విదేశాల్లో మెడికల్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఇండియాలో ఉద్యోగం చేయాలనుకునే భారతీయ విద్యార్థులు మరియు ఎన్ఆర్ఐ విద్యార్థుల అర్హుతను నిర్ణహించేందుకు ఈ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు.
విదేశాలలో పూర్తిచేసిన వైద్య డిగ్రీ ఇండియాలో చెల్లుబాటు కావాలంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేదా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ చేసుకోవాలి. మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసేందుకు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్లో తప్పక అర్హుత సాదించాలి. ఈ స్క్రీనింగ్ టెస్టును నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్ నిర్వహిస్తుంది.
Exam Name | FMGE 2023 |
Exam Type | Qualify Test |
Qualify For | Foreign Medical Degree |
Exam Date | NA |
Exam Duration | 3.30 Hours |
Exam Level | National Level |
ఎఫ్ఎంజీఈ ఎగ్జామ్ ముఖ్యమైన తేదీలు
ఎఫ్ఎంజీఈ దరఖాస్తు ప్రారంభం | - |
ఎఫ్ఎంజీఈ దరఖాస్తు గడువు | - |
ఎఫ్ఎంజీఈ ఎగ్జామ్ తేదీ | - |
ఎఫ్ఎంజీఈ ఫలితాలు | - |
ఎఫ్ఎంజీఈ ఎగ్జామ్ ఎలిజిబిలిటీ
- అభ్యర్థులు భారతీయ పౌరులై లేదా ఎన్ఆర్ఐలు అయి ఉండాలి.
- అభ్యర్థుల పూర్తిచేసిన ప్రైమరీ మెడికల్ క్వాలిఫికేషన్ ఇండియన్ ఎంబసీ ధ్రువీకరణ పొంది ఉండాలి.
- పాకిస్తాన్ లో వైద్య విద్య డిగ్రీ పొందిన వారు భారత హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి సెక్యూరిటీ క్లియరెన్సు పొంది ఉండాలి.
ఎఫ్ఎంజీఈ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్
ఎఫ్ఎంజీఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ (www.nbe.edu.in) వెబ్సైటు ద్వారా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. బోర్డు నియమాలను అనుసరించి అభ్యర్థుల విద్య మరియు వ్యక్తిగత వివరాలను దరఖాస్తులో పొందుపర్చాలి.
వీటికి సంబంధించిన డూప్లికేట్ ధ్రువపత్రాలను దరఖాస్తుతో పాటుగా అందజేయాలి. అందుబాటులో ఉండే పేమెంట్ విధానంలో దరఖాస్తు రుసుము చెల్లించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది. ఆమోదం పొందిన అభ్యర్థులకు పరీక్షకు వారం రోజుల ముందు అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంచుతారు.
దరఖాస్తు ఫీజు | Rs 6000/- (+18% జీఎస్టీ) |
---|---|
ఎగ్జామ్ సెంటర్లు | విశాఖపట్నం, హైదరాబాద్ |
ఎఫ్ఎంజీఈ ఎగ్జామ్ ఫార్మేట్
ఎఫ్ఎంజీఈ ఎగ్జామ్ సీబీటీ విధానంలో జరుగుతుంది. పరీక్షా వ్యవధి ఒక్కో పేపర్'కు 2 గంటల 30 నిముషాలు. పరీక్షా ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రంలో మొత్తం 300 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు 2 భాగాలుగా ఉంటాయి. పార్ట్ A లో 150 ప్రశ్నలు, పార్ట్ B లో 150 ప్రశ్నలు ఇవ్వబడతాయి. రెండు పేపర్ల మధ్య షెడ్యూల్ గ్యాప్ ఉంటుంది.
సరైన సమాధానం గుర్తించిన ప్రశ్నకు 1 మార్కులు ఇవ్వబడతాయి. తప్పు సమాధానం గుర్తించిన ప్రశ్నకుఋణాత్మక మార్కులు లేవు. సమాధానం చేయని ప్రశ్నలకు ఎటువంటి మార్కులు కేటాయించబడవు. ఒకదానికి మించి సమాధానాలు గుర్తించిన ప్రశ్నలను లెక్కించారు. రెండు భాగాలల్లో కలిపి 150 మార్కులు సాధించిన వారిని అర్హులుగా ప్రకటిస్తారు. ప్రవేశ ప్రక్రియ పూర్తి మెరిట్ ఆధారంగా జరుగుతుంది.
సబ్జెక్టు / సిలబస్ | ప్రశ్నలు | మార్కులు | సమయం |
---|---|---|---|
పార్ట్ - A | 150 | 150 | 2.30 గంటలు |
పార్ట్ - B | 150 | 150 | 2.30 గంటలు |