టీఎస్పీఎస్సీ గ్రూపు 2 నోటిఫికేషన్ 2023 | రిజిస్ట్రేషన్, ఎగ్జామ్ నమూనా
Latest Jobs TSPSC

టీఎస్పీఎస్సీ గ్రూపు 2 నోటిఫికేషన్ 2023 | రిజిస్ట్రేషన్, ఎగ్జామ్ నమూనా

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, డిప్యూటీ తహశీల్దార్, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ వంటి వివిధ గ్రూపు 2 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

తాజా నోటిఫికేషన్ ద్వారా దాదాపు 783 గ్రూపు 2 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ 18 జనవరి 2023 నుండి 16 ఫిబ్రవరి 2023 మధ్య నిర్వహించనున్నారు. ఎంపిక రాతపరీక్ష మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా ఉంటుంది.

టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఖాళీలు

ఖాళీ పోస్టులను కమ్యూనిటీ వారీగా, వివిధ కోటాల వారీగా మరియు మల్టీ జోనల్ వారీగా భర్తీ చేస్తారు.

మున్సిపల్ కమీషనర్ గ్రేడ్ III - 11 పోస్టులు ఎక్సటెన్షన్ ఆఫీసర్ - 126 పోస్టులు
అసిస్టెంట్ రిజిస్ట్రార్ - 63 పోస్టులు అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ గ్రేడ్  II - 59 పోస్టులు
డిప్యూటీ తహశీల్దార్ - 98 పోస్టులు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-I
ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ - 97 పోస్టులు అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ - 38 పోస్టులు
అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ - 17 పోస్టులు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ - 9 పోస్టులు
సబ్ రిజిస్ట్రార్ - 14 పోస్టులు అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ - 9 పోస్టులు
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ - 214 పోస్టులు డిస్ట్రిక్ట్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ ఆఫీసర్ - 17 పోస్టులు

టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎలిజిబిలిటీ

  • అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో 50% మార్కులతో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి.
  • డిస్టెన్స్ మరియు ఓపెన్ డిగ్రీ ద్వారా పీజీ పూర్తిచేసిన వారు యూజీసీ గుర్తింపు పొందిన సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
  • అభ్యర్థుల వయస్సు 18 నుండి 44ఏళ్ళ మధ్య ఉండాలి. కమ్యూనిటీ కోటా పరిధిలో వయోపరిమితి సడలింపు ఉంటుంది.
  • ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సబ్ ఇనస్పెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసే పురుష అభ్యర్థులు 167.6 సెమీ, మహిళా అభ్యర్థులు 152.5సెమీ పొడవు ఉండాలి.

టీఎస్పీఎస్సీ గ్రూపు 2 షెడ్యూల్

దరఖాస్తు ప్రారంభం 18 జనవరి 2023
దరఖాస్తు తుది గడువు 16 ఫిబ్రవరి 2023
హాల్ టికెట్ జూన్/జులై 2023
ఎగ్జామ్ తేదీ జూన్/జులై 2023
ఫలితాలు సెప్టెంబర్ 2023

టీఎస్పీఎస్సీ గ్రూపు 2 దరఖాస్తు ఫీజు

దరఖాస్తు రుసుము డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ విధానంలో అందుబాటులో ఉంటుంది. పరీక్ష రుసుము చెల్లించిన దరఖాస్తులు మాత్రమే పరిగణంలోకి తీసుకోబడతాయి.

ఫీజు జనరల్ అభ్యర్థులు నిరుద్యోగులు
అప్లికేషన్ ఫీజు 200/- 200/-
ఎగ్జామ్ ఫీజు 120/- మినహాయింపు

టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 దరఖాస్తు విధానం

టీఎస్పీఎస్సీ గ్రూప్ద 2 పోస్టుల దరఖాస్తు ప్రక్రియ పూర్తి ఆన్‌లైన్ విధానంలో ఉంటుంది. అభ్యర్థులు టీఎస్పీఎస్సీ ఓటీపీఆర్ ఐడీ ఉపయోగించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఐడీ లేని వారు కొత్తగా ఓటిపీఆర్ ఐడీ కోసం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఎడ్యుకేషన్ మరియు ఇతర సంబంధిత సర్టిఫికెట్లు అందుబాటులో ఉంచుకోవాలి.

టీఎస్పీఎస్సీ పోర్టల్ యందు ఉన్న గ్రూప్ 2 లింక్ ఉపయోగించించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంటుంది. మొదటిగా ఓటిపిఆర్ మరియు పుట్టిన తేదీ వివరాలు పొందుపర్చగానే అభ్యర్థుల డేటా లోడ్ అవుతుంది.

అందులో ఇదివరకే మీరు పొందుపర్చిన వ్యక్తిగత, విద్యా, చిరునామా వివరాలు మరోమారు సరిచూసుకుని, అవసరమయ్యే ఇతర అవసరాలను అందించాల్సి ఉంటుంది. అదే సమయంలో  దరఖాస్తు చేస్తున్న పోస్టు మరియు ఎగ్జామ్ సెంటర్ వివరాలు అందించాల్సి ఉంటుంది. చివరిగా దరఖాస్తు రుసుము చెల్లించడం ద్వారా ఈ ప్రక్రియ పూర్తివుతుంది.

టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ సెంటర్లు

ఆసిఫాబాద్-కొమరంభీం
వరంగల్
మంచిర్యాల
హన్మకొండ
పెద్దపల్లి
సూర్యాపేట
జయశంకర్-భూపాలపల్లి
నల్గొండ
నారాయణపేట
కామారెడ్డి
మెదక్
ములుగు
భోంగీర్-యాదాద్రి
ఆదిలాబాద్
జనగాం
నిర్మల్
ఖమ్మం
నాగర్ కర్నూల్
మహబూబాబాద్
వనపర్తి
జోగులాంబ-గద్వాల్
భద్రాద్రి-కొత్తగూడెం
మేడ్చల్-మల్కాజిగిరి
నిజామాబాద్
హైదరాబాద్
జగిత్యాల
రంగా-రెడ్డి
కరీంనగర్
సంగారెడ్డి
సిరిసిల్ల-రాజన్న
వికారాబాద్
సిద్దిపేట
మహబూబ్ నగర్

టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ నమూనా

టీఎస్పీఎస్సీ గ్రూపు II పోస్టుల నియామక ప్రక్రియ రాతపరీక్ష మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా నిర్వహిస్తారు. రాతపరీక్ష 600 మార్కులకు 4 పేపర్లుగా నిర్వహిస్తారు. ఒక్కో పేపర్ 150 మార్కులకు జరుగుతుంది.  ప్రతి పేపర్ 150 ప్రశ్నలతో, 2.30 గంటల నిడివితో పూర్తిచేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి ఒక్కో పేపర్ కోసం వివరంగా తెలుసుకుందాం.

టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పేపర్ పేపర్ I -  జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీ

గ్రూపు 2 పేపర్ I లో భాగంగా 150 మార్కులకు జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీ సంబందించిన అంశాలతో నిర్వహస్తారు. ప్రశ్న పత్రం మూడు సెక్షన్లుగా, ఒక్కో సెక్షన్ యందు 50 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు సమాధానం చేయాల్సి ఉంటుంది. సరైన సమాధానం చేసిన ప్రశ్నలకు 1 మార్కు కేటాయిస్తారు. పరీక్ష నిడివి 2.30 గంటల నిడివితో ఉంటుంది. ప్రశ్నపత్రం ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో అందుబాటులో ఉంటుంది.

సబ్జెక్టు/సిలబస్ ప్రశ్నల సంఖ్యా మార్కులు సమయం
జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీ 150 ప్రశ్నలు 150 మార్కులు 2.30 గంటలు

టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పేపర్ పేపర్ II - హిస్టరీ, పాలిటి & సొసైటీ

గ్రూపు 2 పేపర్ II లో హిస్టరీ, పాలిటి మరియు సొసైటీ అంశంలో కూడిన ఆబ్జెక్టివ్ రాతపరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం మూడు సెక్షన్లుగా ఉంటుంది. ప్రశ్నపత్రంలో ఒక్కో విభాగం నుండి 50 ప్రశ్నలు చెప్పున మొత్తం 150 ప్రశ్నలు ఇవ్వబడతయి. సరైన సమాధానం చేసిన ప్రశ్నలకు 1 మార్కు కేటాయిస్తారు.

పరీక్ష నిడివి 2.30 గంటల నిడివితో ఉంటుంది. ప్రశ్నపత్రం ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో అందుబాటులో ఉంటుంది. ప్రశ్నలు డిగ్రీ స్థాయి సిలబస్ తో ఇండియన్ & తెలంగాణ హిస్టరీ, భారత రాజ్యాంగం & రాజకీయ వ్యవస్థ మరియు ఇండియన్ సొసైటీ స్ట్రక్చర్ & పబ్లిక్ పాలసీ అంశాల నుండి ఇవ్వబడతయి.

సబ్జెక్టు/సిలబస్ ప్రశ్నల సంఖ్యా మార్కులు సమయం
హిస్టరీ, పాలిటి & సోసిటీ స్ట్రక్చర్ 150 ప్రశ్నలు 150 మార్కులు 2.30 గంటలు

టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పేపర్ పేపర్ III - ఇండియన్ ఎకానమీ & డెవలప్మెంట్

గ్రూపు 2 పేపర్ III లో భారతీయ ఆర్థిక వ్యవస్థ, దాని అభివృద్ధి సంబంధిత అంశంలో కూడిన ఆబ్జెక్టివ్ రాతపరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం మూడు సెక్షన్లుగా ఉంటుంది. ప్రశ్నపత్రంలో ఒక్కో విభాగం నుండి 50 ప్రశ్నలు చెప్పున మొత్తం 150 ప్రశ్నలు ఇవ్వబడతయి. సరైన సమాధానం చేసిన ప్రశ్నలకు 1 మార్కు కేటాయిస్తారు. పరీక్ష నిడివి 2.30 గంటల నిడివితో ఉంటుంది.

ప్రశ్నపత్రం ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో అందుబాటులో ఉంటుంది. ప్రశ్నలు డిగ్రీ స్థాయి సిలబస్ తో భారతీయ ఆర్థిక వ్యవస్థ: సమస్యలు మరియు సవాళ్లు, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి మరియు ఆర్థికాభివృద్ధి మరియు మార్పు సమస్యలు వంటి సంబంధిత అంశాల నుండి ఇవ్వబడతయి.

సబ్జెక్టు/సిలబస్ ప్రశ్నల సంఖ్యా మార్కులు సమయం
భారతీయ & తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, దాని అభివృద్ధి 150 ప్రశ్నలు 150 మార్కులు 2.30 గంటలు

టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పేపర్ పేపర్ IV - తెలంగాణ ఉద్యమం & తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు

గ్రూపు 2 పేపర్ IV లో తెలంగాణ ఉద్యమం & తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సంబంధిత అంశంలో కూడిన రాతపరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం మూడు సెక్షన్లుగా ఉంటుంది. ప్రశ్నపత్రంలో ఒక్కో విభాగం నుండి 50 ప్రశ్నలు చెప్పున మొత్తం 150 ప్రశ్నలు ఇవ్వబడతయి. సరైన సమాధానం చేసిన ప్రశ్నలకు 1 మార్కు కేటాయిస్తారు.

పరీక్ష నిడివి 2.30 గంటల నిడివితో ఉంటుంది. ప్రశ్నపత్రం ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో అందుబాటులో ఉంటుంది. ప్రశ్నలు డిగ్రీ స్థాయి సిలబస్ తో తెలంగాణ ఆలోచన (1948-1970), ఉద్యమ సమీకరణ దశ (1971-1990) మరియు తెలంగాణ అవతరణ (1991-2014) అంశాలకు సంబంధించి ప్రశ్నలు ఇవ్వబడతయి.

సబ్జెక్టు/సిలబస్ ప్రశ్నల సంఖ్యా మార్కులు సమయం
తెలంగాణ ఉద్యమం & తెలంగాణ రాష్ట్రం 150 ప్రశ్నలు 150 మార్కులు 2.30 గంటలు

సర్టిఫికెట్ వెరిఫికేషన్ & తుది ఎంపిక

రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారితంగా ఉంటుంది. రాతపరీక్షలో అర్హుత పొందిన అభ్యర్థులను పోస్టుల ఖాళీల వారీగా, జోన్ల వారీగా, కమ్యూనిటీ వారీగా, ఇతర రిజర్వేషన్ కోటాల వారీగా షార్ట్ లిస్టు రూపొందిస్తారు. షార్ట్ లిస్ట్ చేయబడ్డ అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిపి తుది ఎంపిక చేపడతారు.

గ్రూపు 2 క్వాలిఫైయింగ్ మార్కులు

  • జనరల్, ఈడబ్ల్యూఎస్, స్పోర్ట్స్, మాజీ సైనికులు - 40% మార్కులు తప్పనిసరి.
  • బీసీ అభ్యర్థులు లకు 35 శాతం మార్కులు తప్పనిసరి.
  • ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు కనీసం 30 శాతం మార్కులు అవసరం
కేటగిరి & రిజర్వేషన్ కేటగిరి & రిజర్వేషన్ 
బీసీ - 29%
ఎస్సీ - 15%
ఎస్టీ - 7%
EWS - 10%
Sports - 2%
PH - 4%.

Post Comment