సైన్స్ & టెక్నాలజీ అఫైర్స్: మార్చి 2022 | తెలుగు కరెంట్ అఫైర్స్
Telugu Current Affairs

సైన్స్ & టెక్నాలజీ అఫైర్స్: మార్చి 2022 | తెలుగు కరెంట్ అఫైర్స్

ఇస్రో 'యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్' కోసం 150 మంది విద్యార్థులు ఎంపిక

ఇండియన్ స్పేస్ ఏజెన్సీ - ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఉమ్మడిగా పాఠశాల విద్యార్థుల కోసం "యంగ్ సైంటిస్ట్స్ ప్రోగ్రామ్" లేదా "యువ విజ్ఞాన కార్యక్రమం" (యువికా) కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం ప్రధానంగా గ్రామీణ విద్యార్థులకు స్పేస్ టెక్నాలజీ, స్పేస్ సైన్స్ అంశాల యందు ప్రాథమిక జ్ఞానాన్ని అందించడానికి నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్ కోసం దేశవ్యాప్తంగా క్లాస్ ix చదువుతున్న 150 విద్యార్థులను  చేసారు.

Advertisement

ఈ కార్యక్రమంను వేసవి సెలవుల్లో 16-28 మే 2022 తేదీల్లో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC), తిరువనంతపురం, UR రావు శాటిలైట్ సెంటర్ (URSC), బెంగళూరు, స్పేస్ అప్లికేషన్ సెంటర్ (SAC), అహ్మదాబాద్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC), హైదరాబాద్ నార్త్-ఈస్ట్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ (NE-SAC), షిల్లాంగ్ యందు రెండు వారాల పాటు నిర్వహిస్తారు.

టీబీ వాక్సిన్ కోసం బయోఫ్యాబ్రితో భారత్ బయోటెక్ భాగస్వామ్యం

భారత్ బయోటెక్ ఆగ్నేయాసియా మరియు సబ్-సహారా ఆఫ్రికాలోని 70 దేశాల్లో కొత్త క్షయవ్యాధి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి స్పానిష్ బయోఫార్మాస్యూటికల్ కంపెనీ అయిన బయోఫ్యాబ్రితో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. క్షయ వలన ఏటా ప్రపంచ వ్యాప్తంగా సగటున 1.4 మిలియన్ల మంది మరణిస్తున్నారు, వీరిలో 10% మంది మైనర్లు ఉన్నారు. ప్రపంచంలో 20% క్షయ వ్యాధిగ్రస్తులు ఇండియాలో ఉన్నట్లు రిపోర్టులు చెప్తున్నాయి.

లేజర్ వెపన్ అభివృద్ధిపర్చిన చైనా

చైనీస్ పరిశోధకులు రిలేటివిస్టిక్ క్లిస్ట్రాన్ యాంప్లిఫైయర్ (RKA) అనే మైక్రోవేవ్ (లేజర్) ఆయుధాన్ని అభివృద్ధి చేశారు. ఇది అంతరిక్షంలోని ఉపగ్రహాలను జామ్ చేసి నాశనం చేయగలిగే శక్తిని కలిగిఉంది. ఈ పరికరం కా-బ్యాండ్‌లో 5-మెగావాట్ల వేవ్ బర్స్ట్‌ను ఉత్పత్తి చేయగలదు, విద్యుదయస్కాంత స్పెక్ట్రమ్‌లో కొంత భాగం పౌర మరియు సైనిక ప్రయోజనాల కోసం ఉపయోగించనున్నారు.

తమిళనాడు పెట్రోప్రొడక్ట్స్ లిమిటెడ్'కు బీఎస్ఐ సర్టిఫికేషన్

తమిళనాడు పెట్రోప్రొడక్ట్స్ లిమిటెడ్ (TPL), డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమికల్స్ & పెట్రోకెమికల్స్, మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ నుండి లీనియర్ ఆల్కైల్‌బెంజీన్ (LAB) ఉత్పత్తికి సంబంధించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సర్టిఫికేషన్ పొందిన మొదటి ఇండియన్ కంపెనీగా నిలిచింది. బీఎస్ఐ ధృవీకరణతో భారత మార్కెట్లో LAB యొక్క ఏకైక అధీకృత విక్రయదారుగా టీపీఎల్ ఉద్భవించింది. ఇది BIS 12795:2020 సర్టిఫికేషన్‌తో గుర్తింపు పొందిన ప్రపంచంలోనే మొట్టమొదటి లీనియర్ ఆల్కైల్‌బెంజీన్ తయారీదారుగా అవతరించింది.

2050 నాటికి జీరో కర్బన ఉద్గారాల నగరంగా ముంబై

దేశ వాణిజ్య రాజధాని ముంబై, కొత్తగా వాతావరణ కార్యాచరణ ప్రణాళికను ఆవిష్కరించింది, దీనిలో భాగంగా 2050 నాటికి కార్బన్ ఉద్గారాలను సున్నాకు తగ్గించడానికి ఆచరణాత్మక ప్రణాళికలను ప్రకటించింది. దీనితో నికర జీరో కార్బన్ రోడ్‌మ్యాప్‌ను ప్రకటించిన మొదటి దక్షిణాసియా నగరంగా ముంబై నిలిచింది. ప్రధాని మోడీ గత నవంబర్‌లో COP26లో సమావేశాల్లో మాట్లాడుతూ, 2070 నాటికీ ఇండియా జీరో కార్బన్ దేశంగా మారనున్ననట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో పోల్చితే ముంబాయి 20 సంవత్సరాల ముందుగానే ఆ లక్ష్యాన్ని చేరుకోనుంది.

ఇండియా, జపాన్'ల మధ్య క్లీన్ ఎనర్జీ భాగస్వామ్యం

భారతదేశం మరియు జపాన్ దేశల మధ్య స్థిరమైన ఆర్థిక వృద్ధిని పొందడానికి మరియు ఎలక్ట్రిక్ వాహనాల రంగాలలో ఇంధన భద్రతను నిర్ధారించే ప్రయత్నంలో భాగంగా ఇరు దేశాల మధ్య క్లీన్ ఎనర్జీ పార్టనర్‌షిప్ (CEP) ప్రారంభమయ్యింది. ఈ భాగస్వామ్య ఒప్పందం ద్వారా ఉపాధి కల్పన, ఆవిష్కరణలు మరియు పెట్టుబడులను పెంపొందించనున్నారు. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా భారత్ పర్యటనలో భాగంగా ఈ ఒప్పందం కుదిరింది.

Advertisement

Post Comment