Types of verbs in Telugu with examples | తెలుగులో స్పోకెన్ ఇంగ్లీష్
Spoken English

Types of verbs in Telugu with examples | తెలుగులో స్పోకెన్ ఇంగ్లీష్

A verb is a word or a combination of words that indicates action or a state of being or condition. A verb is the part of a sentence that tells us what the subject performs.

Advertisement

Subject (కర్త) యొక్క చర్య (యాక్షన్) లేదా స్థితిని (స్టేట్) తెలియజెప్పే బాషా భాగాన్ని Verb (క్రియ) అని అంటారు. అంటే సబ్జెక్టులో ఉండే Noun లేదా Pronoun చేసే పని లేదా స్థితి గురించి వెర్బ్ మనకు తెలియపరుస్తుంది. బాషా ఏదైనా అది క్రియ ఆధారితంగానే నిర్మితమౌతుంది.

అలానే బాష యొక్క వ్యాకరణం కూడా క్రియ చుట్టూరానే తిరుగుతుంది. కావున, క్రియ గురించి యెంత ఎక్కువ నేర్చుకుంటే బాష అంత గొప్పగా అవగతమౌతుంది. క్రియ (Verb) subject లో ఉండే Noun or Pronoun లేదా ఇతర ఫాక్టర్స్ వలన ఎన్నో రకాలుగా ఉన్నప్పటికీ, మనకు ఎక్కువ ఉపయోగపడే మూడు రకాల క్రియల గురించి నేర్చుకుందాం.

  • Action or Main verbs (which can be transitive or intransitive)
  • Linking verbs (collectively known as subject complements)
  • Helping verbs (sometimes called auxiliary verbs).

Verb సంబంధించి మీరు ఇంటర్నెట్ లేదా స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాలలో వెతికితే ఒకదానికి ఒకటి సంబంధం లేని కంటెంట్ మీకు కనిపిస్తుంది. మీరు పైన చెప్పిన విధానాన్నే గుర్తుపెట్టుకోండి. క్రియ (Verb) స్వభావం ముచ్చటగా పైన చెప్పిన మూడు రకాలుగానే ఉంటుంది.

Action Verb

ఒక వాక్యంలో ఉండే ప్రధాన క్రియను యాక్షన్ వెర్బ్ అంటారు. సబ్జెక్టు చేసే ప్రధాన యాక్షన్ లేదా స్టేట్ గురించే తెలిపే క్రియను Action Verb గా చెప్పొచ్చు. Ex: Eating, Drinking, Walking etc. యాక్షన్ వెర్బ్ తిరిగి రెండు రకాలుగా ఉంటుంది. అవి 1. Transitive verb 2. Intransitive verb.

Transitive verb : ట్రాన్సిటివ్ వెర్బను తెలుగులో సకర్మక క్రియ అంటారు. subject మరియు Object కలిగి ఉండే Verbs ను ట్రాన్సిటివ్ వెర్బలగా చెప్పుకుంటాం. అనగా సంపూర్ణ వాక్యాలలో ఉండే క్రియలు, సకర్మక క్రియలు అవుతాయి. కర్త, క్రియ మరియు కర్మను కలిగి ఉండే వాక్యాలను సంపూర్ణ వాక్యాలు అంటారు. ఒక verb ట్రాన్సిటివ్  వెర్బ్ అవుతుందా లేదా కదా అనేది ఆ వాక్య నిర్మాణంపై ఆధారపడి ఉంటుంది.

Seetha (object) sent (transitive verb) a postcard (direct object) from Vizag
She (object) left (transitive verb) the keys (direct object) on the table
Please (Adverb) buy (transitive verb) me (subject) a dog (direct object)!

Intransitive verb : ఇంట్రాన్సిటివ్ వెర్బను తెలుగులో అకర్మక క్రియ అంటారు. ప్రత్యక్ష లేదా పరోక్ష object లేని క్రియలను అకర్మక క్రియ లేదా ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటారు. ఆబ్జెక్ట్ లేని కొన్ని సంధర్బాలలో preposition, adverb or adverbial phrase ద్వారా ఇంట్రాన్సిటివ్ వెర్బ్ ఆ వాక్యం యొక్క భావాన్ని వ్యక్తపరుస్తుంది. ఆబ్జెక్ట్ లేకపోవడం వలన అకర్మక వాక్యాల్లో ఎవరు, ఏంటి అనే ప్రశ్నలకు సమాధానం దొరకదు.

They (object) Run (intransitive verb) No Object
She (object) Slept (intransitive verb) No Object
Jordan (object) drove (intransitive verb) into the lane (preposition)

Linking Verb

సబ్జెక్టుతో కనెక్ట్ అయ్యి, సబ్జెక్టు కోసం మాత్రమే వివరించే క్రియలను Linking verbs అంటారు. Linking verb క్రియ చేసే చర్య (యాక్షన్) కోసం తెలియజేయదు. ఇవి కేవలం మనుషులు, జంతువులు లేదా ప్రకృతి యొక్క మానసిక లేదా భౌతిక భావాలను వ్యక్తపరుస్తాయి. ఒక వాక్యంలో లింకింగ్ వెర్బ్ ఉంటె ఆ వాక్య నిర్మాణం ఈవిధంగా ఉంటుంది.

SUBJECT--- LINKING VERB --- INFORMATION ABOUT THE SUBJECT (noun)(verb)(adjective, or complement)

కొన్ని లింకింగ్ వెర్బులు ఎల్లప్పుడూ లింకింగ్ వెర్బులుగానే ఉంటాయి. మరికొన్ని సమ సందర్భం బట్టి ప్రధాన క్రియలుగా లేదా లింకింగ్ క్రియలుగా మార్పు చెందుతూ ఉంటాయి. ఎప్పుడూ లింకింగ్ వెర్బలుగా ఉండే కొన్ని క్రియలు.

ఎప్పుడూ లింకింగ్ వెర్బలుగా ప్రవర్తించేవి

To be is, am, are, was, were, has been, have been, had been, is being, are being, was being, will have been, etc.
Become become, becomes, became, has become, have become, had become, will become, will have become, etc
To seem seemed, seeming, seems, has seemed, have seemed, had seemed, is seeming, are seeming, was seeming, were seeming, will seem

Examples

The ball is (Linking Verb) red
The children are (Linking Verb) smart
The child will be (Linking Verb) tall five years from now
The dog became (Linking Verb) thin after his surgery

లింకింగ్ & యాక్షన్ వెర్బలుగా ప్రవర్తించేవి

To appear To feel To look
To taste To stay To remain
To continue To grow To prove
To sound To smell To turn
Five Sense  related verbs Feel, Look, Smell, Taste, Sound
States of Being verbs Act, Grow, Stay, Appear, Prove, Turn, Become, Remain, Get, Some

Examples

Linking : Rajesh appeared happy. (Appeared links Rajesh to the subject complement, happy.)
Action : Ramesh suddenly appeared. (Here, appeared is an intransitive action verb.)

Helpning Verb

వీటినే తెలుగులో సహాయక క్రియలు అని, మరో రకంగా Auxiliary verbs అని కూడా అంటారు. సహాయక క్రియలు సాధారణంగా ప్రధాన క్రియలకు లేదా లింకింగ్ వెర్బులకు ముందున ఉంటూ, వాటి యొక్క అదనపు సమాచారాన్ని లేదా భావాన్ని వ్యక్తపరుస్తాయి. ఇలా రెండు రకాల క్రియల కలయికను verb phrase అంటారు. Ex :  Teju is (helping verb) going (main verb) to Florida.

Always function as helping verbs

can could
may might
must ought to
shall should
will would

Examples

Tanya could learn to fly helicopters. (Could helps the main verb, To learn.)
Sruthi will drive to Idaho tomorrow. (Will helps the main verb, To drive.)

Sometimes serve as helping verbs & In other cases, they may serve as action or linking verbs

is had are
am have does
be has did
being was been
do were

Examples

raju is (Helping Verb) moving to a new house.
Kiran is (Linking verb) ready to go.
Prasad did (Action verb) his homework last night. Dustin did (Helping Verb) eat his vegetables!
venky did (Helping Verb) eat his vegetables!

మనం ఇంతవరకు నేర్చుకున్నది క్రియ స్వభావం గురించి మాత్రమే. వ్యాకరణంలో ఎక్కువ భాగం క్రియకు సంబంధించి మాత్రమే ఉంటుంది. క్రియ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే భూత - వర్తమాన - భవిష్యత్ కాలాలు మూడింటిని చూడాలి. ఆయా కలలో క్రియపదం ఏవిదంగా మార్పు చెందుతుందో నేర్చుకోవాలి.

అలానే Be క్రియలు, Do క్రియలు, Have క్రియలు, మోడల్ క్రియలు, నార్మల్ క్రియలు మధ్య తేడాలను తెలుసుకోవాలి. ఇంకా Direct Speech, Indirect Speech, Phrases and Clauses, Active voice, Passive voice వంటి అన్ని verb సంబంధిత అంశాలు తెలుసుకున్నాకే verb గురించి పూర్తిగా నేర్చుకున్నట్లు అవుతుంది. వీటన్నింటిని చూసి గాబరా పడకుండా, నింపాదిగా ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుందాం.

Advertisement

Post Comment