ఇంజనీరింగ్ మరియు అగ్రికల్చర్ డిప్లొమా కోర్సుల అడ్మిషన్లకు సంబంధించి తెలంగాణ పాలీసెట్ 2023 వెలువడింది. దీనికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ జనవరి 16 నుండి ఏప్రిల్ 24వ తేదీల మధ్య అందుబాటులో ఉండనుంది. పాలీసెట్ పరీక్షను మే 17 తేదీన నిర్వహిస్తున్నారు.
టెన్త్ పూర్తిచేసిన విద్యార్థులకు ఇంజనీరింగ్ లేదా నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులలో అడ్మిషన్ కల్పించేందుకు పాలీసెట్ నిర్వహిస్తారు. పాలీసెట్ అనగా పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని అర్ధం. ఈ పరీక్షను తెలంగాణ స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ & ట్రైనింగ్ నిర్వహిస్తుంది. ఈ పరీక్షలో అర్హుత పొందిన విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రభుత్వ అన్ ఎయిడెడ్ మరియు ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాలిటెక్నిక్ కాలేజీల్లో అడ్మిషన్లు కల్పిస్తారు.
అలానే పాలిటెక్నిక్ కోర్సులు నిర్వహించే ప్రైవేట్ అన్ ఎయిడెడ్ ఇంజనీరింగ్ కాలేజీలతో పాటుగా అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులను అందిస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్శిటీ (PJTSAU) మరియు దాని అనుబంధ కాలేజీల్లో కూడా ప్రవేశం పొందొచ్చు.
అదే విధంగా 2023 విద్యా ఏడాది నుండి పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ (PVNRTVU) అందిస్తున్న ఆనిమల్ హస్బెండరీ మరియు ఫిషరీస్ కోర్సులతో పాటుగా రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ అందిస్తున్న 6 ఏళ్ళ ఇంటిగ్రేటెడ్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో కూడా అడ్మిషన్ అందిస్తున్నారు.
గమనిక : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలోని ఆంధ్ర యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ మరియు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అనుబంధ కాలేజీల్లో ప్రవేశాలు పొందాలనుకునే వారు ఏపీ పాలీసెట్ పరీక్షను రాయాల్సి ఉంటుంది.
పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు (3 ఏళ్ళు)
సివిల్ ఇంజనీరింగ్ ఆర్కిటెక్చరల్ & అసిస్టెంట్షిప్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆటోమొబైల్ఇంజినీరింగ్ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ & ఇనుస్ట్రుమెంటాషన్ ఇంజనీరింగ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ మైనింగ్ ఇంజనీరింగ్ కమర్షియల్ & కంప్యూటర్ ప్రాక్టీస్ గార్మెంట్ టెక్నాలజీ |
హోమ్ సైన్స్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ ప్రింటింగ్ టెక్నాలజీ ప్యాకేజింగ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ & వీడియో ఇంజనీరింగ్ బయో మెడికల్ ఇంజనీరింగ్ లెథర్ టెక్నాలజీ ఫుట్వేర్ టెక్నాలజీ టెక్స్టైల్ టెక్నాలజీ ఎంబెడెడ్ సిస్టమ్స్ |
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్శిటీ అందిస్తున్న డిప్లొమా కోర్సులు
డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ | 2 ఏళ్ళు |
డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ | 2 ఏళ్ళు |
డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ | 3 ఏళ్ళు |
పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ అందిస్తున్న డిప్లొమా కోర్సులు
ఆనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ డిప్లొమా | 2 ఏళ్ళు |
ఫిషరీస్ పాలిటెక్నిక్ డిప్లొమా | 2 ఏళ్ళు |
RGUKT అందిస్తున్న 6 ఏళ్ళ ఇంటిగ్రేటెడ్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ అందిస్తున్న 6 ఏళ్ళ ఇంటిగ్రేటెడ్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సును రెండు అంచుల్లో అందిస్తారు. మొదటి రెండేళ్లు ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూపును అందిస్తారు. తరువాత నాలుగేళ్లు ఇంజనీరింగ్ కోర్సును (బీటెక్) ఆఫర్ చేస్తారు. రెండేళ్ల ప్రీ యూనివర్సిటీ కోర్సును పూర్తిచేసిన వారు ఎటువంటి ప్రవేశపరీక్ష రాయాల్సిన అవసరం ఉండదు.
రెండేళ్ల ప్రీ యూనివర్సిటీ కోర్సు | మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, తెలుగు/సంస్కృతం |
నాలుగేళ్ళ బీటెక్ | కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ మెటలర్జికల్ & మెటీరియల్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్. |
టీఎస్ పాలీసెట్ 2023 షెడ్యూల్
టీఎస్ పాలీసెట్ రిజిస్ట్రేషన్ ప్రారంభం | 16 జనవరి 2023 |
టీఎస్ పాలీసెట్ రిజిస్ట్రేషన్ తుది గడువు | 24 ఏప్రిల్ 2023 |
టీఎస్ పాలీసెట్ అడ్మిట్ కార్డు | మే 2023 |
టీఎస్ పాలీసెట్ 2023 ఎగ్జామ్ తేదీ | 17 మే 2023 |
టీఎస్ పాలీసెట్ ఫలితాలు | 27 మే 2023 |
టీఎస్ పాలీసెట్ ఎలిజిబిలిటీ
- విద్యార్థులు భారతీయ పౌరులై ఉండాలి.
- విద్యార్థి ఏపీ లేదా తెలంగాణ స్టేట్ బోర్డు నుండి 35% మార్కులతో పదివ తరగతి పూర్తిచేసి ఉండాలి.
- పాలీసెట్ పరీక్షకు హాజరయ్యేందుకు ఎటువంటి వయోపరిమితి లేదు.
టీఎస్ పాలీసెట్ దరఖాస్తు రుసుము & ఎగ్జామ్ సెంటర్లు
దరఖాస్తు రుసుములు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ లేదా ఈ చలానా విధానంలో చెల్లించవచ్చు. చెల్లింపు సమయంలో సర్వీస్ చార్జీలు , జీఎస్టీ వంటి అదనపు చార్జీలు ఉంటె అభ్యర్థులనే భరించాలి.
జనరల్ కేటగిరి | Rs 500/- |
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు | Rs 250/- |
పరీక్ష కేంద్రాలు 33 జిల్లాలో పరిధిలో అందుబాటులో ఉంటాయి. దరఖాస్తు చేసే సమయంలో అభ్యర్థులు తమకు అందుబాటులో ఉండే పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
టీఎస్ పాలీసెట్ దరఖాస్తు ప్రక్రియ
పాలీసెట్ కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు స్టేట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ యొక్క అధికారిక వెబ్సైటు www.sbtet.telangana.gov.in లేదా www.polycetts.nic.in ద్వారా ఆన్లైన్ విధానంలో చేసుకోవాల్సి ఉంటుంది. మొదటి ఆదశలో విద్యార్థి టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్, వ్యక్తిగత మరియు అడ్రెస్స్ వివరాలు నింపాల్సి ఉంటుంది.
తరువాత దశలో ఆధార్ నెంబరుతో పాటుగా, రిజర్వేషన్ కేటగిరి, పరీక్ష కేంద్రం ఎంపిక, లాంగ్వేజ్ ఎంపిక వంటి వివరాలు అందించాల్సి ఉంటుంది. చివరిగా చివరిగా ఎగ్జామ్ రుసుమును చెల్లించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది. చివరిగిగా దరఖాస్తు సమర్పించే ముందు మీ వివరాలు మరోసారి సరిచూసుకోవడం మరవొద్దు.
టీఎస్ పాలీసెట్ ఎగ్జామ్ నమూనా
పాలీసెట్ పరీక్ష ఆఫ్లైన్ విధానంలో 150 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష 2.30 గంటల నిడివితో ఉంటుంది. ప్రశ్నపత్రం మొత్తం నాలుగు సెక్షన్లుగా ఉంటుంది. ప్రశ్నలు పూర్తి ఆబ్జెక్టివ్ విధానంలో టెన్త్ క్లాస్ ఆధారిత మాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజీ అంశాల నుండి ఇవ్వబడతాయి. ఇందులో మ్యాథ్స్ నుండి 60 ప్రశ్నలు, ఫిజిక్స్ నుండి 30 ప్రశ్నలు, కెమిస్ట్రీ నుండి 30 ప్రశ్నలు మరియు బయాలజీ నుండి 30 ప్రశ్నలు ఇవ్వబడతాయి.
PJTSAU & PVNRTVU యూనివర్సిటీలు అందించే నాన్ ఇంజనీరింగ్ కోర్సులలో చేరే విద్యార్థులు మాత్రమే బయాలజీ ప్రశ్నలకు సమాధానం చేయాల్సి ఉంటుంది. సరైన సమాధానం చేసిన ప్రశ్నకు 1 మార్కు కేటాయిస్తారు. నెగిటివ్ మార్కులు ఉండవు. ప్రశ్నపత్రం తెలుగు/ఇంగ్లీష్ లేదా ఉర్దూ/ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది.
సెక్షన్ | సిలబస్ | ప్రశ్నలు | మార్కులు |
సెక్షన్ I | మ్యాథమెటిక్స్ | 60 ప్రశ్నలు | 60 మార్కులు |
సెక్షన్ II | ఫిజిక్స్ | 30 ప్రశ్నలు | 30 మార్కులు |
సెక్షన్ III | కెమిస్ట్రీ | 30 ప్రశ్నలు | 30 మార్కులు |
సెక్షన్ IV | బయాలజీ | 30 ప్రశ్నలు | 30 మార్కులు |
150 ప్రశ్నలు | 150 మార్కులు |
టీఎస్ పాలీసెట్ ర్యాంకింగ్ విధానం
పాలీసెట్ ర్యాంకింగ్ ఇంజనీరింగ్ మరియు నాన్ ఇంజినీరింగ్ కోర్సులకు విడివిడిగా అందిస్తారు. ఇంజనీరింగ్ కోర్సులు అందించే పాలిటెక్నిక్స్ కోసం ఎంపీసీ ర్యాంకింగ్ సహాపడుతుంది. ఇందులో కేవలం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సెక్షన్లను మాత్రమే లెక్కిస్తారు. వీటిలో ఒక్కోదానిలో కనీసం 35 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.
అలానే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్శిటీ (PJTSAU) మరియు పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలు అందించే కోర్సుల కోసం విడిగా ఎంబైపీసీ ర్యాంకింగ్ కల్పిస్తారు. ఇందులో అదనంగా బయాలజీ సెక్షన్ మార్కులు కలిపి ర్యాంకు అందిస్తారు. వీటిలో ఒక్కోదానిలో 30 శాతం మార్కులు పొందాల్సి ఉంటుంది.
టీఎస్ పాలీసెట్ సీట్లు కేటాయింపు
ఈ పరీక్షను తెలంగాణ మరియు ఏపీ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు రాసేందుకు అనుమతి ఉంది. కానీ మెజారిటీ అడ్మిషన్లు లోకల్ అభ్యర్థులకు కల్పిస్తారు. అనగా అందుబాటులో సీట్లలో 85% సీట్లు తెలంగాణ విద్యార్థులకు కేటాయిస్తారు. ఇందులో కేటగిరి వారీగా ఎస్సీలకు 15 శాతం సీట్లు, ఎస్టీలకు 6 శాతం సీట్లు మరియు బీసీలకు 29% శాతం సీట్లు కల్పిస్తారు.
తెలంగాణ (85 శాతం సీట్లు) | ఆంధ్రప్రదేశ్ (15 శాతం సీట్లు) | |
బీసీలకు | 29 శాతం సీట్లు | 29 శాతం సీట్లు |
ఎస్సీలకు | 15 శాతం సీట్లు | 15 శాతం సీట్లు |
ఎస్టీలకు | 6 శాతం సీట్లు | 6 శాతం సీట్లు |
కోర్సు ట్యూషన్ ఫీజులు & ఇతర రుసుములు
యూనివర్సిటీ / పాలిటెక్నిక్ | ఏడాదికి ఫీజు మొత్తం |
ప్రభుత్వ & ఎయిడెడ్ పాలిటెక్నిక్స్ | Rs 4,800/- |
ప్రైవేటు పాలిటెక్నిక్స్ | Rs 15,500/- |
PJTSAU | Rs 14,000-19,000/- (హాస్టల్ ఫీజులు అదనం) |
RGUKT | 37,500/- |