స్పోర్ట్స్ అఫైర్స్ | ఫిబ్రవరి 2022
Telugu Current Affairs

స్పోర్ట్స్ అఫైర్స్ | ఫిబ్రవరి 2022

పిఆర్ శ్రీజేష్'కు వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు

భారత పాపులర్ పురుషుల హాకీ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్, 2021 ఏడాదికి గాను వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నాడు. రాణి రాంపాల్ తర్వాత ఈ అవార్డును గెలుచుకున్న రెండవ భారతీయుడుగా నిలిచాడు. 2020లో, భారత మహిళా హాకీ కెప్టెన్ రాణి రాంపాల్, 2019లో తన ప్రదర్శనకు ఈ  గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయురాలుగా చరిత్రకెక్కింది.

Advertisement

అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్-విజేతగా టీమ్ ఇండియా

ఆంటిగ్వాలోని నార్త్ సౌండ్‌లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో భారత్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి రికార్డు స్థాయిలో 5వ అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకుంది. గతంలో 2000, 2008, 2012 మరియు 2018 లలో భారత్ ఈ టైటిల్ సాధించింది.

షేక్ రషీద్ మరియు నిశాంత్ సింధుల క్లాస్ హాఫ్ సెంచరీల సహాయంతో భారత్ 190 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు మరియు 14 బంతులు మిగిలి ఉండగానే చేరుకుంది. అంతక ముందు ఆల్-రౌండర్ రాజ్ బావా ఐదు వికెట్ల అద్భుత ప్రదర్శనతో ఇంగ్లాండ్ జట్టుకు తక్కువ స్కోరుకు పరిమితం చేసాడు. 24 సంవత్సరాలలో టోర్నమెంట్‌లో ఫైనల్‌ కు చేరటం ఇంగ్లాడు జట్టుకు ఇదే మొదటిసారి. విజేత జట్టులోని ప్రతి సభ్యుడికి భారత్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ 40 లక్షల ప్రైజ్ మనీ ప్రకటించారు.

AFC మహిళల ఆసియా కప్ 2022 విజేతగా చైనా

ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ (AFC) మహిళల ఆసియా కప్ ఇండియా 2022 ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను చైనా గెలుచుకుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన AFC ఉమెన్స్ ఆసియా కప్ ఇండియా 2022 ఫైనల్  మ్యాచులో దక్షిణ కొరియాని 3-2తో ఓడించించడం ద్వారా చైనా విజేతగా నిలిచింది. చైనాకు రికార్డు స్థాయిలో ఇది 9వ ఆసియా కప్, కానీ 2006 తర్వాత చైనా గెలిచినా మొదటి ఆసియా ఫుట్‌బాల్ కప్ ఇది.

ఆఫ్రికన్ కప్ ఆఫ్ నేషన్స్ విజేతగా సెనెగల్

సెనెగల్ పెనాల్టీ షూటౌట్‌లో 4-2తో ఈజిప్ట్‌ను ఓడించడం మొదటి ఆఫ్రికన్ కప్ ఆఫ్ నేషన్స్ టైటిల్‌ను గెలుచుకుంది. గతంలో 2002, 2019 ఫైనల్ పోరులో ఓటమి చెందాక మూడవ ప్రయత్నంలో తన మొదటి ఆఫ్రికన్ కప్ ఆఫ్ నేషన్స్ టైటిల్‌ను గెలుచుకుంది. ఆఫ్రికన్ కప్ ఆఫ్ నేషన్స్ అనేది ఆఫ్రికా దేశాలు పాల్గునే ప్రధాన అంతర్జాతీయ పురుషుల అసోసియేషన్ ఫుట్‌బాల్ పోటీ. దీనిలో 54 దేశంలో అర్హుత పొందగా, తుది టోర్నీలో 24 జట్లు టైటిల్ కోసం పోటీ పడతాయి. ఈ టైటిల్'ను అత్యధికంగా 7 సార్లు ఈజిప్టు గెలుపొందింది.

1000 వన్డేల మార్కును చేరుకున్న మొదటి జట్టుగా భారత్

భారత క్రికెట్ జట్టు 1000 అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు ఆడిన మొదటి జట్టుగా నిలిచింది. ఇటీవలే అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన మొదటి వన్డేలో ఈ అరుదైన రికార్డును నెలకొల్పింది. భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ను జూలై 13, 1974న ఇంగ్లాండ్‌తో లీడ్స్‌లో ఆడింది. భారత్ ఆడిన 1000 మ్యాచ్‌లలో 519 మ్యాచ్‌లలో గెలుపొందగా, 431 సార్లు ఓటిమి పొందింది. తొమ్మిది మ్యాచులు టైగా నిలిచాయి. ఈ జాబితాలో భారత్ తర్వాత 958 మ్యాచులతో ఆస్ట్రేలియా రెండువ స్థానంలో, 936 వన్డే మ్యాచ్‌లతో పాకిస్తాన్ మూడో స్థానంలో ఉన్నాయి.

ఈఎస్‌పీఎన్‌ క్రిక్ఇన్ఫో కెప్టెన్ ఆఫ్ ది ఇయర్'గా విలియమ్సన్

న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, ఈఎస్‌పీఎన్‌ క్రిక్ఇన్ఫో యొక్క ' కెప్టెన్ ఆఫ్ ది ఇయర్'గా ఎంపికయ్యాడు. న్యూజిలాండ్ జట్టుకి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీ అందించడంతో పాటుగా న్యూజిలాండును టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌కు చర్చడంలో కెప్టెన్‌గా కీలక భూమిక పోషించినందుకు విలియమ్సన్'కు ఈ గౌరవం దక్కింది. అదే విధంగా భారత వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ కు టెస్ట్ బ్యాటింగ్ అవార్డు అందించింది.

2023 అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సెషన్‌కు ముంబై ఆతిథ్యం

భారతదేశం చివరిసారిగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) సెషన్‌కు ఆతిథ్యం ఇచ్చిన నలభై సంవత్సరాల తర్వాత, 2023 లో ముంబైలో మళ్లీ మరొక సెషన్‌ను నిర్వహించనుంది. ఒలింపిక్ కమిటీలోని భారత ప్రతినిధి నీతా అంబానీ 'దేశ ఒలింపిక్ ఆకాంక్షలకు ఇది ఒక ముఖ్యమైన పరిణామంగా అభివర్ణించారు.

రంజీ ట్రోఫీ అరంగేట్రంలోనే ట్రిపుల్ సెంచరీతో ప్రపంచ రికార్డు

బీహార్ ఆటగాడు సకీబుల్ గని ఫస్ట్ క్లాస్ అరంగేట్రంలో ట్రిపుల్ సెంచరీ సాధించిన మొదటి బ్యాట్స్‌మెనుగా రికార్డు సాధించాడు. మిజోరంతో జరిగిన రంజీ ట్రోఫీ గ్రూప్ మ్యాచ్‌లో గని రికార్డు నెలకొల్పాడు. కేవలం 405 బంతుల్లో 56 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 341 పరుగుల రికార్డు స్కోర్ సాధించాడు.

బీజింగ్‌లో వింటర్ ఒలింపిక్స్ 2022

బీజింగ్ వింటర్ ఒలింపిక్ క్రీడలు 04 ఫిబ్రవరి 2022 న ప్రారంభమై, 20 ఫిబ్రవరి 2022 న ఘనంగా ముగిసాయి. ఈ క్రీడల్లో దాదాపు 91 దేశాల నుంచి 2,871 మంది అథ్లెట్లు, మొత్తం 109 విభాగాల్లో తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించారు. బీజింగ్ వింటర్ ఒలింపిక్ ప్రారంభ మరియు ముగింపు వేడుకలను భారత్ బహిష్కరించింది. ఈ వేడుకలో టార్చ్ బేరర్‌గా గాల్వాన్ దాడిలో పాల్గున్న సైనికుడిని నియమించడాన్ని ఖండిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. అలానే వింటర్ ఒలింపిక్స్ 2022లో భారత్‌ తరపున కేవలం ఒకే ఒక్క అథ్లెట్‌ పోటీపడుతున్నాడు. జమ్ము కశ్మీర్‌కు చెందిన ఆరిఫ్‌ ఖాన్‌, స్కీయింగ్‌ అనే కీడలో భారత్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

కరోనా కారణంగా ఈసారి విదేశీ వీక్షకులకు అనుమతించలేదు. అథ్లెట్లు, అధికారుల కోసం ప్రత్యేకమైన క్లోజ్డ్‌ లూప్‌ సిస్టమ్‌ (బబుల్‌)ను ఏర్పాటు చేశారు. 2008 బీజింగ్ లో మెుదటిసారి వేసవి ఒలింపిక్స్ నిర్వహించారు. 14 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు రెండోసారి ఇక్కడ ఒలింపిక్స్ నిర్వహిస్తున్నారు.

Advertisement

Post Comment