Advertisement
ఇంటర్ తర్వాత ఇండియన్ నేవీలో ఆఫీసర్ ఉద్యోగాలు & జీత భత్యాలు
Career Guidance Career Options

ఇంటర్ తర్వాత ఇండియన్ నేవీలో ఆఫీసర్ ఉద్యోగాలు & జీత భత్యాలు

ఇంటర్, డిగ్రీ మరియు బీటెక్ తర్వాత భారతీయ నౌకాదళంలో ఆఫీసర్లుగా చేరండి. దేశ తీరప్రాంత రక్షణ వ్యవహారాలలో కీలకపాత్ర వహించే నేవీ ఆఫిసర్ ఉద్యోగాలను నాలుగు రకాల నియామక ప్రక్రియల ద్వారా భర్తీ చేస్తుంది. ఈ ఉద్యోగ ప్రకటనలు అన్ని జాతీయ, ప్రాంతీయ వార్త పత్రికలలో ప్రచారించబడతాయి. అవివాహితులైన యువతి, యువకులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసునేందుకు అర్హులు.

ఇండియన్ నేవీలో ఆఫీసర్ ఎంట్రీ రకాలు

భారత నావికాదళంలోని వివిధ శాఖలలో అధికారుల ప్రవేశం నాలుగు రకాల మోడ్‌లు/స్కీమ్‌ల ద్వారా భర్తీ చేస్తారు. ఇందులో మెజారిటీ పోస్టులు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే వివిధ నియామక పరీక్షల ద్వారా భర్తీ చేస్తారు. వీటితో పాటుగా ఇండియన్ నేవీ ప్రత్యేకంగా సర్వీస్ సెలక్షన్ బోర్డ్, షార్ట్ సర్వీస్ కమిషన్ ఎంట్రీల అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ విద్యార్థులను భర్తీచేస్తుంది.

  1. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంట్రీలు
  2. ఇండియన్ నేవీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎంట్రీ
  3. ఇండియన్ నేవీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎంట్రీ
  4. ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్ట్

ఇండియన్ నేవీ ఆఫీసర్ రకాలు, విధులు & ఎలిజిబిలిటీ

ఇండియన్ నేవీలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్

ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు నౌకాదళానికి చెందిన రోజువారీ వ్యవహారాలను సక్రమంగా అమలు అయ్యేలా పర్యవేక్షిస్తారు. కమాండింగ్ అధికారికి ప్రత్యక్ష ప్రతినిధిగా వ్యవహరిస్తారు. కమాండ్ ఆర్డర్‌లు మరియు విధానాలను అమలు చేయడం వీరి యొక్క ప్రధాన విధి. అనుభవం ఆధారంగా ఇండియన్ నేవీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల జీతం 12.0 లక్షల నుండి 29.0 లక్షల మధ్య ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ విభాగ ఆఫీసర్స్ చేసే పని ఆధారంగా వీరిని 11 కేటగిర్ల వారీగా భర్తీ చేస్తారు.

1. జనరల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్

  • నిర్వర్తించే విధులు: వీరు షిప్ యొక్క వ్యూహాత్మక కార్యనిర్వాహక అధికారిగా విధులు నిర్వర్తిస్తారు.షిప్ లో జరిగే సమస్త కార్యకలాపాలలో వీరికి పాల్గునే అవకాశం ఉంటుంది. యుద్ధ సమయంలో వ్యూహాత్మక ఎత్తుగడ వేయడం, షిప్ సామర్థ్యం, దాని పరిమితులు అంచనా వేయటం వంటి విధులన్నీ చేయాల్సి ఉంటుంది.
  • శిక్షణ: ఎంపికైన అభ్యర్థులకు ఏజిమాల లోని నేవెల్ అకాడమీలో 44 వారాల పాటు నేవెల్ ఓరియెంటేషన్ కోర్సులో పాటు నావిగేషన్, కమ్యూనికేషన్, డ్రైవింగ్,  యాంటీ సుబ్మెరైన్ వార్ఫేర్, గన్నరీ వంటి విషయాల యందు శిక్షణ అందిస్తారు. శిక్షణ పూర్తియ్యాక వివిధ నేవల్ యూనిట్స్ యందు ప్రోఫిసినల్ ట్రైనింగ్ అందిస్తారు.
  • విద్య అవకాశాలు: జనరల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తూనే అదనపు స్కిల్స్ ని నేర్చుకునే అవకాశం ఉంది. నేవల్ కమ్యూనికేషన్, నావిగేషన్, డ్రైవింగ్, మెట్రోలాజి, ఓసినోగ్రఫీ, మెరైన్ కమెండో, NBCD వంటి విషయాల యందు నిరంతర శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి
  • విద్య అర్హుత: బీఈ / బీటెక్ విద్యార్థులు

2. హైడ్రోగ్రాఫిక్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్

  • నిర్వర్తించే విధులు: వీరు భారతీయ ప్రాదేశిక జలాలకి సంబంధించి అత్యాధునిక టెక్నాలజీ వ్యవస్థలతో సర్వేలు నిర్వహిస్తారు. అవసరమైతే అంతర్జాతీయ జలాలలో కూడా విధులు నిర్వర్తిస్తారు. అలానే నావికులుకు అవసరమయ్యే సముద్ర నావిగేషన్ మ్యాపులును వీరే రూపకల్పన చేస్తారు.
  • శిక్షణ: ఎంపికైన అభ్యర్థులకు ఏజిమాల లోని నేవెల్ అకాడమీలో 44 వారాల పాటు నేవెల్ ఓరియెంటేషన్ కోర్సు యందు  శిక్షణ అందిస్తారు. శిక్షణ పూర్తియ్యాక వివిధ నేవల్ యూనిట్స్, షిప్ ల యందు ప్రోఫిసినల్ ట్రైనింగ్ అందిస్తారు.
  • విద్య అవకాశాలు: గోవాలోని నేషనల్ హైడ్రోగ్రాఫిక్ స్కూల్లో హైడ్రోగ్రాఫిక్ కోర్సు స్పెషలైజేషన్ యందు తర్ఫీదు అందిస్తారు.
  • విద్య అర్హుత: బీఈ / బీటెక్ విద్యార్థులు

3. నేవల్ పైలట్

  • నిర్వర్తించే విధులు: వీరు నౌకాదళానికి సంభందించిన ఎయిర్ క్రాఫ్ట్ , విమానాలు, హెలీకాఫ్టర్స్ యందు విధులు నిర్వర్తిస్తారు. ప్రకృతి విపత్తుల సమయంలో అవసరమయ్యే సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
  • శిక్షణ; వీరికి శిక్షణ రెండు స్టేజీలలో జరుగుతుంది. మొదట స్టేజిలో భాగంగా ఏజిమాల లోని నేవెల్ అకాడమీలో 22 వారాల పాటు నేవెల్ ఓరియెంటేషన్ కోర్సు యందు  శిక్షణ అందిస్తారు. రెండవ స్టేజి శిక్షణ పూర్తిస్థాయి పైలట్ కి సంబంధించి ఉంటుంది. ఇది ఢీల్లీ లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీ, నేవల్ ఎస్టాబ్లిషమెంట్, ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ యందు జరుగుతుంది. శిక్షణ పూర్తిచేసిన అభ్యర్థులకు గౌరవనీయమైన వింగ్స్ ప్రదానం చేస్తారు.
  • విద్య అవకాశాలు: మెరిటోరియాస్ అధికారులకు క్వాలిఫైడ్ ఫ్లైయింగ్ ఇన్స్టాక్టర్ కోర్సు యందు తర్ఫీదు అందిస్తారు.
  • విద్య అర్హుత: 10+2 లో మాథ్స్, ఫిజిక్స్  నుండి ఉత్తీర్ణులు అయిన బీఈ / బీటెక్ విద్యార్థులు

4. నౌకాదళ పరిశీలకులు (observer)

  • నిర్వర్తించే విధులు: భారతీయ నౌకాదళంలో ఒక వైమానిక వ్యూహకర్తగా వ్యవహరిస్తారు. సముద్ర కార్యకలాపాల్లో పనిచేసే వైమానిక సమన్వయకర్తలకు పరీశీలకులుగా విధులు నిర్వహిస్తారు. సోనిక్లు, రాడార్లు, సోనార్లు వంటి సమాచార పరికరాలు ఉపయోగించి ఖచ్చితమైన సమాచారాన్ని గ్రహించి వైమానిక సమన్వయకర్తలకు అందిస్తారు.
  • శిక్షణ: ఏజిమాల లోని నేవెల్ అకాడమీలో 22 వారాల పాటు నేవెల్ ఓరియెంటేషన్ కోర్సు యందు  శిక్షణ అందిస్తారు. రెండో దశలో అబ్సర్వర్ స్కూల్లో శిక్షణ అందిస్తారు. ఈ శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్నాక  ప్రతిష్టాత్మకమైన అబ్సర్వర్ వింగ్ ని అందిస్తారు.
  • విద్య అవకాశాలు: మెరిటోరియాస్ అధికారులకు క్వాలిఫైడ్ ఫ్లైయింగ్ ఇన్స్టాక్టర్ కోర్సు యందు తర్ఫీదు అందిస్తారు.
  • విద్య అర్హుత: 10+2 లో మాథ్స్, ఫిజిక్స్  నుండి ఉత్తీర్ణులు అయిన బీఈ / బీటెక్ విద్యార్థులు

5. లాజిస్టిక్ ఆఫీసర్స్

  • నిర్వర్తించే విధులు: నౌకాదళానికి సంబంధించే వాణిజ్య కార్యకలాపాల్లో సేవలు అందిస్తారు. రోజువారీ గూడ్స్ సరఫరా, వాటి జాబితా నిర్వహణ వంటి విధులు నిర్వర్తిస్తారు.
  • శిక్షణ: ఏజిమాల లోని నేవెల్ అకాడమీలో 22 వారాల పాటు నేవెల్ ఓరియెంటేషన్ కోర్సు యందు  శిక్షణ అందిస్తారు.
  • విద్య అవకాశాలు: ఎంపికైన ఆఫీసర్స్ కు ఎంబీఏ మెటీరియల్ మేనేజిమెంట్ వంటి ఉన్నత చదువులకు అవకాశం కల్పిస్తారు.
  • విద్య అర్హుత: బీఈ, బీటెక్, బీఎస్సీ, బీకామ్, ఎంఎస్సీ, ఎంసిఎ, బీఏ అర్చిటిక్ లలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణతలైన వారు అర్హులు.

6. నేవల్ ఆర్మమెంట్ ఇన్స్పెక్షన్(NAIC)

  • నిర్వర్తించే విధులు: యుద్ధ సామగ్రి నిర్వహణ, వాటి సరఫరా, వాటి నాణ్యత, రక్షణ తనిఖీలకు సంబంధించే విధులు నిర్వహిస్తారు. ఆధునిక ఆయుధాల రూపకల్పనకు సంభందించే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మరియు రక్షణ పరిశోధనలలో సహకరిస్తారు.
  • శిక్షణ: ఎంపికైన అభ్యర్థులకు ఏజిమాల లోని నేవెల్ అకాడమీలో 44 వారాల పాటు నేవెల్ ఓరియెంటేషన్ కోర్సులో శిక్షణ అందిస్తారు. శిక్షణ పూర్తియ్యాక వివిధ నేవల్ యూనిట్స్ యందు ప్రోఫిసినల్ ట్రైనింగ్ అందిస్తారు.
  • విద్య అవకాశాలు: శిక్షణలో మెరిట్ సాధించిన ఆఫీసర్స్ కి ఐఐటీ /DIAT(DU)లలో ఎంటెక్ ప్రోగ్రామ్స్ చేసే అవకాశం కల్పిస్తారు.
  • విద్య అర్హుత: 60% మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బీఈ/బీటెక్ (సివిల్, మెకానికల్, ఏరోనాటికల్, నేవల్ ఆర్కిటెక్చర్)

7. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ

  • నిర్వర్తించే విధులు: నౌకాదళంలో ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ గా విధులు నిర్వహిస్తారు.
  • శిక్షణ: ఎంపికైన అభ్యర్థులకు ఏజిమాల లోని నేవెల్ అకాడమీలో 44 వారాల పాటు నేవెల్ ఓరియెంటేషన్ కోర్సులో శిక్షణ అందిస్తారు. శిక్షణ పూర్తియ్యాక వివిధ నేవల్ యూనిట్స్ యందు ప్రోఫిసినల్ ట్రైనింగ్ అందిస్తారు
  • విద్య అవకాశాలు: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కి సంబంధించే అదనపు స్పెషలైజేషన్స్ చేసే అవకాశం ఉంది.
  • విద్య అర్హుత: బీఈ/బీటెక్(కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ ఇంజనీరింగ్, ఐటీ), ఎంటెక్ (కంప్యూటర్ సైన్స్) ఎమ్మెస్సీ(కంప్యూటర్స్), బీఎస్సీ(ఐటీ ) బీసీఏ/ఎంసీఏ.

8. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)

  • నిర్వర్తించే విధులు: భారతీయ నౌకాదళానికి చెందే వైమానిక ట్రాఫిక్ కంట్రోల్ ఆఫీసర్స్ గా విధులు నిర్వహిస్తారు.
  • శిక్షణ: ఎంపికైన అభ్యర్థులకు ఏజిమాల లోని నేవెల్ అకాడమీలో 44 వారాల పాటు నేవెల్ ఓరియెంటేషన్ కోర్సులో శిక్షణ అందిస్తారు. శిక్షణ పూర్తియ్యాక వివిధ నేవల్ యూనిట్స్ యందు ప్రోఫిసినల్ ట్రైనింగ్ అందిస్తారు
  • విద్య అవకాశాలు: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కి సంబంధించే అదనపు స్పెషలైజేషన్స్ చేసే అవకాశం ఉంది.
  • విద్య అర్హుత: 10+2 లో మాథ్స్, ఫిజిక్స్  నుండి ఉత్తీర్ణులు అయిన బీఈ / బీటెక్ విద్యార్థులు

9. లా ఆఫీసర్స్

  • నిర్వర్తించే విధులు: భారతీయ నౌకాదనికి చెందిన అన్ని రకాల న్యాయ సంబంధ విధులు నిర్వహణ.
  • శిక్షణ: ఎంపికైన అభ్యర్థులకు ఏజిమాల లోని నేవెల్ అకాడమీలో 44 వారాల పాటు నేవెల్ ఓరియెంటేషన్ కోర్సులో శిక్షణ అందిస్తారు. శిక్షణ పూర్తియ్యాక వివిధ నేవల్ యూనిట్స్ యందు ప్రోఫిసినల్ ట్రైనింగ్ అందిస్తారు
  • విద్య అవకాశాలు: ప్రతిష్టాత్మక IML KAMPTEE నాగపూర్ మరియు ఇతర న్యాయ స్కూల్స్ లో లా స్పెషలైజేషన్స్ చేసే అవకాశం ఉంది.
  • విద్య అర్హుత: 1961 అడ్వొకేట్ ఆక్ట్ ని అనుచరించి లా డిగ్రీ కలిగి ఉండి అడ్వకేట్ గా రిజిస్టర్ అయిన వారందరు అర్హులు.

10. స్పోర్ట్స్ అధికారులు

  • నిర్వర్తించే విధులు: నౌకాదళానికి చెందే శారీరక శిక్షణ అధికారులుగా విధులు నిర్వహిస్తారు. జాతీయ , అంతర్జాతీయ క్రీడ పోటీలలో భారతీయ నౌకాదళం తరుపున ప్రాతినిధ్యం వహిస్తారు.
  • శిక్షణ: ఎంపికైన అభ్యర్థులకు ఏజిమాల లోని నేవెల్ అకాడమీలో 44 వారాల పాటు నేవెల్ ఓరియెంటేషన్ కోర్సులో శిక్షణ అందిస్తారు. శిక్షణ పూర్తియ్యాక వివిధ నేవల్ యూనిట్స్ యందు ప్రోఫిసినల్ ట్రైనింగ్ అందిస్తారు
  • విద్య అర్హుత: సాధారణ పోస్ట్ గ్రాడ్యూట్ లేదా బీఈ/బీటెక్ లేదా డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్ లేదా ఎంఎస్సీ స్పోర్ట్స్ లేదా ఇతర నేషనల్ స్పోర్ట్స్ సంస్థలలో కోచ్ గా పని చేసిన వారు.
  • స్పోర్ట్స్ పర్సన్స్ అర్హుత: అభ్యర్థులు కనీసం జాతీయ స్థాయిలో సీనియర్ స్థాయి క్రీడాకారుడిగా ప్రాతినిధ్యం వహించి ఉండాలి
  • యాచిటింగ్/ వింగ్ సర్ఫింగ్:అభ్యర్థులు ఈ మూడింటిలో ఏదొక అర్హుత కలిగి ఉండాలి 1. అభ్యర్థులు కనీసం YAI జాతీయ సీనియర్  ఛాంపియన్షిప్ లో ప్రాతినిధ్యం వహించి ఉండాలి లేదా ఒలింపిక్స్ లో 5వ స్థాయి అభ్యర్థి అయి ఉండాలి. 2. ISAF నిర్వహించే యూత్ సెయిలింగ్, విండ్ సర్ఫింగ్ ఛాంపియన్షిప్ లలో కనీసం 50% పూర్తిచేసే సామర్థ్యం ఉండాలి. 3. ఆసియా క్రీడలలో, ISAF నిర్వహించే సెయిలింగ్ ఛాంపియన్షిప్స్ లో మెడల్ సాధించి ఉండాలి.

11. నేవల్ మ్యూజిషన్స్

  • నిర్వర్తించే విధులు: భారతీయ నౌకాదళానికి చెందే వేడుకలలో, జాతీయ దినోత్సవ వేడుకులలో మ్యూజిషన్స్ గా విధులు నిర్వహిస్తారు.
  • శిక్షణ: ఎంపికైన అభ్యర్థులకు ఏజిమాల లోని నేవెల్ అకాడమీలో 44 వారాల పాటు నేవెల్ ఓరియెంటేషన్ కోర్సులో శిక్షణ అందిస్తారు. శిక్షణ పూర్తియ్యాక వివిధ నేవల్ యూనిట్స్ యందు ప్రోఫిసినల్ ట్రైనింగ్ అందిస్తారు.
  • విద్య అర్హుత: మ్యూజిక్ సంబంధించే సాధరణ డిగ్రీలలో ఉత్తీర్ణత
  • ప్రోఫిసినల్ అర్హుత: LRAM/ARCM/ATCL డిప్లొమా లేదా అత్యాధునిక మిలిటరీ సంగీత వాయిద్యాలు వాయించే నైపుణ్యం ఉండాలి.

ఇతర: అనుభవం ఉన్న అర్క్రిష్ట్ర/బ్యాండ్ సభ్యులు, మ్యూజిక్ టీచర్స్ గా పనిచేసిన అనుభవం ఉన్నవారు.

ఇండియన్ నేవీలో ఇంజనీరింగ్ ఆఫీసర్స్

ఇంజినీరింగ్ డ్యూటీ ఆఫీసర్లు భారతీయ నావికాదళం మరియు జాయింట్ ఫోర్సెస్ యొక్క నౌకలు/సబ్‌మెరైన్‌లు/విమానాలలో మెరైన్ ఇంజనీరింగ్ పరికరాల పనితీరు మరియు నిర్వహణ వ్యవహారాలు పర్యవేక్షిస్తారు. ఇండియన్ నేవీలో ఇంజినీరింగ్ ఆఫీసర్ సగటు జీతం సంవత్సరానికి ₹ 18.7 లక్షల వరకు ఉంటుంది.

జనరల్ ఇంజనీరింగ్ ఆఫీసర్స్

  • నిర్వర్తించే విధులు: ఎంపికైన ఆఫీసర్స్ భారతీయ నౌకాదళంలో మెరైన్ ఇంజనీర్స్ గా విధులు నిర్వర్తిస్తారు.షిప్స్, సబ్మెరైన్, ఎయిర్ క్రాఫ్ట్స్ రోజువారీ సాంకేతిక సమస్యల నిర్వహణతో పాటు నౌకాదళానికి చెందిన నూతన ఉత్పత్తుల డిజైన్, ప్రొడక్షన్ పనులలో ప్రాతినిధ్యం వహిస్తారు.
  • శిక్షణ: ఎంపికైన అభ్యర్థులకు ఏజిమాల లోని నేవెల్ అకాడమీలో 44 వారాల పాటు నేవెల్ ఓరియెంటేషన్ కోర్సులో శిక్షణ అందిస్తారు. శిక్షణ పూర్తియ్యాక వివిధ నేవల్ యూనిట్స్ యందు ప్రోఫిసినల్ ట్రైనింగ్ అందిస్తారు.
  • విద్య అవకాశాలు: ఐఐటీ, ఎన్ఐటీ మరియు ఇతర అంతర్జాతీయ విద్యాలయంలో ఎంటెక్ చేసే అవకాశం ఉంది.
  • విద్య అర్హుత: మెరైన్, మెకానికల్, ఆరోనాటికల్, ప్రొడక్షన్ మరియు కంట్రోల్ లలో ఏదైనా ఒక స్పెషలైజేషన్ లో 60% మెరిట్ సాధించిన బీఈ / బీటెక్ విద్యార్థులు అర్హులు.

సబ్ మెరైన్ ఇంజనీరింగ్ ఆఫీసర్

  • నిర్వర్తించే విధులు: జలాంతర్గామిలో సాంకేతిక అధికారిగా విధి నిర్వర్తిస్తారు. జలాంతర్గామిని నడపటం, దాని రోజువారీ మైంటైన్ చూడటం, ఆయుధ వ్యవస్థ నిర్వహణ వంటి విధులు చెయ్యాల్సి ఉంటుంది.
  • శిక్షణ: ఎంపికైన అభ్యర్థులకు ఏజిమాల లోని నేవెల్ అకాడమీలో 44 వారాల పాటు నేవెల్ ఓరియెంటేషన్ కోర్సులో శిక్షణ అందిస్తారు. శిక్షణ పూర్తియ్యాక వివిధ నేవల్ యూనిట్స్ యందు ప్రోఫిసినల్ ట్రైనింగ్ అందిస్తారు. ట్రైనింగ్ పూర్తియ్యాక సబ్ మెరైన్ క్వాలిఫైడ్ సర్టిఫికెట్ అందిస్తారు,
  • విద్య అవకాశాలు: ఐఐటీ, ఎన్ఐటీ మరియు ఇతర అంతర్జాతీయ విద్యాలయంలో ఎంటెక్ చేసే అవకాశం ఉంది<
  • విద్య అర్హుత: మెరైన్, మెకానికల్, ఇండస్ట్రియల్, రోబోటిక్స్, ఏరోస్పేస్, బీఎస్ మెరైన్, ఆరోనాటికల్, ప్రొడక్షన్ మరియు కంట్రోల్ లలో ఏదైనా ఒక స్పెషలైజేషన్ లో 60% మెరిట్ సాధించిన బీఈ / బీటెక్ విద్యార్థులు అర్హులు.

నేవల్ ఆర్కిటెక్చర్ ఆఫీసర్

  • నిర్వర్తించే విధులు: యుద్ధ నౌకలు తయారీ, జలాంతర్గామి రూపకల్పన, ఓడరేవుల నిర్మాణం, నౌకల కోసం రీపీట్ నిర్మాణం వంటి విధులు నిర్వహిస్తారు.
  • శిక్షణ: ఎంపికైన అభ్యర్థులకు ఏజిమాల లోని నేవెల్ అకాడమీలో 44 వారాల పాటు నేవెల్ ఓరియెంటేషన్ కోర్సులో శిక్షణ అందిస్తారు. శిక్షణ పూర్తియ్యాక వివిధ నేవల్ యూనిట్స్ యందు ప్రోఫిసినల్ ట్రైనింగ్ అందిస్తారు.
  • విద్య అవకాశాలు: ఐఐటీ, ఎన్ఐటీ మరియు ఇతర అంతర్జాతీయ విద్యాలయంలో ఎంటెక్ చేసే అవకాశం ఉంది
  • విద్య అర్హుత: 400;">: మెకానికల్, సివిల్, ఆరోనాటికల్, లోహ శోధన, నేవల్ ఆర్కిటెక్చర్ లలో ఏదైనా ఒక స్పెషలైజేషన్ లో 60% మెరిట్ సాధించిన బీఈ / బీటెక్ విద్యార్థులు అర్హులు.

ఇండియన్ నేవీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్స్

భారత నౌకాదళంలో నీటి అడుగున ఆయుధాలు, క్షిపణి వ్యవస్థలు, రాడార్ మరియు రేడియో కమ్యూనికేషన్ పరికరాల నిర్వహణ, అధునాతన క్షిపణి వ్యవస్థల పోరాట సంసిద్ధత, ఛార్జ్‌మెన్, ఓడలు మరియు జలాంతర్గామి పరికరాలు (మెకానికల్, మందుగుండు సామగ్రి మరియు పేలుడు పదార్థాలు) మరమ్మతులు మరియు రీఫిట్‌లను పర్యవేక్షించడం వంటి విధులు నిర్వర్తిస్తారు. నేవీ ఇండియాలో ఎలక్ట్రికల్ ఆఫీసర్ జీతం ₹ 7.5 లక్షల నుండి ₹ 23.0 లక్షల మధ్య ఉంటుంది.

జనరల్ ఎలక్ట్రికల్ ఆఫీసర్స్

  • నిర్వర్తించే విధులు: నౌకాదళానికి సంబంధించే ఎలక్ట్రికల్ విభాగాలలో విధులు నిర్వర్తిస్తారు.
  • శిక్షణ: ఎంపికైన అభ్యర్థులకు ఏజిమాల లోని నేవెల్ అకాడమీలో 44 వారాల పాటు నేవెల్ ఓరియెంటేషన్ కోర్సులో శిక్షణ అందిస్తారు. శిక్షణ పూర్తియ్యాక వివిధ నేవల్ యూనిట్స్ యందు ప్రోఫిసినల్ ట్రైనింగ్ అందిస్తారు.
  • విద్య అవకాశాలు: ఐఐటీ, ఎన్ఐటీ మరియు ఇతర అంతర్జాతీయ విద్యాలయంలో ఎంటెక్ చేసే అవకాశం ఉంది
  • విద్య అర్హుత: ఎలక్ట్రికల్, టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ లలో ఏదైనా ఒక స్పెషలైజేషన్ లో 60% మెరిట్ సాధించిన బీఈ / బీటెక్ విద్యార్థులు అర్హులు.

సబ్ మెరైన్ ఎలక్ట్రికల్ ఆఫీసర్స్

  • నిర్వర్తించే విధులు: జలాంతర్గామిలో సాంకేతిక అధికారిగా విధి నిర్వర్తిస్తారు. జలాంతర్గామిని నడపటం, దాని రోజువారీ మైంటైన్ చూడటం, ఆయుధ వ్యవస్థ నిర్వహణ వంటి విధులు చెయ్యాల్సి ఉంటుంది.
  • శిక్షణ: ఎంపికైన అభ్యర్థులకు ఏజిమాల లోని నేవెల్ అకాడమీలో 44 వారాల పాటు నేవెల్ ఓరియెంటేషన్ కోర్సులో శిక్షణ అందిస్తారు. శిక్షణ పూర్తియ్యాక వివిధ నేవల్ యూనిట్స్ యందు ప్రోఫిసినల్ ట్రైనింగ్ అందిస్తారు. ట్రైనింగ్ పూర్తియ్యాక సబ్ మెరైన్ క్వాలిఫైడ్ సర్టిఫికెట్ అందిస్తారు,
  • విద్య అవకాశాలు: ఐఐటీ, ఎన్ఐటీ మరియు ఇతర అంతర్జాతీయ విద్యాలయంలో ఎంటెక్ చేసే అవకాశం ఉంది
  • విద్య అర్హుత: ఎలక్ట్రికల్, టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, పవర్ ఇంజనీరింగ్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఇనుస్ట్రుమెంటేషన్, కంట్రోల్ లలో ఏదైనా ఒక స్పెషలైజేషన్ లో 55% మెరిట్ సాధించిన బీఈ / బీటెక్ విద్యార్థులు అర్హులు.

ఇండియన్ నేవీలో ఎడ్యుకేషన్ ఆఫీసర్స్

వీరు ఎజిమలలోని ప్రతిష్టాత్మకమైన ఇండియన్ నేవల్ అకాడమీ (INA)తో సహా వివిధ భారతీయ నౌకాదళ శిక్షణా సంస్థల్లో బోధన వ్యవహారాలను నిర్వర్తిస్తారు. భారత నౌకాదళంలో, సిబ్బందికి విద్యా మరియు శిక్షణ సహాయాన్ని అందిస్తారు. నేవీ ఇండియాలో ఎడ్యుకేషన్ ఆఫీసర్ జీతం ఏడాదికి ₹ 6.8 లక్షల నుండి ₹ 30.0 లక్షల మధ్య ఉంటుంది.

  • నిర్వర్తించే విధులు: ఏజిమాల లోని ప్రతిష్టాత్మక ఇండియన్ నేవల్ అకాడమీ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్నా భారతీయ నావెల్ ట్రైనింగ్ సెంటర్స్ లో ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ గా సేవలు అందిస్తారు.
  • శిక్షణ: ఎంపికైన అభ్యర్థులకు ఏజిమాల లోని నేవెల్ అకాడమీలో 44 వారాల పాటు నేవెల్ ఓరియెంటేషన్ కోర్సులో శిక్షణ అందిస్తారు. శిక్షణ పూర్తియ్యాక వివిధ నేవల్ యూనిట్స్ యందు ప్రోఫిసినల్ ట్రైనింగ్ అందిస్తారు
  • విద్య అవకాశాలు: శిక్షణ పూర్తిచేసుకున్న ఆఫీసర్స్ ప్రతిష్టాత్మక ఐఐటీ/ఎన్ఐటీ లలో ఎంటెక్, సబ్ మెరైన్, నావిగేషన్, నేవల్ కమ్యూనికేషన్, హైడ్రోగ్రాఫీ, మెటీరియాలజీ, ఓసినోగ్రఫీ, గన్నారీ, వార్ఫేర్ వంటి స్పెషలైజేషన్ లలో శిక్షణ అందిస్తారు.
  • విద్య అర్హుతలు: గుర్తింపుపొందిన యూనివర్సిటీల నుండి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లలో 55% మెరిట్ సాధించిన డిగ్రీ విద్యార్థులు, మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లతో  ఎంఎస్సీ పూర్తిచేసిన వారు.కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఐటీ, కంప్యూటర్ అప్లికేషన్ డిగ్రీలు ఉన్నవారు అర్హులు.

ఇండియన్ నేవీలో మెడికల్ ఆఫీసర్స్

వీరు భారతీయ నౌకాదళ సిబ్బంది వారి కుటుంబాల యొక్క వైద్య మరియు ఆరోగ్య వ్యవహారాలు నిర్వర్తిస్తారు. ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్‌లో నియమించబడిన తర్వాత, వైద్యులకు కెప్టెన్ ర్యాంక్ లేదా నేవీ లేదా ఎయిర్ ఫోర్స్‌లో సమానమైన ర్యాంక్ మంజూరు చేయబడుతుంది. ఇండియన్ నేవీలో మెడికల్ ఆఫీసర్ సగటు జీతం సంవత్సరానికి ₹ 10.8 లక్షలు వరకు ఉంటుంది.

  • నిర్వర్తించే విధులు: వీరు నౌకాదళ సిబ్బందికి అవసరమైన వైద్య సేవల నిర్వహించే మెడికల్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారు
  • శిక్షణ: పూణే లోని లోని సాయుధ దళాల వైద్య కళాశాలలో (AFMC) పాటు దేశవ్యాప్తంగా వున్నా డిఫెన్స్ హాస్పిటల్స్ లలో శిక్షణ అందజేస్తారు.
  • విద్యా అర్హుత : వైద్య సేవల రకాల అనుచరించి 10+2 (బైపీసీ) నుండి ఎంబీబీస్, డెంటల్ వరకు అన్ని మెడికల్  డిగ్రీ ఉన్నవారిని తీసుకుంటారు