తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ : 19 మార్చి 2024
March Telugu Current Affairs

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ : 19 మార్చి 2024

19 మార్చి 2024 కరెంట్ అఫైర్స్ అంశాలను తెలుగులో పొందండి. వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను ఈ ఆర్టికల్ ద్వారా మీకు అందిస్తున్నాం.

Advertisement

గ్లోబల్ హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్‌లో భారతదేశంకు 134వ స్థానం

గ్లోబల్ హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్‌ 2023-24లో భారతదేశం మొత్తం 193 దేశాలలో 134వ స్థానంలో నిలిచింది. "బ్రేకింగ్ ది గ్రిడ్‌లాక్: రీఇమేజినింగ్ కోఆపరేషన్ ఇన్ ఎ పోలరైజ్డ్ వరల్డ్" పేరుతో రూపొందించబడిన నివేదిక, సంపన్న దేశాలు దృఢమైన పునరుద్ధరణ సంకేతాలను చూపుతుండగా, పేద దేశాలు ఇంకా ఇబ్బందులు పడుతున్నారని నివేదించింది.

  • తాజా నివేదిక భారతదేశం యొక్క హెచ్‌డిఐ స్కోర్ 0.644 వద్ద చూపిస్తుంది.
  • ఇది ఇండియాను "మీడియం హ్యూమన్ డెవలప్‌మెంట్" విభాగంలో ఉంచింది.
  • ఇది 2021లో 0.633 నుండి స్వల్ప మెరుగుదలను సూచిస్తుంది.
  • భారతదేశంలో సగటు ఆయుర్దాయం 2021లో 67.2 సంవత్సరాల నుండి ప్రస్తుతం 67.7 సంవత్సరాలకు పెరిగినట్లు పేర్కొంది.
  • అలానే పాఠశాల విద్య పూర్తి చేసేందుకు 11.9 సంవత్సరాల నుండి 12.6 సంవత్సరాలుగా నివేదించింది.
  • భారత తలసరి స్థూల జాతీయ ఆదాయం (జీఎన్ఐ) కూడా $6,542 నుండి $6,951కి మెరుగుపడినట్లు పేర్కొంది.
  • లింగ అసమానతలను తగ్గించడంలో కూడా భారతదేశం పురోగతిని కనబరిచిందని ఈ నివేదిక పేర్కొంది.
  • లింగ అసమానత సూచిక (జీఐఐ) 2022లో 166 దేశాలలో భారత్ 108వ స్థానంలో ఉంది.
  • దేశం యొక్క జీఐఐ విలువ 0.437తో ప్రపంచ సగటు 0.462 మరియు దక్షిణాసియా సగటు 0.478 కంటే మెరుగ్గా ఉందని నివేదించింది.
  • పునరుత్పత్తి ఆరోగ్యంలో భారతదేశం యొక్క పనితీరు మధ్యస్థ మానవ అభివృద్ధి సమూహం లేదా దక్షిణాసియాలోని ఇతర దేశాల కంటే మెరుగ్గా ఉన్నట్లు తెలిపింది.
  • 2022లో భారతదేశపు కౌమారదశ జననాల రేటు 16.3 (15-19 సంవత్సరాల వయస్సు గల 1,000 మంది మహిళలకు జననాలు) అంచనా వేసింది. ఇది 2021లో 17.1 నుండి మెరుగుదలను కనబర్చింది.
  • అయితే శ్రామిక శక్తి భాగస్వామ్య రేటులో భారతదేశం అతిపెద్ద లింగ అంతరాలను కలిగి ఉంది.
  • దేశంలో శ్రామిక శక్తి మహిళలు (28.3%) మరియు పురుషులు (76.1%) తో 47.8 శాతం పాయింట్ల వ్యత్యాసం ఉన్నట్లు పేర్కొంది.

ఆరోగ్యం, విద్య మరియు జీవన ప్రమాణాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని దేశం యొక్క శ్రేయస్సును కొలవడానికి హెచ్‌డిఐ కీలకమైన కొలమానంగా భావించబడుతుంది. ఈ నివేదిక ఈ అంశాలకు సంబంధించి విస్తృతమైన అంతరాన్ని హైలైట్ చేస్తుంది. ఈ నివేదిక ప్రకారం స్విట్జర్లాండ్, నార్వే మరియు ఐస్‌లాండ్ వంటి దేశాలు అత్యధిక హెచ్‌డిఐ స్కోర్‌లను కలిగి ఉండగా, సోమాలియా, దక్షిణ సూడాన్ మరియు సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ వంటి దేశాలు దిగువన ఉన్నాయి.

గ్లోబల్ హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్‌లో 2023-22 నివేదికలో స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్, హాంగ్ కాంగ్, డెన్మార్క్ మరియు స్వీడన్ దేశాలు టాప్ 5 స్థానాలలో ఉన్నాయి. డెన్మార్క్ మరియు స్వీడన్ దేశాలు దేశాలు ఉమ్మడిగా 5వ ర్యాంకులో ఉన్నాయి. ఐర్లాండ్, జర్మనీ, సింగపూర్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియాలు తర్వాత స్థానాలలో ఉంటూ టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి.

తాజా హెచ్‌డిఐ నివేదికలో భారతదేశ పొరుగు దేశాల పనితీరు గమనిస్తే శ్రీలంక 78వ స్థానంలో, చైనా 75వ స్థానంలో నిలిచాయి. ఈ రెండు దేశాలు హై హ్యూమన్ డెవలప్‌మెంట్ కేటగిరీ కింద వర్గీకరించబడ్డాయి. అలానే భూటాన్ 125వ స్థానంలో, బంగ్లాదేశ్ 129వ స్థానంలో భారత్ కంటే మెరుగైనా ర్యాంకు పొందాయి ఉన్నాయి. నేపాల్ (146), పాకిస్థాన్ (164)లు భారత్ కంటే తక్కువ స్థానాల్లో నిలిచాయి.

  • హెచ్‌డిఐ అనేది మానవ అభివృద్ధికి అత్యంత విస్తృతంగా ఉపయోగించే సూచిక.
  • దేశంలో ఆరోగ్యం, విద్య, ఆదాయం మరియు జీవన పరిస్థితులను ఈ సూచిక పరిగణనలోకి తీసుకుని నివేదిక రూపొందిస్తుంది.
  • ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డిపి) వార్షిక మానవ అభివృద్ధి నివేదికలో 193 దేశాల మానవ అభివృద్ధి సూచికను సంకలనం చేస్తుంది.
  • మానవాభివృద్ధి నివేదికలో ఐక్యరాజ్యసమితిలోని మొత్తం 193 సభ్యదేశాల డేటా ప్రచురించబడుతుంది.
  • అలాగే హాంకాంగ్ మరియు పాలస్తీనా రాష్ట్రం యొక్క డేటా కూడా వీటికి జోడించబడింది. అయితే దీనిలో ఉత్తర కొరియా మరియు మొనాకో దేశాలలో కొన్ని భాగాలు మాత్రమే లెక్కించబడతాయి.

2022 నుండి 1 నుండి 69 ర్యాంక్‌లో ఉన్న దేశాలు అత్యధిక హెచ్‌డిఐ స్కోర్‌ కలిగిన దేశాలుగా పరిగణించబడుతున్నాయి. 70 నుండి 115 వరకు ర్యాంక్ ఉన్న దేశాలు అధిక హెచ్‌డిఐ స్కోర్‌ కలిగిన దేశాలుగా, 116 నుండి 159 వరకు ర్యాంక్ ఉన్న దేశాలు మీడియం హెచ్‌డిఐ స్కోర్‌ కలిగిన దేశాలుగా మరియు 160 నుండి 193 వరకు ర్యాంక్ ఉన్న దేశాలు తక్కువ హెచ్‌డిఐ స్కోర్‌ కలిగిన దేశాలుగా పేర్కొంటున్నారు.

జండర్ ఇన్ఇక్వాలిటీ ఇండెక్స్‌లో భారతదేశంకు 108వ స్థానం

లింగ అసమానత సూచిక (జీఐఐ) 2022లో భారతదేశం 193 దేశాలలో 0.437 స్కోర్‌తో 108వ స్థానంలో నిలిచింది. 2021లో 122వ స్థానంలో ఉన్నదానితో పోలిస్తే భారత్ 14 స్థానాలు గణనీయంగా ఎగబాకింది. ఈ మెరుగుదల గత దశాబ్దంలో సానుకూల ధోరణికి కొనసాగింపుగా సూచిస్తుంది.

అదేవిదంగా గత 10 సంవత్సరాలలో లింగ అసమానత సూచికలో భారతదేశం యొక్క ర్యాంక్ స్థిరంగా మెరుగుపడుతూ వస్తుంది. ఇది దేశంలో లింగ సమానత్వాన్ని సాధించడంలో ప్రగతిశీల మెరుగుదలను సూచిస్తుంది. 2014లో భారత్ జీఐఐ ర్యాంకు 127 కాగా, ఇప్పుడు 108కి చేరుకుంది.

ప్రభుత్వం దీర్ఘకాలిక సామాజిక-ఆర్థిక మరియు రాజకీయ అభివృద్ధిని లక్ష్యంగా పని చేయడం కారణంగా మహిళా సాధికారత సాధించడంలో నిర్దేశించిన నిర్ణయాత్మక ఫలితాలు సాధిస్తుంది. బాలికల విద్య, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకతను సులభతరం చేయడం మరియు కార్యాలయంలో భద్రత పెంపొందించడం వంటి కార్యక్రమాలు దీనికి ద్రోహద పడుతున్నాయి.

  • జండర్ ఇన్ఇక్వాలిటీ ఇండెక్స్‌ అనేది పునరుత్పత్తి ఆరోగ్యం, సాధికారత మరియు కార్మిక మార్కెట్ అనే మూడు కోణాలను ఉపయోగించి లింగ అసమానతను అంచనా వేస్తుంది.
  • ఈ కోణాలలో స్త్రీ మరియు పురుషుల మధ్య అసమానత కారణంగా సంభావ్య మానవ అభివృద్ధిలో నష్టాన్ని ఇది చూపిస్తుంది.
  • ఈ నివేదిక ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం మరియు మానవ అభివృద్ధి డేటా సహాయంతో రూపొందించబడుతుంది.
  • తాజా నివేదికలో డెన్మార్క్ అగ్రస్థానంలో ఉండగా నార్వే, స్విట్జర్లాండ్, స్వీడన్, మరియు నెదర్లాండ్స్ దేశాలు తర్వాతనాలుగు స్థానాలలో ఉన్నాయి.
  • ఆరోగ్య పరిమాణాన్ని ప్రసూతి మరణాల నిష్పత్తి మరియు కౌమార సంతానోత్పత్తి రేటు ద్వారా కొలుస్తారు.
  • సాధికారత పరిమాణం పార్లమెంటరీ పురుష, మహిళా సీట్ల వాటా మరియు మాధ్యమిక మరియు ఉన్నత విద్యా స్థాయిల ద్వారా కొలవబడుతుంది.
  • శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం ద్వారా శ్రమ పరిమాణం కొలవబడుతుంది.
  • దేశం యొక్క జీఐఐ విలువ 0.437తో ప్రపంచ సగటు 0.462 మరియు దక్షిణాసియా సగటు 0.478 కంటే మెరుగ్గా ఉందని నివేదించింది.
  • పునరుత్పత్తి ఆరోగ్యంలో భారతదేశం యొక్క పనితీరు మధ్యస్థ మానవ అభివృద్ధి సమూహం లేదా దక్షిణాసియాలోని ఇతర దేశాల కంటే మెరుగ్గా ఉన్నట్లు తెలిపింది.
  • 2022లో భారతదేశపు కౌమారదశ జననాల రేటు 16.3 (15-19 సంవత్సరాల వయస్సు గల 1,000 మంది మహిళలకు జననాలు) అంచనా వేసింది. ఇది 2021లో 17.1 నుండి మెరుగుదలను కనబర్చింది.
  • అయితే శ్రామిక శక్తి భాగస్వామ్య రేటులో భారతదేశం అతిపెద్ద లింగ అంతరాలను కలిగి ఉంది.
  • దేశంలో శ్రామిక శక్తి మహిళలు (28.3%) మరియు పురుషులు (76.1%) తో 47.8 శాతం పాయింట్ల వ్యత్యాసం ఉన్నట్లు పేర్కొంది.

దేశంలో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. వాటిలో బేటీ బచావో బేటీ పడావో, మహిళా శక్తి కేంద్రం, నేషనల్ క్రెష్ స్కీమ్, ప్రధాన మంత్రి మాతృ వందన యోజన, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, సుకన్య సమృద్ధి యోజన మరియు ప్రధాన్ మంత్రి ముద్రా యోజన వంటివి ఉన్నాయి.

నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ కొత్త ఛైర్మన్‌గా బి సాయిరామ్‌ నియామకం

నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎన్‌సిఎల్) కొత్త ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) గా బి సాయిరామ్ నియమితులయ్యారు. సాయిరామ్ మైనింగ్ రంగంలో దాదాపు 30 ఏళ్ళ అనుభవం కలిగివున్నారు. ఆయన 1991లో కోల్ ఇండియా లిమిటెడ్‌లో తన కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్, మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్, సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్, మరియు సిఐఎల్ కార్పొరేట్ హెచ్‌క్యూలో అనేక నాయకత్వ పాత్రల్లో పనిచేశారు.

నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ అనేది భారతదేశంలో అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారుడు అయిన కోల్ ఇండియా లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ. ఇది నవంబర్ 1985లో స్థాపించబడింది. ఇది మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీ ప్రధాన కార్యాలయంగా సేవలు అందిస్తుంది.

కోల్ ఇండియా లిమిటెడ్ యొక్క ప్రధాన బొగ్గు ఉత్పత్తి అనుబంధ సంస్థల్లో ఎన్‌సిఎల్ ఒకటి. ఇది మెకనైజ్డ్ ఓపెన్‌కాస్ట్ గనుల ద్వారా బొగ్గును ఉత్పత్తి చేస్తుంది. ఈ సంస్థ స్థానిక గిరిజన, గిరిజనేతర మరియు ప్రాజెక్ట్-బాధిత వ్యక్తులకు వివిధ సామాజిక అభివృద్ధి పథకాలను అందించడం ద్వారా వారికి సహాయం చేస్తుంది. నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ గత 39 సంవత్సరాల నుండి ప్రధానంగా మైనింగ్ & క్వారీయింగ్ వ్యాపారంలో ఉంది.

రంజీ ట్రోఫీ 2024 టైటిల్ విజేతగా ముంబై

రంజీ ట్రోఫీ 2024 టైటిల్ విజేతగా ముంబై జట్టు నిలిచింది. మార్చి 14న వాంఖడేలో జరిగిన ఫైనల్‌లో విదర్భను 169 పరుగుల తేడాతో ఓడించి ఎనిమిదేళ్ల తర్వాత ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇది రికార్డు స్థాయిలో ముంబై జట్టు గెలుచుకున్న 42వ రంజీ ట్రోఫీ. విజేత జట్టుకు బీసీసీఐ 5 కోట్ల ప్రైజ్ మనీ అందజేసింది. గత ఏడాది నుండి బీసీసీఐ రంజీ ట్రోఫీ ఛాంపియన్‌ల ప్రైజ్ మనీని 5 కోట్లకు పెంచింది.

ముంబై రంజీ జట్టుకు భారత వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే నాయకత్వం వహించాడు. దీనితో రహానే రంజీ ట్రోఫీని గెలుచుకున్న 26వ ముంబై కెప్టెనుగా అవతరించాడు. ఈ జట్టులో శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్ మరియు ధవల్ కులకర్ణి వంటి స్టార్లు ఉన్నారు. ఈ విజయం తర్వాత ధవల్ కులకర్ణి తన కెరీరుకు రిటైర్మెంట్ ప్రకటించాడు.

  • రంజీ ట్రోఫీ అనేది భారతదేశంలో నిర్వహించే ప్రధాన దేశీయ ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఛాంపియన్‌షిప్‌లలో ఒకటి.
  • ఇది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ద్వారా ఏటా నిర్వహించబడుతుంది.
  • దీనిలో ప్రాంతీయ, రాష్ట్ర క్రికెట్ సంఘాలకు ప్రాతినిధ్యం వహించే జట్లు పాల్గొంటాయి.
  • రంజీ ట్రోఫీ 1934లో స్థాపించింది.
  • ప్రస్తుతం ఈ పోటీలో 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్రపాలిత ప్రాంతాల నుండి 38 జట్లు పాల్గొంటున్నాయి.
  • ఈ పోటీని అంతర్జాతీయ క్రికెట్ ఆడిన మొట్టమొదటి భారతీయుడు అయిన రంజిత్‌సిన్హ్జీ పేరుతో నిర్వహిస్తున్నారు.
  • ముంబై క్రికెట్ జట్టు ఈ టోర్నమెంట్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉంది. వీరు రికార్డు స్థాయిలో 42 టైటిల్స్ సాధించారు.

మిల్లెట్ ఉత్పత్తి పెంచేందుకు ఉచిత విత్తన కిట్‌లను అందజేస్తున్న రాజస్థాన్

రాజస్థాన్ ప్రభుత్వం మిల్లెట్ ఉత్పత్తిని పెంచేందుకు ఉచిత విత్తన కిట్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది.ఈ చొరవ 2022-23లో ప్రారంభించిన రాజస్థాన్ మిల్లెట్ ప్రమోషన్ మిషన్‌లో భాగంగా ఉంది. లక్షలాది మంది రైతులకు ఉచితంగా మినీ కిట్‌ల విత్తనాలు అందజేసి రాష్ట్రంలో మిల్లెట్ దిగుబడి పెంచనున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా 1.2 మిలియన్ల రైతులకు మొక్కజొన్న విత్తనాలు, 8 లక్షల రైతులకు పెర్ల్ మిల్లెట్ (బజ్రా) విత్తనాలు, 7 లక్షల మంది రైతులకు ఆవాలు, 4 లక్షల మంది రైతులకు మూంగ్ విత్తనాలు మరియు లక్ష మంది రైతులకు జొన్న (జోవర్) మరియు చిమ్మట విత్తనాలను ఉచితంగా అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ ప్రకటించారు.

రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం 2022-23 నుండి మిల్లెట్ ప్రమోషన్ మిషన్‌ను ప్రారంభించింది. రైతులు, పారిశ్రామికవేత్తలు మరియు స్వచ్ఛంద సంస్థల ద్వారా 100 ప్రాథమిక ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి గత బడ్జెట్ యందు రూ.40 కోట్లు కేటాయించింది.

  • వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఉచిత విత్తనాల కిట్లను పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ తెల్పింది.
  • దేశంలోని మొత్తం మిల్లెట్ ఉత్పత్తిలో రాజస్థాన్ వాటా 26 శాతంగా ఉంది.
  • ఈ రాష్ట్రంలో ఉత్పత్తి చేసే ప్రధాన మిల్లెట్ పంటలలో పెర్ల్ మిల్లెట్ మరియు జొన్నలు అగ్రస్థానంలో ఉన్నాయి.
  • రాజస్థాన్ దేశంలో 41 శాతం బజ్రా ఉత్పత్తిని కలిగి ఉంది.

ప్రసార భారతి కొత్త చైర్‌పర్సన్‌గా నవనీత్ సెహగల్ నియామకం

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నవనీత్ కుమార్ సెహగల్ ప్రసార భారతి నూతన ఛైర్మన్‌గా నియమితులయ్యారు. వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధంఖర్ నేతృత్వంలోని ప్రసార భారతి ఛైర్మన్ ఎంపిక కమిటీ అతని పేరును క్లియర్ చేయడంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అతనిని నియామకాన్ని మార్చి 15న ఆమోదించారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి మూడేళ్ల కాలానికి ఈ హోదాలో ఉండనున్నారు. సెహగల్ 1988-బ్యాచ్ ఉత్తరప్రదేశ్ క్యాడర్‌కు చెందిన రిటైర్డ్ బ్యూరోక్రాట్.

2020లో ప్రసార భారతి ఛైర్మన్‌గా తన పదవీకాలాన్ని పూర్తి చేసిన సూర్య ప్రకాష్ తర్వాత సెహగల్ ఈ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ హోదా ఖాళీగా ఉంది. ప్రసార భారతి కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గౌరవ్ ద్వివేది ఇది వరకు బాధ్యతలు నిర్వర్తించారు. ఈయన నవంబర్ 2022లో ఐదేళ్ల కాలానికి నియమితులయ్యారు.

  • ప్రసార భారతి జాతీయ టెలివిజన్ నెట్‌వర్క్ అయిన దూరదర్శన్ మరియు జాతీయ పబ్లిక్ రేడియో బ్రాడ్‌కాస్టర్ అయిన ఆల్ ఇండియా రేడియో కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది.
  • న్యూ ఢిల్లీలో ప్రధాన కార్యాలయంగా ప్రసార భారతి 1997లో స్థాపించబడింది.
  • ఇది భారత ప్రభుత్వ యాజమాన్యంలోని ప్రధాన పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్.
  • ఇది పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన చట్టబద్ధమైన స్వయంప్రతిపత్తి సంస్థ.
  • భారత పార్లమెంటు ప్రసార భారతి చట్టాన్ని 1990లో ఆమోదించింది. ఈ చట్టం 15 సెప్టెంబర్ 1997 నుండి అమల్లోకి వచ్చింది.
  • ఇది సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలో సేవలు అందిస్తుంది.

వీ- డెమ్ లిబరల్ డెమోక్రసీ ఇండెక్స్‌2024లో భారతదేశంకు 104వ స్థానం

వీ- డెమ్ లిబరల్ డెమోక్రసీ ఇండెక్స్‌ (ఎల్‌డిఐ) 2024లో భారతదేశం 104వ స్థానంలో నిలిచింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య స్వేచ్ఛలను ట్రాక్ చేసే వీ-డెమ్ డెమోక్రసీ సూచికలలో భాగం. ఈ నివేదిక ప్రజాస్వామ్యం యొక్క ఉదారవాద (వ్యక్తిగత మరియు మైనారిటీ హక్కులు) మరియు ఎన్నికల (స్వేచ్ఛ మరియు న్యాయమైన ఎన్నికలు) అనే రెండు అంశాల ఆధారంగా రూపొందించబడుతుంది.

ఈ నివేదిక 71 సూచికలతో లిబరల్ కాంపోనెంట్ ఇండెక్స్ (ఎల్‌సిఐ) మరియు ఎలక్టోరల్ డెమోక్రసీ ఇండెక్స్ (ఈడీఐ)గా ప్రచురించబడుతుంది. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ, రక్షణ మరియు కార్యనిర్వాహకుడిపై శాసనపరమైన తనిఖీలు వంటి అంశాలను ఎల్‌సిఐ నివేదిక కవర్ చేస్తుంది. స్వేచ్ఛాయుతమైన మరియు నిష్పక్షపాత ఎన్నికలకు సంబంధించిన సూచికలను ఈడీఐ అంచనా వేస్తుంది.

భారతదేశం ఇటీవల చెత్త ఆటోక్రేటైజర్లలో ఒకటిగా మారిందని ఈ నివేదిక పేర్కొంది. ప్రపంచంలోని టాప్ టెన్ ఆటోక్రటైజర్స్ జాబితాలో భారత్ ఉందని ఈ నివేదిక పేర్కొంది. భారత్ ప్రస్తుతం ఎల్‌డిఐ నివేదికలో 104వ స్థానంలో, ఎలక్టోరల్ డెమోక్రసీ ఇండెక్స్‌లో 110వ స్థానంలో, లిబరల్ కాంపోనెంట్ ఇండెక్స్‌లో 92వ స్థానంలో ఉంది.

ప్రపంచ జనాభాలో 35% మంది నివసించే 42 దేశాల్లో స్వయంకృతాపరాధం కొనసాగుతోందని, ప్రపంచ జనాభాలో 18% ఉన్న భారతదేశం, నిరంకుశ దేశాలలో నివసిస్తున్న జనాభాలో దాదాపు సగం మంది ఉకలిగి ఉందని పేర్కొంది. భారత్ 2018లో ఎన్నికల నిరంకుశ పాలనకు దిగజారిందని, ఇప్పటికీ అదే స్థితిలో కొనసాగుతున్నట్లు నివేదించింది.

భారతదేశంలోని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం విమర్శకుల నోరు మూయించేందుకు దేశద్రోహం, పరువు నష్టం, తీవ్రవాద వ్యతిరేక చట్టాలను ఉపయోగించుకుందని ఈ నివేదిక పేర్కొంది. బీజేపీ ప్రభుత్వం 2019లో చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టాన్ని సవరించడం ద్వారా లౌకికవాదానికి రాజ్యాంగం యొక్క నిబద్ధతను దెబ్బతీసింది " అని పేర్కొంది.

  • లిబరల్ డెమోక్రసీ ఇండెక్స్‌ వీ- డెమ్ ఇనిస్టిట్యూట్ ద్వారా రూపొందించబడుతుంది.
  • దీనిని స్వీడిష్ రాజకీయ శాస్త్రవేత్త స్టాఫాన్ లిండ్‌బర్గ్ 2014లో స్థాపించారు.
  • స్వీడన్‌లోని యూనివర్శిటీ ఆఫ్ గోథెన్‌బర్గ్ యొక్క పొలిటికల్ సైన్స్ డిపార్ట్‌మెంట్ సహాయంతో ఇది రూపొందించబడుతుంది.
  • ఈ నివేదిక ప్రపంచ వ్యాప్తంగా 179 దేశాలలో ప్రజాస్వామ్య పనితీరును అంచనా వేస్తుంది.
  • ఈ నివేదిక దేశంలోని లిబరల్ డెమోక్రసీ, ఎన్నికల ప్రజాస్వామ్యం, ఎన్నికల నిరంకుశత్వం మరియు క్లోజ్డ్ ఆటోక్రసీ అంశాల ద్వారా ర్యాంకింగ్ అందిస్తుంది.

Advertisement

Post Comment