కేవీఎస్ అడ్మిషన్లు 2023 : కేంద్రీయ విద్యాలయాల సమాచారం
School Education

కేవీఎస్ అడ్మిషన్లు 2023 : కేంద్రీయ విద్యాలయాల సమాచారం

కేంద్ర ప్రభుత్వ ప్రీమియర్ స్కూళ్లుగా చెప్పుకునే కేంద్రీయ విద్యాలయాలను1963 లో స్థాపించారు. ఇవి ప్రధానంగా డిఫెన్స్ మరియు ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల సౌలభ్యం కోసం ఏర్పాటు చేయడం జరిగింది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వృత్తిరీత్యా దేశంలో వివిధ ప్రాంతాల్లో పనిచేయాల్సిన అవసరం ఉన్నందున వారి పిల్లల చదువులకు ఎటువంటి ఆటంకం లేకుండా స్థిరమైన మరియు క్వాలిటీతో కూడిన పాఠశాల విద్యను అందించాలనే లక్ష్యంతో వీటిని రూపొందించారు.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 25 రీజియన్లలో 1252 కేంద్రీయ విద్యాలయాలు అందుబాటులో ఉన్నాయి. ఈ స్కూళ్లలో దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ స్థాయి వరకు విద్యను అభ్యసిస్తున్నారు. కేంద్రీయ విద్యాలయాలు పూర్తిగా ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అధీనంలో నిర్వహించబడతయి.

ఈ స్కూల్స్ అన్ని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్‌ఈ) పాఠ్యప్రణాళికను అనుచరిస్తాయి. కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు సంబంధించి ఫిబ్రవరి చివరి వారంలో ప్రకటన విడుదల చేసి మార్చి నుండి జూన్ మధ్యలో అడ్మిషన్స్ కల్పిస్తారు. ప్రవేశాలు రెండు విడుతలలో జరుగుతాయి.

మొదటి విడతలో క్లాస్ I సంబంధించి అడ్మిషన్ ప్రక్రియ నిర్వహిస్తారు. రెండవ విడతలో వివిధ కేంద్రీయ విద్యాలయాల్లో ఉన్న ఖాళీ సీట్ల ఆధారంగా క్లాస్ II నుండి క్లాస్ VIII వరకు ప్రవేశాలు కల్పిస్తారు. క్లాస్ IX అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది.

కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ ప్రక్రియ

కేంద్రీయ విద్యాలయాల ప్రవేశ ప్రకటన ఏటా ఫిబ్రవరి చివరి వారంలో స్థానిక వార్త పత్రికల్లో, న్యూస్ మీడియాలో విడుదల చేస్తారు. ప్రకటన వెలువడక దగ్గరలో ఉండే కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. అన్‌లైన్ ద్వారా దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకొని సమర్పించాల్సి ఉంటుంది.

కేంద్రీయ విద్యాలయాల అడ్మిషన్ మరియు ట్యూషన్ ఫీజులు

  • అడ్మిషన్ ఫీజు - రూ. 25/-
  • క్లాస్ IX & X ట్యూషన్ ఫీజు - నెలకు - రూ. 200/-
  • క్లాస్ XI & XII ట్యూషన్ ఫీజు - నెలకు - రూ. 300/- (ఆర్ట్స్)
  • క్లాస్ XI & XII ట్యూషన్ ఫీజు - నెలకు - రూ. 400/- (సైన్స్)
  • బాలికలకు పూర్తి ఉచిత విద్యను అందిస్తారు.
  • క్లాస్ 8 వరకు బాలబాలికలకు పూర్తి ఉచిత విద్య.
  • కంప్యూటర్ ఫండ్ - రూ. 100 /- (క్లాస్ III నుండి)
  • కంప్యూటర్ సైన్స్ - రూ. 300/- (క్లాస్ XI & XII )
  • విద్యాలయ వికాసనిధి - నెలకు - రూ. 500/- (అందరూ)

కేవీఎస్ అడ్మిషన్ ఎలిజిబిటీ

కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు మాత్రమే పరిమితం కాదు. కేవీఎస్ ప్రవేశ ప్రకటన భారతీయ విద్యార్థులందరిని దృష్టిలో పెట్టుకుని విడుదల చేయబడుతుంది. కాకుంటే అడ్మిషన్ ప్రక్రియ వివిధ ప్రాధాన్యతల వారీగా నిర్వహిస్తారు.

  • క్లాస్ I అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసే పిల్లల వయస్సు ఐదేళ్లు పూర్తియి ఉండాలి. గరిష్టంగా ఏడేళ్ల వరకు అనుమతిస్తారు. మిగతా తరగతుల అడ్మిషన్ల వయోపరిమితి ఈ క్రింది విదంగా ఉంటుంది.

KVS ELIGIBILITY

  • ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు తాము ప్రభుత్వ ఉద్యోగాల పిల్లలుగా ధ్రువీకరణ పత్రం కలిగివుండాలి.
  • క్లాస్ II నుండి క్లాస్ VIII సంబంధించి దరఖాస్తు చేసే విద్యార్థులు అంతకముందు తప్పనిసరి సిబిఎస్‌ఈ స్కూళ్లలో చదువుకుని ఉండాలి.
  • క్లాస్ IX కోసం దరఖాస్తు చేసే విద్యార్థులు అడ్మిషన్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది
  • క్లాస్ XI కోసం దరఖాస్తు చేసే విద్యార్థులు సిబిఎస్‌ఈ/ సీఐఎస్‌సీఈ/ ఎన్ఐఓఎస్ నుండి క్లాస్ X ఉత్తీర్ణత పొంది ఉండాలి.
  • క్లాస్ I అడ్మిషన్ ప్రక్రియ ఈ ఏడాది ఆన్లైన్ ద్వారా చేప్పట్టనున్నారు.
  • క్లాస్ I అడ్మిషన్లు రిజర్వేషన్ కేటగిరి వారీగా లాటరీ పద్దతిలో చేపడతారు.
  • క్లాస్ XI అడ్మిషన్ ప్రక్రియ క్లాస్ x లో సాధించిన మెరిట్ ఆధారంగా జరుగుతుంది.

కేవీఎస్ అడ్మిషన్ల రేజర్వేషన్ కోటా

కేంద్రీయ విద్యాలయాలు ప్రతి క్లాసుకు గరిష్టంగా 30 నుండి 40 అడ్మషన్లు మాత్రమే అనుమతిస్తాయి. ఈ 40 సీట్లలో 25% (10 సీట్లు) విద్యా హక్కు చట్టం ద్వారా 15% (6 సీట్లు) ఎస్సీలకు, 7.5 % (3 సీట్లు) ఎస్టీలకు 27 % (11 సీట్లు) ఓబీసీలకు మరియు 3% సీట్లు వికలాంగులకు కేటాయిస్తారు. వీటితో పాటుగా సింగిల్ చైల్డ్ గర్ల్ కోటా, స్థానిక పార్లమెంట్ సభ్యని కోటా వంటివి ఉంటాయి.

  • షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ) - 15% (6 సీట్లు)
  • షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ) - 7.5 % (3 సీట్లు)
  • ఓబీసీ - 27 % (11 సీట్లు)
  • వికలాంగులు -
  • 3% సీట్లు

కేవీఎస్ అడ్మిషన్ల ప్రాధాన్యత క్రమం

కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ ప్రక్రియ వివిధ ప్రాధాన్యతల క్రమంలో జరుగుతుంది. ఇందులో మొదట ప్రాధాన్యత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు, తర్వాత కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న అటానమస్ బాడీస్, పబ్లిక్ సెక్టర్ కంపెనీలు మరియు ఉన్నత విద్య సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పిల్లలకు, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ఉంటుంది.

రెండవ ప్రాధాన్యత రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న అటానమస్ బాడీస్, పబ్లిక్ సెక్టర్ కంపెనీలు మరియు ఉన్నత విద్య సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పిల్లలకు చివరిగా మిగతా కేటగిరి విద్యార్థులకు కేటాయిస్తారు. క్లాస్ I సంబంధించి దేశ వ్యాప్తంగా దాదాపు లక్షకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ఈ సీట్ల కోసం ఏటా దాదాపు ఏడు లక్షలకు పైగా విద్యార్థులు దరఖాస్తు చేస్తారు. క్లాస్ II నుండి క్లాస్ VIII సంబంధించి ప్రవేశాలు ఆయా స్కూళ్లలో ఖాళీగా ఉండే సీట్ల సంఖ్యా ఆధారంగా స్థానిక కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.

కేవీఎస్ ప్రవేశానికి కావాల్సిన డాక్యూమెంట్స్

  • డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్
  • ఎంప్లొయ్ రిలేషన్షిప్ ప్రూఫ్ సర్టిఫికెట్
  • ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ (కుల ధ్రువీకరణ పత్రం)
  • ఎంప్లొయ్ సర్వీస్ సర్టిఫికెట్
  • రిటైరుమెంట్ సర్టిఫికెట్ (పదవిరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులు )
  • రెసిడెన్స్ సర్టిఫికెట్
  • టీసీ (క్లాస్ II నుండి క్లాస్ XI)
  • క్లాస్ X సర్టిఫికెట్(క్లాస్ XI అడ్మిషన్స్ కోరకు)