ఆంధ్ర యూనివర్సిటీలో డిగ్రీ కోర్సులు : బీఏ, బీకామ్, బీఎస్సీ
Universities

ఆంధ్ర యూనివర్సిటీలో డిగ్రీ కోర్సులు : బీఏ, బీకామ్, బీఎస్సీ

ఆంధ్ర యూనివర్సిటీ మరియు దాని అనుబంధ కళాశాలల్లో పదుల సంఖ్యలో బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు ఆఫర్ చేస్తుంది. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ మరియు బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పేరుతో అందిస్తున్న ఈ కోర్సులు ఆంధ్ర యూనివెర్సిటీతో పాటుగా దాని అనుబంధ డిగ్రీ కాలేజీల్లో అందుబాటులో ఉంటాయి. ఈ కోర్సులకు సంబంధించి అడ్మిషన్ ప్రక్రియ కాలేజీ వారీగా నిర్వహిస్తారు.

Advertisement

ఏయూ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ కోర్సులను మూడేళ్ళ నిడివితో అందిస్తుంది. ఈ రెండేళ్లలో అభ్యర్థులు ఆరు సెమిస్టరు పరీక్షలకు హాజరవ్వాల్సి ఉంటుంది. ఒక సెమిస్టరు యందు పాస్ కాని అభ్యర్థులు, వచ్చే ఏడాది అదే సెమిస్టరు పరీక్షకు హాజరుకావడం ద్వారా ఉత్తీర్ణత పొందాల్సి ఉంటుంది. కోర్సులు సంబంధించి సీట్ల వివరాలు మరియు ట్యూషన్ ఫీజుల వివరాలు అడ్మిషన్ సమయంలో అందుబాటులో ఉంచుతారు.

ఏయూలో బీఏ మరియు బీకామ్ కోర్సులు

  • B.A - బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్
  • B.Com - బ్యాచిలర్ ఆఫ్ కామర్స్
  • B.A 5 ఏళ్ళ ఇంటిగ్రేటెడ్ కోర్సు (OL)
  • B.Com - కస్టమర్ సర్వీస్ మానేజ్‌మెంట్ దూర విద్య ద్వారా

ఏయూలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ కోర్సులు

  • B.Sc - బ్యాచిలర్ ఆఫ్ సైన్స్
  • B.Sc - హోమ్ సైన్స్
  • B.Sc - ఫుడ్ టెక్నాలజీ
  • B.Sc - హోటల్ మానేజ్‌మెంట్ & కేటరింగ్ టెక్నాలజీ
  • B.Sc - బోటనీ, కెమిస్ట్రీ, న్యూట్రిషన్ & డైటెటిక్స్
  • B.Sc - ఫుడ్ సైన్స్ & న్యూట్రిషన్
  • B.C.A - బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్

ఏయూలో బ్యాచిలర్ ఆఫ్ మానేజ్‌మెంట్ కోర్సులు

  • BBM - బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మానేజ్‌మెంట్
  • BEM - బ్యాచిలర్ ఆఫ్ ఈవెంట్ మానేజ్‌మెంట్
  • B.B.A -  బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్
  • బ్యాచిలర్ ఇన్ హోటల్ మానేజ్‌మెంట్ & క్యాటరింగ్ సైన్స్

Advertisement

Post Comment