TGUGCET 2023 : తెలంగాణ గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు
Admissions University Entrance Exams

TGUGCET 2023 : తెలంగాణ గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు

తెలంగాణ గురుకుల డిగ్రీ కాలేజీల్లో డిగ్రీ ప్రవేశాల కోసం నిర్వహించే టీజీయూజీసెట్ 2023 నోటిఫికేషన్ వెలువడింది. టీజీయూజీసెట్ అనగా తెలంగాణ గురుకులం అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్సు టెస్టు అని అర్ధం. దీనికి సంబంధించి దరఖాస్తులు జనవరి 5వ తేదీ నుండి ఫిబ్రవరి 5వ తేదీ మధ్య స్వీకరిస్తున్నారు.

టీజీయూజీసెట్ యందు అర్హుత పొందటం ద్వారా తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (TTWREIS) లలో 2023 - 24 విద్యా ఏడాదికి సంబంధించి బీబీఏ, బీఏ, బీకామ్ మరియు బీఎస్సీ మొదటి ఏడాది కోర్సులలో అడ్మిషన్లు పొందొచ్చు. రాష్ట్రంలో ప్రతిభావంతులైన నిరుపేద అబ్బాయిలు మరియు అమ్మాయిలకు గురుకులం విద్య ఫార్మేట్'లో నాణ్యమైన బ్యాచిలర్ కోర్సులు అందించేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తారు.

టీజీయూజీసెట్ 2023 షెడ్యూల్

దరఖాస్తు ప్రారంభ తేదీ 05 జనవరి 2023
దరఖాస్తు తుది గడువు 05 ఫిబ్రవరి 2023
టీజీయూజీసెట్ 2023 పరీక్ష తేదీ 05 మే 2023

టీజీయూజీసెట్ ఎలిజిబిలిటీ

  • విద్యార్థులు అకాడమిక్ ఇయర్ 2022-23 మార్చి లేదా 2022 -23 మే పబ్లిక్ పరీక్షలలో ఉత్తీర్ణత పొందాలి.
  • విద్యార్థి కుటుంబ ఆదాయం ఏడాదికి లక్ష ఏభైవేలు (రూరల్), రెండు లక్షలు (అర్బన్) మించకూడదు.
  • తెలుగు మరియు ఇంగ్లీష్  మీడియంలో పది చదువుకున్న విద్యార్థులు మాత్రమే పరీక్ష రాసేందుకు అర్హులు.
  • విద్యార్థి డిగ్రీ కోర్సులలో చేరేందుకు సంబంధిత ఇంటర్ గ్రూపుల యందు ఉత్తీర్ణత సాదించాలి.
  • సీటు సాధించిన విద్యార్థులు అడ్మిషన్ సమయంలో సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాల్సి ఉంటుంది.
  • మెజారిటీ సీట్లు ఎస్టీ విద్యార్థులకు కేటాయిస్తారు.

టీజీయూజీసెట్ దరఖాస్తు విధానం

దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. అర్హుత కలిగిన విద్యార్థులు www.tgtwgurukulam.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులో మొదటి దశలో పరీక్ష ఫీజు చెల్లించడం ద్వారా ప్రారంభం అవుతుంది. దీని కోసం విద్యార్థి తన పేరు, పుట్టిన తేదీ వివరాలు, మొబైల్ నెంబర్, దరఖాస్తు చేయబోతున్న డిగ్రీ గ్రూపు వివరాలు మరియు విద్యార్థి సంబంధిత పాత జిల్లా ఎంపికను పొందుపర్చాలి.

ఈ వివరాలు పొందుపర్చాక అందుబాటులో ఉండే పేమెంట్ విధానంలో దరఖాస్తు ఫీజు చెల్లించాలి. పేమెంట్ విజయవంతం అయ్యాక మీ పేమెంట్ వివరాలతో కూడిన దరఖాస్తు ఐడీ జనరేట్ అవుతుంది. ఈ ఐడీ నెంబర్ సహాయంతో రెండవ దశ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

రెండవ దశలో విద్యార్థి వ్యక్తిగత, విద్యా, చిరునామా వివరాలు పొందుపర్చాలి. అలానే డిజిటల్ సంతకం, పాసుపోర్టు సైజు ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనితో దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది. దరఖాస్తు చేసే ముందు సంబంధిత సర్టిఫికేట్లు అన్ని అందుబాటులో ఉంచుకోవాలి. ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీలు, రిజర్వేషన్ కేటగిరి, భాష ఎంపిక, పరీక్ష కేంద్రం వంటి వివరాలు దరఖాస్తు పూర్తిచేసే ముందు పునఃపరిశీలించుకోండి.

వైట్ బ్యాక్ గ్రౌండ్ తో ఈమధ్య కాలంలో తీసుకున్న పాసుపోర్టు సైజు ఫోటో అందుబాటులో ఉంచుకోండి. కంప్యూటర్ లో డిజైన్ లేదా ఎడిట్ చేసిన ఫోటోలు అనుమతించబడవు. మీ సొంత దస్తూరితో చేసిన సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి. కాపిటల్ లేటర్స్ తో చేసిన సంతకం చెల్లదు. ఫొటోగ్రాఫ్, సంతకం వాటికీ సంబంధించిన బాక్సుల్లో మాత్రమే అప్‌లోడ్ చేయండి.

పై డాక్యూమెంట్లు తారుమారు అయితే దరఖాస్తు పరిగణలోకి తీసుకోబడదు. ఈ ఫైళ్ల సైజు 10-100 కేబీల మధ్య ఉండేలా చూసుకోండి. అడ్మిట్ కార్డు అందుబాటులో ఉండే తేదిలో పిడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్‌లోడ్ చేసుకోండి. పరీక్ష రోజు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డు, ఫొటోగ్రాఫ్ తో పాటు వ్యక్తిగత ఐడెంటి కార్డుతో పరీక్షకు హాజరవ్వాలి. నిషేదిత వస్తువులు పరీక్ష కేంద్రంలోకి ఎట్టి పరిస్థితిల్లో అనుమతించబడవు.

దరఖాస్తు రుసుము : సాధారణ డిగ్రీ కోర్సులకు 150/-, ఆర్మడ్ ఫోర్సెస్ శిక్షణ అందించే కాలేజీలో చేరేవారు 250/- చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు రుసుములు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ లేదా ఈ చలానా విధానంలో చెల్లించవచ్చు. చెల్లింపు సమయంలో సర్వీస్ చార్జీలు, జీఎస్టీ వంటి అదనపు చార్జీలు ఉంటె అభ్యర్థులనే భరించాలి.

టీజీయూజీసెట్ ఎగ్జామ్ నమూనా

టీజీయూజీసెట్ ఐదు రకాల గ్రూపులకు సంబంధించి విడివిగా జరుపుతారు. ప్రవేశ పరీక్ష ఓఎంఆర్ షీట్ ఆధారంగా ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. పరీక్ష రెండున్నర గంటల నిడివితో 120 మార్కులకు ఉంటుంది. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ప్రశ్నలు ఇంటర్ స్థాయి సిలబసుతో ఇంగ్లీష్ పాటుగా మూడు ఆప్షనల్ సబ్జెక్టు అంశాల నుండి ఇవ్వబడతాయి.

ప్రశ్నపత్రం ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో అందుబాటులో ఉంటుంది. ప్రవేశాలు అర్హుత పరీక్షలో పొందిన మెరిట్ మరియు వివిధ కుల, లోకల్ రిజర్వేషన్ సమీకరణాల ఆధారంగా నిర్వహిస్తారు. గ్రూపు వారీగా ఆప్షనల్ సబ్జెక్టులు కింది విధంగా ఉంటాయి.

  1. ఎంపీసీ గ్రూపు : మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ
  2. బైపీసీ గ్రూపు : బోటనీ, జూవాలాజీ, కెమిస్ట్రీ
  3. ఎంఈసీ గ్రూపు : మ్యాథ్స్, కామర్స్ & అకౌంట్స్
  4. సీఈసీ గ్రూపు : ఎకనామిక్స్, కామర్స్ & అకౌంట్స్
  5. హెచ్ఈసీ గ్రూపు : హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్
సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు
ఇంగ్లీష్  30 ప్రశ్నలు 30 మార్కులు
ఆప్షనల్ సబ్జెక్టు I  30 ప్రశ్నలు 30 మార్కులు
ఆప్షనల్ సబ్జెక్టు II  30 ప్రశ్నలు 30 మార్కులు
ఆప్షనల్ సబ్జెక్టు III 30 ప్రశ్నలు 30 మార్కులు
మొత్తం 120 ప్రశ్నలు 120 మార్కులు

టీజీయూజీసెట్ అడ్మిషన్ విధానం

గురుకుల కాలేజీల అడ్మిషన్ ప్రక్రియ టీజీయూజీసెట్ యందు పొందిన మెరిట్ ఆధారంగా నిర్వహిస్తారు. ఒక్కో కాలేజీలో, ఒక్కో గ్రూపుకు సంబంధించి 40 సీట్లు అందుబాటులో ఉంటాయి. మహిళల బీసీ సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీలలో 75 శాతం సీట్లు ఎస్సీ విద్యార్థినులతో భర్తీ చేస్తారు. కో ఎడ్యుకేషన్ కాలేజీల్లో 75 సీట్లు ఎస్టీ విద్యార్థి, విద్యార్థునులతో భర్తీ చేస్తారు.

రిజర్వేషన్ కేటగిరి రిజర్వేషన్ కోటా సీట్ల సంఖ్యా
ఎస్సీ  75 శాతం / 2.5 శాతం 30 / 1 సీట్లు
ఎస్టీ 85 శాతం/ 6 శాతం 34 / 2 సీట్లు
బీసీ  12 శాతం 5 సీట్లు
మైనారిటీ 3 శాతం 1 సీటు
ఈబీసీ / ఓసీ 2 శాతం 1 సీటు

Post Comment