Advertisement
ఏపీ పీఈసెట్ 2023 : షెడ్యూల్ మరియు రిజిస్ట్రేషన్
Admissions Andhra Pradesh Ap CETs

ఏపీ పీఈసెట్ 2023 : షెడ్యూల్ మరియు రిజిస్ట్రేషన్

ఏపీ పీఈసెట్ పరీక్షను రెండేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఫీజికల్ ఎడ్యుకేషన్ (B.P.Ed) లేదా డిప్లొమా ఇన్ ఫీజికల్ ఎడ్యుకేషన్ (D.P.Ed) కోర్సుల యందు మొదటి యేడాది ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తారు. పీఈసెట్ అంటే ఫీజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని అర్ధం. ఈ పరీక్షను ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ మరియు ఆచార్య నాగార్జన యూనివర్సిటీ ఉమ్మడిగా నిర్వహిస్తున్నాయి.

ఏపీ పీఈసెట్ ప్రవేశపరీక్ష రెండు దశలలో జరపడబడుతుంది. మొదటి దశలో అభ్యర్థులకు శారీరక దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. రెండవ దశలో అభ్యర్థి ఎంచుకునే క్రీడా సంబంధిత అంశంపై నైపుణ్య పరీక్ష నిర్వహిస్తారు. క్రీడా సంబంధిత మరియు ఫీజికల్ ఫిట్నెస్ సంబంధిత అంశాలయందు ఆసక్తికనబర్చే అభ్యర్థులకు యెంతగానో ఆకర్షించే ఈ కోర్సుల పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Exam Name AP PECET 2023
Exam Type Entrance Test
Entrance For BP.Ed, D.P.Ed.
Exam Date జూన్ 2023
Exam Level State Level (AP)

ఏపీ పీఈసెట్ 2023 ఎలిజిబిలిటీ

  • అభ్యర్థులు భారతీయ పౌరులై ఉండాలి .
  • అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ చెందినవాడయి ...విద్యా నియంత్రణ చట్టానికి సంబంధించిన లోకల్ నియమాలను సంతృప్తిపర్చాలి.
  •  B.P.Ed కోర్సుల కోసం ధరఖాస్తు చేసేవారు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణతయి ఉండాలి. అడ్మిషన్ సమయానికి అభ్యర్థి వయసు 19 ఏళ్ళు మించకూడదు.
  • D.P.Ed కోర్సుల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు 10+2 లేదా ఇంటర్మీడియట్ పూర్తిచేసి ఉండాలి. అడ్మిషన్ సమయానికి అభ్యర్థుల వయస్సు 16 ఏళ్ళు మించకూడదు .
  • ఫీజికల్ ఎడ్యుకేషన్ టీచర్లుగా(పీటీ ఎస్) పనిచేసే అభ్యర్థులు..ఈ ప్రవేశ పరీక్షకు హాజరవ్వాల్సిన అవసరంలేదు. వీరు నేరుగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారికీ సంబంధిత నోటిఫికేషను అనుసరించి ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఏపీ పీఈసెట్ 2023 షెడ్యూల్

దరఖాస్తు ప్రారంభ తేదీ 23 మార్చి 2023
దరఖాస్తు చివరి తేదీ 10 మే 2023
చేర్పులు మార్పులు 25 మే 2023
హాల్ టికెట్ డౌన్‌లోడ్ 27 మే 2023
పీఈటీ & స్కిల్ టెస్ట్ జూన్ 2023
ఫలితాలు పరీక్ష ముగిసిన వారం తర్వాత

ఏపీ పీఈసెట్ 2023 రిజిస్ట్రేషన్

ఏపీ పీఈసెట్ దరఖాస్తు ఆన్‌లైన్ విధానంలో చేసుకోవాలి. ధరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు 900 రూపాయలు నిర్ణహించగా, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 700 చెల్లిస్తే సరిపోతుంది. దరఖాస్తు రుసుములు ఏపీ ఆన్‌లైన్ కేంద్రాలలో పాటుగా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ విధానాల ద్వారా చెల్లించే అవకాశం కల్పించారు.చెల్లింపు సమయంలో ఉండే అదనపు సర్వీస్ చార్జీలను అభ్యర్థులే భరించాల్సివుంటుంది.

కేటగిరి ధరఖాస్తు ఫీజు
జనరల్ అభ్యర్థులు 900/-
బీసీ అభ్యర్థులు 800/-
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 700/-

దరఖాస్తు ప్రక్రియ మూడు దశలలో పూర్తిచేయాల్సి ఉంటుంది. మొదట దశలో అందుబాటులో ఉన్న పేమెంట్ విధానం ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించాలి. రెండవ దశలో అభ్యర్థి యొక్క విద్యా, వ్యక్తిగత, చిరునామా వివరాలు పొందుపర్చడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేయాలి.

దరఖాస్తు పూర్తిచేసే ముందు మీ వివరాలు పలుమార్లు సరి చూసుకోండి. చివరి దశలో మీ దరఖాస్తును ప్రింటవుట్ తీసుకోవటం ద్వారా మొత్తం దరఖాస్తు ప్రక్రియ  పూర్తివుతుంది. మీరు తీసుకున్న ప్రింటవుట్ పై తాజాగా తీసిన మీ ఫొటోగ్రాఫ్ అతికించి, మీరు చదువుకున్న కాలేజీ ప్రిన్సిపాల్ లేదా గ్రేజిటెడ్ ఆఫీసర్ తో సంతకం చేయించి పరీక్ష సమయంలో ఇన్విజిలేటర్ కు అందించవల్సి ఉంటుంది.

  • వైట్ బ్యాక్ గ్రౌండ్ తో ఈమధ్య కాలంలో తీసుకున్న పాసుపోర్టు సైజు ఫోటో అందుబాటులో ఉంచుకోండి. కంప్యూటర్ లో డిజైన్ లేదా ఎడిట్ చేసిన ఫోటోలు అనుమతించబడవు.
  • మీ సొంత దస్తూరితో చేసిన సంతకాన్ని అప్‌లోడ్ చేయండి. కాపిటల్ లేటర్స్ తో చేసిన సంతకం చెల్లదు.
  • ఫొటోగ్రాఫ్, సంతకం వాటికీ సంబంధించిన బాక్సుల్లో మాత్రమే అప్‌లోడ్ చేయండి. అవి తారుమారు ఐతే దరఖాస్తు పరిగణలోకి తీసుకోరు. ఈ ఫైళ్ల సైజు 10-200 కేబీల మధ్య ఉండేలా చూసుకోండి.
  • దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేసిన ఫొటోగ్రాఫ్ కు సమానమైనది ఇంకో ఫొటోగ్రాఫ్ ను పరీక్ష రోజు ఆయా పరీక్షకేంద్రంలో ఇవ్వాల్సి ఉంటుంది.
  • అడ్మిట్ కార్డు అందుబాటులో ఉండే తేదిలో పిడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్‌లోడ్ చేసుకోండి.
  • పరీక్ష రోజు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది.
  • అడ్మిట్ కార్డు, ఫొటోగ్రాఫ్ తో పాటు వ్యక్తిగత ఐడెంటి కార్డుతో పరీక్షకు హాజరవ్వాలి.
  • నిషేదిత వస్తువులు పరీక్ష కేంద్రంలోకి ఎట్టి పరిస్థితిల్లో అనుమతించబడవు

పరీక్ష రోజు అభ్యర్థులు అవసరమైన స్పోర్ట్స్ మెరిట్ సర్టిఫికెట్లు తో పాటుగా U.G.D.P.Ed / ఎన్ఐఎస్ / యోగ / స్పోర్ట్స్-మేనేజ్మెంట్ / స్పోర్ట్స్ సైన్స్ / స్పోర్ట్స్ జర్నలిజం / ఒలింపిక్ ఎడ్యుకేషన్ వంటి వివిధ అంశాలలో పొందిన ధృవపత్రాలు మరియు N.C.C. సర్టిఫికేట్ (సి-సర్టిఫికేట్ / బి-సర్టిఫికేట్) ల ఒరిజినల్స్ తో పాటుగా ఒక సెట్ జిరాక్స్ కాపీలతో హాజరవ్వాల్సి ఉంటుంది.

ఏపీ పీఈసెట్ 2023 ఎగ్జామ్ నమూనా

బీ.పి.ఎడ్ (రెండేళ్ళు) మరియు డి.పి.ఎడ్ (రెండేళ్ళు) కోర్సులకు ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రెండు దశలలో పరీక్ష నిర్వహిస్తారు. అవి ఎ) శారీరక సామర్థ్య పరీక్ష  బి) ఆటలో నైపుణ్య పరీక్ష.

ఫీజికల్ ఎఫిసియన్సీ టెస్ట్ (శారీరక సామర్థ్య పరీక్ష) 400 మార్కులకు జరుగుతుంది. ఇందులో నాలుగు ఈవెంట్స్ లో పాల్గునల్సి ఉంటుంది. ఇందులో మూడు ఈవెంట్లు తప్పనిసరి చేయాల్సినవి కాగా, నాల్గువది ఆప్షనల్ అవకాశం ఉంటుంది. ప్రతి ఈవెంటుకు 100 మార్కులు కేటాయిస్తారు. దేనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈక్రింది పట్టికలో గమనిద్దాం.

pecet

హై జంప్ లేదా లాంగ్ జంప్ ఆప్షనల్ ఎంపిక అనేది ధరఖాస్తు సమయంలో చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్ష సమయంలో ఆప్షన్ మార్చేందుకు అనుమతి ఉండదు. శారీరక సామర్థ్య పరీక్ష పూర్తిచేసిన అభ్యర్థులకు రెండవ దశలో 100 మార్కులకు గాను అభ్యర్థి ఎంపిక చేసుకున్న క్రీడలో నైపుణ్య పరీక్ష నిర్వహిస్తారు. ధరఖాస్తు సమయంలో క్రీడా ఆప్షన్ ఎంపిక చేసుకొని అభ్యర్థులకు, ఒకటికి మించిన క్రీడలు ఎంపిక చేసుకున్న అభ్యర్థులకు నైపుణ్య టెస్టుకు అనుమతించారు.

1. బాల్ బ్యాడ్మింటన్ 2. బాస్కెట్‌బాల్ 3. క్రికెట్
4. ఫుట్‌బాల్ 5. హ్యాండ్‌బాల్ 6. హాకీ
7. కబడ్డీ 8. ఖో-ఖో 9. షటిల్ బ్యాడ్మింటన్
10. టెన్నిస్ 11. వాలీబాల్

Post Comment