దేశ ఆర్థికవ్యవస్థలో నిర్మాణాత్మక, క్రియాత్మక పాత్ర పోషించే రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా రోజువారీ విధి నిర్వహణలో భాగం కావాలనుకునే వారు, ఆర్‌బిఐ నిర్వహించే గ్రేడ్ బి మరియు అసిస్టెంట్ మేనేజర్ నియామకాల ద్వారా ఆ కలను నెరవేర్చుకోవచ్చు.
ఈ ఉదోగాలకు ఎంపికవ్వడం ద్వారా ఇండియన్ ఎకానమీ నిర్వహణలో కీలక పాత్ర వహించే అవకాశంతో పాటుగా, మీ పరిశోధనాత్మక ఆలోచనల ద్వారా బలమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో మీవంతు బాధ్యత వహించే అవకాశం దొరుకుతుంది. ఆర్‌బిఐ గ్రేడ్ బి అధికారుల ప్రారంభ వేతనం 35150/- నుండి ప్రారంభమోతుంది.
దీనికి ఇతర అలోవెన్సులు అన్నీ కలుపుకుంటే నెలకు గరిష్టంగా 70208/- వరకు అందుతుంది. అసిస్టెంట్ మేనేజర్స్ కు 17000/- ప్రారంభ వేతనం కేటాయించగా, ఇతర అలోవెన్సులు కలుపుకుంటే వీరిక్కూడా నెలకు గరిష్టంగా 43183/- వరకు లభిస్తుంది.
దేశ ఆర్థిక వ్యవస్థకి సంబంధించి సమస్త కార్యకలాపాలు ఒంటిచేతితో నిర్వహించే ఆర్‌బిఐ తెర వెనక నిరంతర సవాళ్ళను స్వీకరిస్తూ, మక్కువతో పనిచేసే సిబ్బంది పాత్ర ఉంటుంది. ద్రవ్యోల్బణం అదుపులో ఉంచడం, ఉత్పాదక రంగానికి ద్రవ్యలోటు లేకుండా చూడటం, వడ్డీ రేట్లు, మారక రేట్లలలో స్థిరత్వాన్ని నిర్దారించుట, కెరెన్సీ ముద్రణ, కెరెన్సీ చలామణి, వాణిజ్య చెల్లింపులు సులభతరం చేయడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలు నిర్వహణ, బ్యాంకులు, ఫైనాన్సియల్ సంస్థల పనితీరు, నిర్వహణ నిబంధనలు రూపొందించడం, నూతన టెక్నాలజీ రూపకల్పన వంటి అనేక విధులలో వీరు నిరంతరం నిమగ్నమై ఉంటారు.
ఆర్‌బిఐ రెండు కేటగిరీలలో తమ సిబ్బందిని నియమించుకుంటుంది. మొదటి కేటగిరిలో క్లాస్ 1 గ్రేడ్ బి అధికారులను, రెండవ కేటగిరిలో వివిధ విధులకు సంబంధించి అసిస్టెంట్ మేనేజర్ స్థాయి పోస్టులను భర్తీచేస్తుంది.
ఆర్‌బిఐ గ్రేడ్ -బి ఆఫీసర్ ఎగ్జామ్
ఆర్‌బిఐ గ్రేడ్ బి అధికారుల నియామకం మూడు ఫేజ్ లలో నిర్వహిస్తారు. మొదటి ఫేజ్ లో ప్రిలిమ్స్ పరీక్ష, రెండవ ఫేజ్ లో మెయిన్స్ పరీక్ష, మూడవ ఫేజ్ లో వ్యక్తిగత ఇంటర్వ్యూ తో నియామక ప్రక్రియ పూర్తివుతుంది. ఫేజ్ లో నాలుగు సెక్షన్లతో, రెండవ గంటల నిడివితో, 200 మార్కుల ఆబ్జెక్టివ్ టెస్ట్ నిర్వహిస్తారు.
ఇందులో అర్హుత సాధించిన వారికి ఫేజ్ 2 కు ఆహ్వానిస్తారు. ఫేజ్ 2 లో 90 నిముషాల వ్యవధితో 100 మార్కుల చెప్పున పేపర్ 1,2,3 పేరుతో మూడు పరీక్షలు నిర్వహిస్తారు. ఫేజ్ 2 క్వాలిఫై అయినా అభ్యర్థులకు వ్యక్తిగత ఇంటర్వ్యూ కి ఆహ్వానిస్తారు. వ్యక్తిగత ఇంటర్వ్యూ లో చూపిన ప్రతిభ ఆధారంగా తుది జాబితా తయారుచేస్తారు.
ఎంపికైన అభ్యర్థులకు ఆర్‌బిఐ నియామక బోర్డు నుండి అప్పోయింట్మెంట్ లేటర్ అందుతుంది. నియామక లేటర్ అందుకున్న అభ్యర్థులు ఆర్‌బిఐ నియామక నిబంధనలు సమ్మతిస్తూ లేటర్ రాయాల్సి ఉంటుంది. అలానే వ్యక్తిగత మెడికల్ రిపోర్టు, పోలీసు వెరిఫికేషన్ రిపోర్టు, రిఫరీ రిపోర్ట్, ఎంప్లోయర్ రిపోర్టు అందించాల్సి ఉంటుంది. ఈ ఫార్మాలిటీస్ పూర్తిచేసుకున్న అభ్యర్థులను చెన్నై రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా స్టాఫ్ కాలేజ్ కు ట్రీయినింగ్ నిమిత్తం పంపిస్తారు.
ఆర్‌బిఐ గ్రేడ్ బి ప్రిలిమ్స్ పరీక్ష నమూనా (సమయం 2గంటలు ) | ||
---|---|---|
సెక్షన్ | ప్రశ్నలు | మార్కులు |
జనరల్ అవేర్నెస్ | 80 | 80 |
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | 30 | 30 |
జనరల్ ఇంగ్లీష్ | 30 | 30 |
రీజనింగ్ ఎబిలిటీ | 60 | 60 |
మొత్తం | 200 | 200 |
ఆర్‌బిఐ గ్రేడ్ బి మెయిన్స్ పరీక్ష నమూనా | ||
---|---|---|
పేపర్ పేరు | పేపర్ టైపు | సమయం |
పేపర్ 1: ఎకనామిక్ మరియి సోషల్ ఇస్స్యూస్ | ఆబ్జెక్టివ్ పరీక్ష | 90 నిముషాలు |
పేపర్ 2: ఇంగ్లీష్ (రాత నైపుణ్య పరీక్ష) | డిస్క్రిప్టివ్ పరీక్ష | 90 నిముషాలు |
పేపర్ 3: ఫైనాన్స్ మరియు మానేజ్మెంట్ | ఆబ్జెక్టివ్ పరీక్ష | 90 నిముషాలు |
ఆర్‌బిఐ అసిస్టెంట్ మేనేజర్స్ ఎగ్జామ్
ఆర్‌బిఐ అసిస్టెంట్ మేనేజర్ స్థాయి నియామకాలకు సంబంధించి యెటువంటి ఎంపిక పరీక్ష ఉండదు. ఈ పోస్టులు వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా భర్తీచేస్తారు. ఈ కేడర్లో ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బిఐ శాఖలలో అసిస్టెంట్ మేనేజర్ (సెక్యూరిటీ), మేనేజర్ (టెక్నికల్), లైబ్రేరియన్ వంటి వివిధ విధులు నిర్వర్తిస్తారు