కేజీబీవీ అడ్మిషన్లు 2023 : కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయలు
Andhra Pradesh

కేజీబీవీ అడ్మిషన్లు 2023 : కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయలు

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ)ను సమగ్రా శిక్ష ప్రధాన లక్ష్యాలలో భాగంగా 2004 లో వీటిని పరిచయం చేశారు. గ్రామీణ మరియు గిరిజన ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ నిరుపేద బాలికలకు అన్ని వసతులతో పూర్తిస్థాయి ఉచిత రెసిడెన్సియల్ పాఠశాల మరియు ఇంటర్మీడియట్ విద్యను అందించాలనే లక్ష్యంతో వీటిని నెల్కొలపరు.

Advertisement

కేజీబీవీలును రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించేటప్పటికీ వీటికి సంబంధించిన నిధులు కేంద్ర ప్రభుత్వం సర్దుబాటు చేస్తుంది. భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ప్రస్తుతం 352 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను మంజూరు చేసింది. ప్రస్తుతం ఇవి ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ గురుకులం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ఉండే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు క్లాస్ VI నుండి క్లాస్ XII వరకు స్టేట్ సెకండరీ బోర్డు మరియు ఇంటర్ బోర్డు ఆధారిత పాఠ్యప్రణాళికను అందిస్తున్నాయి. ప్రతి పాఠశాలలో దాదాపు 200 మంది  బాలికలకు అన్ని వసతులతో కూడిన పూర్తిస్థాయి రెసిడెన్సియల్ విద్యను అందిస్తున్నారు.

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాలు ఏటా జూన్ నెలలో నిర్వహిస్తారు. అర్హుత కలిగిన బాలికలు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే, విద్యార్థి అర్హుతలు ద్రువీకరించి నేరుగా ఎటువంటి ప్రవేశ పరీక్ష లేకుండా అడ్మిషన్ కల్పిస్తారు.

కేజీబీవీ దరఖాస్తు ప్రక్రియ

అర్హులైన విద్యార్థులు అధికారిక కేజీబీవీ పోర్టల్ (www.apkgbv.apcfss.in) ద్వారా ఆన్‌లైన్  విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఆఫ్‌లైన్ దరఖాస్తులు పరిగణలోకి తీసుకోబడవు. దరఖాస్తులో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకుంటున్న క్లాస్, వ్యక్తిగత మరియు చిరునామా వివరాలు, పుట్టిన తేదీ, రిజర్వేషన్ కేటగిరి, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ వంటి వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది.

దరఖాస్తు చేసుకుంటున్న స్కూల్ కూడా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. చివరిగా 10 కేబీ సైజులో పాస్‌ఫోటో మరియు సిగ్నేచర్ ఫైలును అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనితో దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తియ్యాక దానిని రెండు జతల ప్రింట్ తీసుకుని భద్రపర్చుకోండి. విద్యార్థులు ఎటువంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సి అవసరం లేదు.

సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో దరఖాస్తు సమయంలో పొందుపర్చిన వివరాలు అన్నింటికి సంబంధించి ధ్రువపత్రాలను సమర్పించాలి ఉంటుంది. అందులో క్యాస్ట్ సర్టిఫికెట్, ఆదాయ ధ్రువపత్రం, ఆధార్ కార్డు, టీసీ, స్టడీ సర్టిఫికేట్, రెసిడెన్సీ సర్టిఫికెట్ అలానే ఇతర ఎడ్యుకేషన్ అర్హుత సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంటుంది.

కేజీబీవీ ఇంటర్ అడ్మిషన్లు 2023

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ) లో 2023 విద్యా ఏడాదికి సంబంధించి ఇంటర్ మొదటి ఏడాది ప్రవేశాలు కల్పించేందుకు నోటిఫికేషన్ త్వరలో వెలువడనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 352 కేజీబీవీలలో ఈ నోటిఫికేషన్ ప్రక్రియ ద్వారా అడ్మిషన్లు కల్పిస్తారు.

గత ఏడాది వరకు కేవలం 221 కేజీబీవీలలో మాత్రమే ఇంటర్మీడియట్ విద్యను అందించే వారు. ఈ ఏడాది రాష్ట్రంలో ఉన్న మొత్తం కేజీబీవీలలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అందుబాటులోకి తీసుకొచ్చారు.  .

పది ఉత్తీర్ణత పొందిన పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ బాలికలు గడువులోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోండి. ఆన్‌లైన్  దరఖాస్తులు మాత్రమే అడ్మిషన్ ప్రక్రియకు స్వీకరించబడతాయి. అడ్మిషన్లు టెన్త్ క్లాస్ యందు సాధించిన మెరిట్'తో పాటుగా, స్థానిక మరియు వివిధ కుల రిజర్వేషన్ల కోటా ఆధారంగా నిర్వహిస్తారు ఎంపికైన విద్యార్థులకు మొబైల్ ద్వారా సమాచారం అందిస్తారు.

నోటిఫికేషన్ -
దరఖాస్తు ప్రారంభం  -
దరఖాస్తు తుది గడువు -
షార్ట్ లిస్టు విడుదల -
సర్టిఫికెట్ వెరిఫికేషన్  -
తరగతులు ప్రారంభం దరఖాస్తు చేయండి

కేజీబీవీ క్లాస్ VI అడ్మిషన్లు 2023

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ) లో 2023 విద్యా ఏడాదికి సంబంధించి క్లాస్ VI ప్రవేశాలు కల్పించేందుకు నోటిఫికేషన్ త్వరలో వెలువడనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 352 కేజీబీవీలలో ఈ నోటిఫికేషన్ ప్రక్రియ ద్వారా అడ్మిషన్లు కల్పిస్తారు. అడ్మిషన్లు స్థానిక మరియు కుల రిజర్వేషన్ల కోటా ఆధారంగా నిర్వహిస్తారు.

అర్హుత ఉన్న పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బాలికలు గడువులోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోండి. ఆన్‌లైన్  దరఖాస్తులు మాత్రమే స్వీకరించబడతాయి. ఎంపికైన విద్యార్థులకు మొబైల్ ద్వారా సమాచారం అందిస్తారు.

నోటిఫికేషన్ -
దరఖాస్తు ప్రారంభం  -
దరఖాస్తు తుది గడువు -
షార్ట్ లిస్టు విడుదల -
సర్టిఫికెట్ వెరిఫికేషన్  -
తరగతులు ప్రారంభం -

కేజీబీవీ క్లాస్ VII & VIII అడ్మిషన్లు 2023

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ) లో 2022-23 విద్యా ఏడాదికి సంబంధించి క్లాస్ VII & క్లాస్ VIII ప్రవేశాలు కల్పించేందుకు నోటిఫికేషన్ వెలువడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 352 కేజీబీవీలలో అందుబటులో ఉన్న లేదా, మిగిలిన సీట్లను ఈ నోటిఫికేషన్ ప్రక్రియ ద్వారా అడ్మిషన్లు కల్పిస్తారు.

కేజీబీవీలలోక్లాస్ VI మరియు ఇంటర్ మొదటి ఏడాది యందు మాత్రమే జనరల్ అడ్మిషన్ ప్రక్రియ అందుబాటులో ఉంటుంది. అర్హుత ఉన్న పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బాలికలు గడువులోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోండి.

నోటిఫికేషన్ -
దరఖాస్తు ప్రారంభం  -
దరఖాస్తు తుది గడువు -
షార్ట్ లిస్టు విడుదల -
సర్టిఫికెట్ వెరిఫికేషన్  -
తరగతులు ప్రారంభం -

Advertisement

Post Comment