నేడే వెబ్‌సైట్ ప్రారంభించండి | బ్లాగింగ్ కెరీర్ అవకాశాలు
Career Options

నేడే వెబ్‌సైట్ ప్రారంభించండి | బ్లాగింగ్ కెరీర్ అవకాశాలు

ఈ తరం యువతకు ఇంటర్నెట్ మాద్యం అనేక మార్గాలలో ఉపాధిని కల్పిస్తుంది. అందులో బ్లాగింగ్ ఒకటిగా చెప్పొచ్చు. నిజానికి బ్లాగింగ్ సంబంధించి చాలా మందికి అవగాహన ఉండదు. బ్లాగింగ్ అనేది ఒక కెరీర్ ఛాయస్ అనే సంగతి కూడా వారికీ తెలియదు.

Advertisement

వాస్తవానికి ఈ రంగంలో లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. నెలకు లక్షలలో సంపాదించే వారు కూడా ఉన్నారు. ఇంతకీ బ్లాగింగ్ అంటే ఏమిటి, దాని ద్వారా ఎలా ఉపాధి పొందాలి వంటి అనేక వివరాలు ఈ పోస్టు ద్వారా తెలుసుకుందాం.

బ్లాగ్ & బ్లాగింగ్ అంటే ఏమిటి ?

బ్లాగ్ అంటే ఇంటర్నెట్ పరిభాషలో వెబ్‌సైట్ అని అర్ధం. ఆ వెబ్‌సైట్ ద్వారా అక్షర, వీడియో, ఆడియో లేదా ఫోటోల రూపంలో కంటెంట్ పబ్లిష్ చేయడాన్ని బ్లాగింగ్ అంటారు, కంటెంట్ పబ్లిష్ చేసే వారిని బ్లాగర్ అంటారు.

ఇంటర్నెట్ తొలిరోజుల్లో బ్లాగులను వ్యక్తిగత అభిరుచులను బయట ప్రపంచానికి పంచుకునేందుకు ఉపయోగించే వారు. ప్రస్తుతం వీటిని స్వయం ఉపాధి మార్గాలుగా మలుచుకుంటున్నారు. అలా బ్లాగింగును కెరీరుగా ఎంపిక చేసుకున్న తొలితరం బ్లాగర్లు అందరు ప్రస్తుతం లక్షల్లో సంపాదిస్తున్నారు.

మీకు ఆసక్తి ఉంటె బ్లాగింగులో రాణించడం చాలా సులభం. మీరు ఒక ట్రావెలర్ అయితే మీరు ప్రయాణించిన యాత్ర స్థలాల విశేషాలు, ప్రయాణ అనుభవాలు, అక్కడ వసతి సదుపాయాలు వంటి అంశాలతో బ్లాగ్ ప్రారంభించవచ్చు.

మీరు ఒక ఫ్రీలన్సర్ జర్నలిస్టు అయితే మీ విశ్లేశణలు, సేకరించిన వార్తలను పబ్లిష్ చేసేందుకు బ్లాగును ప్రారంభించవచ్చు. అలానే ఫుడ్, ఫాషన్, ఎడ్యుకేషన్, హెల్త్ మరియు వినోదం వంటి అనేక అంశాలకు సంబంధించిన సమాచారం అందించేందుకు బ్లాగింగు మొదలుపెట్టొచ్చు.

బ్లాగింగ్ కెరీర్ ఎవరికి సరిపోతుంది ?

బ్లాగింగ్ అనేది ఒక కళ. అందులో విజయం సాధించాలంటే మీకు ఏదో ఒక కళ యందు ఆసక్తి, అభిరుచి, నైపుణ్యం కలిగి ఉండాలి. అలానే బ్లాగింగ్ అనేది కంటెంట్ ఆధారితమైనది. మీ ఆలోచనలను, భావాలను అక్షర రూపంలో అందించాల్సి ఉంటుంది. దీని కోసం కంటెంట్ రైటింగ్ యందు నైపుణ్యం పొందాల్సి ఉంటుంది. వీటితో పాటు ఈ రంగంలో రాణించాలంటే చేసే పని యందు విషయ పరిజ్ఞానం, క్రమశిక్షణ, పట్టుదల, ఓపిక, కొత్త సంగతులు తెలుకోవాలనే ఆసక్తి తప్పనిసరి.

  • రోజువారీ ఉద్యోగ జీవితం నప్పని వారికీ బ్లాగింగు సరైన ప్రత్యామ్నాయం·
  • వ్యవస్థాపక ఆలోచనలు ఉన్నవారికి బ్లాగింగ్ కెరీర్ చక్కగా సరిపోతుంది.
  • ఫ్యాషన్, ట్రావెలింగ్, ఫుడ్ వంటి అంశాల యందు ఆసక్తి ఉన్నవారికి బ్లాగింగ్ మంచి కెరీర్ మార్గం.
  • వృత్తి నిపుణులకు బ్లాగింగు చక్కని ఉపాధి మార్గాన్ని అందిస్తుంది.
  • జర్నలిస్టులు, జర్నలిజం పై ఆసక్తి ఉన్నవారు బ్లాగింగును కెరీరుగా ఎంపిక చేసుకోవచ్చు.
  • ఆర్టిస్టులు, డాన్సర్లు, మ్యూజిషిన్లు వంటి వారికీ బ్లాగింగ్ స్వయం ఉపాధిని అందిస్తుంది.

బ్లాగింగ్ ఒక సంక్లిష్టమైన కెరీర్ మార్గం. ఇందులో వంద శాతం సక్సెస్ రేటు ఉంటుంది. కొన్ని సంధర్భాలలో ఒక శాతం సక్సెస్ రేటు కూడా ఉండదు. దీనికి ప్రధానమైన కారణం దాని యందు సరైన అధ్యయనం, అవగహన లేకుండా ప్రవేశించడం ఒకటైతే, ఎంపిక చేసుకున్న రంగంలో విషయ నైపుణ్యం లేకపోవడం రెండవది. ఈ రెండూ ఉండి, ఓపికతో కృషి చేసేవాడు ఈ రంగంలో ఫెయిల్ అయినా దాఖలాలు లేవు.

బ్లాగ్ / వెబ్‌సైట్ ఎలా ప్రారంభించాలి

ఇవాళ్టి రోజుల్లో బ్లాగ్ లేదా వెబ్‌సైటును ప్రారంభించడం చాలా సులభమైన పని. కేవలం కొన్ని నిముషాలలో ఈ ప్రక్రియను పూర్తి చేయొచ్చు. మీకు ఏవిధమైన కోడింగ్ పరిజ్ఞానం లేకుండా కంటెంట్ మానేజ్మెంట్ సిస్టమ్ (CMS) సాఫ్ట్‌వేర్ల ద్వారా చిటికిలో మీ సైటును లాంచ్ చేయొచ్చు. వెబ్‌సైటును ప్రారంభించే ముందు కొన్ని విషయాలపై మీకు క్లారిటీ ఉండాలి.

మీరు కేవలం వ్యక్తిగత అభిరుచితో, మీ అభిప్రాయాలను వ్యక్తపర్చేందుకు మాత్రమే బ్లాగింగ్ ప్రారంభిస్తే, దానికోసం బ్లాగర్, వర్డ్‌ప్రెస్, విక్స్, లింక్డ్‌ఇన్, ఘోస్ట్, టంబ్లర్, వీబ్లీ వంటి ఉచిత బ్లాగింగ్ వేదికలు మీకు అందుబాటులో ఉన్నాయి. ఈ వేదికల ద్వారా మీరు ఫ్రీగా మీ వెబ్‌సైటును ప్రారంభించవచ్చు.

అలా కాకుండా ప్రొఫిషినల్ లేదా కమర్షియల్ బ్లాగును ప్రారంభించి, దాని ద్వారా స్వయం ఉపాధిని పొందాలని భావిస్తే దాని కోసం మీరు కొంత ఆర్థిక వనరులను వెచ్చించాల్సి ఉంటుంది. ఒక వెబ్‌సైటును ప్రారంభించేందుకు మీకు ముందుగా డొమైన్ మరియు వెబ్ హోస్టింగ్ ప్లాన్ అవసరమౌతాయి. వీటిని మీరు వెబ్ హోస్టింగ్ సేవలు అందించే సంస్థల నుండి నిర్దిష్ట రుసుములు చెల్లించి, నిర్దిష్ట కాలపరిమితితో రిజస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

డొమైన్ అంటే ఏమిటి & డొమైన్ నేమ్ రిజిస్టర్ చేసుకోవడం ఎలా ?

డొమైన్ అనేది మీ వెబ్‌సైట్ పేరుకు సంబంధించిన అంశం. ఇది అంతర్జాలంలో మీ సైటును గుర్తుపట్టేందుకు సహాయపడుతుంది. డొమైన్ ఫార్మాట్ http://www.example.com మాదిరిగా ఉంటుంది. ఇందులో http అనగా హైపర్ టెక్స్ట్ ట్రాన్సఫర్ ఫొటోకాల్ అని అర్ధం దీనిని సాధారణంగా ఇంటర్నెట్ ఫొటోకాల్ అంటారు.

What Is Domain Domain

www అనగా వరల్డ్ వైడ్ వెబ్ అని అర్ధం. దీనిని సాధారణంగా సబ్ డొమైన్ అని పిలుస్తారు. అలానే చివరిన ఉన్న .com ను డొమైన్ ఎక్సటెన్షన్ అంటారు.

డొమైన్ ఎక్సటెన్షన్లు .com (టాప్ లెవెల్ డొమైన్), .net (నెటవర్క్), .org (ఆర్గనైజషన్), .govt (గవర్నమెంట్), .in (ఇండియా), .us (యునైటెడ్ సెట్స్), uk (ఇంగ్లాండ్) ఇలా సుమారు 500 సంఖ్యలో ఇవి అందుబాటులో ఉంటాయి. ఇందులో .com అనేది పాపులర్ డొమైన్ ఎక్సటెన్షనుగా పరిగణించబడుతుంది.

www మరియు డొమైన్ ఎక్సటెన్షన్ మధ్య ఉండే భాగాన్ని డొమైన్ పేరు లేదా వెబ్సైటు పేరు అని అంటారు. ఈ మొత్తం ఫార్మేటును కలిపి యూనిఫార్మ్ రిసోర్స్ లొకేటర్ (యుఆర్ఎల్) లేదా వెబ్ అడ్రెస్స్ అని అంటారు.

డొమైన్ రిజిస్ట్రేషన్ అనేది వెబ్ హోస్టింగ్ సేవలు అందించే సంస్థల దగ్గరే అందుబాటులో ఉంటుంది. వీటిని పరిమిత రుసుము చెల్లించి కనీసం ఏడాది లేదా అంతకు మించి కాలపరిమితితో రిజస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

డొమైన్ అనేది మీ సంస్థ లేదా వ్యాపారం యొక్క పర్మినేట్ అడ్రెసును తెలియపరుస్తుంది. దాన్ని రిజస్టర్ చేసుకునే ముందు ఖచ్చితమైన పేరును ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అలానే సదురు పేరుతో ముందుగా .com ఎక్సటెన్షన్ అందుబాటులో ఉందొ లేదో చూసుకోవాలి. లేకుంటే పేరు మార్చుకోవడంలో లేదా .in వంటి డొమైన్లను ఎంపిక చేసుకోవాలి.

వెబ్ హోస్టింగ్ అంటే ఏమిటి & హోస్టింగ్ ప్లాన్ ఎంపిక చేసుకోవడం ఎలా ?

వెబ్‌సైటును ప్రారంభించడంలో రెండవ ప్రధానమైన అంశం వెబ్ హోస్టింగ్. వెబ్ హాస్టింగు అనేది వెబ్‌సైట్ యొక్క డేటాను అంతర్జాలంలో భద్రపరిచే అంశానికి సంబంధించింది. హోస్టింగ్ సేవలు అందించే సంస్థలు, మీరు అందించే వెబ్ కంటెంటును మీ రీడర్లలు లేదా కస్టమర్లు వీక్షించేలా అందుబాటులో ఉంచుతాయి. ఈ సేవలను మీరు కొంత రుసుము చెల్లించి పొందాల్సి ఉంటుంది.

సర్వర్ స్పీడ్ మరియు హోస్టింగ్ సంస్థలు అందించే వివిధ ప్రీమియర్ సేవలు ఆధారంగా వెబ్ హోస్టింగ్ మీకు ప్రధానంగా నాలుగు రకాలుగా అందుబాటులో ఉంటుంది. అందులో మొదటిది షేర్డ్ హోస్టింగ్. షేర్డ్ హోస్టింగు అనగా ఒక వెబ్ సర్వరును భహుళ సంఖ్యలో వెబ్సైట్లు పంచుకోవడమని అర్ధం.

అనగా ఒక సర్వర్ యందు వందల సంఖ్యలో వెబ్సైట్లు హోస్ట్ చేయబడతాయి. షేర్డ్ హోస్టింగ్ సేవలు పరిమిత రుసుములో అందుబాటులో ఉంటాయి. ప్రారంభ బ్లాగర్లు, తక్కువ వ్యూర్షిప్ ఉండే బ్లాగర్లకు షేర్డ్ హోస్టింగ్ చక్కగా సరిపోతుంది.

ఇక రెండవది వర్చువల్ ప్రైవేట్ సర్వర్ హోస్టింగ్ (VPS). వీపీఎస్ సర్వర్ అనగా మీ వెబ్సైటు కోసం స్వీయ నిర్వహణ సదుపాయంతో పూర్తిస్థాయి వర్చువల్ ప్రైవేట్ సర్వర్ కేటాయించబడింది. ఇది కొత్తగా ప్రారంభించిన లేదా మీడియం స్థాయి స్టార్టప్ సంస్థలకు సరిపోతుంది. వీటి రుసుము షేర్డ్ హోస్టింగ్ కంటే అధికంగా ఉంటుంది.

ఇక మూడవది డెడికేటెడ్ సర్వర్. వీటిని హైపెరఫార్మెన్సు సర్వర్స్ అంటారు. ఎక్కువ వ్యూర్షిప్ ఉండే కార్పొరేట్ సంస్థలు, కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు దీనిని ఉపయోగిస్తాయి. ఇందులో పూర్తి నియంత్రణతో కూడిన డెడికేటెడ్ సర్వర్ సెటప్ కేటాయించబడింది.

ఇక చివరిది క్లౌడ్ హోస్టింగ్. క్లౌడ్ హోస్టింగ్ అనేది సాంప్రదాయ హోస్టింగ్ వలె కాకుండా పూర్తి అంతర్జాల సర్వర్ల ద్వారా నియంత్రించబడుతుంది. ఇది వినియోగదారుల అవసరం మేరకు సర్వర్ పెంపు లేదా తగ్గింపు అవకాశాలను అందిస్తుంది. షేర్డ్ హోస్టింగ్ కంటే వీటి పనితీరు ఉన్నంతగా ఉంటుంది. ఒక మాదిరి వ్యూర్షిప్ ఉండే బ్లాగర్లకు, చిన్నస్థాయి ఈ కామర్స్ సంస్థలకు ఈ హోస్టింగ్ సరిపోతుంది.

హోస్టింగ్ సేవలు అందించే సంస్థలు ప్రస్తుతం మార్కెట్టులో వందల్లో అందుబాటులో ఉన్నాయి. మీ అవసరాలు, అవి అందించే సేవలు, సెక్యూరిటీ, సంస్థ పనితీరు ఆధారంగా వాటిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. హోస్టింగ్ సేవలు అందిస్తున్న సంస్థల్లో బ్లూహోస్ట్, హోస్ట్‌గేటర్, బిగ్ రాక్, గోడాడీ, అమెజాన్ వెబ్ సర్వీస్, గూగుల్ క్లౌడ్ వంటి పాపులర్ సంస్థలు ఇండియాలో సేవలు అందిస్తున్నాయి. వీటితో పాటుగా స్థానికంగా కూడా చాలా సంస్థలు ఈ సేవలు అందిస్తుంది.

బ్లాగింగ్ ద్వారా మనీ ఎలా సంపాదిస్తారు ?

మానిటైజేషన్, అఫిలియేటింగ్, పైడ్ సర్వీసెస్, ఈ కామర్స్ వంటి వివిధ రూపాల ద్వారా వెబ్‌సైట్ నుండి మీరు డబ్బులు సంపాదించవచ్చు. ఇందులో ప్రధానమైనది మానిటైజేషన్. మానిటైజేషన్ అనగా మీ వెబ్‌సైట్ యందు ప్రకటనలను చొప్పించడం ద్వారా డబ్బు సంపాదించడం అని అర్ధం.

ఇందులో మీరు నేరుగా ప్రకటన దారుల ద్వారా ప్రకటన ఒప్పందాలు పొందొచ్చు లేదా గూగుల్ యాడ్‌సెన్స్ వంటి యాడ్ నెట్‌వర్క్‌ సంస్థల్లో రిజిస్టర్ చేసుకోవడం ద్వారా ప్రకటనలు పొందాల్సి ఉంటుంది. 90 శాతం బ్లాగర్లు గూగుల్ యాడ్‌సెన్స్ ఆధారిత మానిటైజేషన్ ద్వారానే స్వయం ఉపాధి పొందుతున్నారు.

ఇక రెండవది అఫిలియేటింగ్ మార్కెట్. అఫిలియేటింగ్ మార్కెట్ అనగా మీ వెబ్సైటు యందు ఇతర సంస్థల యొక్క సేవలపై అభిప్రాయాలు రాస్తూ, ఆ సేవలను మీ వినియోగ దారులకు సిఫార్సు చేయడం ద్వారా కమిషన్ పొందుతారు. అనగా మీ సైట్ ద్వార వినియోగదారుల ట్రాఫిక్'ను సదురు సంస్థకు పంపాల్సి ఉంటుంది. దీని కోసం మీరు ఆయా సంస్థల వద్ద అఫిలియేటింగ్ ఒప్పందాన్ని పొందల్సి ఉంటుంది. మీకు ఉత్పత్తుల రివ్యూ రైటింగు యందు నైపుణ్యం ఉంటె అఫిలియేటింగ్ మార్కెట్ మిమ్మల్ని కుబేరులను చేస్తుంది.

ఇక మూడవది ప్రీమియం సేవలు అందించడం ద్వారా మీరు డబ్బు సంపాదించొచ్చు. మీరు వృత్తి నిపుణులు అయినట్లు అయితే ఏదైనా ప్రత్యేక అంశానికి సంభందించి కోర్సులు రూపొందించడం, ఆన్‌లైన్ టీచింగ్ వీడియోలు రూపొందించడం, కన్సల్టింగ్ సేవలు, యోగ శిక్షణ మరియు మీరు కళాకారులు అయితే దానికి చెందిన ప్రదర్శనులు లేదా శిక్షణ వీడియోలు చేయడం ద్వారా మీరు డబ్బు సంపాధించవచ్చు. అనగా సబ్‌స్క్రిప్షన్ పద్దతిలో మీ సేవలను విక్రయించడం ద్వారా మీరు డబ్బు సంపాదించాల్సి ఉంటుంది. చివరిగా ఈకామర్స్ ద్వారా మీ ఉత్పత్తులు అమ్మడం ద్వారా డబ్బు సంపాధించవచ్చు.

బ్లాగింగ్ యందు విజయం సాధించడం ఎలా ?

ముందు చెప్పినట్లే బ్లాగింగ్ అనేది ఒక సంక్లిష్టమైన కెరీర్ మార్గం. ఇందులో మీరు విజయం సాధించాలనంటే చాలా గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒక సంస్థగా ఇందులో అడుగుపెడితే పెద్దగా హైరానా పడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటె దానికి సంబధించిన వృత్తి నిపుణులను మీరు నియమించుకోవచ్చు. కాని ఒక వ్యక్తిగా మీరు ఇందులోకి ప్రవేశిస్తే పదిమంది చేయాల్సిన పనిని మీరొక్కరే చేయాల్సి ఉంటుంది. అలానే వాటికీ సంబంధించిన  అంశంపై మీరు పట్టు సాధించాల్సి ఉంటుంది.

బ్లాగరుగా విజయం సాధించాలంటే మీరు ముందుగా వెబ్సైటు నిర్మాణంలో అవసరమయ్యే సాంకేతిక అంశాల యందు మీకు ప్రాథమిక అవగాహనా ఉండాలి, లేదా వాటిని నేర్చుకోవాలి. వెబ్సైట్లు సాధారణంగా హెచ్టిఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్, పీహెచ్పీ వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజుల ఆధారంగా రూపొందించబడతయి. ఇవి అన్ని ప్రాథమిక కోడింగ్ భాషలు.

వీటిని మీరు యూట్యూబ్ వంటి వేదికల ద్వారా ఉచితంగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. వీటిని మీరు కొన్ని వారాలు లేదా నెలలలో నేర్చుకోవచ్చు. ఇవి తెలియక పోయినా మీరు వెబ్సైట్లు నిర్మించవచ్చు కాని..మీ వినియోగదారులకు ఉత్తమ వ్యూర్షిప్ అనుభూతిని అందించాలంటే వీటిని నేర్చుకుని తీరాలి.

ఇక పోతే మీ వెబ్సైటు వినియోగదారులకు చేరేందుకు మీరు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ (ఎస్ఈఓ) కోర్సును నేర్చుకోవాలి. నిజానికి ఇది కూడా ఒక ప్రత్యేక కెరీర్ మార్గం. ప్రతి రోజు ఇంటర్నెట్ యందు కొన్ని లక్షల సంఖ్యలో కొత్త వెబ్సైట్లు రూపొందించబడతాయి.

మీరు గూగుల్ సెర్చ్ యందు ఏదైనా అంశాన్ని శోధించినప్పుడు కొన్ని సెకండ్లలో కొన్ని కోట్ల వెబ్సైట్లు సెర్చ్ రిజల్ట్ యందు ప్రత్యక్షమౌతాయి. అందులో మీరు కేవలం ముందు వరుసలో ఉన్న టాప్ 3 లేదా 4 వెబ్సైటులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. అంటే మీ వెబ్సైటు ఆ 3 లేదా 4 స్థానాల్లో ఉండల్సి ఉంటుంది. అలా ఉండాలి అంటే మీకు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ గురించి తెలిసి ఉండాలి.

సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కోర్సు కూడా మీకు యూట్యూబ్ వంటి వేదికల్లో ఉచితంగా అందుబాటులో ఉంటుంది. ఇందు మీకు ప్రధానంగా, కంటెంట్ ఎలా రాయాలి, వాటికీ ఏవిధంగా పేర్లు పెట్టాలి. ఎటువంటి కీవర్డ్స్ ఉపయోగించాలి వంటి వివిధ సాంకేతిక అంశాలు మీకు నేర్పిస్తారు.

ఇక అలానే మీరు బాగ్గింగ్ యందు రాణించాలి అంటే ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ వంటి అంశాల యందు తర్పీదు పొందాల్సి ఉంటుంది. ఇలా అన్ని విషయాల యందు పూర్తి పరిజ్ఙానం పొంది, మీ వినియోగదారులకు ఉత్తమమైన కంటెంట్ అందించడం ద్వారా మీరు ఈ మార్గంలో విజయం సాధించవచ్చు.

ముగింపు వ్యాఖ్యలు

బ్లాగింగ్ అనేది ఒక మహాసముద్రం. దీని కోసం ఎంతో సమయం, మనీ కేటాయించాల్సి ఉంటుంది. చిటికిలో వెబ్సైటు రూపొందించండి వంటి ప్రకటనలు చూసి చాల మంది ఇందులో ప్రవేశించి విలువైన సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు.

బ్లాగింగ్ యందు రాణించాలనంటే మీరు రాత్రి, పగలు తేడా లేకుండా కష్టపడాల్సి ఉంటుంది. అందరికి రాత్రికి రాత్రే విజయం దక్కదు.. దాని కోసం కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలు ఎటువంటి ఆదాయం లేకుండా పనిచేయాల్సి ఉంటుంది. ఆరు, నూరు అయినా దీనినే కెరీరుగా మల్చుకోవాలనుకునే వారు మాత్రమే ఇందులో ప్రవేశించండి. ప్రారంభంలో మీరు కొంత కష్టపడాల్సి ఉన్నా, ఒకసారి విజయం సాధించాక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. విజయోస్తూ...!

Advertisement

Post Comment