విదేశాల్లో మాస్టర్ డిగ్రీ లేదా పీహెచ్డీ అడ్మిషన్ పొందిన డిజాబిలిటీ విద్యార్థులకు, నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పేరుతో భారత ప్రభుత్వం ఫైనాన్సియల్ అసిస్టెన్స్ అందిస్తుంది. ఈ స్కాలర్షిప్'కు ఎంపికైన విద్యార్థులకు వీసా ఖర్చుల నుండి మెడికల్ మెంటెనన్స్ వరకు దాదాపు పూర్తి ఖర్చులు భరిస్తుంది. నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ ఏటా 20 మంది డిజాబిలిటీ విద్యార్థులకు అందిస్తుంది.
ఈ స్కాలర్షిప్ విదేశాల్లో అండర్ గ్రాడ్యుయేషన్ చేసే విద్యార్థులకు వర్తించదు. ఇంజనీరింగ్, మెడిసిన్, సైన్స్, కామర్స్, అకౌంట్స్, ఫైనాన్స్, అగ్రికల్చర్, మానేజ్మెంట్, లా, హ్యూమానిటీస్'లలో ఉండే పీజీ మరియు పీహెచ్డీ కోర్సులకు ఇది వర్తిస్తుంది.
స్కాలర్షిప్ పేరు | నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ ఫర్ డిజాబిలిటీ స్టూడెంట్స్ |
ఎవరు అర్హులు | విదేశాల్లో పీజీ /పీహెచ్డీ అడ్మిషన్ పొందిన విద్యార్థులు |
దరఖాస్తుకు ఆఖరు తేదీ | 15-01-2022 |
ఎలిజిబిలిటీ
పీజీ కోసం విదేశాలకు పోయే విద్యార్థులు సంబంధిత డిగ్రీలో 55% మార్కులతో ఉత్తీర్ణత పొందిఉండాలి. పీహెచ్డీ కోసం విదేశాలకు పోయే విద్యార్థులు సంబంధిత పీజీలో 55% మార్కులతో ఉత్తీర్ణతయి ఉండాలి. విద్యార్థి వయస్సు 35 ఏళ్ళు మించి ఉండకూడదు. విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం 6 లక్షలకు మించి ఉండకూడదు. విద్యార్థిపై ఎటువంటి పోలీస్ కేసులు ఉండకూడదు. దరఖాసు చేసే సమయానికి చెల్లుబాటు అయ్యే పాసుపోర్టు, విదేశీ యూనివర్సిటీ అడ్మిషన్ లెటర్, వీసా కలిగివుండాలి.
ఈ స్కాలర్షిప్'కు ఎంపికైన విద్యార్థులకు వీసా చార్జీలు నుండి మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం వరకు అన్ని ప్రభుత్వం భరిస్తుంది. ఈ ఫైనాన్సియల్ అసిస్టెన్స్ పీహెచ్డీ కోర్సులకు నాలుగేళ్లు, మాస్టర్ డిగ్రీ కోర్సులకు మూడేళ్ల వరకు అందిస్తుంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు కింద చూడండి.
మెంటెనన్స్ అలోవెన్సు (ఏడాదికి) | యూఎస్ మరియు ఇతర దేశాలలో అడ్మిషన్ పొందిన వారికీ 15,400 $ యూఎస్ డాలర్లు (దాదాపు 12 లక్షలు), అదే యూకే యూనివర్సిటీలలో అడ్మిషన్ పొందే విద్యార్థులకు 9,900 పౌండ్స్ అందిస్తుంది. |
కంటింజెన్సీ అలోవెన్సు (అత్యవసర ఖర్చులకు) (ఏడాదికి) | యూఎస్ మరియు ఇతర దేశాలలో అడ్మిషన్ పొందిన వారికీ 1,500 $ యూఎస్ డాలర్లు, అదే యూకే యూనివర్సిటీలలో అడ్మిషన్ పొందే విద్యార్థులకు 1,100 పౌండ్స్ అందిస్తుంది |
ఇన్సిడెంటల్ జర్నీ అలోవెన్సు | 20 $ యూఎస్ డాలర్లు |
ఎక్విప్మెంట్ అలోవెన్సు | 15,00 /- రూపాయలు |
అలానే ట్రావెలింగ్ ఖర్చులు, ట్యూషన్ ఫీజు, వీసా చార్జీలు, పూల్ టాక్స్, మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా కోర్సు, యూనివర్సిటీ మరియు దేశం బట్టి చెల్లిస్తుంది. | |
ఇవి కాకుండా యూఎస్ మరియు ఇతర దేశాల్లో ఫెలోషిప్ చేసే విద్యార్థులకు ఏడాదికి 2,400 $ యూఎస్ డాలర్లు అవార్డు అందిస్తుంది. అదే యూకే లో ఫెలోషిప్ చేసే విద్యార్థులకు ఏడాదికి 1560 యూకే పౌండ్స్ అందిస్తుంది. |
ఎలా దరఖాస్తు చేసుకోవాలి
అర్హుత ఉండే అభ్యర్థులు ప్రభుత్వ డిజాబిలిటీ అఫైర్స్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అందిన దరఖాస్తులను డిపార్టుమెంటు ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజాబిలిటీకు చెందిన కమిటీ వెరిఫై చేసి అర్హులైన విద్యార్డులను ఎంపిక చేస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాల కోసం ఈ కింది వెబ్ పోర్టల్ యందు సంప్రదించండి.