Advertisement
పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ రిజిస్ట్రేషన్ గైడెన్స్
Entrepreneur Guide

పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ రిజిస్ట్రేషన్ గైడెన్స్

పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఒక విస్తృతమైన వ్యాపార ప్రణాళికు సంబంధించింది. మిగతా బిజినెస్ రిజిస్ట్రేషన్లకు పూర్తి భిన్నమైనది భిన్నమైనది. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ రిజిస్టర్ చేసేందుకు కనీసం 7మంది సభ్యలు ఉండాలి. గరిష్టంగా పరిమితి లేదు. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ నిర్వహణను బోర్డు సభ్యులు నేతృత్వం వహిస్తారు. ఈ బోర్డులో సభ్యులు 3 నుండి గరిష్టంగా 15 మంది ఉండేందుకు అవకాశం ఉన్నటుంది.

ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపిఓ) ద్వారా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ సెక్యూరిటీ వాటాలను సాధారణ పబ్లిక్ కొనుక్కోవచ్చు. దీని కోసం తప్పనిసరి ఒక స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్లో రిజిస్టర్ అయ్యి ఉండాలి. సెబీ అనుమతి పొంది ఉండాలి. ట్రేడ్ సర్టిఫికెట్ కలిగివుండాలి. ఇంపోర్ట్ మరియు ఎక్స్పోర్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ రిజిస్ట్రేషన్ భారీ స్టార్టప్‌లకు, భారీ పెట్టుబడులు అవసరమయ్యే వ్యాపారాలకు మంచి ఎంపిక.

పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ రిజిస్ట్రేషన్ ప్రాధమిక నియమావళి

  • పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ రిజిస్టర్ చేసేందుకు కనీసం ముగ్గురు డైరెక్టర్లు ఉండాలి గరిష్టంగా 15 మంది వరకు అవకాశం ఉంటుంది. ఒక డైరెక్టర్ తప్పనిసరి భారతీయ పౌరుడయి ఉండాలి.
  • పబ్లిక్ లిమిటెడ్ కంపనీలో వాటాదారులు కనిష్టంగా 7 మంది  గరిష్ట పరిమితి లేదు.
  • పబ్లిక్ లిమిటెడ్ రిజిస్టర్ చేసేందుకు 5 లక్షల రూపాయల కనీస పెట్టుబడి ఉండాలి.
  • పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ రిజిస్టర్ చేసేందుకు తప్పనిసరి పూర్తిస్థాయి అనుమతి కలిగిన వాణిజ్య భవనం ఆఫీస్ చిరునామా ఉండాలి.

పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ రిజిస్ట్రేషన్ చేసేందుకు అవసరమయ్యే డాక్యూమెంట్స్

  • పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ రిజిస్టర్ చేసేందుకు డైరెక్టర్లు, షేర్ హోల్డర్లు చెల్లుబాటు అయ్యే వ్యక్తిగత మరియు నివాస ధ్రువపత్రాలు కలిగి ఉండాలి.
  • వ్యక్తిగత గుర్తింపు కోసం విదేశీయులు/ఎన్ఆర్ఐ సభ్యులు పాన్ కార్డు మరియు పాస్‌పోర్ట్ కలిగి ఉండాలి.
  • వ్యక్తిగత గుర్తింపు కోసం భారతీయ పౌరులు ఓటర్ కార్డు/ పాస్‌పోర్ట్ / డ్రైవింగ్ లైసెన్స్ /పాన్ కార్డు కలిగి ఉండాలి.
  • చిరునామా గుర్తింపు కోసం తాజాగా తీసుకున్న బ్యాంకు స్టేటుమెంట్, టెలిఫోన్ బిల్, గ్యాస్ బిల్, కరెంటు బిల్ ఉండాలి.
  • పాస్‌పోర్ట్-సైజ్డ్ ఫొటోగ్రాఫ్ మరియు మీసొంత దస్తూరితో సంతకం (డైరెక్టర్లకు మాత్రమే) అందించాలి.
  • రిజిస్టర్ ఆఫీస్: ఆఫీసుకు సంబంధించిన ఫోన్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్ కలిగివుండాలి.
  • ఇంగ్లీషులో టైపుచేసిన నోటరైజ్డ్ రెంటల్ అగ్రిమెంట్ కలిగివుండాలి.
  • భవన యాజమాని నుండి నిరభ్యంతర పత్రం (NOC) పొందిఉండాలి.
  • సొంత భవనమైతే అమ్మకపు దస్తావేజు / ఆస్తి దస్తావేజు అందజేయాలి.

పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ

ఏకరూప కంపెనీ పేరు కోసం దరఖాస్తు చేయాలి డైరెక్టర్ సిగ్నేచర్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేయాలి (DSC)
డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ (DIN) eMOA మరియు eAOA డాక్యుమెంటేషన్
కంపెనీ PAN మరియు TAN నెంబర్ కోసం దరఖాస్తు చేయాలి ఇన్కార్పొరేషన్ సర్టిఫికెట్ మరియు కార్పొరేట్ ఐడెంటిటీ నెంబర్ జారీ
జిఎస్టీ రిజిస్ట్రేషన్, కంపెనీ ఆధార్, ఇంపోర్ట్ & ఎక్స్పోర్ట్ రిజిస్ట్రేషన్ కంపెనీ బ్యాంకు అకౌంట్  కోసం దరఖాస్తు

యూనిక్ కంపెనీ పేరు ఎంపిక

కంపెనీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అతి ముఖ్యమైన భాగం మీ వ్యాపారానికి మంచి పేరు ఎంపిక చేయడం. అది అక్షర సరూపంలో కానీ, పలకడంలో కానీ ఇంకో కంపెనీ పేరును పోలి ఉండకూడదు. అందుకారణంగా మీ బిజినెస్ కు పేరు పెట్టేముందు MCA (మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్) వెబ్సైటులో  సంబంధించిన బిజినెస్ పేరు మరియు ట్రేడ్ మార్క్ సంబంధిత వివరాలు ముందుగా శోధించి పూర్తి వివరాలు సేకరించండి.

అలానే నేమ్ రిజిస్ట్రేషన్ కోసం MCA కు దరఖాస్తు చేసేటప్పుడు ముందు జాగ్రత్తలో భాగంగా 3 నుండి 4 ఆప్షనల్ నేమ్స్ సిపార్సు చేయండి. ఒక బిజినెస్ నేమ్ పాపులర్ గా ఉండటం ఎంతుయా ముఖ్యమో అది రాబోయే కాలంలో చిక్కులు తేకుండా ఉండటం కూడా అంతే ముఖ్యం.

పబ్లిక్ లిమిట్ రిజిస్ట్రేషన్ కంపెనీలు వాటి పేరు వెనక పబ్లిక్ లిమిటెడ్ నేమ్ ట్యాగ్ ఉండాల్సిన అవసరంలేదు. అలానే ఈరోజుల్లో ప్రతి బిజినెస్ కు ఒక వెబ్సైటు ఉండటం తప్పనిసరి.  కంపెనీ పేరు ఖరారు చేసేముందు మీ పేరుకు సంబంధించిన డొమైన్ నేమ్ (.in/.com) అందుబాటులో ఉందేలేదో చెక్ చేసుకోండి. మీ కంపెనీ పేరులో ఇన్సూరెన్సు , బ్యాంక్, స్టాక్ ఎక్స్ఛేంజ్, వెంచర్ క్యాపిటల్, అసెట్ మేనేజ్మెంట్, మ్యూచువల్ ఫండ్ మొదలైన పదాలు ఉంటె ఆర్బిఐ, సెబీ, ఆర్డిఐల ఆమోదాలు అవసరం.

ఇంటర్నేషనల్, గ్లోబ్, కాంటినెంటల్, ఆసియాటిక్, ఆసియా, ఇండస్ట్రీస్, ఉద్యోగ్, హిందుస్తాన్, ఇండియా, భారత్, ఎంటర్ప్రైజెస్, ప్రొడక్ట్స్, బిజినెస్ మొదలైన పదాలను కలిగి ఉండే కంపెనీలు కనీసం 5 లక్షలు ప్రారంభ పెట్టుబడి కలిగి ఉండాలి.

DSC & DIN రిజిస్ట్రేషన్

ఇంటర్నెట్ అధికారిక దరఖాస్తులు పూర్తిచేసేందుకు డైరెక్టర్ సిగ్నేచర్ సర్టిఫికెట్ (DSC) తప్పనిసరి. ఒక సారి DSC పొందేక దాని కాలపరిమితి ఒకటి లేదా రెండేళ్లు ఉంటుంది. తర్వాత దాన్ని క్రమానుగతంగా రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. DSC లేనిదే డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ (DIN) కు దరఖాస్తు చేయలేము. DIN లేనిదే కంపెనీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముందుకు సాగదు.

ప్రతి కంపెనీ డైరెక్టర్ DIN కలిగి ఉండటం తప్పనిసరి. DIN కంపెనీ డైరెక్టర్ సంబంధించిన వ్యక్తిగత సమాచారం కలిగి ఉంటుంది. ఇది ఫేక్ కంపెనీ రిజిస్ట్రేషన్లలు జరగకుండా ఉండేందుకు, ఫైనాన్సియల్ స్కామ్స్ జరిగేటప్పుడు ఆ డైరెక్టర్లు తప్పించుకునేందుకు అవకాశం లేకుండా చేస్తుంది. DIN నెంబర్ కోసం సంబంధిత ధ్రువపత్రాలతో MCA వెబ్సైటు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

eMOA మరియు eAOA డాక్యుమెంటేషన్

eMOA (మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్) మరియు eAOA (ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ) డాక్యుమెంటేషన్ నిబంధన ప్రక్రియ 2013 కంపెనీ చట్టంలో MCA ప్రవేశ పెట్టింది. వీటికి సంబంధించిన ఫారం నెంబర్ IN 33 & IN 34 తప్పనిసరి పూర్తిచేయాల్సి ఉంటుంది.

ఈ నిబంధన ప్రకారం కంపెనీ స్థాపించేందుకు గల కారణంతో పాటుగా, పెట్టుబడుల గురించి, డైరెక్టర్లు, షేర్ హోల్డర్ల గురించి పూర్తి వివరాలు తెలియజేయాల్సి. ఈ వివరాలన్నీ నిబంధలు అనుచరించి ఆఫేడివిట్ రూపంలో అందించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తిచేసాక కంపెనీ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

కంపెనీ పాన్ & టాన్ కోసం దరఖాస్తు

ఇండియాలో బిజినెస్ చేసే ప్రతి వ్యాపార సంస్థ పాన్ (పర్మినెంట్ అకౌంట్ నెంబర్) మరియు టాన్ (టాక్స్ డెడిక్షన్ నెంబర్) నంబర్లు తప్పనిసరి కలిగి ఉండాలి.  ఆదాయ పన్ను చెల్లింపులు వాటికీ సంబందించిన రిటర్న్ లావాదేవీలు నిర్వహించేందుకు ఈ నంబర్లు అవసరం. పాన్, టాన్ నంబర్లకు దరఖాస్తు చేసే ముందు కంపెనీ పేరు తప్పనిసరి రిజిస్టర్ అయ్యి ఉండాలి. పాన్ మరియు టాన్ నంబర్లకు ఆదాయ పన్ను వెబ్సైటు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఇన్కార్పొరేషన్ సర్టిఫికెట్ & కార్పొరేట్ ఐడెంటిటీ నెంబర్ జారీ

కంపెనీ రిజిస్ట్రేషన్ లో ఇది చివరి ప్రక్రియ. రిజిస్ట్రేషన్ కోసం అందించిన అన్ని వివరాలు సరైనవని MCA ధ్రువీకరించక ఇన్కార్పొరేషన్ సర్టిఫికెట్ మరియు కార్పొరేట్ ఐడెంటిటీ నెంబర్ జారీ చేస్తుంది. దీనికి 15 నుండి 20 రోజులు సమయం పడుతుంది.  ఇన్కార్పొరేషన్ సర్టిఫికెట్ జారీతో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రిజిస్టేషన్ ప్రక్రియ పూర్తివుతుంది. ఇన్కార్పొరేషన్ సర్టిఫికెట్ జారీ ద్వారా మీ కంపెనీకి అధికారకంగా వ్యాపారం చేసేందుకు అనుమతి లభించినట్లు అర్ధం.

కంపెనీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయ్యాక కరెంట్ బ్యాంకు అకౌంట్, జిఎస్టీ నెంబర్, కంపెనీ ఆధార్ మరియు ఇంపోర్ట్ & ఎక్స్పోర్ట్ సర్టిఫికెట్లు కోసం దరఖాస్తు చేసుకోవాలి. దీనితో మీ కంపెనీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సంపూర్ణంగా పూర్తిఅయినట్లు భావించవచ్చు.

ఈ ప్రక్రియ మొత్తం మీరు సొంతంగా చేసుకునేందుకు అన్నిరకాల రుసుములు కలుపుకుంటే 25,000 /- వరకు ఖర్చు అవుతుంది. అదే కన్సల్టెన్సీ సంస్థలను ఆశ్రయిస్తే వారు ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు పది వేల నుండి 30 నుండి 50 వేలు తీసుకుని ఈ మొత్తం ప్రక్రియ పూర్తిచేసి పెడతారు.

పబ్లిక్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ ప్రయోజనాలు

పబ్లిక్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ మీ వ్యాపారానికి సంపూర్ణ కార్పొరేట్ లుక్ తెచ్చిపెడుతుంది. ఇది పెద్ద మొత్తంలో ఇన్వెస్టర్లను మరియు కస్టమర్లను ఆకర్షించేందుకు సహాయపడుతుంది. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలకు బ్యాంకులు అప్పులు ఇచ్చేనందుకు ముందు వరుసలో ఉంటాయి. స్టాక్ ఎక్స్చేంజి రిజిస్ట్రేషన్ మరియు సెబీ అనుమతితో IPO పద్దతిలో పబ్లిక్ కు షేర్స్ అమ్మడం ద్వారా అధిక మొత్తంలో పెట్టుబడులు సమకూర్చొచ్చు.

షేర్ హోల్డర్లకు పరిమితమైన హక్కులు ఉండటం వలన డైరెక్టర్లకు పూర్తిస్థాయి స్వేచ్ఛ ఉంటుంది. కంపెనీ నష్టాల్లో కూరుకుపోయిన కంపెనీ యాజమాన్య వ్యక్తిగత ఆస్తులకు వచ్చే ముప్పు ఉండదు. కంపెనీ అమ్మకం, విలీనం మరియు యాజమాన్య మార్పులు సులభంగా నిర్వర్తించవచ్చు. డైరెక్టరుగా పదవి విరమణ తర్వాత కూడా వ్యక్తులు కంపెనీలో కొనసాగేందుకు అవకాశం ఉంటుంది.

ప్రైవేట్ కంపెనీలకు ప్రభుత్వం అనేక పన్ను ప్రయోజనలను చేకూర్చిపెడుతుంది. కంపెనీ నమోదు చేసే లాభాలపై టాక్స్ చెల్లిస్తే చాలు. వ్యక్తుల రాబడిపై పన్ను మినహాయింపు ఉంటుంది. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు అంతర్జాతీయంగా వ్యాపారం చేసేందుకు అనుమతి ఉంటుంది. భారీ స్థాయిలో విదేశీ పెట్టుబడులు ఆహ్వానించేందుకు అవకాశం ఉంటుంది. భారీ స్థాయి వ్యాపారాలకు ఈ రిజిస్ట్రేషన్ చక్కగా సరిపోతుంది.

పబ్లిక్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ ప్రతికూలతలు

పబ్లిక్ లిమిట్ రిజిస్ట్రేషన్ వలన ఒనగూరే ప్రయోజనాలతో పాటుగా కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. కంపెనీ రిజిస్టర్ చేసేందుకు అన్ని అనుమతులు పొందేందుకు ఎక్కువ సమయం పడుతుంది. దరఖాస్తు రుసుములు భారీమొత్తంలో ఉంటాయి.

కనీసం ముగ్గురు డైరెక్టర్లు, ఏడు మంది షేర్ హోల్డర్లు ఉండటం వలన ఏకపక్ష నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఉండదు. కంపెనీలో ఆర్థికపరమైన అవకతవకలు చోటుచేసుకుంటే దానికి డైరెక్టర్లు పూర్తిస్థాయి బాధ్యత వహించాల్సి ఉంటుంది. అది భారీ స్థాయి కార్పొరేట్ స్కామ్ కు దారితీస్తుంది.

షేర్ హెల్డర్లు ఆర్జించే లాభాలకు టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. కంపెనీ ఫలితాలు ట్రేడర్లను సంతృప్తీ పరిచేలా ఉండాలి. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు తట్టుకోవడం అంత సులభం కాదు. MCA నిబంధనలు ప్రకారం ఏడాదిలో 3 సార్లు బోర్డు మీటింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. ఏడాదికోసారి కంపెనీ పూర్తి స్థాయి అకౌంట్స్ ఆడిట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది రిటర్న్స్ చేయాల్సి ఉంటుంది. వాటిపాటుగా అనేక కార్పొరేట్ ఫార్మాలిటీస్ అసరించాల్సిన అవకాశం ఉంటుంది.

Post Comment