శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ | అడ్మిషన్లు & పరీక్షా ఫలితాలు
Universities

శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ | అడ్మిషన్లు & పరీక్షా ఫలితాలు

శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ 2014 లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన అనంతరం డా వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ తెలంగాణ విభాగాన్ని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ మార్పుచేసి నూతన హార్టికల్చర్ యూనివర్సిటీ స్థాపించారు. ఇది దేశంలో స్థాపించబడ్డ నాల్గువ హార్టికల్చర్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ ప్రస్తుతం మహబూబ్‌నగర్ మోజెర్లలో మరియు హైదరాబాద్ రాజేంద్రనగర్ లో రెండు అనుబంధ శాఖలను కలిగిఉంది.

శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ ప్రస్తుతం పరిమిత సంఖ్యలో కొన్ని యూజీ, పీజీ మరియు డిప్లొమా హార్టికల్చర్ కోర్సులు అందిస్తుంది.

యూజీ కోర్సులు

B.Sc. (Hons.) Horticulture

కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ ప్రస్తుతం అండర్ గ్రాడ్యుయేషన్ పరిధిలో బీఎస్సి (ఆనర్స్) హార్టికల్చర్ కోర్సును మాత్రమే అందిస్తుంది. ఈ కోర్సుకు సంబంధించి మహబూబ్‌నగర్ మరియు రాజేంద్రనగర్ లో దాదాపు 150 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 130 సీట్లు జనరల్ కాగా మిగతా 20 సీట్లు పేమెంట్ కోటాలో భర్తీచేస్తారు.

ఈ కోర్సుకు సంబందించిన ప్రవేశాలు ICAR మరియు ఎంసెట్ ప్రవేశాల మెరిట్ ఆధారంగా చేపడతారు. 85 శాతం సీట్లు ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, మహాబూనగర్, మెదక్, నిజామాబాద్, రంగా రెడ్డి, నల్గొండ, ఖమ్మం మరియు వరంగల్ జిల్లాలకు చెందిన అభ్యర్థులకు కేటాయిస్తారు.

పీజీ కోర్సులు

M.Sc. (Horticulture)

పోస్ట్ గ్రాడ్యుయేషన్ పరిధిలో ఎంఎస్సీ హార్టికల్చర్ కోర్సు అందిస్తుంది. ఈ కోర్సుకు సంబంధించి ఫ్రూట్ సైన్స్ (8 సీట్లు), వెజిటబుల్ సైన్స్ (6 సీట్లు), ఫ్లోరికల్చర్ & ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్చర్ (9 సీట్లు), స్పైసెస్, ప్లాంటేషన్, మెడిసినల్ మరియు అరోమాటిక్ (8 సీట్లు) విభాగాల్లో స్పెషలైజషన్స్ అందిస్తుంది. ఈ కోర్సు చేరేందుకు 50 శాతం మార్కులతో బీఎస్సీ హార్టికల్చర్ ఉత్తీర్ణత అయ్యుండాలి. ఇందులో 25% సీట్లు ICAR కోటాలో భర్తీ చేస్తారు.

పీహెచ్డీ ఇన్ హార్టికల్చర్

మూడేళ్ళ వ్యవధితో హైదరాబాద్ రాజేంద్రనగర్ కాలేజీలో ఫ్రూట్ సైన్స్, వెజిటబుల్ సైన్స్, ఫ్లోరికల్చర్ & ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్చర్, స్పైసెస్, ప్లాంటేషన్, మెడిసినల్ మరియు అరోమాటిక్ విభాగాల్లో  పీహెచ్డీ హార్టీకల్చర్ కోర్సు అందిస్తుంది. ఈ కోర్సులలో చేరేందుకు ఎంఎస్సీ హార్టికల్చర్ ఉత్తీర్ణత సాధించాలి.

డిప్లొమా ఇన్ హార్టికల్చర్

పది అర్హుతతో 4 ఏళ్ళ డిప్లొమా ఇన్ హార్టికల్చర్ అందిస్తుంది. ఈ కోర్సుకు సంబంధించి 50 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

సర్టిఫికెట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్

వెబ్‌సైట్‌
www.skltshu.ac.in
రిజిస్ట్రార్
మెయిల్: registrar@skltshu.ac.in, registrarskltshu@gmail.com
ఫోన్: 040-24014301 (O), 24014312 (F)

Post Comment