టీఎస్ అగ్రిసెట్ & అగ్రి ఇంజనీరింగ్ సెట్ నోటిఫికేషన్ 2022 వెలువడింది. హైదరాబాద్‌లోని రాజేంద్ర నగర్‌లో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ అగ్రికల్చర్ కోర్సుల యందు అడ్మిషన్ కల్పించేందుకు నిర్వహించే ఈ ప్రవేశ పరీక్ష కోసం అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.
Exam Name | AGRICET & AGRIENGGCET |
Exam Type | Entrance Exam |
Exam For | Admission for Agriculture |
Exam Date | 30 Sep 2022 |
Exam Duration | 90 Minutes |
Exam Level | State Level (TS) |
టీఎస్ అగ్రిసెట్ & అగ్రి ఇంజనీరింగ్ సెట్
- టీఎస్ అగ్రిసెట్ & అగ్రి ఇంజనీరింగ్ సెట్ ద్వారా అడ్మిషన్ పొందే కోర్సులు
- టీఎస్ అగ్రిసెట్ & అగ్రి ఇంజనీరింగ్ సెట్ ఎలిజిబిలిటీ
- టీఎస్ అగ్రిసెట్ & అగ్రి ఇంజనీరింగ్ సెట్ షెడ్యూల్ 2022
- టీఎస్ అగ్రిసెట్ & అగ్రి ఇంజనీరింగ్ సెట్దరఖాస్తు ఫీజు
- టీఎస్ అగ్రిసెట్ & అగ్రి ఇంజనీరింగ్ సెట్ పరీక్షకు దరఖాస్తు చేయండి
- టీఎస్ అగ్రిసెట్ & అగ్రి ఇంజనీరింగ్ సెట్ పరీక్ష నమూనా
టీఎస్ అగ్రిసెట్ & అగ్రి ఇంజనీరింగ్ సెట్ ద్వారా అడ్మిషన్ పొందే కోర్సులు
టీఎస్ అగ్రిసెట్ పరీక్షను బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుల యందు అడ్మిషన్ కల్పించేందుకు నిర్వహిస్తారు. అగ్రి ఇంజనీరింగ్ సెట్ ద్వారా బీటెక్ అగ్రికల్చర్ కోర్సుల యందు ప్రవేశాలు కల్పిస్తారు. బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులకు సంబంధించి మొత్తం 71 సీట్లు అందుబాటులో ఉన్నాయి. బీటెక్ అగ్రికల్చర్ కోర్సులకు సంబంధించి మొత్తం 8 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అగ్రికల్చర్ డిప్లొమా పూర్తిచేసిన విద్యార్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు.
టీఎస్ అగ్రిసెట్ & అగ్రి ఇంజనీరింగ్ సెట్ ఎలిజిబిలిటీ
అగ్రిసెట్ | అగ్రి ఇంజనీరింగ్ సెట్ |
---|---|
ప్రొఫెసర్ జయశంకర్ & ఎన్జీ రంగా యూనివర్సిటీ నుండి అగ్రికల్చర్ లేదా సీడ్ టెక్నాలజీ, ఆర్గానిక్ ఫార్మింగ్ నుండి డిప్లొమా పూర్తి చేసిన వారు అర్హులు. | ప్రొఫెసర్ జయశంకర్ & ఎన్జీ రంగా యూనివర్సిటీ నుండి డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు అర్హులు. |
అభ్యర్థుల వయస్సు 17 నుండి 22 ఏళ్ళ మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 5 ఏళ్ళ సడలింపు ఉంటుంది. | అభ్యర్థుల వయస్సు 18 నుండి 22 ఏళ్ళ మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 5 ఏళ్ళ సడలింపు ఉంటుంది. |
టీఎస్ అగ్రిసెట్ & అగ్రి ఇంజనీరింగ్ సెట్ 2022 షెడ్యూల్
దరఖాస్తు ప్రారంభ తేదీ | 08 ఆగష్టు 2022 |
దరఖాస్తు చివరి తేదీ | 07 సెప్టెంబర్ 2022 |
చేర్పులు మార్పులు | 07 సెప్టెంబర్ 2022 |
హాల్ టికెట్ డౌన్‌లోడ్ | 25 సెప్టెంబరు 2022 |
ఇంజనీరింగ్ సెట్ | 30 సెప్టెంబర్ 2022 |
అగ్రికల్చర్ & మెడికల్ పరీక్ష తేదీ | 30 సెప్టెంబర్ 2022 |
ఫలితాలు | అక్టోబర్ 2022 |
కౌన్సిలింగ్ | అక్టోబర్ 2022 |
పరీక్ష సమయం (ఇంజనీరింగ్ మరియు అగ్రికల్చర్ ) | |
ఉదయం | 10:00 AM TO 11:40 PM |
టీఎస్ అగ్రిసెట్ & అగ్రి ఇంజనీరింగ్ సెట్ దరఖాస్తు ఫీజు
జనరల్ అభ్యర్థులు | 14,00/- |
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు | 700/- |
జనరల్ అభ్యర్థులు (లేటు ఫీజు) | 2,100/- (19/09/2022) |
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు (లేటు ఫీజు) | 1,050/- (19/09/2022) |
దరఖాస్తు రుసుములు ఏపీ ఆన్‌లైన్, టీఎస్ ఆన్‌లైన్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు మరియు నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు. దరఖాస్తు సమయంలో ఉండే అదనపు రుసుములు అభ్యర్థులే చెల్లించవల్సి ఉంటుంది.
టీఎస్ అగ్రిసెట్ & అగ్రి ఇంజనీరింగ్ సెట్ దరఖాస్తు ప్రక్రియ
తెలంగాణ టీఎస్ అగ్రిసెట్ & అగ్రి ఇంజనీరింగ్ సెట్ దరఖాస్తు ప్రక్రియ పూర్తి ఆన్‌లైన్ పద్దతిలో ఉంటుంది. ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించే ముందు ఈ కింది వివరాలు అందుబాటులో ఉంచుకోండి.
- ఉత్తీర్ణత సాధించిన పరీక్ష హాల్ టికెట్ నెంబర్
- టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్
- పుట్టిన తేదీ వివరాలు
- కేటగిరి వివరాలు (ఎస్సీ, ఎస్టీ, బీసీలు)
- ఆధార్ నెంబర్
- PH, NCC, Sports సర్టిఫికేట్లు
- ఆదాయ దృవపత్రం & రేషన్ కార్డు నెంబర్
- స్టడీ మరియు రెసిడెన్సీ సర్టిఫికెట్లు
దరఖాస్తు ప్రక్రియ మూడు దశలలో పూర్తిచేయాల్సి ఉంటుంది. మొదట దశలో అందుబాటులో ఉన్న పేమెంట్ విధానం ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించాలి. రెండవ దశలో అడిగిన వివరాలు పూరించి దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేయాలి. దరఖాస్తు పూర్తిచేసే ముందు మీరు ఇచ్చిన వివరాలు మరోమారు సరిచూసుకోండి.
చివరి దశలో మీ దరఖాస్తు ప్రింటవుట్ తీసుకోవటం ద్వారా మొత్తం దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది. మీరు తీసుకున్న ప్రింటవుట్ పై తాజాగా తీసిన మీ ఫొటోగ్రాఫ్ అతికించి, మీరు చదువుకున్న కాలేజీ ప్రిన్సిపాల్ లేదా గ్రేజిటెడ్ ఆఫీసర్ తో సంతకం చేయించి పరీక్ష సమయంలో ఇన్విజిలేటర్ కు అందించవల్సి ఉంటుంది.
టీఎస్ అగ్రిసెట్ & అగ్రి ఇంజనీరింగ్ సెట్ రీజనల్ పరీక్ష కేంద్రాలు
అగ్రిసెట్ | అగ్రి ఇంజనీరింగ్ సెట్ |
---|---|
హైదరాబాద్ ఖమ్మం వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ |
హైదరాబాద్ ఖమ్మం వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ |
టీఎస్ అగ్రిసెట్ & అగ్రి ఇంజనీరింగ్ సెట్ ఎగ్జామ్ నమూనా
టీఎస్ అగ్రిసెట్ & అగ్రి ఇంజనీరింగ్ సెట్ పరీక్ష పూర్తి ఆన్‌లైన్ (CBT) విధానములో కంప్యూటర్ ఆధారంగా నిర్వహించబడుతుంది. 90 నిముషాల కాలవ్యవధిలో 100 మల్టిపుల్ ఛాయస్ ప్రశ్నలకు సమాధానం చేయాల్సి ఉంటుంది. పరీక్ష ఉదయం 10 నుండి 11.40 వరకు వరకు జరపబడుతుంది.
టీఎస్ అగ్రిసెట్ పరీక్ష తెలుగు మరియు ఇంగ్లీష్ భాషల్లో నిర్వహించబడుతుంది. అగ్రి ఇంజనీరింగ్ సెట్ కేవలం ఇంగ్లీష్ భాషలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. విద్యార్థులు పేస్ మాస్క్ , గ్లౌజులు, సాధారణ పెన్, అడ్మిట్ కార్డ్, ఐడీ కార్డ్, హ్యాండ్ శానిటైజరుతో హాజరవ్వాలి.
టీఎస్ అగ్రిసెట్ & అగ్రి ఇంజనీరింగ్ సెట్ అడ్మిషన్ ప్రక్రియ ప్రవేశ పరీక్ష యందు సాధించిన మెరిట్ ఆధారంగా నిర్వహిస్తారు. తుది షార్ట్ లిస్ట్ వివిధ రిజర్వేషన్ కోటాల పరిధిలో అందుబాటులో ఉండే సీట్లు ఆధారంగా రూపొందించి ప్రవేశాలు కల్పిస్తారు.
సబ్జెక్టు/సిలబస్ | ప్రశ్నలు | మార్కులు | సమయం |
టీఎస్ అగ్రిసెట్ | 100 ప్రశ్నలు | 100 మార్కులు | 90 నిముషాలు |
అగ్రి ఇంజనీరింగ్ సెట్ | 100 ప్రశ్నలు | 100 మార్కులు | 90 నిముషాలు |
అగ్రిసెట్ సిలబస్ | అగ్రి ఇంజనీరింగ్ సెట్ సిలబస్ |
---|---|
New syllabus (English medium) covered in Diploma in Agriculture / Diploma in Seed Technology / Diploma in Organic Agriculture; varieties & technologies developed by PJTSAU; Central and State Government schemes related to Agriculture, General Agriculture, General English and Basics in Computers. | Syllabus covered in Diploma in Agricultural Engineering; latest technologies developed by PJTSAU; Central and State Government schemes related to Agricultural Engineering, General Agriculture, General English and Basics in Computers. |