ఇండియన్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం) లలో మేనేజ్‌మెంట్ కోర్సుల యందు అడ్మిషన్ జరిపేందుకు నిర్వహించే క్యాట్ 2023 నోటిఫికేషన్ వెలువడింది. క్యాట్ అనగా కామన్ అడ్మిషన్ టెస్ట్ అని అర్ధం. క్యాట్ పరీక్షలో అర్హుత పొందడం ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న 20 ఐఐఎంలతో పాటుగా ఇతర మేనేజ్‌మెంట్ ఇనిస్టిట్యూట్లలో అడ్మిషన్ పొందవచ్చు.
Exam Name | CAT 2023 |
Exam Type | Entrance Exam |
Eligibility For | MBA,PGP |
Exam Date | 26/11/2023 |
Exam Duration | 3 Hours |
Exam Level | National Level |
క్యాట్ 2023
-
ఐఐఎంలు అవి అందిస్తున్న కోర్సులు
-
క్యాట్ షెడ్యూల్ 2023
-
క్యాట్ దరఖాస్తు ఫీజు
-
క్యాట్ దరఖాస్తు ప్రక్రియ
-
తెలుగు రాష్ట్రాల్లో క్యాట్ ఎగ్జామ్ సెంటర్లు
-
క్యాట్ పరీక్ష నమూనా
-
క్యాట్ అడ్మిషన్ ప్రక్రియ
-
క్యాట్ క్వాలిఫై మార్కులు
ఐఐఎంలు అవి అందిస్తున్న కోర్సులు
దేశంలో మేనేజ్‌మెంట్ విద్యకు ప్రఖ్యాత గాంచిన ఇండియన్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం) లలో రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాం(PGP) మరియు మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ), డాక్టరొల్, మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం వంటి వివిధ మేనేజ్‌మెంట్ కోర్సుల యందు ప్రవేశాల కోసం క్యాట్ (కామన్ అడ్మిషన్ టెస్ట్) నిర్వహించబడుతుంది. యేటా నవంబర్ లో జరిగే ఈ ప్రవేశ పరీక్ష కోసం దేశ వ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇంత డిమాండ్ ఉన్న ఈ మేనేజ్‌మెంట్ ప్రవేశ పరీక్ష యొక్క పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఐఐఎం | పీజీ ప్రోగ్రామ్స్ | ఐఐఎం | పీజీ ప్రోగ్రామ్స్ |
ఐఐఎం అహ్మదాబాద్ | PGP, PGP-FABM, ePGP | ఐఐఎం నాగపూర్ | PGP |
ఐఐఎం అమృత్సర్ | PGP | ఐఐఎం రాయపూర్ | PGP |
ఐఐఎం బెంగుళూరు | PGP, PGPEM, PGPPM, | ఐఐఎం రాంచీ | PGP, PGP-HRM |
ఐఐఎం బోధ్ గయా | PGP | ఐఐఎం రోహతక్ | PGP, EPGPX |
ఐఐఎం కలకత్తా | PGP | ఐఐఎం సంబల్పూర్ | MBA |
ఐఐఎం ఇండోర్ | PGP, PGP-HRM | ఐఐఎం షిల్లోంగ్ | PGP, PGPEX |
ఐఐఎం జమ్మూ | PGP | ఐఐఎం సిర్మార్ | MBA |
ఐఐఎం కాశీపూర్ | PGP, EPGP | ఐఐఎం తిరుచిరాపల్లి | PGPM, PGPBM |
ఐఐఎం కోజ్హికోడే | PGP, PGP-BL, PGP-F | ఐఐఎం ఉదయపూర్ | MBA |
ఐఐఎం లక్నో | PGP, PGP-ABM, PGP-SM | ఐఐఎం విశాఖపట్నం | PGP, PGPEx |
ఐఐఎం నాగపూర్ మినహా మిగతా అన్ని ఐఐఎం లు పీహెచ్డీ, FPM, డాక్టోరల్, EFPM, EPhD వంటి ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ ని అందిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నాన్ ఐఐఎం కాలేజీలు
- గీతం డ్రీమ్డ్ యూనివర్సిటీ - రుషికొండ, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
- ఇనిస్టిట్యూట్ అఫ్ ఫైనాన్సియల్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్(IFMR) - శ్రీసిటీ చిత్తూరు ఆంధ్రప్రదేశ్
- అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ అఫ్ ఇండియా(ASCI) - బంజారాహిల్స్, హైదరాబాద్ తెలంగాణ
- ఐసీబీమ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎక్సలెన్స్ అత్తాపూర్ హైదరాబాద్ తెలంగాణ
- ఇనిస్టిట్యూట్ అఫ్ పబ్లిక్ ఇంటర్ప్రైస్ ఎంటర్ప్రైజ్(IPE) - షమీర్పేట రంగారెడ్డి తెలంగాణ
- విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ - కూకట్ పల్లి హైదరాబాద్ తెలంగాణ
- హైదరాబాద్ బిజినెస్ స్కూల్ - గీతం యూనివర్సిటీ పఠాన్ చెరువు మెదక్ తెలంగాణ
- ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్ (IIRM) - గచ్చిబౌలి హైదరాబాద్ తెలంగాణ
- హైదరాబాద్ విశ్వవిద్యాలయం (స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్) - గచ్చిబౌలి హైదరాబాద్ తెలంగాణ
క్యాట్ రాసేందుకు ఎలిజిబిలిటీ
- 50 శాతం మార్కుల తో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత అయి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ మరియు అంగవైకల్యం ఉన్న అభ్యర్థులకు 45 శాతం మార్కులు తప్పనిసరి.
- చివరి ఏడాది డిగ్రీ చదువుతున్నవారు, రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- 50% శాతం మార్కులతో CA, CS, ICWA కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు కూడా క్యాట్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- దరఖాస్తు చేసే అభ్యర్థులకు ఎటువంటి గరిష్ట వయోపరిమితి నిర్ణహించలేదు.
క్యాట్ 2023 షెడ్యూల్
దరఖాస్తు ప్రారంభ తేదీ | 2 ఆగష్టు 2023 |
దరఖాస్తు చివరి తేదీ | 21 సెప్టెంబర్ 2023 |
హాల్ టికెట్ డౌన్‌లోడ్ | 26 అక్టోబర్ 2023 |
పరీక్ష తేదీ | 26 నవంబర్ 2023 |
ఫలితాలు | జనవరి 2024 |
క్యాట్ 2023 దరఖాస్తు ఫీజు
క్యాట్ దరఖాస్తు రుసుములు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ లేదా ఈ చలానా విధానంలో చెల్లించవచ్చు. చెల్లింపు సమయంలో సర్వీస్ చార్జీలు, జీఎస్టీ వంటి అదనపు చార్జీలు ఉంటె అభ్యర్థులనే భరించాలి
- ఎస్సీ, ఎస్టీ, అంగవైకల్యం ఉన్న అభ్యర్థులకు 1200/- రూపాయలు
- మిగతా అన్ని కేటగిరిల అభ్యర్థులకు 2400/- రూపాయలు
క్యాట్ దరఖాస్తు విధానం
క్యాట్ దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది. క్యాట్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసే ముందు మీ మొబైల్ మరియు మెయిల్ ఐడీ సహాయంతో క్యాట్ పోర్టల్ యందు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. రిజిస్టర్ అయ్యాక మీరు ఏర్పాటు చేసుకున్న యూజర్ వివరాలతో క్యాట్ పోర్టల్ యందు తిరిగి లాగిన్ అయ్యి క్యాట్ 2022 పరీక్ష కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తులో ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీలు, రిజర్వేషన్ కేటగిరి, భాష ఎంపిక, పరీక్ష కేంద్రం, కోర్సు ఎంపిక, కాలేజీ ఎంపిక వంటి వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. చివరిగా అందుబాటులో ఉన్న పేమెంట్ విధానంలో ఎగ్జామ్ ఫీజు చీలించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తి అవుతుంది.
దరఖాస్తు చేసే ముందు సంబంధిత సర్టిఫికేట్లు అన్ని అందుబాటులో ఉంచుకోవాలి. దరఖాస్తు సమయంలో అందించే సమాచారంకు పూర్తి జవాబుదారీ మీరే కాబట్టి ఇచ్చే సమాచారంలో తప్పులు దొర్లకుండా చూసుకోండి. ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీలు, రిజర్వేషన్ కేటగిరి, భాష ఎంపిక, పరీక్ష కేంద్రం, కోర్సు ఎంపిక, కాలేజీ ఎంపిక వంటి వివరాలు దరఖాస్తు పూర్తిచేసేముందు పునఃపరిశీలించుకోండి. దరఖాస్తు పూర్తిచేసాక మూడు లేదా నాలుగు కాపీలు ప్రింట్ తీసి భద్రపర్చండి.
- వైట్ బ్యాక్ గ్రౌండ్ తో ఈమధ్య కాలంలో తీసుకున్న పాసుపోర్టు సైజు ఫోటో అందుబాటులో ఉంచుకోండి. కంప్యూటర్ లో డిజైన్ లేదా ఎడిట్ చేసిన ఫోటోలు అనుమతించబడవు.
- మీ సొంత దస్తూరితో చేసిన సంతకాన్ని అప్‌లోడ్ చేయండి. కాపిటల్ లేటర్స్ తో చేసిన సంతకం చెల్లదు.
- ఫొటోగ్రాఫ్, సంతకం వాటికీ సంబంధించిన బాక్సుల్లో మాత్రమే అప్‌లోడ్ చేయండి. అవి తారుమారు ఐతే దరఖాస్తు పరిగణలోకి తీసుకోరు. ఈ ఫైళ్ల సైజు 10-200 కేబీల మధ్య ఉండేలా చూసుకోండి.
- దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేసిన ఫొటోగ్రాఫ్ కు సమానమైనది ఇంకో ఫొటోగ్రాఫ్ ను పరీక్ష రోజు ఆయా పరీక్షకేంద్రంలో ఇవ్వాల్సి ఉంటుంది.
- అడ్మిట్ కార్డు అందుబాటులో ఉండే తేదిలో పిడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్‌లోడ్ చేసుకోండి.
- పరీక్ష రోజు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది.
- అడ్మిట్ కార్డు, ఫొటోగ్రాఫ్ తో పాటు వ్యక్తిగత ఐడెంటి కార్డుతో పరీక్షకు హాజరవ్వాలి.
- నిషేదిత వస్తువులు పరీక్ష కేంద్రంలోకి ఎట్టి పరిస్థితిల్లో అనుమతించబడవు
తెలుగు రాష్ట్రాల్లో క్యాట్ ఎగ్జామ్ సెంటర్లు
- ఆంధ్రప్రదేశ్: గుంటూరు, కాకినాడ, విజయవాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం.
- తెలంగాణ: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్
క్యాట్ ఎగ్జామ్ నమూనా
క్యాట్ పరీక్ష పూర్తి ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది. మూడు గంటల నిడివితో 300 మార్కులకు జరిగే ఈ అర్హుత పరీక్షలో మొత్తం మూడు సెక్షన్లలో 100 ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్ 1 లో 34 ప్రశ్నలు, సెక్షన్ 2 లో 32 ప్రశ్నలు, సెక్షన్ 3 లో 34 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సెక్షనుకు ఒక గంట సమయం నిర్దేశించబడి ఉంటుంది. ఒక సెక్షన్ లో సమాధానం చేసే సమయంలో ఇంకో సెక్షన్ లో ప్రశ్నలకు సమాధానం చేసే అవకాశం ఉండదు.
సరైన సమాధానం చేసిన ప్రశ్నకు 3 మార్కులు, తప్పు సమాధానం చేసిన ప్రశ్నలకు -1 మార్కు ఇవ్వబడుతుంది. నాన్ మల్టిఫుల్ ఛాయస్ ప్రశ్నలకు నెగిటివ్ మార్కింగు విధానం లేదు. నాన్ మల్టిఫుల్ ఛాయస్ ప్రశ్నలకు కంప్యూటర్ కీబోర్డు ద్వారా సమాధానం రాయాల్సి ఉంటుంది. పరీక్ష రెండు షిఫ్టులలో పలు సెషన్లలో జరుగుతుంది. ఏటా పరీక్ష విధానం మార్చుకుంటూ పోయే ఈ ఎలిజిబిలిటీ టెస్ట్ యొక్క ప్రశ్నల తీరును అంచనా వేయటం చాల కష్టం. పరీక్ష ముందు రోజుల్లో క్యాట్ అధికారిక వెబ్‌సైట్ లో ఉండే మాక్ పరీక్షల ఆధారంగా ఒక అంచనాకు రావొచ్చు.
సిలబస్ | ప్రశ్నల సంఖ్యా | మార్కులు | సమయం |
సెక్షన్ 1 : వెర్బల్ ఎబిలిటీ & రీడింగ్ కంప్రెహెన్షన్ | 34 ప్రశ్నలు | 102 మార్కులు | 60 ని" |
సెక్షన్ 2: డేటా ఇంటర్ప్రిటేషన్ & లాజికల్ రీజనింగ్ | 32 ప్రశ్నలు | 96 మార్కులు | 60 ని" |
సెక్షన్ 3: క్వాంటిటేటివ్ ఎబిలిటీ | 34 ప్రశ్నలు | 102 మార్కులు | 60 ని" |
మొత్తం | 100 ప్రశ్నలు | 300 మార్కులు | 3 గంటలు |
క్యాట్ ప్రవేశ పరీక్షకు సంబంధించి ఎటువంటి ప్రామాణిక సిలబస్ లేదు. పై పట్టికలో ఉన్నవిదంగా వెర్బల్ ఎబిలిటీ, రీడింగ్ కంప్రెహెన్షన్, డేటా ఇంటెరిప్రిటేషన్, లాజికల్ రీజనింగ్, మరియు క్వాంటిటేటివ్ ఎబిలిటీ కి సంబంధించి గ్రాడ్యుయేట్ స్థాయి పూర్తి సిలబస్ ని చదువుకోవలసి ఉంటుంది.
రిజల్ట్ మరియు స్కోరింగ్ విధానం
క్యాట్ పరీక్ష రెండు సెషన్లలో జరగటం కారణంగా వివిధ సెషన్ లలో వివిధ రకాల ప్రశ్నలతో పాటు వాటి క్లిష్టత లో తేడాల ఉండటం వలన, ఏ సెషన్ అభ్యర్థులకు నష్టం జరగకుండా ఉండేందుకు, అన్ని సెషన్ల మార్కులను ముందు నార్మలైజేషన్ చేసి తర్వాత తుది స్కోర్ ని కొన్ని ప్రత్యేక ఫార్ములాల ద్వారా లెక్కిస్తారు. ఆ తర్వాత తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు.
ప్రవేశాలు & రిజర్వేషన్ లు
ఐఐఎం లలో రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రవేశం పొందటం అంత సులువైన ప్రక్రియ కాదు. క్యాట్ పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులకు ఆయా ఐఐఎం ల ద్వారా నేరుగా ఇంటర్వ్యూ కాల్ లెటర్లు పంపించటం జరుగుతుంది, ఈ ప్రక్రియలో రాత పరీక్షతో పాటు వ్యక్తిగత ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్, క్యాట్ లో సాధించిన స్కోర్, అకాడమీ లలో చూపించిన ప్రతిభ, ఉద్యోగ అనుభవం, జండర్, రిజర్వేషన్లు వంటి వివిధ అంశాల ఆధారంగా షార్ట్ లిస్ట్ తాయారు చేసి ఎంపికైన అభ్యర్థులకు అడ్మిషన్ కల్పిస్తారు.
భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజెర్వేషన్లు కల్పించటం జరుగుతుంది. ఎస్సీ అభ్యర్థులకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, నాన్ క్రిమి లేయర్ ఓబీసీ అభ్యర్థులకు 27 శాతం, ఆర్థికంగా వెనకబడిన తరగతులకు 10 శాతం మరియు వికలాంగులకు 5 శాతం రేజర్వేషన్లు కల్పించటం జరుగుతుంది. ఆర్థిక సహాయం అవసరమైన విద్యారులకు ఐఐఎంలు స్కాలర్షిప్ లు కూడా అందజేస్తాయి.