అవార్డులు & గౌరవాలు : మార్చి | తెలుగు కరెంటు అఫైర్స్ 2022
Telugu Current Affairs

అవార్డులు & గౌరవాలు : మార్చి | తెలుగు కరెంటు అఫైర్స్ 2022

త్రిపుర వైద్యురాలు ఇలా లోధ్‌కు మరణానంతరం నారీ శక్తి పురస్కారం

ప్రఖ్యాత ప్రసూతి & గైనకాలజిస్ట్ మరియు మాజీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ ఇలా లోధ్‌ను మరణానంతరం మార్చి 8న రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమంలో 'నారీ శక్తి పురస్కార్-2020'తో సత్కరిస్తారు. మహిళా సాధికారత మరియు సాంఘిక సంక్షేమం కోసం మహిళలు చేస్తున్న నిర్విరామ సేవను గుర్తించేందుకు కేంద్రం ప్రతి సంవత్సరం 'నారీ శక్తి పురస్కారం'ని అందజేస్తుంది.

Advertisement

పర్యావరణవేత్త రిజ్వానాకు ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్ అవార్డు

అసాధారణమైన ధైర్యం మరియు నాయకత్వాన్ని" ప్రదర్శించే బంగ్లాదేశ్ పర్యావరణవేత్త సైదా రిజ్వానా హసన్‌ 2022 కోసం ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్ (IWOC) అవార్డుకు ఎంపికయ్యారు. రిజ్వానా హసన్ బంగ్లాదేశ్ కు చెందిన ఎన్విరాన్‌మెంటల్ లాయర్స్ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్. ఆమె వివిధ చట్టవిరుద్ధమైన కార్యక్రమాలకు వ్యతిరేకంగా కేసులు నమోదు చేసి పోరాడుతుంది. ఆమె క్రియాశీలతకు గాను 2012లో రామన్ మెగసెసే అవార్డును కూడా అందుకుంది.

ఇంటర్నేషనల్ విమెన్ ఆఫ్ కరేజ్ (IWOC) అవార్డును తమ కమ్యూనిటీ పరిధిలో మార్పు తీసుకురావడానికి కృషి చేసే అసాధారణమైన ధైర్యం, శక్తి మరియు నాయకత్వం కలిగిన మహిళలను గౌరవించటానికి యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ 2007లో దీనిని స్థాపించింది. ఈ కార్యక్రమం కింద ఇప్పటి వరకు 80 దేశాల నుండి 170 మంది మహిళలను సత్కరించారు.

75వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ (BAFTA) 2022

75వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్, 2021లోని ఉత్తమ జాతీయ మరియు విదేశీ చిత్రాలను సత్కరించే అవార్డు కార్యక్రమం 13 మార్చి 2022న లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో అట్టహసంగా జరిగింది. ఈ ఏడాది ఉత్తమ నటుడు అవార్డు, కింగ్ రిచర్డ్ చిత్రానికి గాను విల్ స్మిత్ అందుకోగా, ఉత్తమ నటిగా ఆఫ్టర్ లవ్ చిత్రానికి గాను జోవన్నా స్కాన్లాన్ అందుకుంది. అలానే 'ది పవర్ ఆఫ్ ద డాగ్' ఉత్తమ చిత్రంగా ఎన్నికవ్వగా, బెస్ట్ బ్రిటిష్ చిత్రంగా బెల్ఫాస్ట్ నిలిచింది. 'ది పవర్ ఆఫ్ ద డాగ్' చిత్రానికి గాను జేన్ కాంపియన్ ఉత్తమ దర్శకుడుగా అవార్డు అందుకున్నాడు.

చిత్రనిర్మాత స్టీవ్ మెక్‌క్వీన్‌కు రాయల్ నైట్‌హుడ్‌తో సత్కారం

ఆస్కార్-విజేత బ్రిటీష్ దర్శకుడు స్టీవ్ మెక్‌క్వీన్ విండ్సర్ కాజిల్‌లో రాయల్ నైట్‌హుడ్‌ తో సత్కరించబడ్డాడు. మెక్ క్వీన్, 12 ఇయర్స్ ఏ స్లేవ్‌తో ఉత్తమ చిత్రంగా ఆస్కార్‌ను గెలుచుకున్న మొదటి బ్లాక్ ఫిల్మ్ మేకరుగా చరిత్రకెక్కాడు. ప్రిన్స్ అన్నీ ఈ గౌరవాన్ని ఆయనకు అందించారు. రాయల్ నైట్‌హుడ్‌ అనేది బ్రిటిష్ రాజవంశం అందించే అతికొద్ది గౌరవాల్లో ఒకటి.

ప్రొఫెసర్ నారాయణ్ ప్రధాన్‌కు జీడీ బిర్లా అవార్డు

మెటీరియల్ సైన్సెస్ రంగంలో విశేష కృషి చేసినందుకు గానూ ప్రొఫెసర్ నారాయణ్ ప్రధాన్‌ను 31వ జీడీ బిర్లా అవార్డుకు ఎంపిక చేసినట్లు కెకె బిర్లా ఫౌండేషన్ సోమవారం అధికారిక ప్రకటనలో తెలిపింది. 1991లో స్థాపించబడిన ఈ అవార్డును విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి విశిష్టమైన కృషి చేసే 50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ప్రముఖ భారతీయ శాస్త్రవేత్తలకు అందిస్తారు. అవార్డు గ్రహీతకు 5 లక్షల నగదు బహుమతిని లభిస్తుంది.

ఇరాన్‌కు చెందిన మహ్మద్ రెజా మసౌమీకి గ్రీన్‌స్టార్మ్‌ అవార్డు

ఇరాన్‌కు చెందిన మొహమ్మద్ రెజా మసౌమీ ప్రతిష్టాత్మకమైన గ్రీన్‌స్టార్మ్ గ్లోబల్ ఫోటోగ్రఫీ అవార్డు యొక్క 13వ ఎడిషన్‌ను గెలుచుకున్నారు. గ్రీన్‌స్టార్మ్ గ్లోబల్ ఫోటోగ్రఫీ అవార్డును గ్రీన్‌స్టార్మ్ ఫౌండేషన్ మరియు ఐక్యరాజ్యసమితి ఎన్నివిరాన్మెంటల్ ప్రోగ్రామ్ (యుఎన్‌ఇపి) ఉమ్మడిగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తాయి. ఈ ఏడాది ఈ అవార్డు కోసం అమెరికా, ఇంగ్లండ్, కెనడా, అల్జీరియా, బ్రెజిల్, ఇరాన్, మలేషియా, దక్షిణ కొరియా, మొరాకో, వియత్నాం సహా 42 దేశాల నుంచి 3,519 మంది ఫోటోగ్రాఫర్‌లు ఎంట్రీలు పొందగా, మొహమ్మద్ రెజా మసౌమీ విజేతగా నిలిచారు. అలానే మొదటి రన్నరప్‌గా ఫిలిప్పీన్స్‌కు చెందిన జోఫెల్ బొటెరో వైబియోసా నిలిచాడు.

అమెరికన్ గణిత శాస్త్రజ్ఞుడు డెన్నిస్ పి. సుల్లివన్'కు అబెల్ ప్రైజ్

నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్ 2022 అబెల్ ప్రైజ్‌ని అమెరికన్ గణిత శాస్త్రజ్ఞుడు డెన్నిస్ పార్నెల్ సుల్లివన్‌కు అందించింది. అబెల్ ప్రైజ్ అనేది గణిత శాస్త్ర రంగంలో విశేష కృషి చేసిన వ్యక్తికి నార్వే రాజు ఏటా ఇచ్చే వార్షిక బహుమతి. ఈ ప్రతిష్టాత్మక అవార్డు నార్వేజియన్ గణిత శాస్త్రజ్ఞుడు నీల్స్ హెన్రిక్ అబెల్ పేరు పేరున 2001 నుండి అందిస్తున్నారు. డెన్నిస్ పార్నెల్ సుల్లివన్‌ ఇదివరకు స్టీల్ ప్రైజ్, వోల్ఫ్ ప్రైజ్ (2010), బల్జాన్ ప్రైజ్ (2014) వంటి ప్రతిష్టాత్మక అవార్డులు అందుకుని ఉన్నారు.

94వ అకాడమీ అవార్డులు (ఆస్కార్ అవార్డులు) 2022

అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (AMPAS) యొక్క 94వ అకాడమీ అవార్డుల వేడుక మార్చి 27, 2022న లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఘనంగా నిర్వహించబడింది. 2021 మార్చి 1 నుండి డిసెంబర్ 31 మధ్య అంతర్జాతీయంగా విడుదలైన ఉత్తమ చిత్రాలను సత్కరించే ఈ అవార్డు వేడుక ఈ ఏడాది రెజీనా హాల్, అమీ షుమెర్ మరియు వాండా సైక్స్ ద్వారా హోస్ట్ చేయబడింది.

హాట్టహాసంగా జరిగిన ఈ అవార్డుల వేడుకలో ఈ ఏడాది ఉత్తమ చిత్రంగా అమెరికన్ ఫిలిం 'కోడా' అవార్డు దక్కించుకోగా కింగ్ రిచర్డ్ చిత్రానికి గాను విల్ స్మిత్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. అలానే 10 విభాగాల్లో నామినేట్ అయినా డ్యూన్ చిత్రం, అత్యధికంగా ఈ ఏడాది ఆరు ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకుంది.

ఇలా ఉండగా విల్ స్మిత్ మరో ఇబ్బందికర చర్యతో వార్తలకెక్కారు. ఈ వేడుకలో ఒకానొక వ్యాఖ్యాతగా వ్యవహరించిన హాస్యనటుడు క్రిస్ రాక్‌, స్మిత్ భార్య జాడా పింకెట్ స్మిత్ గురించి జోక్ చేయడం వివాదాస్పదమయ్యింది. దీనికి కలత చెందిన విల్ స్మిత్ నేరుగా వేదికపైకి వెళ్లి, క్రిస్ రాక్‌ను చెంపదెబ్బ కొట్టి ఆచ్చర్యపర్చాడు. దీనితో అసలు వేడుక బదులు ఈ సంఘటన భారీ వార్తా కవరేజీని పొందింది.

ఉత్తమ చిత్రం కోడా
ఉత్తమ నటుడు విల్ స్మిత్ ( కింగ్ రిచర్డ్ )
ఉత్తమ నటి జెస్సీకా ఛాస్టెయిన్ (ది ఐస్ ఆఫ్ టామీ ఫే)
ఉత్తమ సహాయ నటుడు ట్రాయ్ కోట్సూర్ (కోడా)
ఉత్తమ సహాయ నటి అరియానా డిబోస్ (వెస్ట్ సైడ్ స్టోరీ)
ఉత్తమ దర్శకురాలు జేన్ కాంపియన్ (ది పవర్ ఆఫ్ డాగ్)
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే విజేత సియాన్ హెడర్ (కోడా)
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విజేత కెన్నెత్ బ్రానాగ్ (బెల్ ఫాస్ట్)
ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్ర విజేత ర్యూసుకే హమగుచి ( డ్రైవ్ మై కార్)
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ ఎన్కాంటో
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ సమ్మర్ ఆఫ్ సోల్
బెస్ట్ ఒరిజినల్ స్కోర్ హన్స్ జిమ్మెర్ (డ్యూన్)
ఉత్తమ ఒరిజినల్ సాంగ్ నో టైమ్ టు డై (బిల్లీ ఎలిష్ & ఫిన్నియాస్ ఓ'కానెల్)
బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ జో వాకర్ (డ్యూన్)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ పాల్ లాంబెర్ట్ , ట్రిస్టన్ మైల్స్ (డ్యూన్)

Advertisement

Post Comment