రిపోర్టులు & ర్యాంకులు : మార్చి 2022 | తెలుగు కరెంటు అఫైర్స్
Telugu Current Affairs

రిపోర్టులు & ర్యాంకులు : మార్చి 2022 | తెలుగు కరెంటు అఫైర్స్

ప్రపంచ బిలియనీర్ జనాభా ర్యాంకింగులో ఇండియాకు 3వ స్థానం

ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ జనాభాలో భారతదేశం 3వ స్థానంలో నిలిచింది. నైట్ ఫ్రాంక్ పరిశోధన ప్రకారం భారతదేశం యొక్క అల్ట్రా-హై-నెట్-వర్త్ (UHNWI) జనాభా 2021 మరియు 2026 మధ్య 39% పెరుగుతుందని అంచనా వేయబడింది. అలానే దేశంలో అత్యధిక సంపన్నులు ముంబాయిలో ఉన్నట్లు వెల్లడించింది. ఈ జాబితాలో భారత్ కంటే ముందు అమెరికా, చైనాలు ఉన్నాయి.

స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ ర్యాంకింగులో ఏపీకి అగ్రస్థానం

స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ 2021 ర్యాంకింగ్‌లో ఆంధ్రప్రదేశ్ వరుసగా రెండవ సంవత్సరం తన నంబర్ వన్ స్థానాన్ని నిలుపుకుంది. ఈ జాబితాలో పశ్చిమ బెంగాల్‌ రెండవ స్థానంలో, ఒడిశా 3వ స్థానంలో , గుజరాత్‌ 4, మహారాష్ట్ర 5వ స్థానంలో నిలిచాయి. పొరుగున ఉన్న తెలంగాణ 6వ స్థానంను దక్కించుకుంది. 2020లో కూడా ఆంధ్రప్రదేశ్ పాలనలో టాప్ ర్యాంక్ సాధించింది.

న్యూఢిల్లీకి చెందిన థింక్ ట్యాంక్ అయిన స్కోచ్ ర్యాంకింగ్ అసెస్‌మెంట్‌లో, ఆంధ్రప్రదేశ్ పోలీసు మరియు భద్రత, వ్యవసాయం, జిల్లా పరిపాలన మరియు గ్రామీణాభివృద్ధిలో కూడా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

ప్రపంచ అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్

ఫిన్‌లాండ్ వరుసగా ఐదవ సంవత్సరం ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా కిరీటాన్ని పొందింది. ఈ జాబితాలో ఫిన్‌లాండ్ తర్వాత డెన్మార్క్, ఐస్లాండ్, స్విట్జర్లాండ్ మరియు నెథర్లాండ్స్ దేశాలు టాప్ 5 లో చోటు సంపాదించుకున్నాయి. అలానే లెబనాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ దేశాలు ఈ జాబితాలో అట్టడుగున ఉన్నాయి.

ప్రపంచ అత్యంత సంతోషకరమైన దేశల జాబితాలో భారత్ 136 స్థానంలో (146 దేశాల్లో) నిలిచింది. భారత్ కంటే పొరుగున ఉన్న నేపాల్ (84), బాంగ్లాదేశ్ (94), పాకిస్తాన్ (121), శ్రీలంక (127) స్థానాలతో ముందు వరుసలో ఉన్నాయి.

వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2021

స్విస్ ఆర్గనైజేషన్ IQAir యొక్క వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2021 లో దేశ రాజధాని ఢిల్లీ మరోసారి ప్రపంచ అత్యధిక కలుషిత రాజధానిగా నిలిచింది. ఢిల్లీ ఈ ర్యాంకులో నిలవడం వరుసగా  ఇది నాల్గువ సారి. ప్రపంచ వ్యాప్తంగా 100 నగరాలకు సంబంధించి ఈ ర్యాంకింగ్ వెలువడగా అందులో 63 నగరాలు ఇండియన్ నుండి ఉండటం ఆశ్చర్యం.

భారతదేశ అత్యుత్తమ ప్రైవేట్ హాస్పిటల్‌గా మేదాంత

గురుగ్రామ్'కు చెందిన మేదాంత హాస్పిటల్, వరుసగా మూడవసారి సారి భారతదేశ అత్యుత్తమ ప్రైవేట్ హాస్పిటల్‌గా గుర్తింపు పొందింది. న్యూస్‌వీక్ వరల్డ్ బెస్ట్ హాస్పిటల్స్ సర్వేలో టాప్ 150 హాస్పిటళ్లలో భారత్ నుండి మేదాంత హాస్పిటల్'కు మాత్రమే చోటు దక్కించుకుంది. ఈ సర్వే 22 దేశాల పరిధిలో దాదాపు 2000 లకుపైగా హాస్పిటళ్లకు సంబంధించి నిర్వహిస్తారు. మెడికల్ ప్రోఫిసినల్స్ సిపార్సులు ఆధారంగా ఈ ర్యాంకింగ్ రూపొందిస్తారు.

Post Comment