ఉడాసిటీ ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌లు : లేటెస్ట్ టెక్ స్కిల్స్ నేర్చుకోండి
Online Education Useful websites

ఉడాసిటీ ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌లు : లేటెస్ట్ టెక్ స్కిల్స్ నేర్చుకోండి

కెరీర్ సంబంధిత సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపర్చేందుకు ఉడాసిటీ ఉత్తమ ఎంపిక. ఆన్‌లైన్ లెర్నింగ్ వేదికల్లో పూర్తిస్థాయి ప్రోఫిసినల్ కోర్సులు అందిస్తున్న సంస్థల్లో ఉడాసిటీ ముందు వరుసలో ఉంది. ఉడాసిటీ 2011 లో సెబాస్టియన్ థ్రన్ , డేవిడ్ స్టావెన్స్ మరియు మైక్ సోకోల్స్కీ లచే స్థాపించబడింది.

Advertisement

ఉడాసిటీ మొదట విశ్వవిద్యాలయ తరహా కోర్సులను అందించడంపై దృష్టి సారించినప్పటికీ, ప్రస్తుతం ఇది వృత్తి పరమైన సాంకేతిక నైపుణ్యలు మెరుగుపర్చే కోర్సులపై ఎక్కువ దృష్టి సారిస్తుంది. ఉడాసిటీ ప్రధానంగా ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్, క్లౌడ్ కంప్యూటరింగ్, డేటా సైన్స్, ప్రోగ్రామింగ్ డెవలప్మెంట్, బిజినెస్ మరియు అటానమస్ సిస్టమ్స్ సంబంధిత కోర్సులను అందిస్తుంది.

ఉడాసిటీ ఈ కోర్సులలో కొన్నింటిని ఉచితంగా ఆఫర్ చేస్తుంది. మిగతా కోర్సులకు రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. ఉడాసిటీ కోర్సులు ఇండస్ట్రీ అవసరాలకు సరిపడే పూర్తిస్థాయి ఉపాధి నైపుణ్యాలను అందించే విధంగా రూపొందించారు. కోర్సులు అన్ని రియల్ టైమ్ ఆక్టివ్ ప్రోజెక్టులచే అనుసందించబడి ఉంటాయి.

ప్రతి కోర్సుకు సబ్జెక్టు పరమైన సలహాలు, సందేహాలు తీర్చేందుకు 25/7 నిపుణల సపోర్ట్ అందిస్తారు. కోర్సులు అన్ని అభ్యర్థులకు అందుబాటులో ఉండే సమయాల్లో నేర్చుకునేందుకు అనువుగా రూపొందించారు. వీటితో పాటుగా బెర్టెల్స్‌మన్-టెక్-స్కాలర్‌షిప్‌ పేరుతో మెరిట్ అభ్యర్థులకు ఉడాసిటీ స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ అందిస్తుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో ఆసక్తి, అభిరుచిని అనుచరించి 15000 మందికి ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్, క్లౌడ్ కంప్యూటరింగ్, డేటా సైన్స్ అంశాలపై 3 నెలల బేసిక్ అవగాహనా అందిస్తారు.

ఇందులో  అత్యున్నత ప్రతిభ కనబర్చిన టాప్ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఊడాసిటీ లైఫ్ టైమ్ ఉచితంగా ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. దానితో పాటుగా కెరీర్ పరంగా ఉన్నత స్థాయిలో స్థిరపడేందుకు సహకరిస్తారు. అలానే వృత్తి జీవితానికి ఉపకరించే ప్రపంచ స్థాయి కోడింగ్ నైపుణ్యాన్ని అందిస్తారు.

ఉడాసిటీ ఆఫర్ చేస్తున్న కోర్సులు

ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్ క్లౌడ్ కంప్యూటరింగ్
డేటా సైన్స్ ప్రోగ్రామింగ్ డెవలప్మెంట్
బిజినెస్ అటానమస్ సిస్టమ్స్

ఉడాసిటీ కోర్సుల ప్రయోజనాలు

  • ఉడాసిటీ టాప్ క్వాలిటీ ప్రోఫిసినల్ కంటెంట్ అందిస్తుంది
  • ఉడాసిటీ కొన్ని కోర్సులను ఉచితంగా అందిస్తుంది
  • ఉడాసిటీ అన్ని కోర్సులకు 24/7 నిపుణల సపోర్ట్ అందిస్తుంది
  • ఉడాసిటీ కోర్సులను ఎంపిక చేసుకోవడం ద్వారా రియల్ టైమ్ ప్రోజెక్టు యందు పనిచేసే అవకాశం ఉంటుంది
  • లైవ్ కోడ్ ప్రాక్టీస్ సదుపాయం లభిస్తుంది. కోర్సులను మీకు అందుబాటులో ఉండే సమయాల్లో నేర్చుకోవచ్చు
  • పూర్తి చేసిన కోర్సులకు యూనివర్సిటీ స్థాయి సర్టిఫికెట్ అందిస్తారు
  • ఉడాసిటీ డిగ్రీకి ప్రముఖ కంపెనీలు ప్రాధాన్యత ఇస్తాయి

ఉడాసిటీ కోర్సుల ప్రతికూలతలు

  • ఉచిత కోర్సులు పక్కన పెడితే ఉడాసిటీ కోర్సులు ఫీజులు చాల ప్రీమియం
  • ఉడాసిటీ కోర్సులకు అనుకునేంత కమ్మూనిటీ ఫారం సపోర్టు లేదు
  • ఉడాసిటీ కోర్సులు ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే అందుబాటులో ఉంటాయి
  • ఉడాసిటీ కోర్సులు కంటెంట్ పరంగా పరిమితంగా ఉంటాయి.

ఉడాసిటీ కోర్సులు ప్రయోజనాలు మరియు ప్రతికూలతలు కొంచెపు పక్కన పెడితే, వృత్తిపరమైన సాంకేతిక నైపుణ్యలు మెరుగుపర్చే కోర్సులు మీరు ఆన్‌లైన్ ద్వారా పూర్తిచేయాలనుకుంటే ఉడాసిటీ ఉత్తమ ఎంపిక అవుతుంది.

ఉడాసిటీ అందించే పూర్తిస్థాయి ఇండస్ట్రీ లీడింగ్ ప్రోఫిసినల్ కోర్సులు కెరీర్ పరంగా స్థిరపడేందుకు, వృత్తి జీవితంలో ఇంకో అడుగు ముందుకు వేచేందుకు మీకు పూర్తిస్థాయిలో ఉపయోగపడతాయి.

Advertisement