తెలంగాణ స్టాఫ్ నర్స్ 2023 రిక్రూట్మెంట్ – మొత్తం పోస్టులు 5,204
Latest Jobs TSPSC

తెలంగాణ స్టాఫ్ నర్స్ 2023 రిక్రూట్మెంట్ – మొత్తం పోస్టులు 5,204

తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB), వివిధ మెడికల్ విభాగాల వారీగా స్టాఫ్ నర్సుల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. తాజా నియామక ప్రక్రియ ద్వారా 5,204 ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు వెల్లడించింది. వీటిలో అత్యధికంగా దాదాపు 3,823 పోస్టులు డీఎంఈ/డీపీహెచ్ విభాగంలో భర్తీ కానున్నాయి.

ఈ నోటిఫికేషన్ సంబంధించి దరఖాస్తులను జనవరి 25 నుండి ఫిబ్రవరి 15వ తేదీ మధ్య స్వీకరించనున్నారు. ఈ మొత్తం ఖాళీలను రాష్ట్ర వ్యాప్తంగా ఏడు జోన్లుగా విభజించి భర్తీ చేయనున్నారు. ఒక జోన్ పరిధిలో ఉండే ఖాళీలను ఆ జోన్ సంబంధించి అభ్యర్థులతో భర్తీ చేస్తారు. ఎంపిక రాతపరీక్షలో పొందిన మెరిట్ ఆధారంగా ఉంటుంది.

తెలంగాణ స్టాఫ్ నర్సు రిక్రూట్మెంట్ ఖాళీలు

ఖాళీ పోస్టులను కమ్యూనిటీ వారీగా, వివిధ కోటాల వారీగా మరియు మల్టీ జోనల్ వారీగా భర్తీ చేస్తారు.

డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ / డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ & ఫామిలీ వెల్ఫేర్ (DME/DPH & HW) 3,823 పోస్టులు
తెలంగాణ వైద్యవిధాన పరిషత్ 757 ఖాళీలు
ఎంఎన్జి ఇనిస్టిట్యూట్ ఆఫ్ అంకాలిజి & రీజనల్ కాన్సర్ సెంటర్ 81 ఖాళీలు
డిపార్టుమెంట్ ఆఫ్ డిజేబుల్డ్ & సీనియర్ సిటిజెన్ వెల్ఫేర్ 8 ఖాళీలు
తెలంగాణ మైనారిటీ రెసిడెన్సియల్ ఎడ్యుకేషన్ సొసైటీ 127 ఖాళీలు
తెలంగాణ బీసీ రెసిడెన్సియల్ ఎడ్యుకేషన్ సొసైటీ 197 ఖాళీలు
ట్రైబల్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషన్ సొసైటీ 74 ఖాళీలు
ఎస్సీ రెసిడెన్సియల్ ఎడ్యుకేషన్ సొసైటీ 124 ఖాళీలు
జనరల్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషన్ సొసైటీ 13 ఖాళీలు

తెలంగాణ స్టాఫ్ నర్సు పోస్టుల ఎలిజిబిలిటీ

  • అభ్యర్థులు జనరల్ నర్సింగ్ & మిడ్‌వైఫరీ (జీఎన్ఎం) లేదా బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి.
  • సంబంధిత సర్టిఫికెట్లు తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ యందు రిజిస్టర్ అయ్యి ఉండాలి.
  • అభ్యర్థుల వయస్సు 18 నుండి 44ఏళ్ళ మధ్య ఉండాలి. కమ్యూనిటీ కోటా పరిధిలో వయోపరిమితి సడలింపు ఉంటుంది.

తెలంగాణ స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ 2022 షెడ్యూల్

దరఖాస్తు ప్రారంభం 25 జనవరి 2023
దరఖాస్తు తుది గడువు 15 ఫిబ్రవరి 2023
హాల్ టికెట్ మార్చి/ఏప్రిల్ 2023
ఎగ్జామ్ తేదీ మార్చి/ఏప్రిల్ 2023
ఫలితాలు మే/జూన్ 2023

తెలంగాణ స్టాఫ్ నర్స్ దరఖాస్తు ఫీజు

దరఖాస్తు రుసుము డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ విధానంలో అందుబాటులో ఉంటుంది. పరీక్ష రుసుము చెల్లించిన దరఖాస్తులు మాత్రమే పరిగణంలోకి తీసుకోబడతాయి.

ఫీజు జనరల్ అభ్యర్థులు నిరుద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ & ఇతరులు
అప్లికేషన్ ఫీజు 500/- 500/-
ఎగ్జామ్ ఫీజు 120/- మినహాయింపు

తెలంగాణ స్టాఫ్ నర్సు రిక్రూట్మెంట్ దరఖాస్తు విధానం

స్టాఫ్ నర్సు పోస్టులకు సంబంధించి దరఖాస్తులు తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తులో అభ్యర్థి వ్యక్తిగత, విద్యా, చిరునామా వివరాలు పొందుపర్చాల్సి. వీటికి సంబంధించిన ధ్రువపత్రాల యొక్క జిరాక్స్ కాపీలను దరఖాస్తుతో పాటు జత చేయాల్సి ఉంటుంది.

రెండవ దశలో అందుబాటులో ఉన్న పేమెంట్ విధానంలో దరఖాస్తు రుసుము చెల్లించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది. దరఖాస్తు విజయవంతంగా సమర్పించాక, మీకు దరఖాస్తుకు సంబంధించి ఒక రిఫరెన్స్ ఐడీ జెనెరేట్ అవుతుంది. ఈ రిఫరెన్స్ ఐడీని అభ్యర్థులు భద్రపర్చుకోవాలి. మీ దరఖాస్తు తదుపరి సమాచారం పొందేందుకు ఈ ఐడీ ఉపాయోగపడుతుంది.

దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఎడ్యుకేషన్ మరియు ఇతర సంబంధిత సర్టిఫికెట్లు అందుబాటులో ఉంచుకోవాలి. దరఖాస్తులో పొందుపర్చిన వ్యక్తిగత, విద్యా, చిరునామా వివరాలు పలుమార్లు సరిచూసుకోండి. అదే సమయంలో  దరఖాస్తు చేస్తున్న పోస్టు మరియు ఎగ్జామ్ సెంటర్ వివరాలు అందించాల్సి ఉంటుంది. చివరిగా దరఖాస్తు రుసుము చెల్లించడం ద్వారా ఈ ప్రక్రియ పూర్తివుతుంది.

తెలంగాణ స్టాఫ్ నర్స్ ఎగ్జామ్ సెంటర్లు

  • హైదరాబాద్
  • కరీంనగర్
  • ఖమ్మం
  • నిజామాబాద్

తెలంగాణ స్టాఫ్ నర్స్ ఎగ్జామ్ నమూనా

స్టాఫ్ నర్సు పోస్టులకు సంబంధించి రాతపరీక్ష ఆఫ్‌లైన్ విధానంలో  నిర్వహిస్తారు. పరీక్ష పూర్తి ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ప్రశ్న పత్రం ఇంగ్లీష్ భాషలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

పేపర్ పేరు సబ్జెక్టు / సిలబస్ ప్రశ్నలు & మార్కులు సమయం
నర్సింగ్ ఎగ్జామ్ బీఎస్సీ నర్సింగ్ సిలబస్ 80 ప్రశ్నలు (80 మార్కులు) 2.30 గంటలు

తెలంగాణ స్టాఫ్ నర్స్ నియామక ప్రక్రియ

స్టాఫ్ నర్సు పోస్టుల నియామక ప్రక్రియ రాతపరీక్ష మెరిట్ ఆధారితంగా ఉంటుంది. నియామక ప్రక్రియకు సంబంధించి మొత్తం 100 పాయింట్లకు గాను 80 పాయింట్లు రాతపరీక్షకు మిగతా 20 పాయింట్లు వృత్తి అనుభవంకు గాను కేటాయించారు. ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రభుత్వ హెల్త్ క్యాంపుల యందు పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ & కాంట్రాక్టు నర్సింగ్ సిబ్బందికి 20 పాయింట్స్ వెయిటేజీ కల్పిస్తారు.

గిరిజన ప్రాంతాల్లో 6 నెలలకు పైగా నర్సింగ్ సేవలు అందించిన వారికీ 2.5 పాయింట్స్ వెయిటేజీ, ఇతర ప్రాంతాలలో పనిచేసిన వారికీ 2 పాయింట్స్ వెయిటేజీ అందిస్తారు. వీటికి సంబంధించి అభ్యర్థులు డాక్యుమెంట్ ప్రూఫ్ కలిగి ఉండాలి. ఈ విధంగా టాప్ మెరిట్ సాధించిన అభ్యర్థుల షార్ట్ లిస్ట్ రూపొందించి వివిధ జోన్ల వారీగా, కమ్యూనిటీ రిజెర్వేషన్ల వారీగా తుది నియామక ప్రక్రియ పూర్తి చేస్తారు.

Post Comment