యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి 2023 ఏడాదికి సంబంధించి నేషనల్ డిఫెన్స్ అకాడమీ & నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ II (NDA & NA - II) ప్రకటన వెలువడింది. ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ సర్వీసుల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు జరిగే ఈ నియామక పరీక్షకు ఇంటర్ పూర్తిచేసి, 16 నుండి 18 ఏళ్ళ మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు.
ప్రస్తుత నోటిఫికేషన్ ద్వారా మొత్తం 395 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో నేషనల్ డిఫెన్స్ అకాడమీ సంబంధించి 370, నేవల్ అకాడమీ సంబంధించి 25 ఖాళీలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు 06 జూన్ 2023 లోపు దరఖాస్తు చేసుకోండి.
నోటిఫికేషన్ నెంబర్ | 10/2023-NDA-II |
నోటిఫికేషన్ తేదీ | 17/05/2023 |
దరఖాస్తు తుది గడువు | 06/06/2023 |
పరీక్షా ఫీజు | 100/- |
పరీక్ష తేదీ | 03/09/2023 |
NDA & NA 2023 ఖాళీలు
అకాడమీ | ఇండియన్ ఆర్మీ | ఇండియన్ నేవీ | ఎయిర్ ఫోర్స్ |
---|---|---|---|
నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) | 208 | 42 | 92+18+10 |
నేవల్ అకాడమీ (NA) | 25 (పురుషులకు మాత్రమే) | ||
మొత్తం | (370+25) 395 ఖాళీలు |
ఇంటర్ అర్హుతతో భారత త్రివిధ దళాల యందు ఉద్యోగం కల్పించే నేషనల్ డిఫెన్స్ అకాడమీ మరియు నేవల్ అకాడమీ పరీక్షకు దరఖాస్తు చేయండి. ఈ పరీక్షను యూపీఎస్సీ జాతీయ స్థాయిలో ఏటా రెండు సార్లు జరుపుతుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాతపరీక్ష మరియు సర్వీస్స్ సెలక్షన్ బోర్డు నిర్వహించే వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
ఎంపికైనఅభ్యర్థులకు పూణేలో ఖాదక్వస్లా నేషనల్ డిఫెన్సె అకాడమీలో 3 ఏళ్ళ పాటు గ్రాడ్యుయేషన్ పాటుగా సాయుధ దళాల ట్రయినింగ్ అందిస్తారు. మూడేళ్ళ ట్రయినింగ్ పూర్తిచేసుకున్న అభ్యర్థులను ఆయా సాయుధ దళాల అకాడమీలకు పంపిస్తారు.
NDA మొదటి విడుత పరీక్షను జనవరి నుండి ఏప్రిల్ మధ్యలో నిర్వహించి, జులైలో ట్రైనింగ్ కు పిలుస్తారు. రెండవ విడుత పరీక్షను సెప్టెంబరు మరియు అక్టోబరు మధ్యలో జరిపి, జనవరి లో ట్రైనింగ్ కాల్ లేటర్ పంపిస్తారు. దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ మరియు దరఖాస్తు విధానం ఇప్పుడు తెలుసుకుందాం.
NDA & NA ఎగ్జామ్ ఎలిజిబిలిటీ
- జాతీయత: ఇండియా, భూటాన్, నేపాల్ దేశాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
- 1962 కు ముందు ఇండియాకు వచ్చి స్థిరపడిన టిబెటియన్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- భారత్ లో శాశ్వతంగా స్థిరపడేందుకు వచ్చిన పాకిస్తాన్, శ్రీలంక, బర్మా మరియు కెన్యా, ఉగాండా, జాంబియా దెసలకు చెందిన వారుకూడా అర్హులు.
- వయోపరిమితి: అభ్యర్థుల వయసు 16 నుండి 19 ఏళ్ళ మధ్య ఉండాలి.
- వైవాహిక స్థితి : అభ్యర్థులు తప్పనిసరి అవివాహితులై ఉండాలి. ట్రయినింగ్ పూర్తయ్యే వరకు వివాహానికి అనుమతించారు.
- విద్య అర్హుత: ఆర్మీ, నేవీ కు సంబంధించి గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి ఇంటర్మీడియట్ లేదా 10+2 ఉత్తీర్ణతై ఉండాలి. ఎయిర్ ఫోర్స్ సంబంధించి దరఖాస్తు చేసుకున్న అభ్యర్డ్యులు మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి ఇంటర్మీడియట్ లేదా 10+2 ఉత్తీర్ణతై ఉండాలి.
- నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామినేషన్ నిబంధనలు అనుచరించి అభ్యర్థులు శారీరకంగా ఫిట్ గా ఉండాలి.
NDA & NA ఎగ్జామ్ దరఖాస్తు ఫీజు
కేటగిరి | దరఖాస్తు ఫీజు |
---|---|
జనరల్ అభ్యర్థులు | 100/- |
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు | దరఖాస్తు రుసుము లేదు |
NDA & NA ఎగ్జామ్ దరఖాస్తు విధానం
నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామినేషన్ కు పోటీపడే అభ్యర్థులు యుపిఎస్‌సి అధికారిక వెబ్సైటు ద్వారా ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు మొదటి దశలో విద్యార్థి వ్యక్తిగత, విద్యా, చిరునామా వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. తరువాత దశలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు మినహా మిగతా అభ్యర్థులు అందుబాటులో ఉన్న పేమెంట్ విధానంలో 100/- దరఖాస్తు ఫీజు చెల్లించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది.
ప్రతి అభ్యర్థి గరిష్టంగా ఒక్క దరఖాస్తు మాత్రమే చేయాలి. దరఖాస్తు సమయంలో ఖచ్చితమైన వివరాలు అందించాల్సి ఉంటుంది. దరఖాస్తు ద్వారా అందించే తప్పుడు సమాచారంకు పూర్తి బాధ్యత అభ్యర్థి వహించాలి. వయస్సు ధ్రువపత్రం, విద్యా అర్హత ధ్రువపత్రాలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులకు చెందినవారు ఇడబ్ల్యుఎస్ సర్టిఫికేట్ మరియు అవసరమైన వారు వయసు సడలింపు ధ్రువపత్రాలు అందుబాటులో ఉంచుకోవాలి.
యుపిఎస్‌సి పరీక్షకు సంబంధించిన సమస్త సమాచారం ఇమెయిల్ మరియు మొబైల్ ఫోన్లకు పంపిస్తుంది. ఇమెయిల్ మరియు మొబైల్ అందుబాటులో ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత అభ్యర్థులదే.
తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామ్ సెంటర్స్ | |
---|---|
ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ |
విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి | హైదరాబాద్, వరంగల్, |
NDA & NA ఎగ్జామ్ నమూనా
NDA & NA ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ పద్దతిలో 900 మార్కులకు నిర్వహిస్తారు. మొదట భాగంలో రెండున్నర గంటల కాలవ్యవధితో 300 మార్కులకు మ్యాథమెటిక్స్ పరీక్ష నిర్వహిస్తారు. రెండవ భాగంలో అదే కాలవ్యవధితో 600 మార్కులకు జనరల్ ఎబిలిటీ టెస్ట్ జరుపుతారు.
ప్రశ్నపత్రాలు హిందీ మరియు ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంటాయి. పరీక్షా ముగిసాక అభ్యర్థుల చూపిన ప్రతిభ ఆధారంగా అర్హుత మార్కులను కమిషన్ నిర్ణయిస్తుంది. ఎంపికైన అభ్యర్థులను ఇంటర్వ్యూ కి పిలుస్తారు. సర్వీస్స్ సెలక్షన్ బోర్డు జరిపిన ఇంటర్వ్యూ మరియు రాతపరీక్షలో చూపించిన ప్రతిభ ఆధారంగా తుదిఫలితాలు విడుదల చేస్తారు.
పేపర్ కోడ్ | సిలబస్ | సమయం | మార్కులు |
---|---|---|---|
01 | మ్యాథమెటిక్స్ | 2.30 గంటలు | 300 |
02 | జనరల్ ఎబిలిటీ | 2.30 గంటలు | 600 |
మొత్తం | 900 |
NDA & NA ఎంపిక
రాతపరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులను రిజర్వేషన్ మరియు జండర్ వారీగా మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు. మెరిట్ లిస్టులో చోటు పొందిన వారికి తర్వాత దశలో ఫీజికల్ మరియు మెడికల్ టెస్టులు నిర్వహిస్తారు. ఈ రెండు పరీక్షలో అర్హుత పొందిన వారికీ చివరిగా ట్రైనింగ్ కోసం ఎంపిక చేస్తారు. ఫీజికల్ మరియు మెడికల్ టెస్టులకు సంబంధించి పూర్తి సమాచారం నోటిఫికేషన్ ద్వారా పొందగలరు.
ప్రాథమిక పరిశీలనలో చెవిలో వాక్స్, డివియేటెడ్ నాసల్ సెప్టం, హైడ్రోసెల్/ఫిమోసిస్, అధిక బరువు/తక్కువ బరువు. ఛాతీ సైజు తక్కువ, పైల్స్, గైనెకోమాస్టియా, టాన్సిలిటిస్, వరికోసెల్ వంటి అనారోగ్య మరియు లోపాలు ఉండే అభ్యర్థులను తొలగిస్తారు. రెండవ దశలో శారీరక దారుడ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో అర్హుత పొందిన వారికీ ఇతర మెడికల్ టెస్టులు నిర్వహించి ఎంపిక చేస్తారు.
NDA & NA ట్రైనింగ్ వివరాలు
ఎంపికైన అభ్యర్థులకు మొదట మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు. మెడికల్ పరీక్షల అనంతరం నేషనల్ డిఫెన్స్ అకాడమీ నియమాలను సమ్మతిస్తూ అభ్యర్థి తల్లిదండ్రులు లేదా సంరక్షుకులు జాయింగ్ దరఖాస్తుపై సంతకం చేయాల్సి ఉంటుంది. ఎంపికయిన అభ్యర్థులకు బుక్స్, యూనిఫామ్స్, వసతి మరియు మెడికల్ ట్రీట్మెంట్ సంబంధిత సౌకర్యాలు ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది.
అభ్యర్థుల ఇతర అవసరాల నిమిత్తం నెలకు 3000/- ఫోకెట్ అలోవెన్సు చెల్లించాల్సి ఉంటుంది. దీనితో పాటుగా మిగతా రుసుములు చెల్లింపు కోసం కొంత సొమ్ము డిఫాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆధాయం 21000/- లోపు ఉండే అభ్యర్థులకు నెలకు 1000/- చెప్పున ప్రభుత్వం సాయం అందిస్తుంది. దేనితో పాటుగా ఇతర స్కాలర్షిప్ అవకాశాలను ఉపయోగించుకోవచ్చు.
ఫోకెట్ అలోవెన్సు (ఐదు నెలలకు) | 15000/- |
దుస్తులు మరియు ఇతర వస్తువులకు | 21831/- |
ఆర్మీ గ్రూపు ఇన్సూరెన్స్ ఫండ్ | 7200/- |
జాయిన్ అయ్యే సమయంలో అవసరమయ్యే దుస్తులు కోసం | 8681/- |
మొదటి సెమిస్టర్ ఖర్చులు | 7138/- |
మొత్తం | 59850/- |
చెల్లించిన మొత్తంలో కొంత రిఫండ్ తిరిగి చెల్లిస్తారు. నెలకు 400/- చెప్పున 2000/- పాకెట్ అలోవెన్సు తిరిగి చెల్లిస్తారు. అలానే దుస్తులు మరియు ఇతర వస్తువులకు సంబంధించి 13935/- రిఫండ్ అందిస్తారు.
ట్రైనింగ్ పీరియడ్ మూడేళ్లు ఉంటుంది. ఆర్మీ. నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ సర్వీసెసుకు జాయిన్ అయినా అభ్యర్థులకు ఈ మూడేళ్లు అకాడమిక్ ట్రైనింగ్ తో పాటుగా ఫీజికల్ ట్రైనింగ్ కూడా అందిస్తారు.
మొదటి రెండున్నరేళ్లు అన్ని సర్వీసెస్ అభ్యర్థులకు ఒకటే విధమైన ట్రైనింగ్ అందిస్తారు. చివరి ఆరునెలలు ఆయా సర్వీసులు సంబంధించి ట్రైనింగ్ ఉంటుంది. అకాడమిక్ కోర్సులు విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులకు JNTU ఢీల్లీ నుండి డిగ్రీ పట్టాలు అందిస్తారు.
అలానే చివరి ఆరు నెలల క్యాడెట్ ట్రైనింగ్ సమయంలో ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ ఆఫీసర్ల ర్యాంకు అనుచరించి కనిష్టంగా 56,100/- నుండి గరిష్టంగా 2,56,000/- నెలవారీ స్టైపెండ్ అందిస్తారు. దీనితో పాటుగా ఇతర అనేక అలోవెన్సులు కలిపిస్తారు.
ఆర్మడ్ సర్వీసెస్ | అకాడమిక్ ట్రైనింగ్ |
---|---|
ఇండియన్ ఆర్మీ | B.Sc/ B.Sc (కంప్యూటర్) / B.A. |
ఇండియన్ నేవీ | బీటెక్ డిగ్రీ |
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ | బీటెక్ డిగ్రీ / B.Sc/B.Sc (కంప్యూటర్) |