కరెంటు అఫైర్స్ : ఏప్రిల్ 2022 | స్పోర్ట్స్ అఫైర్స్
Telugu Current Affairs

కరెంటు అఫైర్స్ : ఏప్రిల్ 2022 | స్పోర్ట్స్ అఫైర్స్

ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా డ్వేన్ బ్రావో

చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో 171 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. తాజా సీజన్లో ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్‌తో జరిగిన మ్యాచులో బ్రావో ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో 170 వికెట్లతో లసిత్ మలింగా రెండవ స్థానంలో ఉండగా, అమిత్ మిశ్రా (166 వికెట్లు), పీయూష్ చావ్లా (157 వికెట్లు) తో ఆ తరువాత స్థానాల్లో ఉన్నారు.

Advertisement

నీరజ్ చోప్రా & మీరాబాయికు స్పోర్ట్స్ స్టార్ ఏసెస్ అవార్డులు

టోక్యో 2020 సమ్మర్ ఒలింపిక్స్‌లో బంగారు పతకం (జావెలిన్) గెలుచుకున్న భారతీయ ఒలింపియన్ నీరజ్ చోప్రా , స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ది ఇయర్ (పురుషుడు) అవార్డును అందుకున్నాడు. అలానే 2020 టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రజత పతకాన్ని సాధించిన మీరాబాయి చాను స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డును గెలుచుకున్నారు.

రెండుసార్లు ఒలింపిక్ కాంస్య పతక విజేత మరియు భారతదేశంకు యొక్క ఏకైక హాకీ ప్రపంచ కప్ అందించిన కెప్టెన్ అజిత్ పాల్ సింగ్‌కు స్పోర్ట్‌స్టార్ ఏసెస్ అవార్డ్స్‌లో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు లభించింది.

జాతీయ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్'లో ఆన్ మరియాకు స్వర్ణం

కేరళకు చెందిన ఆన్ మరియా జాతీయ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌ మహిళల 87 కిలోగ్రాముల బంగారు పతకాన్ని సాధించింది. ఈమె రికార్డు స్థాయిలో 231 కిలోల జాతీయ రికార్డును బద్దలు కొట్టడం ద్వారా ఈ ఘనత దక్కించుకుంది. ఈమె ఈ ఏడాది చివర్లో జరిగే కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశాలు ఉండనున్నాయి.

ఐసీసీ మహిళల ప్రపంచకప్ విజేతగా ఆస్ట్రేలియా

హాగ్లీ ఓవల్‌లో ఆస్ట్రేలియా మరియు ఇంగ్లండ్ మధ్య జరిగిన ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2022 ఫైనల్ పోరులో ఇంగ్లాండ్‌ను 71 పరుగుల తేడాతో ఓడించడం ద్వారా ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. 357 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 43.4 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌటైంది.

ఆస్ట్రేలియా మహిళలు క్రికెట్ ప్రపంచకప్ గెలవడం ఇది రికార్డు స్థాయిలో ఏడోసారి. ఇది వరకు ఈ జట్టు 1978, 1982, 1988, 1997, 2005 మరియు 2013 లలో విజేతగా నిలిచింది. మొత్తంగా 12 వరల్డ్ కప్'లు జరగగా అందులో ఏడు సార్లు ఆస్ట్రేలియా, నాలుగు సార్లు ఇంగ్లాండ్, న్యూజీలాండ్ ఒకసారి విజేతగా నిలిచాయి.

ఆస్ట్రేలియన్ F1 గ్రాండ్ ప్రిక్స్ విజేతగా చార్లెస్ లెక్లెర్క్

మెల్‌బోర్న్, విక్టోరియాలో జరిగిన ఫార్ములా వన్ (F1) 2022 ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్‌ను చార్లెస్ లెక్లెర్క్ (ఫెరారీ-మొనాకో) గెలుచుకున్నాడు. 24 ఏళ్ల లెక్లెర్క్ డ్రైవర్స్ ఛాంపియన్‌షిప్‌లో తన ఆధిక్యాన్ని ప్రదర్శించాడు. బహ్రెయిన్‌లో సీజన్-ఓపెనింగ్ రేసులో విజయం తర్వాత సీజన్‌లో తన రెండవ విజయాన్ని సాధించాడు. ఈ రేసులో సెర్గియో పెరెజ్ రెండవ స్థానంలో నిలవగా మెర్సిడెస్ యొక్క మెర్సిడెస్'కు చెందిన జార్జ్ రస్సెల్ మూడవ స్థానంలో రేసు పూర్తిచేసాడు.

2026 కామన్వెల్త్ క్రీడలకు ఆస్ట్రేలియా ఆతిథ్యం

ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రం 2026 కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ క్రీడలను గీలాంగ్, బెండిగో, బల్లారట్ మరియు గిప్స్‌ల్యాండ్‌తో కూడిన నాలుగు రీజనల్ హబ్'లలో నిర్వహించనున్నారు. ఇకపోతే ఈ ఏడాది జులై 28 నుండి ఆగష్టు 8 మధ్య, దక్షిణాఫ్రికా నగరం డర్బన్‌లో షెడ్యూల్ చేయబడిన ఈ క్రీడలు, ఆ దేశ ఆర్థిక పరిమితులు కారణంగా బర్మింగ్‌హామ్, ఇంగ్లాండ్‌లో జరగనున్నాయి.

కామన్వెల్త్ గేమ్స్ అనేవి కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ నుండి అథ్లెట్లు పాల్గొనే అంతర్జాతీయ క్రీడా కార్యక్రమం. ఈ కార్యక్రమం మొదటిసారిగా 1930లో నిర్వహించబడింది. అప్పటి నుండి 1942 మరియు 1946 మినహా, ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడుతున్నాయి.

ఐపీఎల్ చరిత్రలో 'రిటైర్డ్ అవుట్' అయిన తొలి ప్లేయరుగా అశ్విన్

ఐపీఎల్ చరిత్రలో 'రిటైర్డ్ అవుట్' అయిన మొదటి ప్లేయరుగా ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అవతరించాడు. ప్రస్తుత సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడుతున్న అశ్విన్, తాజాగా లక్నో సూపర్ జెయింట్‌తో జరిగిన పోరులో టీమ్ గేమ్ ప్లేలో భాగంగా ఎటువంటి గాయం కాకపోయినా రిటైర్డ్ అవుట్'గా పెవిలియన్'కు చేరాడు.

రిటైర్డ్ అవుట్ అనేది గాయమైన క్రీడాకారుడు ఫీల్డను వదిలి పోయేందుకు సంబంధించిన నిబంధన. కానీ గేమ్ ప్లేలో భాగంగా దీనిని ఉపయోగించడం ఇదే మొదటిసారి. ఐపీఎల్ నిబంధల ప్రకారం గాయంతో రిటైర్డ్ అవుట్ అయిన క్రీడాకారుడు తిరిగి ఆడేందుకు అవకాశం ఉంటుంది. కానీ గేమ్ ప్లేలో భాగంగా వెనుదిరిగిన ప్లేయర్ తిరిగి గేమ్'లో ప్రవేశించే అవకాశం ఉండదు.

2023 స్ట్రీట్ చైల్డ్ క్రికెట్ ప్రపంచ కప్‌కు భారత్ ఆతిథ్యం

2023 లో నిర్వహించే స్ట్రీట్ చైల్డ్ క్రికెట్ ప్రపంచ కప్‌కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. స్ట్రీట్ చైల్డ్ యునైటెడ్ మరియు సేవ్ ది చిల్డ్రన్ ఇండియా కలిసి నిర్వహిస్తున్న ఈ స్ట్రీట్ చైల్డ్ క్రికెట్ ప్రపంచ కప్ 2023 లో 16 దేశాల నుండి 22 జట్లు పాల్గుననున్నాయి. 2019 లండన్‌లో జరిగిన స్ట్రీట్ చైల్డ్ క్రికెట్ ప్రపంచ కప్‌లో ఎనిమిది జట్లు పోటీపడ్డాయి. తుదిపోరులో ఆతిథ్య ఇంగ్లాండ్‌ను ఓడించి టీమ్ ఇండియా కప్‌ను సొంతం చేసుకుంది. ఈ ఈవెంట్ ఇండియాలో జరిగే ఐసీసీ ప్రపంచ కప్‌ 2023 కు ముందు సెప్టెంబర్‌లో జరగనుంది. ఈ క్రికెట్ టోర్నమెంట్‌లో వీధి పిల్లలు పాల్గొంటారు.

జాతీయ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌ విజేతగా తమిళనాడు

71వ సీనియర్ నేషనల్ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ పురుషుల టైటిల్‌ను తమిళనాడు సొంతం చేసుకుంది. తుది పోరులో 87-69 తో డిఫెండింగ్ ఛాంపియన్ పంజాబ్‌ను ఓడించడం ద్వారా విజేతగా నిలిచింది. అలానే మహిళల టైటిల్‌ను ఇండియన్ రైల్వేస్ టీమ్ సొంత చేసుకుంది. ప్రత్యర్థి తెలంగాణ జట్టుపై 132-82 తేడాతో విజయం సాధించింది.

విజ్డెన్ 'క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్' 2022 జాబితాలో రోహిత్ & బుమ్రా

విజ్డెన్ అల్మానాక్ "ఫైవ్ క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్" 2022 లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మరియు బౌలర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటుగా డెవాన్ కాన్వే, ఆలీ రాబిన్సన్, మరియు డేన్ వాన్ నీకెర్క్ లు ఎంపికయ్యారు. అలానే జో రూట్‌ను ప్రపంచంలోనే అగ్రగామి క్రికెటర్‌గా ఎంపిక చేయగా, దక్షిణాఫ్రికాకు చెందిన లిజెల్ లీ లీడింగ్ మహిళా క్రికెటర్‌గా ఎంపికైంది. మహ్మద్ రిజ్వాన్ ప్రపంచంలోనే ప్రముఖ టీ20 క్రికెటర్‌గా ఎంపికయ్యాడు. విజ్డెన్ క్రికెట్లో పురాతన వ్యక్తిగత అవార్డుగా భావిస్తారు.

 

Advertisement

Post Comment