సైన్స్ & టెక్నాలజీ | కరెంటు అఫైర్స్ : మే 2022
Telugu Current Affairs

సైన్స్ & టెక్నాలజీ | కరెంటు అఫైర్స్ : మే 2022

కెనడాలో మొక్కల ఆధారిత కోవిడ్ వాక్సిన్ ఆవిష్కరణ

కెనడాకు చెందిన మిత్సుబిషి కెమికల్ హోల్డింగ్స్ కార్పొరేషన్ మరియు ఫిలిప్ మోరిస్ ఇంటర్నేషనల్ యూనిట్లు కోవిడ్ వైరస్'ను ఎదుర్కునేందుకు ప్రపంచ మొట్టమొదటి మొక్కల ఆధారితా కోవిడ్ వాక్సిన్ రూపొందించినట్లు వెల్లడించింది.

"కోవిఫెంజ్" అనే ఈ వ్యాక్సిన్‌ను మిత్సుబిషి కెమికల్ మరియు ఫిలిప్ మోరిస్ యాజమాన్యంలోని బయోఫార్మా కంపెనీ అయిన మెడికాగో ఇంక్, క్యూబెక్ సిటీ మరియు గ్లాక్సో స్మిత్‌క్లైన్ సంయుక్తంగా అభివృద్ధి చేసాయి. ఇది 18 నుండి 64 సంవత్సరాల వయస్సు గల పెద్దలకు అందుబాటులో ఉండనుంది. ఈ వాక్సిన్ 70% శాతం సమర్ధంగా కోవిడ్ వైరస్'లను నియంత్రిస్తున్నట్లు తెలిపారు.

భారత్ సంతానోత్పత్తి రేటు 2.2 నుండి 2.0కి తగ్గుదల

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-5) యొక్క ఐదవ రౌండ్ పరిశోధనల ప్రకారం, భారతదేశం యొక్క మొత్తం సంతానోత్పత్తి రేటు గత ఐదు సంవత్సరాలలో 2.2 నుండి 2 కి తగ్గుదల నమోదు చేసినట్లు వెల్లడించింది. 2015-16ల మధ్యకాలంలో 2.2 సంతానోత్పత్తి రేటు నమోదు అవ్వగా, 2019-21 మధ్య కాలానికి 2.0కి తగ్గుదల కనిపించింది.

ఇది జనాభా నియంత్రణ చర్యల యొక్క గణనీయమైన పురోగతిని సూచిస్తుందని తెలిపింది. దేశంలో గర్భనిరోధక సాధనాల వినియోగం పెరిగిన కారణంగా గర్భనిరోధక వ్యాప్తి రేటు (CPR) 54 శాతం నుండి 67 శాతానికి గణనీయంగా పెరిగిందని సర్వే కనుగొంది. దీని కారణంగానే ఈ క్షీణత నమోదు అయినట్లు అభిప్రాయపడింది. సంతానోత్పత్తి రేటు అనేది ఒక నిర్దిష్ట కాలవ్యవధిలో స్త్రీ సగటు సంతానపు సంఖ్యను తెలియజేస్తుంది.

బంగాళాఖాతంలో అసని తుపాను

ఆగ్నేయ బంగాళాఖాతంలో మే 8వ తేదీన ఏర్పడిన లోతైన అల్పపీడనం 'అసని' తుఫానుగా బలపడినట్లు భారత వాతావరణశాఖ వెల్లడించింది. ఇది ఉత్తర ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రయాణించి కాకినాడకు దగ్గరంలో తీరం దాటింది. తీరం దాటాక ఉత్తరాంధ్ర జిల్లాల మీదగా, ఒడిశా తీరాల దిశగా వాయువ్య దిశగా ప్రయాణిస్తూ బలహీనపడింది.

ఈ తుపానుకు శ్రీలంక ప్రతిపాదించిన "అసని" పేరును పెట్టరు. సింహళ భాషలో అసని అంటే "కోపం" అని అర్ధం. సాధారణంగా బంగాళాఖాతంలో ఏర్పడే ఉష్ణమండల తుఫానులకు ప్రాంతీయ పేర్లు పెడతారు. అదే అట్లాంటిక్ మరియు దక్షిణ అర్ధగోళంలో (ఇండియన్ మహాసముద్రం మరియు దక్షిణ పసిఫిక్), ఉష్ణమండల తుఫానులకు ఆంగ్ల అక్షర క్రమంలో నామకరణం చేస్తారు. ఇందులో స్త్రీలు మరియు పురుషుల పేర్లతో పాటుగా ప్రత్యామ్నాయ పేర్లు అందుబాటులో ఉంటాయి.

ఇంగ్లాండ్‌లో మంకీపాక్స్ కేసులు గుర్తింపు

ఆర్థోపాక్స్ వైరస్ కుటుంబానికి చెందిన మంకీపాక్స్ వైరస్ వ్యాధి లక్షణాలు లండన్‌లో ఇద్దరు వ్యక్తులలో గుర్తించినట్లు యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ వెల్లడించింది. మంకీపాక్స్ వైరస్, మశూచి (వేరియోలా వైరస్) కలిగించే వైరస్ లాగానే ఉంటుంది. ఇది అరుదైన తీవ్రమైన వైరల్ వ్యాధి. మంకీపాక్స్ వైరస్ మానవులలో వ్యాపించడం పరిమితం, అయితే ఇది దగ్గరి చర్మం, గాలి బిందువులు, శరీర ద్రవాలు మరియు వైరస్-కలుషితమైన వస్తువుల ద్వారా ఒకరి నుండి ఒకరికి సంక్రమిస్తుంది. ఈ కేసులు యునైటెడ్ స్టేట్స్, కెనడా వంటి దేశాలలతో పాటుగా యూరోపియన్ దేశాల్లో కనిపిస్తుంది.

రాజస్థాన్‌లోని రామ్‌ఘర్ విష్ధారి అభయారణ్యంకు టైగర్ రిజర్వ్‌గా గుర్తింపు

రాజస్థాన్‌లోని రామ్‌ఘర్ విష్ధారి అభయారణ్యం భారతదేశం యొక్క 52వ టైగర్ రిజర్వ్‌గా నోటిఫై చేయబడినట్లు కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. రణతంబోర్, సరిస్కా మరియు ముకుంద్ర తర్వాత ఇది రాజస్థాన్‌లో నాల్గవ టైగర్ రిజర్వ్‌గా ఉండనుంది. రామ్‌గర్ విష్ధారి అభయారణ్యం రాజస్థాన్‌లోని బుండి జిల్లాలో ప్రసిద్ధ రణతంబోర్ టైగర్ రిజర్వ్ మరియు ముకుంద్రా హిల్స్ విస్తరించి ఉంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్‌గా మరోసారి టెడ్రోస్

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) డైరెక్టర్ జనరల్‌గా టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్‌ మోరోసారి మెజారిటీతో ఎన్నికయ్యారు. టెడ్రోస్ ఘెబ్రేయేసస్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థకు నాయకత్వం వహించిన మొదటి ఆఫ్రికనుగా గుర్తింపు పొందారు. కోవిడ్ 19 విపత్తు సమయంలో ప్రపంచ దేశాలను ఏకం చేయడంలో, దాన్ని నియంత్రించడంలో ఆయన చూపిన పనితీరు, ఆయన్ని మరోసారి ఆ బాధ్యతలు దక్కేలా చేసాయి. ఈ పదవిలో ఆయన మరో పదేళ్లు ఉండనున్నారు.

 

Post Comment