D సోర్స్ అనేది డిజైన్ కోర్సులకు సంబంధించిన డిజిటల్ లెర్నింగ్ వేదిక. దీన్ని ఇ -కల్ప అని కూడా పిలుస్తారు. జాతీయ విద్య మిషన్ లో భాగంగా ఈ ప్రాజెక్టును భారత ప్రభుత్వ మానవ వనరుల మంత్రిత్వ శాఖ స్పాన్సర్ చేస్తుంది. ఇది ప్రధానంగా డిజైన్ అంశాలకి సంబంధించి డిజిటల్ డేటాబేస్ ఏర్పాటుచేయడంతో పాటుగా ఆసక్తి ఉండే అభ్యర్థులు డిస్టెన్స్ పద్దతి ద్వారా డిజైనింగ్ నైపుణ్యలను నేర్చుకునే అవకాశం కల్పిస్తుంది. అంతేకాకుండా సోషల్ మీడియా కొలెబ్రేషన్ ద్వారా ఒకే అభిరుచి ఉండే సృజనాత్మక వ్యక్తులకు తమ అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకునే వేదిక కల్పిస్తుంది.
D సోర్స్ వేదికలో ప్రస్తుతం 107 వరకు డిజైనింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో చిన్నపిల్లల బొమ్మల డిజైనింగు నుండి డిజిటల్ టైపోగ్రఫీ అన్నిరకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. D సోర్స్ కోర్సుల రూపకల్పనలో మూడు ప్రముఖ ఇండియన్ ఇనిస్టిట్యూట్లు భాగస్వామ్యమయ్యి ఉన్నాయి అందులో ఇండస్ట్రియల్ డిజైన్ సెంటర్ ఐఐటీ బొంబై, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ బెంగుళూరు మరియు డిపార్టుమెంట్ ఆఫ్ డిజైన్ ఐఐటీ గువాహటిలు ఉన్నాయి.
D సోర్స్ డిజైనింగ్ కోర్సులకు సంబంధించి పూర్తిస్థాయి లెర్నింగ్ ప్యాకేజీ అందిస్తుంది. డిజైన్ ఫాండమెంటల్ నుండి ప్రోడక్ట్ డిజైన్ వరకు అన్ని అంశాలను అందిస్తుంది. D సోర్స్ కోర్సులు వీడియో, ఆడియో మరియు డిజిటల్ టెక్స్ట్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. ప్రతి కోర్సుకు థియరీతో పాటుగా ప్రాక్టికల్ వర్కుసీట్లను కూడా అందిస్తుంది. D సోర్స్ కోర్సులు మీరు వెబ్సైట్, ఆండ్రాయిడ్ యాప్ మరియు యూట్యూబ్ ద్వారా అభ్యసించవచ్చు.
పాపులర్ D సోర్స్ డిజైనింగ్ కోర్సులు
Light and Photography Typography and Expression Lighting Techniques for TV Pop-Up Design Packaging and Label Design Virtual Reality Introduction to Drawing - Advanced Animations 2D & 3D Digital Illustration Freehand Sketching |
Product Design Designing of Plastic Products Photography Handmade Paper Making Clay Pottery Acrylic Painting Character Design for Animation Story Sketches for Animation Calligraphy Product Drawing |