ఎస్‌ఎస్‌సీ సీఏపీఎఫ్ ఎగ్జామ్ 2022 | మొత్తం ఖాళీలు 4,300
Latest Jobs SSC

ఎస్‌ఎస్‌సీ సీఏపీఎఫ్ ఎగ్జామ్ 2022 | మొత్తం ఖాళీలు 4,300

ఎస్‌ఎస్‌సీ సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్ మరియు ఢీల్లీ సబ్ ఇన్సపెక్టర్ ఎగ్జామ్ నోటిఫికేషన్ 2022 వెలువడింది. తాజా నోటిఫికేషన్ ద్వారా దాదాపు 4,300 ఖాళీలను భర్తీ చేయున్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి 20-25 ఏళ్ళ మధ్య వయసున్న ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. నియామక ప్రక్రియ రాత పరీక్ష మరియు ఫీజికల్, మెడికల్ టెస్టులు నిర్వహణ ద్వారా జరుగుతుంది.

Advertisement

ఎస్‌ఎస్‌సీ సీఏపీఎఫ్ 2022 ఖాళీలు

ఢిల్లీ పోలీస్ శాఖలో - సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టులు (పురుషులు)
జాబ్ కేటగిరి జనరల్ కోటా రిజర్వేషన్ కోటా మొత్తం ఖాళీలు
ఓపెన్ కేటగిరి 79 101 180
ఎక్స్ సర్వీస్ మ్యాన్ 06 07 13
ఎక్స్ సర్వీస్ మ్యాన్ (స్పెషల్) 06 06 12
డిపార్ట్‌మెంటల్ 12 11 23
మొత్తం ఖాళీలు 103 125 228
ఢిల్లీ పోలీస్ శాఖలో - సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టులు (మహిళలు)
జాబ్ కేటగిరి జనరల్ కోటా రిజర్వేషన్ కోటా మొత్తం ఖాళీలు
ఓపెన్ కేటగిరి 51 61 112
మొత్తం పోస్టులు  51 61 112
సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్'లో - సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టులు (GD)
సీఏపీఎఫ్ జనరల్ కోటా రిజర్వేషన్ కోటా మొత్తం ఖాళీలు
BSF Male  - 133
Female - 07
Male  - 203
Female - 10
Male  - 336
Female - 17
CISF Male  - 133
Female - 04
Male  - 133
Female - 05
Male  - 133
Female - 09
CRPF Male  - 1217
Female - 43
Male  - 1789
Female - 63
Male  - 3006
Female - 106
ITBP Male  - 66
Female - 12
Male  - 96
Female - 17
Male  - 162
Female - 29
SSB Male  - 65
Female - 03
Male  - 145
Female - 05
Male  - 210
Female - 08
మొత్తం (3,960) Male  - 1,514
Female - 69
Male  - 2,277
Female - 100
Male  - 3,791
Female - 169

సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్ & జీతాలు

ఎస్‌ఎస్‌సీ నిర్వహించే సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్ మరియు ఢీల్లీ సబ్ ఇన్సపెక్టర్ ఎగ్జామ్ ద్వారా సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్, ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ తో పాటుగా ఢీల్లీ పోలీస్ డిపార్టుమెంట్ పరిధిలో సబ్ ఇనస్పెక్టర్లు, అసిస్టెంట్ సబ్ ఇనస్పెక్టర్లు, హెడ్ కానిస్టేబుళ్లు మరియు కానిస్టేబుళ్ల పోస్టులు భర్తీ చేస్తారు.

సెంట్రల్ సాయుధ పోలీసు దళాలు బిఎస్ఎఫ్, ఐటిబిపి, ఎస్ఎస్బిలు సరిహద్దు కాపలా దళాలుగా విధులు నిర్వర్తిస్తాయి. సిఐఎస్ఎఫ్ ప్రభుత్వ పరిశ్రమలకు సంబంధించిన భద్రత వ్యవహారాలు చూస్తాయి. లా అండ్ ఆర్డర్, కౌంటర్-టెర్రరిస్ట్ ఆపరేషన్స్, నక్సల్ ఆపరేషన్లు సిఆర్పిఎఫ్ & ఎన్ఎస్జి లు చేపడతాయి. బిఎస్ఎఫ్ & సిఆర్పిఎఫ్ లు అవసరమయ్యే సమయంలో ఆర్మీ తో కలిసి పనిచేస్తాయి.

సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ డిప్యూటేషన్లో భాగంగా దేశ అంతర్గత రక్షణ వ్యవహారాల్లో ప్రధాన భూమిక పోషించే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW), స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA), ఇంటిలిజెన్స్ బ్యూరో (IB), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో మరియు ఇండియన్ ఆర్మీ లో కూడా సేవలు అందిస్తారు.

సబ్  ఇనస్పెక్టర్లు (గ్రౌండ్ డ్యూటీ ) Rs 35,400 - 112,40
సబ్ ఇనస్పెక్టర్లు (ఎగ్జిక్యూటివ్) - (మగ / ఆడ) Rs 35,400 - 112,40
అసిస్టెంట్ సబ్ ఇనస్పెక్టర్లు Rs 29,200 - 92,300

ఎస్‌ఎస్‌సీ సీఏపీఎఫ్ ఎలిజిబిలిటీ

  • జాతీయత : ఇండియా/నేపాల్/భూటాన్ దేశాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు.
  • వయోపరిమితి: 20 నుండి 25 ఏళ్ళ మధ్య వయస్సు ఉండే అభ్యర్థులు దరఖాస్తు చెయ్యొచ్చు. ఓబీసీ అభ్యర్థులకు గరిష్టంగా 3 ఏళ్ళ వయోపరిమితి సడలింపు ఉంటుంది. షెడ్యూల్డ్ కులాల వారికీ గరిష్టంగా 5 ఏళ్ళు, వికలాంగులకు 10 ఏళ్ళు సడలింపు కల్పిస్తారు.
  • విద్య అర్హుత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు.

ఎస్‌ఎస్‌సీ సీఏపీఎఫ్ దరఖాస్తు ఫీజు

జనరల్ కేటగిరి అభ్యర్థులు 100/-
మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, వికలాంగులు, ESM అభ్యర్థులు దరఖాస్తు ఫీజు మినహాహించారు

ఎస్‌ఎస్‌సీ సీఏపీఎఫ్ షెడ్యూల్ 2022

నోటిఫికేషన్ నెంబర్ HQ-PPII01/5/2022-PP_II
పోస్టుల సంఖ్యా 4,300
దరఖాస్తు ప్రారంభం 10 ఆగష్టు 2022
దరఖాస్తు తుది గడువు 30 ఆగష్టు 2022
పరీక్ష ఫీజు 100/-
పరీక్ష తేదీ నవంబర్ 2022
అడ్మిట్ కార్డు క్లిక్ చేయండి 
ఫలితాలు క్లిక్ చేయండి 

ఎస్‌ఎస్‌సీ సీఏపీఎఫ్ దరఖాస్తు విధానం

అర్హుత ఉన్న అభ్యర్థులు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అధికారిక వెబ్సైటు నుండి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్'లో పొందిపర్చిన విదంగా కమిషన్ అడిగిన వ్యక్తిగత, విద్యా సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది.

దరఖాస్తు పారంభించే ముందు అవసరమయ్యే వివరాల్ని అందుబాటులో పెట్టుకోండి. పుటిన తేదీ వివరాలు, కేటగిరి వివరాలు, మొబైల్ నెంబర్ మరియు మెయిల్ ఐడీ వంటి వివరాలు తప్పులు దొర్లకుండా పొందుపర్చండి. పోస్టు ఎంపిక, పరీక్షా కేంద్ర ఎంపిక వివరాలు మరో మారు సరిచూసుకోండి.

అప్లోడ్ చేసే ధ్రువపత్రాలు కమిషన్ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా రూపొందించుకోండి. దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేశాక అందుబాటులో ఉండే పేమెంట్ మార్గం ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించండి. దరఖాస్తు రుసుము చెల్లించని అప్లికేషన్లు పరిగణలోకి తీసుకోబడవు.

ఎస్‌ఎస్‌సీ సీఏపీఎఫ్ ఎగ్జామ్ సెంటర్లు

ఎగ్జామ్ సెంటర్ SSC రీజనల్ కేంద్రం సమాచారం (సౌత్ రీజియన్)
గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం,
హైదరాబాద్, వరంగల్.
Regional Director (SR), Staff Selection Commission, 2 nd Floor, EVK Sampath Building, DPI Campus, College Road, Chennai, Tamil Nadu-600006 (www.sscsr.gov.in)

ఎస్‌ఎస్‌సీ సీఏపీఎఫ్ పరీక్ష విధానం

సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్ ఈ కింది సూచించిన విదంగా నాలుగు పేజుల్లో జరుగుతుంది. మొదటి పేజులో పేపర్ I పేరుతో సీబీటీ ఆధారిత ఆబ్జెక్టివ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో అర్హుత పొందిన వారికీ రెండవ దశలో ఫీజికల్ స్టాండర్డ్ టెస్ట్ / ఫీజికల్ ఎండ్యూరెన్సు టెస్ట్ ఉంటుంది. ఈ పేజ్ దాటిన వారికీ మూడవ దశలో పేపర్ II (ఆబ్జెక్టివ్ టెస్ట్) నిర్వహిస్తారు. చివరిగా మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి నియామక ప్రక్రియ పూర్తిచేశారు.

  1. పేపర్ I (ఆబ్జెక్టివ్ టెస్ట్)
  2. ఫీజికల్ స్టాండర్డ్ టెస్ట్ / ఫీజికల్ ఎండ్యూరెన్సు టెస్ట్
  3. పేపర్ II (ఆబ్జెక్టివ్ టెస్ట్)
  4. డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్

పేపర్ I : (ఆబ్జెక్టివ్ టెస్ట్)

పేపర్ I కంప్యూటర్ ఆధారంగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. పరీక్ష పూర్తి ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. జనరల్ ఇంటిలిజెన్స్ & రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్ & జనరల్ అవెర్నెస్ మరియు ఇంగ్లీష్ కంప్రెహెన్షన్ సంబంధించి 200 ప్రశ్నలు ఇవ్వబడతాయి. సరైన సమాధానం గుర్తించిన ప్రశ్నలకు 1 మార్కు కేటాయిస్తారు. తప్పు సమాధానం చేసిన ప్రశ్నలకు 0.25 మార్కులు తొలగిస్తారు. పరీక్షా వ్యవధి 2 గంటలు.

సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్ పేపర్ I పరీక్షా సరళి
పార్ట్ సిలబస్ ప్రశ్నలు /మార్కులు సమయం
పార్ట్ I జనరల్ ఇంటిలిజెన్స్ & రీజనింగ్ 50/50 2 గంటలు
పార్ట్ II క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50/50
పార్ట్ III జనరల్ నాలెడ్జ్ & జనరల్ అవెర్నెస్ 50/50
పార్ట్ IV ఇంగ్లీష్ కంప్రెహెన్షన్ 50/50

PST & PET

పేపర్ I లో అర్హుత సాధించిన అభ్యర్థులకు రెండవ దశలో ఫీజికల్ స్టాండర్డ్ టెస్ట్/ఫీజికల్ ఎండ్యూరెన్సు టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా కింద పొందుపర్చిన వివిధ టాస్కులు నిర్వహిస్తారు.

Physical Standard Test for all Posts (PST)
Category of candidates Height (in cm) Chest (in cm)
Unexpanded Expanded
For male candidates only (UR) 170 80 85
For all candidates belonging to Scheduled Tribes 162.5 77 82
For Female candidates only (UR) 157 - -
For all female candidates belonging to Scheduled Tribes 154 - -

 

Physical Endurance Test (PET) For all posts
For male candidates only For female candidates only
100 metre race in 16 seconds 100 metre race in 18 seconds
1.6 Kms race in 6.5 minutes 800 metre race in 4 minutes
Long Jump: 3.65 metre in 3 chances Long Jump: 2.7 metre in 3 chances
High Jump : 1.2 metre in 3 chances High Jump : 0.9 metre in 3 chances
Shot put (16 Lbs): 4.5 metre in 3 chance -

పేపర్ II (ఆబ్జెక్టివ్ ఇంగ్లీష్ టెస్ట్)

ఫీజికల్ స్టాండర్డ్ టెస్ట్ & ఫీజికల్ ఎండ్యూరెన్సు టెస్ట్ అర్హుత సాధించిన అభ్యర్థులకు మూడవ దశలో పేపర్ II పేరుతొ ఆబ్జెక్టివ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ పరీక్షా 2 గంటల నిడివితో 200 మార్కులకు జరుగుతుంది. సరైన సమాధానం గుర్తించిన ప్రశ్నలకు 1 మార్కు కేటాయిస్తారు. తప్పు సమాధానం చేసిన ప్రశ్నలకు 0.25 మార్కులు తొలగిస్తారు.

సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్ పేపర్ II పరీక్షా సరళి
సిలబస్ ప్రశ్నలు మార్కులు సమయం
ఇంగ్లీష్ లాంగ్వేజ్ & కంప్రెహెన్షన్ 200 200 2 గంటలు

మెడికల్ ఎగ్జామినేషన్ 

పేపర్ II లో మెరిట్ సాధించిన అభ్యర్థులకు మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ కి చెందిన మెడికల్ ఆఫీసర్ లేదా ఇతర గ్రేడ్ 1 స్థాయి అసిస్టెంట్ మెడికల్ సర్జన్ తో మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. అభ్యర్థుల కంటి చూపు, మోకాలి సమస్యలు మరియు ఇతర వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు గురించి వాకబు చేస్తారు.  మెడికల్ రిపోర్టు అందించేందుకు 15 గడువిస్తుంది.

అభ్యర్థుల కంటి చూపు సమీప దృష్టి N6 (ఆరోగ్యవంతమైన కన్ను) , N9 (సమస్య ఉన్న కన్ను) ఉండాలి. అభ్యర్థుల మినిమం డిస్టెన్స్ విజన్ 6/6 (ఆరోగ్యవంతమైన కన్ను) , 6/9 (సమస్య ఉన్న కన్ను) ఉండాలి. అభ్యర్థులకు మోకాలి సమస్యలు, ఫ్లాట్ ఫుట్, కళ్ళల్లో స్క్యింట్ సమస్య ఉండకూడదు. అభ్యర్థులు భౌతికంగా మానసికంగా ఆరోగ్యాంగా ఉండాలి.

సబ్ ఇనస్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇనస్పెక్టర్ పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థులు ఈ కింది అంశాలతో కూడిన టైనింగ్ ప్రోగ్రాంకు హాజరవ్వాల్సి ఉంటుంది.

Jumping over the Vertical Board Tarzan Swing
Jumping on the Horizontal Board Parallel Rope
Monkey Crawl Vertical Rope
Holding the rope on jumping from the Board

టాటూస్ పరిశీలన: శాశ్వత శరీర పచ్చబొట్లు ముంజేయి లోపలి ముఖంపై (మోచేయి లోపలికి మణికట్టుకు)మరియు అరచేతి / వెనుక (డోర్సల్) చేతి రివర్స్ వైపు) మాత్రమే అనుమతించబడతాయి. శరీరంలోని ఇతర భాగాలపై శాశ్వత శరీర పచ్చబొట్లు ఆమోదయోగ్యం కాదు. గిరిజన తెగలు వారి ఆచార, సంప్రదాయాల ప్రకారం ముఖాలపై వేసుకునే పచ్చబొట్లు అనుమతించబడతాయి.

డాక్యుమెంట్ వెరిఫికేషన్ & ఎంపిక విధానం

పేపర్ I, పేపర్ II లలో అర్హుత సాధించిన అభ్యర్థులకు చివరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. అభ్యర్థులు రెండు ఫోటో కాపీలతో పాటుగా అవసరమయ్యే అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరవ్వాల్సి ఉంటుంది.

కొన్ని పోస్టులకు సంబంధించి ఎంపికను మార్చుకునేందుకు చివరిసారి అవకాశం కల్పిస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంతృప్తిపర్చని అభ్యర్థులను అనర్హులుగా పరిగణిస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తియ్యాక తుది షార్ట్ లిస్ట్ తయారీలో నిమగ్నమౌతారు. పేపర్ I, పేపర్ II లకు విడివిగా అర్హుత మార్కులు ప్రకటిస్తారు.

కేటగిరి వారీగా రెండు పేపర్లలో మెరిట్ సాధించిన అభ్యర్థుల షార్ట్ లిస్ట్ తయారు చేస్తారు.  పేపర్ I & II అందరు అభ్యర్థులు 30% మార్కులతో తప్పనిసరి క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. PST, PET టెస్టుల్లో తప్పనిసరి అర్హుత సాధించాలి. మార్కులు సమమయ్యేటప్పుడు పేపర్ II  మెరిట్ ను ప్రామాణికంగా తీసుకుంటారు. అప్పటికి సమమైతే పేపర్ I లో సాధించిన మొత్తం మార్కులను పరిగణలోకి తీసికుంటారు.

అప్పటికి సమమైతే ఎక్కువ వయస్సు అభ్యర్థులకు ప్రాధన్యత ఇస్తారు. ఇంకా సమస్య పరిస్కారం కాకుంటే అభ్యర్థుల పేర్లలో ఆల్ఫాబెట్ అక్షరాలను ఆధారంగా చేసుకుని చోటు కల్పిస్తారు. పోస్టుల ఎంపిక తీరు ఈక్రింది విదంగా ఉంటాయి.

సబ్ ఇనస్పెక్టర్ ఇన్ ఢీల్లీ పోలీసు (ఎ)
సబ్ ఇనస్పెక్టర్ ఇన్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బి)
సబ్ ఇనస్పెక్టర్ ఇన్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సి)
సబ్ ఇనస్పెక్టర్ ఇన్  సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (డి)
సబ్ ఇనస్పెక్టర్ ఇన్ ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఇ)
సబ్ ఇనస్పెక్టర్ ఇన్ శాస్త్రా సీమా బాల్ (ఎఫ్)
అసిస్టెంట్ సబ్ ఇనస్పెక్టర్ ఇన్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (జి)

కేటగిరి క్వాలిఫైయింగ్ మార్కులు
జనరల్ కేటగిరి అభ్యర్థులు 30%
ఓబీసీ /ఈడబ్ల్యూఎస్ 25%
ఇతరులు 20%

Advertisement

Post Comment