ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ 2022 | ఎస్సై మరియు కానిస్టేబుల్ పోస్టులు
APPSC Latest Jobs

ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ 2022 | ఎస్సై మరియు కానిస్టేబుల్ పోస్టులు

ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ 6,511 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో 411 ఎస్సై పోస్టులు, 6,100 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 30 నుండి డిసెంబర్ 28 మధ్య నిర్వహిస్తున్నారు. ఎస్సై పోస్టులకు సంబంధించి డిసెంబర్ 14 నుండి వచ్చే ఏడాది జనవరి 15 స్వీకరించనున్నారు.

ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ ఖాళీలు

ఈ నియామక ప్రకటన ద్వారా 411 ఎస్సై పోస్టులు, 6,100 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఎస్సై పోస్టులలో 315 పోస్టులు సివిల్ డ్యూటీకి సంబంధించి, మిగతావి ఏపీఎస్పీ సంబంధించి భర్తీ చేస్తున్నారు. కానిస్టేబుల్ పోస్టులలో 3,580 పోస్టులు సివిల్ కేటగిరిలో 2,520 పోస్టులు ఏపీఎస్పీ కేటగిరిలో భర్తీ కానున్నాయి.

పోస్టు పేరు సివిల్ ఏపీఎస్పీ మొత్తం ఖాళీలు
సబ్-ఇన్‌స్పెక్టర్‌ (ఎస్సై) 315 96 411
కానిస్టేబుల్ (పురుషులు & మహిళలు) 3,580 (స్త్రీ & పు) 2,520 (పు) 6,100

ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ 2022  షెడ్యూల్

పోస్టు పేరు ఎస్సై పోస్టులు కానిస్టేబుల్ పోస్టులు
దరఖాస్తు ప్రారంభం 14 డిసెంబర్ 2022 30 నవంబర్ 2022
దరఖాస్తు ముగింపు 18 జనవరి 2023 28 డిసెంబర్ 2022
అడ్మిట్ కార్డు 5 ఫిబ్రవరి 2023 9 జనవరి 2023
ప్రిలిమినరీ ఎగ్జామ్ 19 ఫిబ్రవరి 2023 22 జనవరి 2023
ఫీజికల్ టెస్ట్ మార్చి 2023 ఫిబ్రవరి 2023
ఫైనల్ రాతపరీక్ష ఏప్రిల్ 2023 మార్చి 2023

ఏపీ ఎస్సై & కానిస్టేబుల్ ఎలిజిబిలిటీ

ఎస్సై పోస్టులు కానిస్టేబుల్
అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. మహిళా అభ్యర్థులు సివిల్ పోస్టులకు మాత్రమే అర్హులు. అభ్యర్థులు ఇంటర్ ఉత్తీర్ణత పొంది ఉండాలి. మహిళా అభ్యర్థులు సివిల్ పోస్టులకు మాత్రమే అర్హులు.
అభ్యర్థులు వయస్సు 21 నుండి 27 ఏళ్ళ మధ్య ఉండాలి. రిజర్వేషన్ ఉన్నవారికి వయోపరిమితి సడలింపు ఉంటుంది. అభ్యర్థులు వయస్సు 18 నుండి 24 ఏళ్ళ మధ్య ఉండాలి. రిజర్వేషన్ ఉన్నవారికి వయోపరిమితి సడలింపు ఉంటుంది.

ఏపీ ఎస్సై & కానిస్టేబుల్ దరఖాస్తు ఫీజు

పోస్టు పేరు జనరల్ కేటగిరి ఎస్సీ & ఎస్టీ కేటగిరి
ఎస్సై పోస్టు 600/- 300/-
కానిస్టేబుల్ 300/- 150/-

తెలంగాణ నాన్ లోకల్ అభ్యర్థులు అందరూ 300/- పూర్తి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు మరియు యూపీఐ విధానంలో చెల్లించే అవకాశం కల్పిస్తున్నారు.

ఏపీ ఎస్సై & కానిస్టేబుల్ దరఖాస్తు ప్రక్రియ

దరఖాస్తు ప్రక్రియ పూర్తి ఆన్‌లైన్‌ విధానంలో మూడు దశలలో పూర్తి చేయాల్సి ఉంటుంది. మొదటి దశలో అధికారిక ఏపీ పోలీస్ (www.slprb.ap.gov.in) పోర్టల్ యందు దరఖాస్తు ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. అబ్యర్దిలి వ్యక్తిగత వివరాలు, టెన్త్ హాల్ టికెట్ నెంబర్ వంటివి పొందుపర్చి అందుబాటులో ఉన్న పేమెంట్ విధానం ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించాలి.

దరఖాస్తు ఫీజు చెల్లించిన అభ్యర్థులు తిరిగి అదే పోర్టల్ ఓపెన్ చేసి మొదటి దశ ఎగ్జామ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో పోస్టు ఎంపిక, జిల్లా ఎంపిక, పరీక్ష కేంద్రం ఎంపిక వంటి వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది.

మూడవ దశ దరఖాస్తు ప్రక్రియ ప్రిలిమినరీ, ఫీజికల్ టెస్టులు పూర్తి చేసిన అభ్యర్థులు ఫైనల్ రాతపరీక్ష కోసం తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కానిస్టేబుల్ సివిల్ మరియు ఏపీఎస్పీ పోస్టులకు దరఖాస్తు చేసే వారు ఒక దరఖాస్తు సమర్పిస్తే సరిపోతుంది. ఎస్సై పోస్టుల అభ్యర్థులు కూడా ఈ నియమం వర్తిస్తుంది. కానీ ఎస్సై మరియు కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు వేరువేరుగా రెండు దరఖాస్తు సమర్పించాలి.

ఏపీ ఎస్సై & కానిస్టేబుల్ ఎంపిక విధానం

ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్సై పోస్టులకు సంబందించిన నియామక ప్రక్రియ మూడు దశలలో నిర్వహిస్తున్నారు. మొదటి దశలో అభ్యర్థుల వడపోత కోసం ప్రిలిమనరీ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. ఇందులో అర్హుత పొందిన వారికీ రెండవ దశలో దేహ దారుడ్య పరీక్షలు నిర్వహించి, చివరిగా ఫైనల్ రాతపరీక్ష నిర్వహించడం ద్వారా నియామక ప్రక్రియ పూర్తి చేస్తున్నారు.

ఏపీ ఎస్సై పోస్టుల నియామక విధానం

ఎస్సై పోస్టులకు సంబంధించి ప్రిలిమినరీ పరీక్ష రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. ఈ పేపర్లను ఒకే రోజు ఉదయం మరియు మధ్యాహ్నం వేళల్లో నిర్వహిస్తారు. పేపర్ I, అర్థమెటిక్, రీజనింగ్, మెటల్ ఎబిలిటీ అంశాలకు సంబంధించి 100 మార్కులకు ఉంటుంది. పరీక్ష ఉదయం 10 నుండి ఒంటి గంట మధ్య మూడు గంటల నిడివితో నిర్వహిస్తారు.

పేపర్ II జనరల్ స్టడీస్ అంశాలకు సంబంధించి మూడు గంటల నిడివితో 100 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుండి 5.30 గంటల మధ్య నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హుత సాధించిన అభ్యర్థులకు దేహ దారుడ్య పరీక్షల కోసం కాల్ లెటర్ అందిస్తారు. ఫీజికల్ టెస్టు కోసం గరిష్టంగా 100 మార్కులు కేటాయిస్తారు. ఇందులో అర్హుత పొందిన వారికీ చివరిగా రాతపరీక్ష నిర్వహిస్తారు.

ఫైనల్ రాతపరీక్ష నాలుగు పేపర్లుగా ఉంటుంది. పేపర్ I యందు ఇంగ్లీష్, పేపర్ II యందు తెలుగు, పేపర్ III యందు అర్థమెటిక్, పేపర్ IV యందు జనరల్ స్టడీస్ అంశాలతో  పేపరు I & II 100 మార్కులకు, పేపర్ III & IV 400 మార్కులకు నిర్వహిస్తారు. ఒక్కో పేపరుకు 3 గంటల సమయం కేటాయిస్తారు.

ఏపీ ఎస్సై ప్రిమినరీ ఎగ్జామ్ నమూనా
పేపర్ సబ్జెక్టు మార్కులు సమయం
పేపర్ I (ఆబ్జెక్టివ్) అర్థమెటిక్, రీజనింగ్, మెటల్ ఎబిలిటీ 100 3 గంటలు
పేపర్ II (ఆబ్జెక్టివ్) జనరల్ స్టడీస్ 100 3 గంటలు
 దేహ దారుడ్య పరీక్షలు (PMT & PET)
 టెస్టు పేరు  పురుషులు మహిళలు
పొడవు 167.6 cm 152.2 cm
ఛాతి కనీసం 86.3 cm -
బరువు - కనీసం 40 కేజీలు
1,600 మీటర్ల రన్ 8 నిముషాలు (40 మార్కులు) 10.30 నిముషాలు (40 మార్కులు)
100 మీటర్ల రన్ 15 సెకండ్లు (30 మార్కులు) 18 సెకండ్లు (30 మార్కులు)
లాంగ్ జంప్ 3.80 మీటర్లు (30 మార్కులు) 2.75 మీటర్లు (30 మార్కులు)
ఏపీ ఎస్సై ఫైనల్ ఎగ్జామ్ నమూనా
పేపర్ సబ్జెక్టు మార్కులు సమయం
పేపర్ I (డిస్క్రిప్టివ్) ఇంగ్లీష్ 100 మార్కులు 2 గంటలు
పేపర్ II (డిస్క్రిప్టివ్) తెలుగు 100 మార్కులు 2 గంటలు
పేపర్ III (ఆబ్జెక్టివ్) అర్థమెటిక్ సివిల్ - 200 మార్కులు
ఏపీఏస్పీ - 100 మార్కులు
3 గంటలు
పేపర్ IV (ఆబ్జెక్టివ్) జనరల్ స్టడీస్ సివిల్ - 200 మార్కులు
ఏపీఏస్పీ - 100 మార్కులు
3 గంటలు

క్వాలిఫై మార్కులు & తుది ఎంపిక

ప్రిలిమనరీ పరీక్షలో జనరల్ అభ్యర్థులు 40 శాతం, బీసీ అభ్యర్థులు 35 శాతం మరియు ఎస్సీ & ఎస్టీ అభ్యర్థులు 30% కనీస అర్హుత మార్కులు పొందాల్సి ఉంటుంది. ఫీజికల్ టెస్టులకు గరిష్టంగా 100 మార్కులు కేటాయిస్తారు. ఇందులో తప్పక అర్హుత పొందాల్సి ఉంటుంది. ఫైనల్ రాతపరీక్షలో పేపర్ I & II లలో కనీస అర్హుత మార్కులు సాధించి, పేపర్ III & IV యందు జనరల్ అభ్యర్థులు 40 శాతం, బీసీ అభ్యర్థులు 35 శాతం మరియు ఎస్సీ & ఎస్టీ అభ్యర్థులు 30% క్వాలిఫై మార్కులు పొందాల్సి ఉంటుంది.

దేహ దారుడ్య పరీక్షలో మరియు ఫైనల్ రాతపరీక్షలోని పేపర్ III & IV యందు సాధించిన మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇలా రూపొందించిన మెరిట్ జాబితా నుండి వివిధ స్థానిక, సమాజిక రిజర్వేషన్ కోటాల వారీగా తుది ఎంపిక పూర్తి చేస్తారు.

ఏపీ కానిస్టేబుల్ పోస్టుల నియామక విధానం

కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి ప్రిలిమినరీ పరీక్ష 200 మార్కులకు నిర్వహిస్తారు. ఇంగ్లీష్ అర్థమెటిక్, రీజనింగ్, మెటల్ ఎబిలిటీ, జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్ అంశాలకు సంబంధించి పూర్తి ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఈ పరీక్షను 3 గంటల నిడివితో పూర్తి చేయాల్సి ఉంటుంది.

ప్రిలిమినరీ పరీక్షలో అర్హుత సాధించిన అభ్యర్థులకు దేహ దారుడ్య పరీక్షల కోసం కాల్ లెటర్ అందిస్తారు. ఫీజికల్ టెస్టు కోసం గరిష్టంగా 100 మార్కులు కేటాయిస్తారు. ఇందులో అర్హుత పొందిన వారికీ చివరిగా రాతపరీక్ష నిర్వహిస్తారు.

ఫైనల్ రాతపరీక్ష సివిల్ అభ్యర్థులకు 200 మార్కులకు, ఏపీఎస్పీ అభ్యర్థులకు 100 మార్కులకు నిర్వహిస్తారు. ఒక్కో పేపరుకు 3 గంటల సమయం కేటాయిస్తారు. రాతపరీక్ష ఇంగ్లీష్ అర్థమెటిక్, రీజనింగ్, మెటల్ ఎబిలిటీ, జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్ అంశాలకు సంబంధించి పూర్తి ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు.

ఏపీ కానిస్టేబుల్ ప్రిమినరీ ఎగ్జామ్ నమూనా
పేపర్ సబ్జెక్టు మార్కులు సమయం
ప్రిలిమినరీ ఎగ్జామ్ (ఆబ్జెక్టివ్) అర్థమెటిక్, రీజనింగ్, మెటల్ ఎబిలిటీ, జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్ 200 మార్కులు 3 గంటలు
 దేహ దారుడ్య పరీక్షలు (PMT & PET)
 టెస్టు పేరు  పురుషులు మహిళలు
పొడవు 167.6 cm 152.2 cm
ఛాతి కనీసం 86.3 cm -
బరువు - కనీసం 40 కేజీలు
1,600 మీటర్ల రన్ 8 నిముషాలు (40 మార్కులు) 10.30 నిముషాలు (40 మార్కులు)
100 మీటర్ల రన్ 15 సెకండ్లు (30 మార్కులు) 18 సెకండ్లు (30 మార్కులు)
లాంగ్ జంప్ 3.80 మీటర్లు (30 మార్కులు) 2.75 మీటర్లు (30 మార్కులు)
ఏపీ కానిస్టేబుల్ ఫైనల్ ఎగ్జామ్ నమూనా
పేపర్ సబ్జెక్టు మార్కులు సమయం
సివిల్ కానిస్టేబుల్  అర్థమెటిక్, రీజనింగ్, మెటల్ ఎబిలిటీ, జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్ 200 మార్కులు 3 గంటలు
ఏపీఎస్పీ కానిస్టేబుల్  అర్థమెటిక్, రీజనింగ్, మెటల్ ఎబిలిటీ, జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్ 100 మార్కులు 3 గంటలు

క్వాలిఫై మార్కులు & తుది ఎంపిక

ప్రిలిమనరీ పరీక్షలో జనరల్ అభ్యర్థులు 40 శాతం, బీసీ అభ్యర్థులు 35 శాతం మరియు ఎస్సీ & ఎస్టీ అభ్యర్థులు 30% కనీస అర్హుత మార్కులు పొందాల్సి ఉంటుంది. ఫీజికల్ టెస్టులకు గరిష్టంగా 100 మార్కులు కేటాయిస్తారు. ఇందులో తప్పక అర్హుత పొందాల్సి ఉంటుంది. ఫైనల్ రాతపరీక్ష యందు కూడా జనరల్ అభ్యర్థులు 40 శాతం, బీసీ అభ్యర్థులు 35 శాతం మరియు ఎస్సీ & ఎస్టీ అభ్యర్థులు 30% క్వాలిఫై మార్కులు పొందాల్సి ఉంటుంది.

దేహ దారుడ్య పరీక్షలో మరియు ఫైనల్ రాతపరీక్ష యందు సాధించిన మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇలా రూపొందించిన మెరిట్ జాబితా నుండి వివిధ స్థానిక, సమాజిక రిజర్వేషన్ కోటాల వారీగా తుది ఎంపిక పూర్తి చేస్తారు.

Post Comment