సైన్స్ & టెక్నాలజీ అఫైర్స్ | ఫిబ్రవరి 2022
Telugu Current Affairs

సైన్స్ & టెక్నాలజీ అఫైర్స్ | ఫిబ్రవరి 2022

ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో సుజుకీ ఇన్నోవేషన్ సెంటర్‌ ఏర్పాటు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (IITH) మరియు సుజుకి మోటార్ కార్పొరేషన్ ఉమ్మడి భాస్వామ్యంలో క్యాంపస్ యందు సుజుకి ఇన్నోవేషన్ సెంటర్‌ను ప్రారంభించేందుకు మూడు సంవత్సరాల ఒప్పందంపై సంతకం చేశాయి. భారతదేశం-జపాన్ బంధాన్ని బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించేందుకు ఐఐటీ హైదరాబాద్'కి SIC మరో మైలురాయిగా నిలువనుంది. ఈ చొరవలో భాగంగా, టెక్నాలజీ రీసెర్చ్ పార్క్‌లోని కేంద్రానికి అవసరమైన సహాయాన్ని ఐఐటీ హైదరాబాద్ అందివ్వనుందని  పేర్కొంది.

Advertisement

నెదర్లాండ్స్‌లో కొత్త హెచ్‌ఐవి వేరియంట్ గుర్తింపు

ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు నెదర్లాండ్స్‌లో కొత్త హెచ్‌ఐవి వేరియంట్‌ను గుర్తించినట్లు వెల్లడించారు. ఈ కొత్త "VB వేరియంట్" సోకిన రోగులు వారి రోగనిరోధక వ్యవస్థలో వేగవంతమైన క్షీణతతో పాటు, ప్రత్యామ్నాయ వైవిధ్యాలతో సోకిన వారి కంటే, వారి రక్తంలో 3.5 నుండి 5.5 రెట్లు అధిక వైరల్ స్థాయిలను కలిగి ఉన్నాట్లు వెల్లడించారు. ఆక్స్‌ఫర్డ్ ఎపిడెమియాలజిస్ట్ క్రిస్ వైమాంట్ ప్రకారం 1980ల చివరలో మరియు 1990ల ప్రారంభంలో నెదర్లాండ్స్‌లో ఈ వేరియంట్ ఉద్భవించిందని పరిశోధకులు విశ్వసిస్తున్నారు, అయితే 2010 నాటికి క్షీణించడం ప్రారంభించింది.

రామ్‌సర్ చిత్తడినేలల జాబితాలో ఖిజాడియా & బఖిరా అభయారణ్యలు

గుజరాత్‌లోని జామ్‌నగర్ సమీపంలోని ఖిజాడియా పక్షుల అభయారణ్యం మరియు ఉత్తరప్రదేశ్‌లోని బఖిరా వన్యప్రాణుల అభయారణ్యం అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలలుగా రామ్‌సర్ గుర్తింపునిచ్చింది. అంతర్జాతీయ చిత్తడి నేలల దినోత్సవం (ఫిబ్రవరి 2) సందర్భంగా ఇరాన్‌లోని రామ్‌సర్ సెక్రటేరియట్ ఈ ప్రకటన చేసింది. దీంతో భారతదేశంలోని మొత్తం రామ్‌సర్ సైట్‌ల సంఖ్య 48కి చేరుకుంది.

ఖిజాడియా వన్యప్రాణుల అభయారణ్యం (రామ్‌సర్ సైట్ నం. 2464), గల్ఫ్ ఆఫ్ కచ్ తీరానికి సమీపంలో ఉన్న మంచినీటి చిత్తడి నేల, వ్యవసాయ భూములను రక్షించడానికి 1920లో అప్పటి రాచరిక రాష్ట్రమైన నవనగర్ పాలకుడు ఒక కట్ట (డైక్)ను రూపొందించడం ద్వారా ఇది ఏర్పడింది. ఈ అభయారణ్యం ఇప్పుడు మెరైన్ నేషనల్ పార్క్, జామ్‌నగర్‌లో భాగంగా ఉంది, ఇది దేశంలోనే మొదటి మెరైన్ నేషనల్ పార్క్.

బఖిరా వన్యప్రాణుల అభయారణ్యం (సైట్ నెం. 2465), సంత్ కబీర్ నగర్ జిల్లాలో మంచినీటి చిత్తడి నేల, ఇది తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని అతిపెద్ద సహజ వరద మైదానపు చిత్తడి నేల. ఈ అభయారణ్యం 1980లో స్థాపించబడింది. ఇది వన్యప్రాణుల రక్షణ చట్టం (1972) కింద "ఎకో-సెన్సిటివ్ జోన్" గా రక్షించబడింది.

ఆరావళి బయోడైవర్సిటీ పార్కుకు OECM గుర్తింపు

హర్యానాలోని గురుగ్రామ్‌లోని ఆరావళి బయోడైవర్సిటీ పార్క్ భారతదేశపు మొట్టమొదటి “ అదర్ ఎఫెక్టివ్ ఏరియా-బేస్డ్ కన్సర్వేషన్ మెజర్స్” (OECM) సైట్‌గా ప్రకటించబడింది. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ గుర్తింపు పొందిన మొట్టమొదటి భారత్  సైట్ ఇదే. ఒకప్పుడు పాడుబడిన మైనింగ్ పిట్‌గా ఉన్న ఈ ఉద్యానవనం, గత 10 సంవత్సరాలలో పచ్చని అటవీ ప్రాంతంగా రూపాంతరం చెందింది. అడవులు వంటి రక్షిత ప్రాంతాల వెలుపల జీవవైవిధ్యం యొక్క ప్రభావవంతమైన ఇన్-సిటు పరిరక్షణను సాధించిన ప్రదేశానికి OECM హోదా కపిస్తారు. దీనిని ఇంటర్నేషనల్ యూనియన్ కన్సర్వేషన్  ఆఫ్ నేచర్ (IUCN) అందిస్తుంది.

కోవిడ్-19 డిఎన్‌ఎ వాక్సిన్ అందించిన మొదటి దేశంగా భారత్

కోవిడ్ 19 కి వ్యతిరేకంగా డిఎన్‌ఎ వ్యాక్సిన్‌ను అందించిన ప్రపంచంలోనే మొదటి దేశంగా భారతదేశం అవతరించింది. ప్రపంచంలోని మొట్టమొదటి ప్లాస్మిడ్ డిఎన్‌ఎ వ్యాక్సిన్, ఫిబ్రవరి 2022 లో అహ్మదాబాద్‌కు చెందిన వ్యాక్సిన్ తయారీదారు జైడస్ కాడిలాచే ఉత్పత్తి చేయబడింది. దీనిని 12 నుండి 17 ఏళ్ళ లోపు పిల్లలకు అత్యవసర ఉపయోగంగా వాడేందుకు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది.

Advertisement

Post Comment