన్ సమాచారం స్థానిక న్యూస్ పేపర్లలో, ఎంప్లాయిమెంట్ న్యూస్ లో వస్తుంది
  • నోటిఫికేషన్ అనుచరించి UPSC వెబ్సైట్ ద్వార దరఖాస్తు  చేసుకోవాలి
  • ట్రైనింగ్ సెంటర్ : ఇండియన్ మిలిటరీ అకాడమి డెహరాడూన్
  • ట్రైనింగ్ కాలవ్యవధి: 18 నెలలు

ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమి (OTA NON TECHNICAL) 

  • అందుబాటులో ఉండే సీట్లు: 175 (ఏడాదికి రెండుసార్లు)
  • విద్య అర్హుత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ
  • వయోపరిమితి:19 నుండి 25 ఏళ్ళ మద్య, అవివాహితలు.
  • నోటిఫికేషన్ విడుదల: జూలై, నవంబర్
  • నోటిఫికేషన్ సమాచారం స్థానిక న్యూస్ పేపర్లలో, ఎంప్లాయిమెంట్ న్యూస్ లో వస్తుంది
  • నోటిఫికేషన్ అనుచరించి UPSC వెబ్సైట్ ద్వార దరఖాస్తు  చేసుకోవాలి
  • ట్రైనింగ్ సెంటర్ : ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమి చెన్నై
  • ట్రైనింగ్ కాలవ్యవధి: 49 నెలలు