ఆర్‌బిఐ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ 2022 | మొత్తం ఖాళీలు 950
Bank Jobs Latest Jobs

ఆర్‌బిఐ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ 2022 | మొత్తం ఖాళీలు 950

రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా, దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ఆర్‌బిఐ కార్యాలయాల్లో అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తు కోరుతుంది. ఆసక్తి మరియు అర్హుత ఉన్న అభ్యర్థులు 08 మార్చి 2022 లోపు దరఖాస్తు చేయండి. ఎంపిక ప్రక్రియ రెండు దశలలో జరుగుతుంది.

మొదటి దశలో ప్రిలిమినరీ మరియు మెయిన్ పరీక్షలలు నిర్వహిస్తారు. ఈ రెండింటిలో అర్హుత పొందిన వారికీ రెండవ దశలో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (LPT) నిర్వహించి తుది ఎంపిక పూర్తిచేశారు. ఎంపిక వారికీ ప్రారంభ వేతనం 20,700/- నుండి మొదలవుతుంది దీనితో పాటుగా ఇతర అలోవెన్సులు ఉంటాయి.

ఆర్‌బిఐ అసిస్టెంట్ నియామక  షెడ్యూల్

దరఖాస్తు ప్రారంభం 17.02.2022
 దరఖాస్తు తుది గడువు 08.03.2022
ప్రిలిమినరీ టెస్ట్ మార్చి 26 & 27, 2022
మెయిన్ టెస్ట్ మే 2022

ఎలిజిబిలిటీ

  • భారతీయ అభ్యర్థులు మాత్రమే అర్హులు
  • అభ్యర్థి వయసు గరిష్టంగా 20 నుండి 28 ఏళ్ళ మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వైకల్యాలున్న వ్యక్తులు, మాజీ సైనికులు వితంతువులు/విడాకులు తీసుకున్న మహిళలకు గరిష్టంగా 3 నుండి 10 ఏళ్ళ వరకు సడలింపు ఉంటుంది.
  • అభ్యర్థి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 50శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
  • అభ్యర్థి తన స్థానిక బాష (మాతృబాష) యందు పూర్తి నైపుణ్యం కలిగివుండాలి.

పరీక్ష కేంద్రాలు

ఆంధ్రప్రదేశ్ 
ప్రిలిమ్స్ మెయిన్స్ 
చీరాల, గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం
తెలంగాణ 
ప్రిలిమ్స్  మెయిన్స్
హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ హైదరాబాద్

దరఖాస్తు విధానం

ఆసక్తి, అర్హుత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో ఆర్‌బిఐ అధికారిక వెబ్‌సైట్ (www.rbi.org.in) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు పేజీలో పేరు, అడ్రెస్స్ ఇమెయిల్-ఐడి వివరాలు నమోదు చేయడం ద్వారా ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్ రూపొందించబడతాయి. దీనికి సంబంధించి అభ్యర్థి తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ను నోట్ చేసుకోవాలి. తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ వివరాలు అభ్యర్థి ఇమెయిల్ & మెసేజ్ రూపంలో పంపబడతాయి. తర్వాత దశలో అభ్యర్థి వ్యక్తిగత, విద్య, చిరునామా వివరాలు పొందుపర్చి, దరఖాస్తు రుసుము చెల్లించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది.

దరఖాస్తు రుసుము

ఎస్సీ, ఎస్టీ, బీసీ, వైకల్యాలున్న వ్యక్తులు
ఇతర అభ్యర్థులు
45/- (ఇంటిమేషన్ ఛార్జీలు)
450/- (పరీక్ష రుసుములు + ఇంటిమేషన్ ఛార్జీలు)

పరీక్ష విధానం

ఎంపిక ప్రక్రియ రెండు దశలలో జరుగుతుంది. మొదటి దశలో ప్రిలిమినరీ మరియు మెయిన్ పరీక్షలలు నిర్వహిస్తారు. ఈ రెండింటిలో అర్హుత పొందిన వారికీ రెండవ దశలో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (LPT) నిర్వహించి తుది ఎంపిక పూర్తిచేశారు.

ప్రిలిమినరీ పరీక్ష

మొదటి దశలో నిర్వహించే ప్రిలిమినరీ పరీక్ష 60 నిముషాల నిడివితో 100 మార్కులకు జరుగుతుంది. పరీక్ష ఆన్‌లైన్ విధానంలో పూర్తి ఆబ్జెక్టివ్ పద్దతిలో ఇంగ్లీష్, న్యూమరికాల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ అంశాలతో నిర్వహిస్తారు. సరైన సమాధానం చేసిన ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. తప్పు సమాధానం చేసిన ప్రశ్నలకు 1/4 మార్కులు తొలగిస్తారు. ఈ పరీక్షలో అర్హుత పొందిన వారికి రెండవ దశలో మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు.

సబ్జెక్టు  ప్రశ్నల సంఖ్యా మార్కులు  సమయం 
ఇంగ్లీష్ 30 ప్రశ్నలు 30 మార్కులు 20 నిముషాలు
న్యూమరికాల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు 35 మార్కులు 20 నిముషాలు
రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు 35 మార్కులు 20 నిముషాలు
మొత్తం  100 ప్రశ్నలు 100 మార్కులు 60 నిముషాలు

మెయిన్స్ పరీక్ష

రెండవ దశలో నిర్వహించే మెయిన్స్ పరీక్ష 2.15 గంటల నిడివితో 200 మార్కులకు జరుగుతుంది. పరీక్ష ఆన్‌లైన్ విధానంలో పూర్తి ఆబ్జెక్టివ్ పద్దతిలో ఇంగ్లీష్, న్యూమరికాల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ అవెర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ అంశాలతో నిర్వహిస్తారు.  సరైన సమాధానం చేసిన ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. తప్పు సమాధానం చేసిన ప్రశ్నలకు 1/4 మార్కులు తొలగిస్తారు. ఈ పరీక్షలో అర్హుత పొందిన వారు మూడవ దశలో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (LPT) ను ఎదుర్కొనాల్సి ఉంటుంది.

సబ్జెక్టు  ప్రశ్నల సంఖ్యా మార్కులు  సమయం 
రీజనింగ్ 40 ప్రశ్నలు 40 మార్కులు 30 నిముషాలు
ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 ప్రశ్నలు 40 మార్కులు 30 నిముషాలు
న్యూమరికాల్ ఎబిలిటీ 40 ప్రశ్నలు 40 మార్కులు 30 నిముషాలు
జనరల్ అవెర్నెస్ 40 ప్రశ్నలు 40 మార్కులు 25 నిముషాలు
కంప్యూటర్ నాలెడ్జ్ 40 ప్రశ్నలు 40 మార్కులు 20 నిముషాలు
మొత్తం  200 ప్రశ్నలు 200 మార్కులు  2.15 గంటలు 

లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (LPT)

మెయిన్స్ పరీక్షలో షార్ట్ లిస్ట్ చేయబడ్డ అభ్యర్థులకు చివరి దశలో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (LPT) నిర్వహిస్తారు. అభ్యర్థి మాతృబాష పరిజ్ఞానాన్ని తెలుసుకునేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష మాతృభాషకు సంబంధించి రాయడం, మాట్లాడటం, చదవడం వంటి అంశాలకు సంబంధించి ఉంటుంది. ఈ పరీక్షలో అర్హుత సాధించన వారికి తుది దశలో వివిధ రిజర్వేషన్ల ఆధారంగా నియామక ప్రక్రియ పూర్తిచేస్తారు.

Post Comment