ఏపీ బీఆర్ఏజీ సెట్ 2023 : 5వ తరగతి మరియు ఇంటర్ ప్రవేశాలు
Andhra Pradesh

ఏపీ బీఆర్ఏజీ సెట్ 2023 : 5వ తరగతి మరియు ఇంటర్ ప్రవేశాలు

ఏపీ బీఆర్ఏజీ సెట్ 2023 నోటిఫికేషన్ వెలువడింది. ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో, క్లాస్ V మరియు జూనియర్ ఇంటర్ ప్రవేశాల కోసం ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. అర్హులైన విద్యార్థులు 24 మార్చి 2022 లోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోండి.

Advertisement

ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో సౌలభ్యలు

  • డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు పూర్తిస్థాయి రెసిడెన్సియల్ ఉచిత విద్యను ప్రభుత్వం అందిస్తుంది.
  • ప్రవేశం పొందే విద్యార్థులకు కోర్సు పూర్తియ్యే వరకు అన్ని సౌకర్యాలు కల్పిస్తారు.
  • విద్యార్థుల మానసిక ఉల్లాసం కోసం విద్యతో పాటుగా క్రీడలు, ఇతర నైపుణ్యాభివృది అంశాలలో భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడే తర్పీదు అందిస్తారు.
  • ఈ సంస్థల్లో అడ్మిషన్ల కోసం ఏటా ప్రవేశ పరీక్ష నిర్వహించి, అర్హుత పొందిన విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు.
  • అందుబాటులో ఉండే సీట్లలో 75 శాతం ఎస్సీ విద్యార్థులతో, 12 శాతం బీసీ సీ (కన్వెర్టడ్ క్రిస్టియన్), 06 శాతం సీట్లు ఎస్టీ విద్యార్థులతో, 5 శాతం సీట్లు బీసీ విద్యార్థులతో భర్తీ చేస్తారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంఘిక సంక్షేమా గురుకుల విద్యాలయాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల పేరుతో నిర్వహిస్తుంది. ఈ విద్యాలయాల్లో పాఠశాల విద్యతో పాటుగా, ఇంటర్మీడియట్ విద్యను కూడా అందిస్తుంది. వీటికి వేరువేరుగా ఏపీ బీఆర్ఏజీ ఫిప్త్ సెట్ మరియు ఏపీ బీఆర్ఏజీ ఇంటర్ సెట్ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తుంది.

కొన్ని ఇంటర్మీడియట్ కాలేజీలను ఐఐటీ మెడికల్ అకాడమీస్ పేరుతో ప్రత్యేకంగా నిర్వహిస్తున్నాయి. ఈ కాలేజీలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఇంటర్ మొదటి ఏడాది నుండే ఐఐటీ, నీట్ సిలబస్ ఆధారిత ఇంటర్మీడియట్ విద్యను అందిస్తారు.

ఏపీ బీఆర్ఏజీ ఫిప్త్ సెట్ : ఏపీలో మొత్తం 189 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మొత్తం 14,940 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 75 శాతం సీట్లు ఎస్సీ విద్యార్థులతో భర్తీ చేస్తారు.

ఏపీ బీఆర్ఏజీ ఇంటర్ సెట్ : ఏపీలో మొత్తం 164 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ మరియు ఎంఈసీ గ్రూపులకు సంబంధించి మొత్తం 13,320 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 75 శాతం సీట్లు ఎస్సీ విద్యార్థులతో భర్తీ చేస్తారు.

ఏపీ బీఆర్ఏజీ ఫిప్త్ సెట్ ఎలిజిబిలిటీ

  • విద్యార్థులు ఈ ఏడాది పబ్లిక్ పరీక్షలలో క్లాస్ IV పూర్తిచేసి ఉండాలి.
  • విద్యార్థి కుటుంబ ఆదాయం ఏడాదికి లక్ష రూపాలకు మించకూడదు.
  • విద్యార్థులు తమ జిల్లా పరిధిలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • సీట్లు పొందిన విద్యార్థులు అడ్మిషన్ సమయంలో సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాల్సి ఉంటుంది.
  • మెజారిటీ సీట్లు ఎస్సీ విద్యార్థులకు కేటాయిస్తారు.

ఏపీ బీఆర్ఏజీ ఇంటర్ సెట్ ఎలిజిబిలిటీ

  • విద్యార్థులు ప్రస్తుత విద్యా ఏడాదిలో 10వ తరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలి.
  • విద్యార్థి కుటుంబ ఆదాయం ఏడాదికి లక్ష రూపాలకు మించకూడదు.
  • తెలుగు మరియు ఇంగ్లీష్  మీడియంలో పది చదువుకున్న విద్యార్థులు మాత్రమే పరీక్ష రాసేందుకు అర్హులు.
  • విద్యార్థి వయస్సు 17 ఏళ్ళు మించకూడదు.
  • సీటు సాధించిన విద్యార్థులు అడ్మిషన్ సమయంలో సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాల్సి ఉంటుంది.
  • మెజారిటీ సీట్లు ఎస్సీ విద్యార్థులకు కేటాయిస్తారు.

ఏపీ బీఆర్ఏజీ ఫిప్త్ సెట్ ఎగ్జామ్ షెడ్యూల్

దరఖాస్తు ప్రారంభ తేదీ 25 ఫిబ్రవరి 2023
దరఖాస్తు తుది గడువు 24 మార్చి 2023
పరీక్ష తేదీ 23 ఏప్రిల్ 2023 (ఉదయం 10 నుండి 12)

ఏపీ బీఆర్ఏజీ ఇంటర్ సెట్ షెడ్యూల్

దరఖాస్తు ప్రారంభ తేదీ 25 ఫిబ్రవరి 2023
దరఖాస్తు తుది గడువు 24 మార్చి 2023
పరీక్ష తేదీ 23 ఏప్రిల్ 2023 (ఉదయం 10 నుండి 12)

ఏపీ బీఆర్ఏజీ సెట్ దరఖాస్తు విధానం

దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. అర్హుత కలిగిన విద్యార్థులు https://apgpcet.apcfss.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థులు దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్ ద్వారా లేదా తల్లిదండ్రులు, ఉపాధ్యాయల సహాయంతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు విద్యార్థి వ్యక్తిగత, విద్యా, చిరునామా వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది.

రెండవ దశలో విద్యార్థి జాయిన్ అవ్వదల్చుకునే పాఠశాల వివరాలను పొందు పర్చాల్సి ఉంటుంది. చివరిగా వైట్ బ్యాక్ గ్రౌండ్ తో ఈమధ్య కాలంలో తీసుకున్న పాసుపోర్టు సైజు ఫోటో అప్లోడ్ చేయడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది. విద్యార్థి ఎటువంటి దరఖాస్తు రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఏపీ బీఆర్ఏజీ ఫిప్త్ సెట్ ఎగ్జామ్ నమూనా

ప్రవేశ పరీక్ష ఓఎంఆర్ షీట్ ఆధారంగా ఆఫ్‌లైన్ యందు నిర్వహిస్తుంది. పరీక్ష రెండు గంటల నిడివితో 50 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ప్రశ్నలు 4వ తరగతి స్థాయి సిలబస్ ఆధారితంగా తెలుగు, ఇంగ్లీష్, గణితం మరియు ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ అంశాల నుండి ఇవ్వబడతాయి.

ప్రశ్నపత్రం ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో అందుబాటులో ఉంటుంది. ప్రవేశాలు అర్హుత పరీక్షలో పొందిన మెరిట్ మరియు వివిధ కుల, లోకల్ రిజర్వేషన్ సమీకరణాల ఆధారంగా నిర్వహిస్తారు.

సిలబస్ ప్రశ్నలు మార్కులు
తెలుగు 10 ప్రశ్నలు 10 మార్కులు
ఇంగ్లీష్ 10 ప్రశ్నలు 10 మార్కులు
మ్యాథమెటిక్స్ 15 ప్రశ్నలు 15 మార్కులు
ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ 15 ప్రశ్నలు 15 మార్కులు
మొత్తం  50 ప్రశ్నలు 50 మార్కులు 

ఏపీ బీఆర్ఏజీ ఇంటర్ సెట్ ఎగ్జామ్ నమూనా

ప్రవేశ పరీక్ష ఓఎంఆర్ షీట్ ఆధారంగా ఆఫ్‌లైన్ యందు నిర్వహిస్తుంది. పరీక్ష రెండు గంటల నిడివితో 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ప్రశ్నలు పదివ తరగతి స్థాయి సిలబస్ ఆధారిత గణితం, సోషల్, బయోలాజికల్ సైన్స్, ఫీజికల్ సైన్స్, ఇంగ్లీష్ గ్రామర్ మరియు లాజికల్ రీజనింగ్ అంశాల నుండి ఇవ్వబడతాయి.

ప్రశ్నపత్రం ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో అందుబాటులో ఉంటుంది. ప్రవేశాలు అర్హుత పరీక్షలో పొందిన మెరిట్ మరియు వివిధ కుల, లోకల్ రిజర్వేషన్ సమీకరణాల ఆధారంగా నిర్వహిస్తారు.

సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు
గణితం  25 ప్రశ్నలు 25 మార్కులు
ఫీజికల్ సైన్స్  15 ప్రశ్నలు 15 మార్కులు
బయోలాజికల్ సైన్స్  15 ప్రశ్నలు 15 మార్కులు
సోషల్ స్టడీస్ 15 ప్రశ్నలు 15 మార్కులు
ఇంగ్లీష్ గ్రామర్ & కంప్రహెన్షన్ 15 ప్రశ్నలు 15 మార్కులు
లాజికల్ రీజనింగ్ 15 ప్రశ్నలు 15 మార్కులు
మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులు

Advertisement

Post Comment