June 2023 Current Affairs Questions In Telugu
Current Affairs Bits 2023

June 2023 Current Affairs Questions In Telugu

జూన్ 2023 కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ ప్రశ్నలు మరియు సమాధానాలను సాధన చేయండి. జూన్ 2023 నెలలో చోటుచేసుకున్న సమకాలిన అంశాలకు సంబంధించి 30 ప్రాక్టీస్ ప్రశ్నలు మరియు జవాబులను మీ కోసం అందిస్తున్నాం. వివిధ పోటీ పరీక్షలకు సిద్దమౌతున్న అభ్యర్థులు తమ కరెంట్ అఫైర్ సన్నద్ధతను అంచనా వేసేందుకు ఇవి ఉపయోగపడతాయి.

Advertisement

1. కింది వాటిలో అటల్ భుజల్ యోజన అమలు అవుతున్న రాష్ట్రాలు ఏవి ?

  1. తమిళనాడు & కర్ణాటక
  2. మహారాష్ట్ర & గోవా
  3. ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ
  4.  గుజరాత్ & హర్యానా
సమాధానం
4.  గుజరాత్ & హర్యానా

2. ఇ-డీజిల్ సంబంధించి కింది వాటిలో సరైన సమాధానం గుర్తించండి ?

  1. ఇథనాల్‌ కలిపిన డీజిల్‌ను ఇ-డీజిల్ అంటారు
  2. ఇ-డీజిల్ యందు ఇథనాల్ 10% -15% కలపబడుతుంది.
  3. ఎమల్సిఫైయర్ అనే సాంకేతికత ఆధారంగా ఇ-డీజిల్ తయారు చేస్తారు
  4. పైవి అన్ని సరైనవి
సమాధానం
4. పైవి అన్ని సరైనవి

3. కొంకణి సాహిత్యానికి ఇటీవలే జ్ఞానపీఠ్ అవార్డు అవార్డు అందుకున్న రచయత ఎవరు ?

  1. అమితవ్ ఘోష్
  2. దామోదర్ మౌజో
  3. రఘువీర్ చౌదరి
  4. భాలచంద్ర నెమాడే
సమాధానం
2. దామోదర్ మౌజో

4. దేశంలో జెండర్ ఇన్‌క్లూజివ్ టూరిజం పాలసీని అమలు చేస్తున్న రాష్ట్రం ఏది ?

  1. గుజరాత్
  2. బెంగుళూరు
  3. మహారాష్ట్ర
  4. ఒడిశా
సమాధానం
3. మహారాష్ట్ర 

5. వందే భారత్ రైళ్ల తయారీ కాంట్రాక్టు దక్కించుకున్న విదేశీ సంస్థ ఏది ?

  1. ఆల్‌స్టామ్‌
  2. బాంబార్డియర్
  3. సీమెన్స్
  4. స్టాడ్లర్ రైల్
సమాధానం
1. ఆల్‌స్టామ్‌

6. కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి ?

  1. ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది
  2. ప్రపంచ వాతావరణ సంస్థ 1940లో స్థాపించారు
  3. ప్రపంచ వాతావరణ సంస్థ యొక్క మొదటి మహిళా అధిపతిగా సెలెస్టే సౌలో
  4. పైవి అన్ని సరైనవి
సమాధానం
3. ప్రపంచ వాతావరణ సంస్థ యొక్క మొదటి మహిళా అధిపతిగా సెలెస్టే సౌలో  

7. ప్రధానమంత్రి స్వనిధి పథకం దేనికి సంబంధించినది  ?

  1. మహిళల స్వయం ఉపాధి కోసం లోన్లు అందిస్తుంది
  2. వీధి వ్యాపారులకు రుణ సాయం అందిస్తుంది
  3. 15 ఏళ్లలోపు బాలికలకు స్కాలర్షిప్ అందిస్తుంది
  4. రైతులకు వ్యవసాయ బీమా కల్పిస్తుంది
సమాధానం
2. వీధి వ్యాపారులకు రుణ సాయం అందిస్తుంది

8. ఎన్ఎబీహెచ్ గుర్తింపు పొందిన దేశంలోని తోలి ఎయిమ్స్ ఏది ?

  1. ఎయిమ్స్ నాగ్‌పూర్‌
  2. ఎయిమ్స్ ఢిల్లీ
  3. ఎయిమ్స్ భువనేశ్వర్
  4. ఎయిమ్స్ రిషికేశ్
సమాధానం
1. ఎయిమ్స్ నాగ్‌పూర్‌  

9. రిపబ్లిక్ ఆఫ్ సురినామ్ ఏ ఖండంలో ఉంది ?

  1. యూరోప్
  2. ఆసియా
  3. ఆఫ్రికా
  4. దక్షిణ అమెరికా
సమాధానం
4. దక్షిణ అమెరికా 

10. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నూతన డీజీ ఎవరు ?

  1. అమిత్ యాదవ్
  2. జనార్దన్ ప్రసాద్
  3. అరుణ్‌ కుమార్‌
  4. నితిన్ అగర్వాల్
సమాధానం
2. జనార్దన్ ప్రసాద్

11. తెలంగాణ దశబ్ద ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలు ఎన్ని రోజులు నిర్వహించారు ?

  1. ఒక రోజు
  2. 10 రోజులు
  3. 21 రోజులు
  4. 29 రోజులు
సమాధానం
3. 21 రోజులు

12. ఫుకోట్ కర్నాలీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏ దేశంలో నిర్మిస్తున్నారు ?

  1. బంగ్లాదేశ్
  2. నేపాల్
  3. ఇండియా
  4. భూటాన్
సమాధానం
2. నేపాల్

13. గోబర్ధన్ యూనిఫైడ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ దేనికి సంబంధించింది ?

  1. సోలార్ ఎనర్జీ ప్రాజెక్టుల నమోదు
  2. సీఎన్‌జి ప్రాజెక్టుల నమోదు
  3. ఇ-డీజిల్ ప్రాజెక్టుల నమోదు
  4. బయోగ్యాస్ ప్రాజెక్టుల నమోదు
సమాధానం
4. బయోగ్యాస్ ప్రాజెక్టుల నమోదు  

14. భారతదేశం యొక్క లావెండర్ రాజధాని ఏది ?

  1. లెహ్రోట్
  2. టిప్రి
  3. భదర్వా
  4. మున్నార్ వ్యాలీ
సమాధానం
3. భదర్వా

15. దేశంలో సొంత ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్‌ని ఏర్పాటు చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ?

  1. ఆంధ్రప్రదేశ్
  2. ఒడిశా
  3. కేరళ
  4. తమిళనాడు
సమాధానం
3. కేరళ

16. అమృత్ ధరోహర్ యోజన దేనికి సంబంధించింది ?

  1. పులుల సంరక్షణ కేంద్రాల పరిరక్షణ
  2. దేశంలో నీటి వనరుల సంరక్షణ
  3. అభయారణ్యాల పరిరక్షణ
  4. రామ్‌సర్ సైట్‌ల పరిరక్షణ
సమాధానం
4. రామ్‌సర్ సైట్‌ల పరిరక్షణ

17. దేశంలో తొలి అంతర్జాతీయ క్రూయిజ్ వెసెల్ ఏ రెండు దేశాల మధ్య సేవలు అందిస్తుంది ?

  1. ఇండియా - మయన్మార్
  2. ఇండియా - బంగ్లాదేశ్
  3. ఇండియా - మాల్దీవులు
  4. ఇండియా - శ్రీలంక
సమాధానం
4. ఇండియా - శ్రీలంక

18. కిసాన్ సంపర్క్ అభియాన్ ఈ రాష్ట్రం/యూటీలో అమలులో ఉంది ?

  1. గుజరాత్
  2. జమ్మూ & కాశ్మీర్
  3. పుదుచ్చేరి
  4. పంజాబ్
సమాధానం
2. జమ్మూ & కాశ్మీర్ 

19. తొలి ఎఐ ప్రపంచ శిఖరాగ్ర సదస్సుకు ఏ దేశం ఆతిధ్యం ఇస్తుంది ?

  1. జపాన్
  2. యునైటెడ్ స్టేట్స్
  3. యునైటెడ్ కింగ్‌డమ్
  4. ఇండియా
సమాధానం
3. యునైటెడ్ కింగ్‌డమ్

20. డిజిటల్ ప్రభుత్వ బాండ్‌ను విడుదల చేసిన మొదటి దేశం ఏది ?

  1. ఇజ్రాయిల్
  2. ఈజిప్టు
  3. రష్యా
  4. ఇండోనేషియా
సమాధానం
1. ఇజ్రాయిల్

21. బోల్గట్టి ఐలాండ్ ఏ రాష్ట్రంలో ఉంది ?

  1. ఒడిశా
  2. పశ్చిమ బెంగాల్
  3. కేరళ
  4. గోవా
సమాధానం
3. కేరళ

22. ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌కు ఆతిధ్యం ఇచ్చిన దేశం ?

  1. ఆస్ట్రేలియా
  2. ఇంగ్లాండ్
  3. ఇండియా
  4. న్యూజీలాండ్
సమాధానం
2. ఇంగ్లాండ్

23. ఐవీఆర్-ఆధారిత యూపీఐ 123పే-ని విడుదల చేసిన ప్రభుత్వ బ్యాంకు ఏది ?

  1. పంజాబ్ నేషనల్ బ్యాంక్
  2. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా
  3. కెనరా బ్యాంక్
  4. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సమాధానం
1. పంజాబ్ నేషనల్ బ్యాంక్

24. స్క్వాష్ ప్రపంచ కప్‌ 2023 కు ఆతిధ్యం ఇచ్చిన భారతీయ నగరం ఏది ?

  1. న్యూఢిల్లీ
  2. చెన్నై
  3. హైదరాబాద్
  4. బెంగుళూరు
సమాధానం
2.చెన్నై

25. తొలి మహిళల కబడ్డీ లీగ్‌ విజేత ?

  1. బెంగళూరు హాక్స్
  2. ఢిల్లీ డైనమైట్స్
  3. ఉమా కోల్‌కతా
  4. పంజాబ్ పాంథర్స్
సమాధానం
3. ఉమా కోల్‌కతా  

26. జాతీయ నీటి అవార్డులకు సంబంధించి సరైన సమాధానం ?

  1. ఉత్తమ జిల్లా అవార్డు : ఒడిశాలోని గంజాం జిల్లా
  2. ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు : తెలంగాణలోని జగన్నాధపురం గ్రామ పంచాయతీ
  3. ఉత్తమ రాష్ట్ర అవార్డు : మధ్యప్రదేశ్‌
  4. పైవి అన్ని సరైనవి
సమాధానం
4. పైవి అన్ని సరైనవి

27. 2021 గాంధీ శాంతి బహుమతి విజేత ?

  1. రామకృష్ణ మిషన్
  2. ఇస్రో
  3. గీతా ప్రెస్‌
  4. అక్షయ పాత్ర
సమాధానం
3. గీతా ప్రెస్‌  

28. ప్రపంచంలో అత్యంత వేగంగా వేడెక్కుతున్న ఖండం ?

  1. ఆఫ్రికా
  2. యూరోప్
  3. ఆసియా
  4. ఆస్ట్రేలియా
సమాధానం
2. యూరోప్

29. దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?

  1. ఉత్తరప్రదేశ్
  2. తమిళనాడు
  3. తెలంగాణ
  4. గుజరాత్
సమాధానం
3. తెలంగాణ 

30. జగనన్న సురక్ష కార్యక్రమం దేనికి సంబంధించింది ?

  1. ఇంటివద్ద వైద్య సేవలు
  2. ఇంటి వద్దకు ప్రభుత్వ సేవలు
  3. వివిధ ప్రభుత్వ సర్టిఫికెట్లు జారీ
  4. బాలింతలకు ప్రౌష్టికాహారం
సమాధానం
3. వివిధ ప్రభుత్వ సర్టిఫికెట్లు జారీ

Advertisement

Post Comment