సింగపూరులో మాస్టర్స్
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మరియు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు కలిగిన నాలుగు ఆసియా టైగెర్/డ్రాగన్ దేశాలలో సింగపూర్ ఒకటి. ఆసియా దేశాలలో ఎక్కడ చూడని విభిన్న సంస్కృతీ మీకు సింగపూరులో కనిపిస్తుంది. ఉండేది ఆసియా ఖండంలో అయినా చూసేందుకు అచ్చమైన ఇంగ్లీష్ దేశంలా అగుపిస్తుంది. సింగపూర్ అధికారిక బాష మలయ్ అయినా వీరి పరిపాలన మరియు విద్యా వ్యవస్థ మొత్తం ఇంగ్లీష్ బాషలోనే ఉంటాయి. సింగపూరును ఆసియన్ ఎడ్యుకేషనల్ & టూరిజం హబ్'గా పరిగణిస్తారు. ఈ దేశంలో ఉండే 6 పబ్లిక్ యూనివర్శిటీలలో 2 యూనివర్శిటీలు, వరల్డ్ టాప్ 100 యూనివర్శిటీల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఇక్కడ ఉండే ప్రైవేట్ విద్యాసంస్థలు వీటికి మించి అత్యుత్తమ విద్యా సేవలు అందిస్తున్నాయి.
ఆసియాలో అత్యధిక సంఖ్యలో విదేశీ విద్యార్థులను ఆకర్షిస్తున్న దేశాల జాబితాలో సింగపూర్ టాప్ 2 లో ఉంటుంది. ఏటా లక్షకు మించి విదేశీ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం సింగపూరులో అడుగుపెడుతున్నారు. సింగపూరు విద్యాసంస్థలు ఎంబీఏ, బిజినెస్ మానేజ్మెంట్, టూరిజం, ట్రావిలింగ్, హోటల్ మానేజ్మెంట్, క్రియేటివ్ ఆర్ట్స్, డిజైనింగ్. ఆర్కిటెక్చర్ కోర్సులకు ప్రసిద్ధి. అత్యధిక మంది విదేశీ విద్యార్థులు మానేజ్మెంట్ కోర్సులు చేసుందుకు సింగపూరుకు వెళ్తున్నారు, అందులో భారతీయ విద్యార్థుల సంఖ్యే ఎక్కువ.
స్టడీ ప్రోగ్రామ్స్ & యూనివర్శిటీలు
సింగపూరులో మాస్టర్ డిగ్రీలను గ్రాడ్యుయేట్ స్టడీస్ గానే పరిగణిస్తారు. ఇక్కడ విద్యాసంస్థలు మాస్టర్ డిగ్రీలను 12 నుండి 18 నెలల నిడివితో అందిస్తాయి. చాలా కోర్సులు షార్ట్ & పుల్ టర్మ్ కోర్సులుగా అందుబాటులో ఉన్నాయి. ప్రవేశాలు ఏటా ఆగష్టు మరియు జనవరిలో నిర్వహిస్తారు. సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తులు నిర్దిష్ట గడువులోపు పూర్తిచేయాల్సి ఉంటుంది. విద్యార్థి నేరుగా యూనివర్సిటీ ద్వారా లేదా ప్రభుత్వ గ్రాడ్యుయేట్ ఆఫీసర్ ద్వారా నిర్వహిస్తారు. ఆమోదం పొందిన విద్యార్థులకు అడ్మిషన్ లెటర్ అందిస్తారు. స్టూడెంట్ వీసా పొందేందుకు అడ్మిషన్ లెటర్ తప్పనిసరి.
ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ ఉత్తీర్ణత తప్పనిసరి
గ్రాడ్యుయేషన్ (మాస్టర్స్) ప్రవేశాలకు GMAT, GRE ఉత్తీర్ణత స్కోరులు తప్పనిసరి. యూనివర్సిటీల నుండి Letter of acceptance పొందాలంటే విద్యార్థి IELTS (International English Language Testing System), TOEFL (Test of English as a Foreign Language), PTE (Pearson Test of English) వంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అర్హుత పరీక్షలలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. మెజారిటీ సింగపూర్ యూనివర్సిటీలు TOEFL, IELTS స్కోరును ప్రామాణికంగా తీసుకుంటాయి. 65 నుండి 80 మధ్య TOEFL, 6 to 7.5 మధ్య IELTS స్కోరు సాధించిన విద్యార్థులకు అడ్మిషన్ దొరికే అవకాశం ఉంటుంది.
సింగపూరులో ఆరు ప్రపంచ స్థాయి టాప్ క్లాస్ పబ్లిక్ యూనివర్సిటీలు అందుబాటులో ఉన్నాయి. వీటికి మించి 300 లకుపైగా ప్రైవేట్ యూనివర్సిటీలు విదేశీ విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నాయి. అన్ని ప్రైవేట్ యూనివర్సిటీలు ప్రభుత్వ గుర్తింపును కలిగి ఉంటాయి. సింగపూర్ ప్రభుత్వం ఉన్నత చదువు కోసం వచ్చే విదేశీ విద్యార్థులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుంది.
నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ మరియు నాన్యాంగ్ టెక్నోజికల్ విశ్వవిద్యాలయంలోని విదేశీ విద్యార్థులకు స్వీయ-ఫైనాన్స్ సబ్సిడీ ట్యూషన్ అవకాశాన్ని కలిపిస్తుంది. కొన్ని ప్రైవేట్ యూనివెర్సిటీలు కూడా ఈ ట్యూషన్ ఫీజులో సబ్సిడీ అందిస్తున్నాయి. దీని విలువ కనిష్టంగా S$ 5000/- నుండి S$ 40000/- సింగపూర్ డాలర్లలో ఉంటుంది. దీనికి అర్హత సాధించడానికి, గ్రాడ్యుయేషన్ తర్వాత మూడేళ్లపాటు సింగపూర్ ఆధారిత కంపెనీలలో పనిచేయడానికి MoE తో సర్వీస్ ఆబ్లిగేషన్ (SO) అని పిలువబడే ఒక ఒప్పందంపై మీరు సంతకం చేయాల్సి ఉంటుంది. వీటితో పాటుగా వివిధ స్కాలర్‌షిప్‌లు, ఎడ్యుకేషనల్ అసిస్టెన్స్ అందిస్తుంది. అలానే యూనివర్సిటీ అనుమతితో పార్ట్ టైమ్ ఉద్యోగం చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు.
సింగపూర్ స్టూడెంట్ వీసా
యూనివర్సిటీ అడ్మిషన్ లెటర్ పొందాక సింగపూర్ స్టూడెంట్ పాస్ (వీసా) కోసం దరఖాస్తు చేసుకోవాలి. అనేక దేశాలలో మాదిరిగానే, సింగపూర్‌లో చదువుకోవడానికి పర్యాటక వీసా సరిపోదు. ఈ ప్రక్రియను ఆన్‌లైన్‌లో స్టూడెంట్స్ పాస్ అప్లికేషన్ అండ్ రిజిస్ట్రేషన్ (సోలార్) వ్యవస్థ ద్వారా లేదా దగ్గరలో ఉండే సింగపూరు ఇమ్మిగ్రేషన్ కార్యాలయం ద్వారా పూర్తిచేయాలి. దరఖాస్తుతో పాటుగా మీరు సమర్పించిన వివరాలు సదురు యూనివర్సిటీతో నిర్దారించుకుని స్టూడెంట్ పాస్ జారీచేస్తారు.
స్టూడెంట్ పాస్ ఆమోదం పొందేందుకు కావాల్సిన డాక్యూమెంట్స్
- ఉన్నత విద్య కోసం దరఖాస్తు చేసుకున్న యూనివర్సిటీ నుండి Acceptance Letter.
- కోర్సు పూర్తిచేసినందుకు అవసరమయ్యే ఆర్థిక వనరులు కలిగి ఉన్నట్లు ఖచ్చితమైన లెక్కలతో ఫైనాన్స్ రిపోర్టు.
- ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్.
- ఆధార్/ పుట్టిన తేదీ ధ్రువపత్రం, పెళ్ళైన వారు మ్యారేజ్ సర్టిఫికెట్.
- 6 నెలల ముందుగా ఆమోదం పొందినా పాసుపోర్టు.
- నేర చరిత్ర లేనట్లు police certificates.
విద్యార్థులకు ఉపయోగపడే వెబ్‌సైట్లు
- Singapore Immigration & Checkpoints
- Singapore Ministry Of Education
- Singapore Teaching Academy
- Singapore National Library
- Singapore Digital Services
- Ministry of Foreign Affairs
- Ministry Of Manpower
6 Most recognized Universities Singapore
- Nanyang Technological University (NTU)
- National University of Singapore (NUS)
- Singapore Institute of Technology (SIT)
- Singapore Management University (SMU)
- Singapore University of Social Sciences (SUSS)
- Singapore University of Technology and Design (SUTD)
Cost of study in Singapore
సింగపూరులో హయ్యర్ ఎడ్యుకేషన్ రుసుములు యూఎస్, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాలతో దాదాపు సరిసమానంగా ఉంటాయి. సింగపూరులో గ్రాడ్యుయేట్ కోర్సులను పూర్తిచేందుకు 30 నుండి 35 వేల సింగపూర్ డాలర్లను వెచ్చించాల్సి ఉంటుంది. ఇది 20 నుండి 25 లక్షలకు సమానం. వీసా చార్జీలు, నెలవారీ జీవన వ్యయాల బడ్జెట్ కూడా నెలకు 35 నుండి 40 వేల వరకు వెచ్చించాల్సి ఉంటుంది.
విదేశీ విద్యార్థులకు యూనివర్సిటీ పరిధిలో వారానికి 20 గంటల వరకు పార్ట్ టైమ్ జాబ్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. వేసవి సెలవులు, ఇతర సెలవు దినాలలో పూర్తిస్థాయి ఉద్యోగం చేసే అవకాశం కూడా ఉంటుంది. అలానే సింగపూర్ ప్రభుత్వం అందించే స్కాలర్‌షిప్‌లు, ఇతర విద్యా రాయితీలు, విదేశీ విద్యార్థులకు కొంతలో కొంత ఉపశమనం కల్గిస్తాయి.
Study program | Average annual fee |
Undergraduate program | $13,000 to $20,000 |
Postgraduate master's degree | S$ 30000/- To S$ 35000/- |
Doctoral degree | $7,000 to $15,000 |
Management programs | $30,000 to $40,000 |
Living expenses | Average Budget |
Accommodation | S$350 to S$400 pm |
Living costs | Up to $700 pm |
visa and permit | S$100 |
Health & insurance | $500 per year |