ఎస్‌ఎస్‌సీ జేఈ నోటిఫికేషన్ 2022 | ఎలిజిబిలిటీ, దరఖాస్తు, ఎగ్జామ్ ఫార్మేట్
Latest Jobs SSC

ఎస్‌ఎస్‌సీ జేఈ నోటిఫికేషన్ 2022 | ఎలిజిబిలిటీ, దరఖాస్తు, ఎగ్జామ్ ఫార్మేట్

ఎస్‌ఎస్‌సి జూనియర్ ఇంజనీర్ 2022 నోటిఫికేషన్ వెలువడింది. ఈ నియామక ప్రకటన ద్వారా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ & క్వాలిటీ సర్వేయింగ్ కాంట్రాక్టు విభాగాల్లో జూనియర్ ఇంజనీర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంజనీరింగ్ లేదా డిప్లొమా పూర్తిచేసి 22 నుండి 32 ఏళ్ళ మధ్య వయసున్న అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా జరుగుతుంది.

ఎస్‌ఎస్‌సీ జేఈ ఎగ్జామ్ ద్వారా భర్తీచేసే పోస్టులు

భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ డిపార్టుమెంట్ కార్యాలయాలు మరియు కేంద్రప్రభుత్వ ఆర్గనైజషన్స్'లో జూనియర్ ఇంజనీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, మరియు క్వాంటిటీ సర్వేయింగ్ & కాంట్రాక్ట్స్ విభాగాలకు సంబంధించి జూనియర్ ఇంజినీర్లను నియమించేందుకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ జూనియర్ ఇంజినీర్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తుంది. ఎంపికైన అభ్యర్థులలో గ్రూపు బి నాన్ గెజిటెడ్ హోదాలో లెవెల్ 6 పే (35400-/ to 112,400/-) పరిదిలో వేతనం అందుకుంటారు.

ఆర్గనైజషన్ పోస్టు విభాగం
సెంట్రల్ వాటర్ కమిషన్ జూ. ఇంజనీర్ (సివిల్, మెకానికల్)
సెంట్రల్ పబ్లిక్ వర్క్ డిపార్టుమెంట్ జూ. ఇంజనీర్ (సివిల్, ఎలక్ట్రికల్ )
మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ జూ. ఇంజనీర్ (సివిల్, మెకానికల్ & ఎలక్ట్రికల్)
ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్ జూ. ఇంజనీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్)
బోర్డర్ రోడ్డు ఆర్గనైజషన్ జూ. ఇంజనీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్)
సెంట్రల్ పవర్ & వాటర్ రీసెర్చ్ స్టేషన్ జూ. ఇంజనీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్)
డైరెక్టరేట్ ఆఫ్ క్వాలిటీ అస్యూరెన్స్ (నావల్) జూ. ఇంజనీర్ (మెకానికల్, ఎలక్ట్రికల్)
నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజషన్ జూ. ఇంజనీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్)
మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ హార్బర్ (అండమాన్ & లక్షదీప్) జూ. ఇంజనీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్)

ఎస్‌ఎస్‌సీ జేఈ ఎగ్జామ్ 2022 షెడ్యూల్

ఎస్‌ఎస్‌సీ జేఈ నోటిఫికేషన్ HQ-PPII03(2)/2/2022-PP_II
పోస్టుల సంఖ్యా -
దరఖాస్తు ప్రారంభం 12.08.2022
దరఖాస్తు చివరి గడువు 02.09.2022
పరీక్ష ఫీజు 100/-
పరీక్ష తేదీ నవంబర్ 2022
అడ్మిట్ కార్డు క్లిక్ చేయండి 
ఫలితాలు క్లిక్ చేయండి 

ఎస్‌ఎస్‌సీ జేఈ ఎలిజిబిలిటీ

  • జాతీయత : ఇండియా/నేపాల్/భూటాన్ దేశాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. 1 జనవరి 1962 ముందు భారత్ వచ్చి స్థిరపడిన టిబెటియన్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయొచ్చు. భారతీయ మూలాలు కలిగి పాకిస్తాన్, బర్మా, శ్రీలంకా, తూర్పు ఆఫ్రికా దేశాలు కెన్యా, ఉగాండా, యునైటెడ్ రిపబ్లిక్ టాంజానియా (పూర్వం టాంగన్యికా మరియు జాంజిబార్), జాంబియా, మాలావి, జైర్, ఇథియోపియా మరియు వియత్నాం దేశాల నుండి శాశ్వతంగా భారత్ లో స్థిరపడేందుకు వచ్చే భారతీయ సంతతి కూడా అర్హులు.
  • వయోపరిమితి: వివిధ పోస్టులను అనుసరించి 22 నుండి 32 ఏళ్ళ మధ్య వయస్సు ఉండే అభ్యర్థులు దరఖాస్తు చెయ్యొచ్చు. ఓబీసీ అభ్యర్థులకు గరిష్టంగా 3 ఏళ్ళ వయోపరిమితి సడలింపు ఉంటుంది. షెడ్యూల్డ్ కులాల వారికీ గరిష్టంగా 5 ఏళ్ళు, వికలాంగులకు 10 ఏళ్ళు సడలింపు కల్పిస్తారు.
  • విద్య అర్హుత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 60% శాతం మార్కులతో ఇంజనీరింగ్ (సివిల్, మెకానికల్ మరియు ఎలక్ట్రికల్) పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు.

ఎస్‌ఎస్‌సీ జేఈ దరఖాస్తు ఫీజు

జనరల్ కేటగిరి అభ్యర్థులు 100/-
మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, వికలాంగులు, ESM అభ్యర్థులు దరఖాస్తు ఫీజు మినహాహించారు

ఎస్‌ఎస్‌సీ జేఈ దరఖాస్తు విధానం

అర్హుత ఉన్న అభ్యర్థులు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అధికారిక వెబ్సైటు నుండి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ యందు పొందిపర్చిన విదంగా కమిషన్ అడిగిన వ్యక్తిగత, విద్యా సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. దరఖాస్తు పారంభించే ముందు అవసరమయ్యే వివరాల్ని అందుబాటులో పెట్టుకోండి.

పుటిన తేదీ వివరాలు, కేటగిరి వివరాలు, మొబైల్ నెంబర్ మరియు మెయిల్ ఐడీ వంటి వివరాలు తప్పులు దొర్లకుండా పొందుపర్చండి. పోస్టు ఎంపిక, పరీక్షా కేంద్ర ఎంపిక వివరాలు మరో మారు సరిచూసుకోండి.

అప్లోడ్ చేసే ధ్రువపత్రాలు కమిషన్ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా రూపొందించుకోండి. దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేశాక అందుబాటులో ఉండే పేమెంట్ మార్గం ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించండి. దరఖాస్తు రుసుము చెల్లించని అప్లికేషన్లు పరిగణలోకి తీసుకోబడవు.

తెలుగు రాష్ట్రాలలో ఎగ్జామ్ సెంటర్లు

ఎగ్జామ్ సెంటర్ SSC రీజనల్ కేంద్రం సమాచారం (సౌత్ రీజియన్)
చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం,
హైదరాబాద్, కరీంనగర్, వరంగల్
Regional Director (SR), Staff Selection Commission, 2 nd Floor, EVK Sampath Building, DPI Campus, College Road, Chennai, Tamil Nadu-600006 (www.sscsr.gov.in)

ఎస్‌ఎస్‌సీ జేఈ ఎగ్జామ్ నమూనా

ఎస్‌ఎస్‌సీ జేఈ పరీక్ష రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. పేపర్ I పూర్తి ఆబ్జెక్టివ్ పద్దతిలో ఆన్‌లైన్ విధానంలో నిర్వహించబడుతుంది. జనరల్  ఇంటిలిజెన్స్ & రీజనింగ్, జనరల్ అవెర్నెస్ మరియు ఇంజనీరింగ్ సంబంధించిన అంశాలతో 200  మార్కులకు జరుగుతుంది. పరీక్ష 2 గంటల నిడివిలో పూర్తిచేయాల్సి ఉంటుంది. సరైన సమాధానం చేసిన ప్రశ్నకు 1 మార్కు, తప్పు సమాధానం చేసిన ప్రశ్నకు -0.25 మార్కులు తొలగిస్తారు.

ఎస్‌ఎస్‌సీ జేఈ పేపర్ I పరీక్ష నమూనా
సిలబస్ ప్రశ్నలు మార్కులు సమయం
పేపర్ I /ఆబ్జెక్టివ్ జనరల్ ఇంటిలిజెన్స్ & రీజనింగ్ 50/50 2 గంటలు
జనరల్ అవెర్నెస్ 50/50
ఇంజనీరింగ్ (సివిల్. ఎలక్ట్రికల్ & మెకానికల్ ) 100/100

పేపర్ I లో అర్హుత పొందిన వారిని పేపర్ II రాసే అవకాశం కల్పిస్తారు. పేపర్ II డిస్క్రిప్టివ్ పద్దతిలో ఇంజనీరింగ్ స్పెషలైజ్  సంబంధించి జరుగుతుంది. సివిల్, మెకానికల్ మరియు ఎలక్ట్రికల్ స్పెషలైజ్డ్ సబ్జెక్టులకు సంబంధించి ఒక్కో పేపర్ 300 మార్కులకు జరుగుతుంది. ఏ పోస్టుకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఆ పరీక్షకు హాజరు అవ్వాల్సి ఉంటుంది. పరీక్షకు 2 గంటల సమయం కేటాయిస్తారు.

ఎస్‌ఎస్‌సీ జేఈ పేపర్ II పరీక్ష నమూనా
సిలబస్ ప్రశ్నలు మార్కులు సమయం
పేపర్ II /డిస్క్రిప్టివ్ సివిల్ ఇంజనీరింగ్ (or) 300 2 గంటలు
మెకానికల్ ఇంజనీరింగ్ (or) 300
 ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 300

ఎస్‌ఎస్‌సీ జేఈ తుది ఎంపిక

ఎస్‌ఎస్‌సీ జేఈ తుది ఎంపిక అభ్యర్థులు రాతపరీక్షలో చూపినా ప్రతిభ ఆధారంగా ఉంటుంది. మొదట రెండు పేపర్లు యందు అభ్యర్థులు సాధించిన మెరిట్ లెక్కించి షార్ట్ లిస్ట్ రూపొందిస్తారు. దరఖాస్తులో పేర్కొన్న ప్రాథమ్యాలు, ఆయా విభాగాల్లో ఉన్న ఖాళీలు, రిజర్వేషన్లు వంటి అంశాలను పెరిగినలోకి తీసుకుంది తుది జాబితాను రూపొందిస్తారు.

Post Comment