Advertisement
ఆంధ్ర యూనివర్సిటీలో ఫార్మసీ కోర్సులు : బీఫార్మసీ, ఎంఫార్మసీ
Universities

ఆంధ్ర యూనివర్సిటీలో ఫార్మసీ కోర్సులు : బీఫార్మసీ, ఎంఫార్మసీ

ఆంధ్ర యూనివర్సిటీ పదుల సంఖ్యలో ఫార్మసీ కోర్సులు ఆఫర్ చేస్తుంది. బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ, మాస్టర్ ఆఫ్ ఫార్మసీ పేరుతో అందిస్తున్న ఈ కోర్సులు ఆంధ్ర యూనివెర్సిటీతో పాటుగా దాని అనుబంధ డిగ్రీ కాలేజీల్లో అందుబాటులో ఉంటాయి. ఈ కోర్సులకు సంబంధించి అడ్మిషన్ ప్రక్రియ ఏపీ ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా నిర్వహిస్తారు.

ఏయూ బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ కోర్సులు నాలుగేళ్ళ నిడివితో ఆఫర్ చేస్తున్నారు. ఈ నాలుగేళ్లలో అభ్యర్థులు ఆరు సెమిస్టరు పరీక్షలకు హాజరవ్వాల్సి ఉంటుంది. ఒక సెమిస్టరు యందు పాస్ కాని అభ్యర్థులు, వచ్చే ఏడాది అదే సెమిస్టరు పరీక్షకు హాజరుకావడం ద్వారా ఉత్తీర్ణత పొందాల్సి ఉంటుంది. కోర్సులు సంబంధించి సీట్ల వివరాలు మరియు ట్యూషన్ ఫీజుల వివరాలు అడ్మిషన్ సమయంలో అందుబాటులో ఉంచుతారు.

ఆంధ్ర యూనివర్సిటీలో ఫార్మసీ కోర్సులు

ఫార్మసీ కోర్సు సీట్ల సంఖ్యా
B. Pharm. సీట్లు 40
Pharm. D సీట్లు 30
Pharm. D (P.B.) సీట్లు 10
M. Pharm. (Pharmaceutical Technology) సీట్లు 10
M. Pharm. (Pharmaceutical Bio-technology) సీట్లు 10
M. Pharm. (Pharmaceutical Chemistry) సీట్లు 10
M. Pharm. (Pharmaceutical and Food Analysis) సీట్లు 10
M. Pharm. (Pharmacology) సీట్లు 10
M. Pharm. (Pharmacy Practice) -సీట్లు 18
M. Pharm. (Pharmacognosy) సీట్లు 10
M. Pharm. (Pharmaceutical Analysis and Drug Regulatory Affairs) సీట్లు 18
Ph.D. in all Subjects of Pharmaceutical Sciences (Full-Time/ Part-Time/ Extramural) సీట్లు 30

Post Comment