Prone meaning in Telugu with example | తెలుగులో స్పోకెన్ ఇంగ్లీష్
Spoken English

Prone meaning in Telugu with example | తెలుగులో స్పోకెన్ ఇంగ్లీష్

A pronoun is a word that substitutes for a noun or noun phrase

బాషా భాగాలలో రెండవ భాగం Pronoun. Noun కు బదులుగా ఉపయోగించే పదాన్ని Pronoun అంటారు. ఒక వాక్యం లేదా సంభాషణలో, ఒక సారి noun ఉపయోగించకా, మరోమారు Noun ఉపయోగించకుండా దానికి బదులుగా Pronoun ఉపయోగించి ఆ సంభాషణ పూర్తిచేయొచ్చు.

ఉదాహరణకు ఒక వాక్యంలో రవి అనే Noun ను ఒకసారి పరిచయం చేసాకా, రవి తిన్నాడు, రవి పరిగెత్తాడు, రవి పాడాడు అని చెప్పేకంటే Ravi (Noun) బదులుగా He (pronoun) ఉపయోగించడం ద్వారా ఆ వాక్యాన్ని వినసొంపుగా పూర్తిచేయొచ్చు.

Nouns ఎన్ని వందలైన, వేలైనా ఉంటాయి. కానీ  Pronouns పరిమితం. ఎందుకంటె పుల్లింగము (Male) ఉండే పేర్ల అన్నింటికీ He (pronoun) ఉపయోగిస్తే సరిపోతుంది. స్త్రీలింగం (Female) ఉండే పేర్లు అన్నిటికి She (Pronoun) ఉపయోగిస్తే సరిపోతుంది. అలానే వస్తువుల పేర్లకు బదులుగా It (Pronoun) ఉపయోగిస్తే సరిపోతుంది. అందుకే Pronouns సంఖ్యా తక్కువగా ఉంటుంది.

ఆంగ్లభాషలో సర్వనామాలు ఎన్ని ఉన్నాయో చూద్దాం

First person Second person Third person
I
We
You He, She
It, This, That
They, These, Those

3rd person లో ఉండే This, That, They, These, Those పదాల విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. ఇవి ఎపుడు Pronouns గా వ్యవహరించావు. కొన్ని సందర్భాలలో వీటి రూపం మారుతూ ఉంటుంది.

ఉదాహరణకు కింది వాటిలో మొదటి వాక్యంలో This - Pronoun గా వ్యవహరించగా, రెండవ వాక్యంలో Adjective గా ఉంది. అలానే He, She లకు మినహాహిస్తే మిగిలిన వాటికీ జండర్ తేడా ఉండదు. వాటిని కామన్ జండరుగా పరిగణిస్తారు.

This (Pronoun) is a book | This (Adjective) book is good

ప్రతి Pronoun ఐదు రూపాలలో ఉంటుంది. సందర్భం బట్టి అవి వాటి పాత్రను పోషిస్తాయి. ఉదాహరణకు I (నేను) అనే Pronoun వివిధ సందర్భాలలో నన్ను, నాకు, నాయొక్క, నాది, నేనే అనే రూపాల్లోకి మారుతూ ఉంటుంది. Pronouns వేరు వేరు సందర్భాలలో ఎలా మారుతాయో ఒక టేబుల్ ద్వారా చూద్దాం.

First Person

Subject pronouns Object pronouns Possessive adjective Possessive Pronouns Reflexive pronoun
I
(నేను)
ME
(నన్ను, నాకు)
MY
(నా యొక్క)
MINE
(నాది)
MYSELF
(నేనే)
WE
(మేము, మనము)
US
(మమ్మల్ని, మనల్ని , మాకు, మనకు)
OUR
(మా, మన)
OURS
(మాది, మనది)
OURSELVES
(మేమే, మనమే)

Second Person

YOU
(నువ్వు)
YOU
(నిన్ను, నీకు)
YOUR
(నీ)
YOURS
(నీది)
YOURSELF
(నువ్వే)
YOU (Plural)
(మీరు)
YOU
(మిమ్మల్ని, మీకు)
YOUR
(మీ)
YOURS
(మీది)
YOURSELVES
(మీరే)

Third Person

HE
(అతడు)
HIM
(అతనిని, అతనికి)
HIS
(అతని)
HIS
(అతనిది)
HIMSELF
(అతనే)
SHE
(ఆమె)
HER
(ఆమెకి, ఆమెని)
HER
(ఆమె యొక్క)
HERS
(ఆమెది)
HERSELF
(ఆమె)
IT
(అది, ఇది)
IT
(దానిని, దానికి)
ITS
(దాని)
ITS
(దానిది)
ITSELF
(అదే)
THEY
(వారు, అవి)
THEM
(వారిని, వారికీ)
THIER
(వారి)
THIERS
(వారిది)
THEMSELVES
(వారే)
WHO
(ఎవరు)
WHOM
(ఎవరిని, ఎవరికి)
WHOSE
(ఎవరి)
WHOSE
(ఎవరిది)
-
WHAT
(ఏమిటి)
WHICH
(దేనిని, దేనికి)
- - -

ఈ టేబుల్ చూసి హైరానా పడాల్సిన అవసరం లేదు. అలానే టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ కోసం కూడా ఆలోచించొద్దు. మీరు చేయాల్సిందల్లా ప్రతి ప్రొనౌన్ యొక్క తెలుగులో ఏమంటారో తెలుసుకోండి.

మీకు తెలుగు భాషలో ఆయా పాదాలను ఎప్పుడెప్పుడు ఉపయోగించాలో తెలుసుకాబట్టి ..వీటిని కూడా ఎప్పుడు ఉపయోగించాలో మీకు సులువుగా అర్ధమౌతుంది. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ కోసం మనం ఇంతకముందు నేర్చుకున్నాం కాబట్టి, ఆయా పర్సన్స్ వచ్చే సమయాల్లో ఆయా వ్యక్తులను ఊహించుకుంటూ ప్రాక్టీస్ మొదలు పెట్టండి.

Post Comment