తెలంగాణ మెగా రిక్రూట్మెంట్ : 91142 ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం
Telangana

తెలంగాణ మెగా రిక్రూట్మెంట్ : 91142 ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం

తెలంగాణలో మెగా ఉద్యోగ భర్తీ ప్రకటన

ఉహించిన విధంగానే అసెంబ్లీ వేదికగా తెలంగాణ నిరుద్యోగులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుభవార్త అందించారు. ఎప్పటినుండో వాయిదా పడుతూ వస్తున్నా కొలువుల నియామక ప్రక్రియకు ముహూర్తం ఖరారు చేసారు. విద్య, ఆరోగ్య, వైద్య, రెవిన్యూ, పోలీస్ వంటి వివిధ శాఖల్లో సుమారు 91,142 పోస్టుల భర్తీకి ప్రకటన వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ప్రారంభమయ్యిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం అంటూ అసెంబ్లీలో ప్రసంగం ప్రారంభించిన ముఖ్యమంత్రి, వివిధ రాష్ట్ర సమస్యలపై సుధీర్ఘంగా మాట్లాడారు.

తెలంగాణ ఏర్పాటు నుండి ఇప్పటి వరకు 1,56,254 ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు వెలువడగా, ఇప్పటికే సుమారు 1,33,942 పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తియిందని, మిగతా 22,312 పోస్టుల నియామక ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఎంప్లాయింట్‌మెంట్‌ ఫ్రెండ్లీ గవర్నమెంట్‌ అని, హయ్యెస్ట్‌ పెయిడ్‌ ఎంప్లాయిస్‌ తెలంగాణలో ఉన్నారని సీఎం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం, పక్క రాష్ట్రాల వైఖరి వల్లే భర్తీ ప్రక్రియ ఆలస్యమైందని చెప్పుకొచ్చారు.

95 శాతం పోస్టులు స్థానిక అభ్యర్థులకే...

తెలంగాణలో ఇక మీదట భర్తీ ప్రతి ఉద్యోగం లోకల్ అభ్యర్థులతో భర్తీచేయనున్నట్లు, సుమారు 95% ఉద్యోగాలు స్థానిక అభ్యర్థులతో భర్తీచేసే విధంగా న్యాయపరమైన అనుమతి కోసం చొరవ తీసుకున్నామని వెల్లడించారు. అలానే ఇకమీదట తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్‌ ఉద్యోగులు అనే మాట వినిపించిందని, ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న 11,103 కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.

91, 142 ఉద్యోగాల్లో 11,103  పోస్టులు కాంట్రాక్ట్‌ ఉద్యోగులతో భర్తీచేయగా, మిగిలిన 80,039 పోస్టులకు ఇవాళ్టి(మార్చి 9, 2022) నుంచే నోటిఫికేషన్లు జారీ అవుతాయని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. అలానే షెడ్యూల్‌ 9, 10 వివాదాలు సర్దుమనిగితే మరో 20 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి అవకాశం ఉంటుందని తెలిపారు. ఇదే సందర్భంలో ఉద్యోగ దరఖాస్తు గరిష్ట వయోపరిమితిని పదేళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు.

వయోపరిమితి పెంపు

రిజర్వేషన్ కేటగిరి గరిష్ట వయోపరిమితి పెంపు
ఓసీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి
ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల వయోపరిమితి
దివ్యాంగ అభ్యర్థుల వయోపరిమితి
ఎక్స్‌ సర్వీస్‌మెన్లకు వయోపరిమితి
44 ఏళ్లు
49 ఏళ్లు
54 ఏళ్లు
47 ఏళ్ళు

జిల్లాల వారీగా ఖాళీలు

హైదారాబాద్‌ - 5,268 యాదాద్రి-భువనగిరి - 1,010 సూర్యాపేట-719
నిజామాబాద్‌ - 1,976 ములుగు - 696 వికారాబాద్‌ -738
మేడ్చల్‌ మల్కజ్‌గిరి - 1,769 జయశంకర్‌ భూపాలపల్లి - 918 నారాయణ్‌పేట - 741
రంగారెడ్డి - 1,561 వనపర్తి-556 జనగాం -760
రాజన్న సిరిసిల్ల - 601 జోగులాంబ గద్వాల - 662 పెద్దపల్లి -800
వరంగల్‌ -842 నిర్మల్‌ -876 కొమురంభీం ఆసీఫాబాద్‌ - 825
మెదక్‌ - 1,149 జగిత్యాల - 1, 063 మంచిర్యాల -1, 025
హన్మకొండ - 1,157 మహబూబాబాద్‌ - 1, 172 సిద్దిపేట - 1,178
సంగారెడ్డి -1,243 భద్రాద్రి కొత్తగూడెం - 1,316 మహబూబ్‌నగర్‌ - 1,213
నాగర్‌ కర్నూలు -1,257 ఖమ్మం - 1,340 ఆదిలాబాద్‌ -1,193
 కరీంనగర్‌ -1,465 నల్లగొండ -1,398 కామారెడ్డి - 1,340

జోన్ల వారీగా నియామక ప్రక్రియ

నియామక ప్రక్రియ జిల్లాల వారీగా, జోన్ల వారీగా మరియు వివిధ విభాగాల వారీగా భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 33 జిల్లాలను రెండు ప్రధాన జోన్ కేంద్రాలుగా విభజించారు. వీటిని తిరిగి 5 నుండి 8 జిల్లాల వారీగా 7 ఉప జోన్లుగా విడగొట్టారు. ప్రధాన జోన్ I లో కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి తో కూడిన 4 ఉప జోన్లు ఉండగా, ప్రధాన జోన్ II లో యాదాద్రి, చార్మినార్, జోగులాంబ తో కూడిన 3 ఉప జోన్లు ఉన్నాయి.

మల్టీ జోన్ I మల్టీ జోన్ II
కాళేశ్వరం జోన్ I : కొమురంభీం ఆసీఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు యాదాద్రి జోన్ V : సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి-భువనగిరి, జనగాం
బాసర జోన్ II : ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాదు, జగిత్యాల చార్మినార్ జోన్ VI: చార్మినార్, మేడ్చల్‌ మల్కజ్‌గిరి, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి
రాజన్న జోన్ III  : కరీంనగర్, సిరిసిల్ల-రాజన్న, సిద్దపేట్, మెదక్, కామారెడ్డి జోగులాంబ జోన్ VII : మహబూబాబాద్‌, నారాయణపేట్, జోగులాంబ-గద్వాల్, వనపర్తి, నాగర్‌ కర్నూలు
భద్రాద్రి జోన్ IV : కొత్తగూడెం-భద్రాద్రి, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్‌

గ్రూప్ I, II, III, IV పోస్టుల భర్తీ వివరాలు

గ్రూప్ I ఖాళీలు : 503 పోస్టులు గ్రూప్ II ఖాళీలు : 582 పోస్టులు
గ్రూప్ III ఖాళీలు : 1,373 పోస్టులు గ్రూప్ IV ఖాళీలు : 9,168 పోస్టులు

వివిధ ప్రభుత్వ విభాగాల వారీగా పోస్టుల భర్తీ వివరాలు

హోం శాఖ : 18,334 పోస్టులు సెకండరీ ఎడ్యుకేషన్‌ : 13,086 పోస్టులు
వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ : 12,775 పోస్టులు బీసీల సంక్షేమం శాఖ : 4,311 పోస్టులు
హయ్యర్ ఎడ్యుకేషన్ : 7,878 పోస్టులు రెవెన్యూ శాఖలో : 3,560 పోస్టులు
షెడ్యూల్‌ కాస్ట్స్‌ : 2, 879 పోస్టులు ఇరిగేషన్‌ శాఖ : 2,692 పోస్టులు
ఆర్థిక శాఖలో : 1,146 పోస్టులు లెజిస్లేచర్‌లో : 25 పోస్టులు
విద్యుత్‌ శాఖ : 16 పోస్టులు

One Comment

Post Comment