Advertisement
టీఎస్ ఈఎంఆర్‌ఎస్‌ సెట్ 2023 : ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలు
Telangana

టీఎస్ ఈఎంఆర్‌ఎస్‌ సెట్ 2023 : ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 28 ఏకలవ్య మోడల్ రెసిడెన్సియల్ స్కూళ్లలో ఆరు, ఏడు తరగతుల ప్రవేశాల కోసం టీటీడబ్ల్యుఆర్ఈఐఎస్ దరఖాస్తు కోరుతుంది. కేంద్ర ప్రభుత్వ సహాయంతో నడుస్తున్న ఈ పాఠశాలలను తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ నడుపుతుంది. ఈ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం సీబీఎస్ఈ ఎడ్యుకేషన్ అందిస్తారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఐదు, ఆరవ తరగతి చదువుతూ, కుటుంబ ఆదాయం 2 లక్షల (గ్రామీణ కుటుంబాలకు 1.5 లక్షలు) లోపు ఉండే నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు.

  1. ఆరవ తరగతి అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసే విద్యార్థుల వయస్సు 10 నుండి 12 ఏళ్ళ మధ్య ఉండాలి.
  2. ఏడువ తరగతి కోసం దరఖాస్తు చేసే విద్యార్థులు 11 నుండి 14 ఏళ్ళ మధ్య ఉండాలి.
  3. 8వ తరగతి కోసం దరఖాస్తు విద్యార్థుల వయస్సు 12 నుండి 15 ఏళ్ళ మధ్య ఉండాలి.
  4. 9వ తరగతి కోసం దరఖాస్తు విద్యార్థుల వయస్సు 13 నుండి 16 ఏళ్ళ మధ్య ఉండాలి.
  5. అడ్మిషన్లు ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా, వివిధ రిజర్వేషన్ కేటగిర్ల వారీగా కల్పిస్తారు.

సీట్ల వివరాలు : ఈ విద్య ఏడాదికి సంబంధించి మొత్తం 28 ఏకలవ్య మోడల్ గురుకులాల్లో ఒక్కొదానికి ఆరో తరతగతిలో 60 సీట్ల చొప్పున మొత్తం 1,680 (840 బాలురు, 840 బాలికలు) సీట్లు ఉన్నాయి. ఏడో తరగతిలో 126 (48 బాలికలు, బాలురు 78) సీట్లు, ఎనిమిదో తరగతిలో 81(28 బాలికలు, బాలురు 53) సీట్లు, తొమ్మిదో తరగతిలో 53 (29 బాలికలు, బాలురు 24) సీట్లు అందుబాటులో ఉన్నాయి.

దరఖాస్తు విధానం

అర్హుత ఉన్న విద్యార్థులు TTWREIS అధికారిక వెబ్సైటు (www.tgtwgurukulam.telangana.gov.in) నుండి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తుచేసుకోవాలి. 50 రూపాయల దరఖాస్తు రుసుము చెల్లించడంతో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమౌతుంది. దరఖాస్తు ప్రారంభించే ముందు ఆధార్ కార్డు, స్టడీ అండ్ టీసీ సర్టిఫికెట్లు, బర్త్ డే, రెసిడెన్సియల్, కుల మరియు ఆదాయ ధ్రువపత్రాలు అందుబాటులో పెట్టుకోవాలి.

దరఖాస్తులో పొందుపర్చాల్సిన విద్య, వ్యక్తిగత మరియు చిరునామా వంటి వివరాలు తప్పుల దొర్లకుండా పూరించండి. దరఖాస్తు పూర్తియ్యాక దానికి సంబంధించి ప్రింట్ కాపీ తీసి భద్రపర్చుకోండి. పరీక్షకు 10 రోజుల ముందు హాల్ టిక్కెట్లు అధికారిక వెబ్సైటులో అందుబాటులో ఉంచుతారు.

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు ప్రారంభం 27 మార్చి 2023
దరఖాస్తు చివరితేది 20 ఏప్రిల్ 2023
హాల్ టికెట్ 25 ఏప్రిల్ 2023
పరీక్ష తేదీ 30 ఏప్రిల్ 2023
అడ్మిషన్ తేదీ మే 2023

పరీక్ష విధానం

ప్రవేశ పరీక్షా ఆఫ్‌లైన్ పద్దతిలో పెన్ మరియు పేపర్ (OMR) ఆధారంగా నిర్వహిస్తారు. పరీక్షా పూర్తి ఆబ్జెక్ట్ విధానంలో ఉంటుంది. పతి ప్రశ్నకు 4 ఆప్షనల్ సమాదానాలు ఉంటాయి. అందులో నుండి ఒక సరైన సమాధానాన్ని ఎంపిక చేయాల్సి ఉంటుంది.

సరైన సమాధానం చేసిన ప్రశ్నకు 1 మార్కు కేటాయించబడింది. పరీక్షా స్థాయి మరియు సిలబస్ ముందు చదువుకున్న తరగతికి సంబందించి ఉంటుంది. ప్రశ్నలు తెలుగు, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సోషల్, సైన్స్ మరియు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నుండి ఇవ్వబడతయి. పరీక్షా 2 గంటల నిడివితో 100 మార్కులకు జరుగుతుంది.

క్లాస్ సబ్జెక్టు /సిలబస్ ప్రశ్నలు / మార్కులు సమయం
క్లాస్ 6 మెంటల్ ఎబిలిటీ
అర్థమెటిక్ టెస్ట్
లాంగ్వేజ్ టెస్ట్ (తెలుగు)
50/50
25/25
25/25
2 గంటలు
క్లాస్ 7, 8, 9 ఇంగ్లీష్
తెలుగు
మ్యాథమెటిక్స్
జనరల్ సైన్స్
సోషల్ స్టడీస్
10/20
10/20
30/60
30/60
20/40
2 గంటలు