ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్ | ఐఎఫ్ఎస్ ప్రిలిమ్స్ 2022
Latest Jobs UPSC

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్ | ఐఎఫ్ఎస్ ప్రిలిమ్స్ 2022

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2022 ఏడాదికి సంబంధించి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ప్రకటన విడుదల చేసింది. ఈ నియామక పరీక్షా ద్వారా ప్రిన్సిపాల్ చీఫ్ కాన్సర్వటర్స్ ఆఫ్ ఫారెస్ట్, అడిషనల్ చీఫ్ కాన్సర్వటర్స్ ఆఫ్ ఫారెస్ట్, డిప్యూటీ కాన్సర్వటర్స్ ఆఫ్ ఫారెస్ట్, అసిస్టెంట్ కాన్సర్వటర్స్ ఆఫ్ ఫారెస్ట్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ వంటి పోస్టులను భర్తీ చేస్తారు.

తాజా నియామక ప్రకటన ద్వారా దాదాపు 151 ఖాళీలను యుపిఎస్‌సి నోటిఫై చేసింది. నియామక ప్రక్రియ రాత పరీక్షా మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా చేపడతారు. ఈ నోటిఫికేషన్ సంబంధించి మరిన్ని వివరాలు ఇక్కడ తెల్సుకుందాం

నోటిఫికేషన్ నెంబర్ 06/2022-IFoS
పోస్టుల సంఖ్యా 151 పోస్టులు
నోటిఫికేషన్ తేదీ 02 ఫిబ్రవరి 2022
దరఖాస్తు తుది గడువు 22 ఫిబ్రవరి 2022
పరీక్ష ఫీజు 100/-
పరీక్ష తేదీ 05 జూన్ 2022

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్

దేశంలో ఉన్న మూడు అఖిల భారత సర్వీసులలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఒకటి. దేశంలో 80 మిలియన్ హెక్టర్ల మేర అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఈ అడవులు పుష్కలమైన సహజ వనరులకు, విలువ కట్టలేని అటవీ సంపదకు, సారవంతమైన గడ్డి మైదానాలకు, అమాయకపు గిరిజన తెగలకు, జీవవైవిద్యపు జంతు జాతులకు స్వర్గధామంగా ఉంది.

దేశ సంస్కృతి, ప్రజల జీవన విధానంలో భాగమైన ఈ అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత భారత ప్రభుత్వానికి ఉంది. అందువలనే  ఇండియన్ ఫారెస్ట్ సర్వీసును అఖిల భారత సర్వీసుల సరసన చోటు కలభించింది. పర్యావరణ మంత్రిత్వశాఖ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ ఉమ్మడిగా ఈ అటవీ పరిరక్షణ బాధ్యతను నిర్వర్తిస్తున్నాయి.

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ద్వారా ఎంపికైన అధికారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో అడవుల రక్షణ, అడవుల అభివృద్ధి, సహజ వనరుల పరిరక్షణ, పర్యావరణ స్థిరత్వాన్ని కాపాడుట,వన్యజీవుల సంరక్షణ, అటవీ గ్రామీణ, గిరిజన ప్రాంతాల కమ్యూనిటీలకు జీవనోపాధి కల్పించుట వంటి బృహత్తర  విధులు నిర్వర్తిస్తారు.

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తుంది. ఈ పరీక్షా మూడు దశలో జరుగుతుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ ద్వారా నియామక ప్రక్రియ చేపడతారు. మూడు అఖిల భారత సర్వీసులకు ఒకే ప్రిలిమ్స్ పరీక్షా నిర్వహిస్తారు.  సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ద్వారా ఒకే సమయంలో ఒకే విధానంలో జరుగుతుంది.

మెయిన్స్ పరీక్షకు వచ్చేసరికి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ విడిగా నిర్వహిస్తారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్షకు హాజరవ్వాలనుకునే అభ్యర్థులు, సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు దరఖాసు చేసే సమయంలో మెయిన్స్ పరీక్షకు సంబంధించి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్షను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లో మెరిట్ సాధించిన అభ్యర్థును ఉన్న ఉద్యోగ ఖాళీలను అనుచరించి ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ కు అనుమతి ఇస్తారు.

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ ద్వారా భర్తీచేసే ఉద్యోగాలు

  1. ప్రిన్సిపాల్ చీఫ్ కాన్సర్వటర్స్ ఆఫ్ ఫారెస్ట్
  2. అడిషనల్ చీఫ్ కాన్సర్వటర్స్ ఆఫ్ ఫారెస్ట్
  3. డిప్యూటీ కాన్సర్వటర్స్ ఆఫ్ ఫారెస్ట్
  4. అసిస్టెంట్ కాన్సర్వటర్స్ ఆఫ్ ఫారెస్ట్
  5. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్

ఐఎఫ్ఎస్ ఎలిజిబిలిటీ

  • జాతీయత: అభ్యర్థులు ఇండియా లేదా నేపాల్, భూటాన్ పౌరులయి ఉండాలి
  • 1962కు ముందు భారతదేశంకు వలస వచ్చిన టిబెటన్ అభ్యర్థులు కూడా అర్హులు.
  • విద్య అర్హుత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి పశుసంవర్ధక & వెటర్నరీ సైన్స్, బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, జువాలజీ లలో ఒక సబ్జెక్టు తో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
  • బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అభ్యర్థులు కూడా అర్హులు.
  • ప్రయత్నాల సంఖ్యా: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్షకు గరిష్టంగా 6 సార్లు అనుమతి ఇస్తారు. షెడ్యూల్ కులాల వారికీ ఎటువంటి పరిమితి లేదు.
  • ఫీజికల్ ప్రమాణాలు: అభ్యర్థులు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యాంగా ఉండాలి.
  • వయోపరిమితి: దరఖాస్తు చేసే అభ్యర్థుల వయసు 21 నుండి 32 ఏళ్ళ మధ్య ఉండాలి. రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు కేటగిరి వారీగా 3 నుండి 5 ఏళ్ళ సడలింపు ఉంటుంది.
కేటగిరి ప్రిలిమ్స్ ఫీజు మెయిన్స్ ఫీజు
జనరల్ కేటగిరి అభ్యర్థులు 100/- 200/-
ఎస్సి, ఎస్టి, మహిళలు, వికలాంగులు ఫీజు లేదు ఫీజు లేదు

ఐఎఫ్ఎస్ దరఖాస్తు విధానం

ఫారెస్ట్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కు పోటీపడే అభ్యర్థులు మొదట సివిల్స్ సర్వీస్ ప్రిలిమ్స్ పరీక్షకు యుపిఎస్‌సి అధికారిక వెబ్సైటు ద్వారా ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో మెయిన్స్ పరీక్షా ఎంపికకు సంబంధించి ఫారెస్ట్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ లో అర్హుత సాధించిన అభ్యర్థులు తిరిగి ఫారెస్ట్ సర్వీస్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ప్రారంభించే ముందు కావాల్సిన సమాచారమంతా అందుబాటులో ఉంచుకోండి. ప్రతి అభ్యర్థి గరిష్టంగా ఒక్క దరఖాస్తు మాత్రమే చేయాలి. దరఖాస్తు సమయంలో ఖచ్చితమైన వివరాలు అందించాల్సి ఉంటుంది. దరఖాస్తు ద్వారా అందించే తప్పుడు సమాచారంకు పూర్తి బాధ్యత మీరే వహించాలి.

వయస్సు ధ్రువపత్రం, విద్యా అర్హత ధ్రువపత్రాలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులకు చెందినవారు ఇడబ్ల్యుఎస్ సర్టిఫికేట్ మరియు  అవసరమైన వారు వయసు సడలింపు ధ్రువపత్రాలు అందుబాటులో ఉంచుకోవాలి. యుపిఎస్‌సి పరీక్షకు సంబంధించిన సమస్త సమాచారం ఇమెయిల్ మరియు మొబైల్ ఫోన్లకు పంపిస్తుంది. ఇమెయిల్ మరియు మొబైల్ అందుబాటులో ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత అభ్యర్థులదే.

తెలుగు రాష్ట్రాలలో ఎగ్జామ్ సెంటర్లు
హైదరాబాద్, వరంగల్ విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపూర్

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ నమూనా

ఫారెస్ట్ సర్వీస్ సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్షను, సివిల్స్ సర్వీస్ ప్రిలిమ్స్ పరీక్షతో కలిపి ఉమ్మడిగా నిర్వహిస్తారు. ఈ పరీక్ష పూర్తి ఆబ్జెక్టివ్ పద్దతిలో జరుగుతుంది. స్క్రీనింగ్ టెస్టుగా జరిగే ఈ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. జనరల్ స్టడీస్ మరియు ఆప్టిట్యూడ్ టెస్టుగా పిలుచుకునే ఈ రెండు పేపర్లను 400 (200+200) మార్కులకు నిర్వహిస్తారు.

ప్రతి పేపర్లో 100 ముల్టీపుల్ ఛాయస్ ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఈ వంద ఆబ్జెక్టివ్ ప్రశ్నలుకు 2 గంటల సమయంలో సమాధానం చేయాల్సి ఉంటుంది. తప్పు సమాధానం చేసిన ప్రశ్నలకు 1/3 వంతు నెగిటివ్ మార్కులు ఇవ్వబడతయి. ప్రిలిమ్స్ లో సాధించిన మార్కులును కేవలం మెయిన్స్ పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు మాత్రమే ఉపయోగిస్తారు. ఉద్యోగ ఖాళీలు ఆధారంగా ప్రతి పోస్టుకు గరిష్టంగా 10 నుండి 13 మంది అభ్యర్థులను మెయిన్స్ పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు.

పేపరు 1 లో కరెంటు అఫైర్స్, భారతదేశ చరిత్ర, భారత జాతీయ ఉద్యమం, భారతీయ మరియు ప్రపంచ భౌగోళికం, భారత రాజకీయ వ్యవస్థ, పంచాయతీ రాజ్ వ్యవస్థ, పాలిటీ, ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి, పర్యావరణం, జీవవైవిధ్యం, వాతావరణ మార్పులు, ఆర్ట్ అండ్ కల్చర్ మరియు జనరల్ సైన్స్ సంబంధిత అంశాలలో అభ్యర్థి పరిజ్ణానం పరిశీలిస్తారు.

సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్టుగా పిలుచుకునే పేపర్ 2 లో లాజికల్ రీజనింగ్, అనలాటికల్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్, ప్రాబ్లెమ్ సొల్వింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ స్కిల్స్ మరియు మెంటల్ ఎబిలిటీ సంబంధిత అంశాల యందు అభ్యర్థి పరిజ్ఞానం పరీక్షిస్తారు. పేపర్ 2 ను క్వాలిఫై పేపర్ గా పరిగణిస్తారు. ఈ పేపర్లో 33% కనీస మార్కులు సాధించిన అభ్యర్థులు ప్రిలిమ్స్ ఉత్తీర్ణతులుగా పరిగణిస్తారు.

పేపర్ పేరు ప్రశ్నలు మార్కులు సమయం
1 జనరల్ స్టడీస్ (పేపర్ 1) 100 200 2 గంటలు
2 ఆప్టిట్యూడ్ టెస్ట్ (పేపర్ 2) 80 200 2 గంటలు

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ ఎగ్జామ్ నమూనా

ప్రిలిమ్స్ యందు మెరిట్ సాధించి, మెయిన్స్ పరీక్షకు అర్హుత సాధించిన వారు మరోసారి యూపిఎస్సి వెబ్సైటు ద్వారా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్ రాతపరీక్ష విధానం ద్వారా నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 6 పేపర్లు ఉంటాయి.

పేపర్ 1 లో 300 మార్కులకు జనరల్ ఇంగ్లీష్ పరీక్ష నిర్వహిస్తారు. పేపర్ లో 300 మార్కులకు జనరల్ నాలెడ్జ్ సంబంధిత పరీక్షా నిర్వహిస్తారు. పేపర్ 3 నుండి 6 వరకు ఆప్షనల్ సబ్జెక్టుల సంబందించి ప్రశ్నపత్రాలు ఇవ్వబడతాయి. ప్రతి పేపర్ 200 మార్కులకు జరుగుతుంది.

ప్రతి పేపరకు 3 గంటల నిర్ణయిత సమయం కేటయిస్తారు. మెయిన్స్ మొత్తం పరీక్ష 1400 మార్కులకు  జరుగుతుంది. 300 మార్కులకు జరిగే ఇంటర్వ్యూ తో కలుపుకుంటే మొత్తం 1700 మార్కులకు జరుగుతుంది.

సిలబస్ సమయం మార్కులు
పేపర్ 1 జనరల్ ఇంగ్లీష్ 3 గంటలు 300
పేపర్ 2 జనరల్ నాలెడ్జ్ 3 గంటలు 300
పేపర్ 3 ఆప్షనల్ పేపర్లలో రెండు పేపర్లు ఎంచుకోవాల్సి ఉంటుంది. 3 గంటలు 200
పేపర్ 4 3 గంటలు 200
పేపర్ 5 3 గంటలు 200
పేపర్ 6 3 గంటలు 200

 

ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఆప్షనల్ సబ్జెక్ట్స్
అగ్రికల్చర్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ యానిమల్ హుస్బండారీ &వెటర్నరీ సైన్స్
బోటనీ కెమిస్ట్రీ కెమికల్ ఇంజనీరింగ్
సివిల్ ఇంజనీరింగ్ ఫారెస్టరీ జియాలజి
మేథమేటిక్స్ మెకానికల్ ఇంజనీరింగ్ స్టాటిస్టిక్స్
ఫిజిక్స్ జూలోజి

ఫారెస్ట్ సర్వీస్ ఇంటర్వ్యూ

మెయిన్స్ యందు గరిష్ట మెరిట్ సాధించిన అభ్యర్థులను వ్యక్తిగత ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. ఖాళీ ఉన్న పోస్టుల సంఖ్యా ఆధారంగా, ప్రతి పోస్టుకు ఒకరి నుండి ముగ్గురు అభ్యర్థులను ఇంటర్వ్యూ కు పిలుస్తారు. మీరు ఆప్షనల్ గా ఎంచుకునే భాషలో ఇంటర్వ్యూ సమాధానాలు చెప్పే అవకాశం బోర్డు కల్పిస్తుంది. ప్రతి అభ్యర్థికి ఒక ఇంటర్వ్యూ బోర్డు కేటాయించబడింది.

ఇంటర్వ్యూ బోర్డుకు ఒక చైర్మన్ తో పాటుగా నలుగురు బోర్డు సభ్యులను కేటాయిస్తారు. ఇంటర్వ్యూ బోర్డుకు అభ్యర్థికి సంబంధించిన పూర్తి వ్యక్తిగత, విద్య, తాజా పరీక్షలో ఫలితాల సమాచారం అందిస్తారు. ఇంటర్వ్యూ బోర్డు ప్రధానంగా వ్యక్తిగత, సామజిక, మానసిక, విద్య, మేధో, నైతిక, తార్కిక, నాయకత్వ సమర్థత అంశాలలో అభ్యర్థి బల, బలహీనతలను వెలికితీసే దిశలో జరుగుతుంది.

ఇంటర్వ్యూ కు ఎటువంటి కనీస అర్హుత మార్కులు లేవు. ఇంటర్వ్యూ 275 మార్కులకు జరుగుతుంది. ఇంటర్వ్యూలో అభ్యర్థి చూపిన ప్రతిభ ఆధారంగా మార్కులు 1 నుండి 275 వరకు మార్కులు కేటాయిస్తారు. ఇంటర్వ్యూలో సాధించిన స్కోరు సాంకేతికంగా అభ్యర్థి తుది ఫలితాలను ప్రభావితం చేస్తుంది

Post Comment