అవార్డులు & గౌరవాలు | కరెంటు అఫైర్స్ మే 2022
Magazine 2022

అవార్డులు & గౌరవాలు | కరెంటు అఫైర్స్ మే 2022

డీడీ నేషనల్ పెట్ షో ' బెస్ట్ ఫ్రెండ్ ఫరెవర్' కు ENBA అవార్డ్

దూరదర్శన్ ఛానల్లో పెంపుడు జంతువుల సంరక్షణ సంబంధించి ప్రచారమయ్యే 'బెస్ట్ ఫ్రెండ్ ఫరెవర్' టెలివిజన్ సిరీస్ ఎక్స్చేంజి4మీడియా న్యూస్ బ్రాడ్‌కాస్టింగ్ (ENBA) అవార్డును గెలుచుకుంది. ఈ లైవ్ షో అరగంట నిడివితో నేషనల్ దూరదర్శన్ ఛానల్ ద్వారా వారానికి ఒకసారి ప్రచారం అవుతుంది. ఈ షోలో ఇద్దరు జంతు సంరక్షణ నిపుణులు జంతు సంబంధిత గైడెన్స్ అందిస్తారు.

Advertisement

కామెరూనియన్ యాక్టివిస్ట్'కు వంగరి మాథై ఫారెస్ట్ అవార్డు

కామెరూన్‌కు చెందిన అంతర్జాతీయ మహిళా హక్కుల న్యాయవాది సెసిలీ నడ్జెబెట్'కు 2022 ఏడాదికి సంబంధించి వంగరి మాథై ఫారెస్ట్ ఛాంపియన్స్ అవార్డు దక్కించుకుంది. కొరియా ఫారెస్ట్ సర్వీస్ అందించే ఈ అవార్డును సియోల్‌లో జరుగుతున్న 15వ వరల్డ్ ఫారెస్ట్రీ కాంగ్రెస్‌లో ఆమెకు ప్రధానం చేసారు.

ఈ అవార్డనును కెన్యా నోబెల్ బహుమతి గ్రహీత వంగారి జ్ఞాపకార్థం 2012లో కాలేబోరేటివ్ పార్టనర్షిప్ ఆన్ ఫారెస్ట్ (CPF) సంస్థ ప్రారంభించింది. దీనిని యేటా అడవులను మరియు ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు అసాధారణ కృషి చేస్తున్నవ్యక్తులకు అందిస్తున్నారు.

నలుగురు భారతీయ ఫోటో జర్నలిస్టులకు పులిట్జర్‌ ప్రైజ్

కోవిడ్ విపత్కర సమయంలో దేశంలో చోటుచేసుకున్న వాస్తవ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించిన నలుగురు భారతీయ ఫోటో జర్నలిస్టులకు ప్రఖ్యాత పులిట్జర్‌ అవార్డు లభించింది. ఫీచర్ ఫోటోగ్రఫీ విభాగంలో సత్కరించబడిన నలుగురు భారతీయులలో ఆఫ్ఘనిస్తాన్‌లో హత్యకు గురైన ఫోటో జర్నలిస్ట్ డానిష్ సిద్ధిఖీ కూడా ఉన్నారు.

డానిష్ సిద్ధిఖీతో పాటుగా ఈ జాబితాలో రాయిటర్స్ వార్త సంస్థకు చెందిన ఆయన సహచరులు అద్నాన్ అబిది, సన్నా ఇర్షాద్ మట్టూ మరియు అమిత్ డేవ్ లు ఈ అవార్డు అందుకున్నారు. సిద్ధిఖీ గత ఏడాది ఆఫ్ఘనిస్తాన్‌లో, ఆఫ్ఘన్ దళాలు మరియు తాలిబాన్ల మధ్య జరిగిన ఘర్షణలను కవర్ చేస్తూ మరణించాడు.

పులిట్జర్ ప్రైజ్ గెలవడం సిద్దిఖీకి ఇది రెండోసారి. రోహింగ్యా సంక్షోభంపై కవరేజ్ చేసినందుకు రాయిటర్స్ బృందంలో భాగంగా 2018లో ఈ ప్రతిష్టాత్మక అవార్డు మొదటిసారి అందుకున్నాడు. డానిష్ సిద్ధిఖీ ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకునే విపత్కర పరిస్థితులను కవర్ చేయడంలో సిద్ధహస్తుడు. ఈ జాబితాలో ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభం, హాంకాంగ్ నిరసనలు, ఆసియా,  ఐరోపా ఘర్షణలు ఉన్నాయి.

ఫ్రాంక్ విల్‌జెక్'కు 2022 టెంపుల్టన్ ప్రైజ్‌

2004లో భౌతిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న అమెరికన్ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త మరియు రచయిత డాక్టర్ ఫ్రాంక్ విల్‌జెక్‌కు 2022లో టెంపుల్టన్ ప్రైజ్ లభించింది. టెంపుల్టన్ ప్రపంచంలోనే అతిపెద్ద వ్యక్తిగత జీవితకాల సాఫల్య పురస్కారంగా భావిస్తారు. ఈ అవార్డు గ్రహీతకు 1.3 మిలియన్ డాలర్ల నగదు బహుమతి అందజేస్తారు. ఈ అవార్డు 1972 లో ప్రారంభించారు. ఈ అవార్డును యేటా విశ్వం మరియు మానవ ఉనికి యొక్క లోతైన ప్రశ్నలను అన్వేషించే శాస్త్రవేత్తలకు అందిస్తారు.

2022 పులిట్జర్ ప్రైజ్ విజేతలు

వార్తాపత్రిక, మ్యాగజైన్, ఆన్‌లైన్ జర్నలిజం, సాహిత్యం మరియు సంగీత కూర్పులో ఉత్తమ ప్రతిభ కనబర్చే వారికే ఇచ్చే పులిట్జర్ ప్రైజ్ 2022 విజేతల జాబితా వెలువడింది. ఈ జాబితాలో ఫిక్షన్ విభాగంలో జాషువా కోహెన్ రచించిన ది నెతన్యాహస్ ఉత్తమ పుస్తకంగా ఎంపికయ్యింది. డ్రామా కేటగిరిలో జేమ్స్ ఇజామ్స్ రాసిన ఫ్యాట్ హామ్ విజేతగా నిలిచింది. అలానే నికోల్ యుస్టేస్  యొక్క నైట్ (హిస్టరీ), దివంగత విన్‌ఫ్రెడ్ రెంబర్ట్ యొక్క ఛేజింగ్ మి టు మై గ్రేవ్ ఛేజింగ్ మి టు మై గ్రేవ్ (బయోగ్రఫీ) అవార్డు దక్కించుకున్నాయి. అలానే సంగీతంలో రావెన్ చాకన్ యొక్క వాయిస్‌లెస్ మాస్ విజేతగా నిలిచింది. పూర్తి వివరాల కోసం www.pulitzer.org/prize-winners-by-year/2022 లింక్ సందర్శించండి.

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022

2022 ఏడాదికి సంబంధించి 75వ ఇంటర్నేషనల్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫ్రాన్స్‌లో ఘనంగా నిర్వహించబడింది. ఈ వేడుకలు మే 17 నుండి మే 28 మధ్య నిర్వహించారు. వీటిని మొదటిగా 1946 లో ప్రారంభించారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది కేన్స్‌లో యేటా జరిగే వార్షిక చలనచిత్రోత్సవం. ఇది ప్రపంచం నలుమూలల నుండి డాక్యుమెంటరీలతో సహా అన్ని రకాల కొత్త చిత్రాల ప్రదర్శనకు వేదికగా నిలుస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చలనచిత్రోత్సవంగా గుర్తించబడింది. ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా సినీతారలు వారి అభిమానులు హాజరవుతారు.

ప్రతి ఏడాది ఈవెంట్ ప్రారంభానికి ముందు, ఫెస్టివల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు కేన్స్ అవార్డులు అందజేసేందుకు పూర్తి బాధ్యత వహించే జ్యూరీలను నియమిస్తారు. ఈ ఏడాది ఈ జ్యూరీ బృంధంలో ఇండియా నుండి ప్రముఖ నటి దీపికా పదుకునే చోటు దక్కించుకున్నారు.

  • ఉత్తమ స్క్రీన్ ప్లే: బాయ్ ఫ్రమ్ హెవెన్
  • ఉత్తమ నటి: జార్ అమీర్ ఇబ్రహీమి (హోలీ స్పైడర్)
  • ఉత్తమ నటుడు: సాంగ్ కాంగ్-హో (బ్రోకర్)
  • కెమెరా డి'ఓర్: గినా గామ్మెల్ మరియు రిలే కీఫ్ (వార్ పోనీ)
  • షార్ట్ ఫిల్మ్ పామ్ డి ఓర్:  ది వాటర్ మర్మర్స్

అజయ్ పిరమల్'కు అత్యున్నత బ్రిటీష్ గౌరవ పురస్కారం

పిరమల్ గ్రూప్ చైర్మన్ అజయ్ గోపికిసన్ పిరమల్, హర్ మెజెస్టి ద్వారా ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ (సీబీఈ) గౌరవ కమాండర్‌ని అందుకున్నారు. యుకె-ఇండియా సిఇఒ ఫోరమ్‌కు భారతదేశ కో-చైర్‌గా ఉన్న అజయ్ పిరమల్, యుకె-ఇండియా వాణిజ్య సంబంధానికి చేసిన సేవలకు గాను ఈ గౌరవం అందించారు.

సంగీత కళానిధి & నృత్య కళానిధి అవార్డులు

సంగీత అకాడమీ 2020, 2021 మరియు 2022 సంవత్సరాలకు సంబంధించి సంగీత కళానిధి అవార్డు విజేతలను ప్రకటించింది. సంగీత కళానిధిని అవార్డును ప్రముఖ గాయకుడు నైవేలి ఆర్ సంతానగోపాలన్ (2020), ప్రముఖ మృదంగం విద్వాంసుడు తిరువారూర్ భక్తవత్సలం (2021), వయోలిన్ విద్వాంసులు లాల్గుడి జిజెఆర్ కృష్ణన్ మరియు అతని సోదరి జిజెఆర్ విజయలక్ష్మి 2022కి గాను ఎంపికయ్యారు. అలానే నృత్య కళానిధి అవార్డులను రామ వైద్యనాథన్ (2020), నర్తకీ నటరాజ్ (2021) మరియు బ్రఘా బెస్సెల్ (2022) గాను అందుకున్నారు.

గీతాంజలి శ్రీ రాసిన 'టోంబ్ ఆఫ్ సాండ్'కు బుకర్‌ ప్రైజ్‌

ప్రముఖ రచయిత్రి గీతాంజలి శ్రీ రచించిన హిందీ నవల ‘టోంబ్ ఆఫ్ సాండ్’కు ప్రతిష్ఠాత్మక బుకర్‌ ప్రైజ్‌ లభించింది. దీనితో ఇది అంతర్జాతీయ బుకర్‌ ప్రైజ్‌ గెలుచుకున్న తొలి హిందీ నవలగా చరిత్రకెక్కింది. గీతాంజిలి శ్రీ 2018లో ‘రెట్‌ సమాధి’ పేరుతో హిందీలో నవల రాశారు. దీనిని అమెరికాకు చెందిన అనువాదకురాలు డైసీ రాక్‌వెల్‌ ‘టూంబ్‌ ఆఫ్‌ శాండ్‌’ పేరుతో ఇంగ్లిష్‌లోకి అనువదించారు.

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ నవల 2022గాను అంతర్జాతీయ బుకర్‌ ప్రైజ్‌ను సొంతం చేసుకున్నది. లండన్‌లో జరిగిన వేడుకల్లో అనువాదకురాలు డైసీ రాక్‌వెల్‌తో కలిసి 50 వేల పౌండ్ల (సుమారు రూ.49.4 లక్షలు) నగదు బహుమతిని పంచుకున్నారు. కాగా, ఇప్పటికే ఈ పుస్తకం ‘ఇంగ్లిష్‌ పెన్‌ అవార్డు’ కూడా దక్కించుకున్నది.

Advertisement

Post Comment