IES/ISS Exam 2022 | ఎలిజిబిలిటీ, ఎగ్జామ్ నమూనా
Latest Jobs UPSC

IES/ISS Exam 2022 | ఎలిజిబిలిటీ, ఎగ్జామ్ నమూనా

ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ మరియు ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీసులకు సంబంధించి ఖాళీలను భర్తీచేసేందుకు యూపీఎస్సీ దరఖాస్తు కోరుతుంది. 2022 ఏడాదికి కి సంబంధించిన ఈ నియామక ప్రకటన ద్వారా సుమారు 53 ఇండియన్ ఎకనామిక్ (24) & స్టాటిస్టికల్ (29) అధికారులను భర్తీ చేయున్నారు.

ఆసక్తి మరియు అర్హుత ఉండే అభ్యర్థులు యుపిఎస్‌సి అధికారిక వెబ్సైటు నుండి తుడిగడువు లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నియామక ప్రక్రియ రాత పరీక్షా మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా చేపడతారు. ఈ ప్రకటనకు సంబంధించి పూర్తివివరాలు తెలుసుకోండి.

నోటిఫికేషన్ నెంబర్ 07/2022-IES/ISS
నోటిఫికేషన్ తేదీ 06 ఏప్రిల్ 2022
దరఖాస్తు తుది గడువు 26 ఏప్రిల్ 2022
పరీక్షా ఫీజు 200/-
పరీక్షా తేదీ 24 జూన్ 2022 నుండి
అడ్మిట్ కార్డు జూన్ 2022
ఫలితాలు

దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి విధానపరమైన పాలసీలు రూపొందించే ఆర్థిక సలహాదారులు, స్టాటిస్టికల్ విశ్లేషకులను నియమించేందుకు ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ మరియు ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. యూపీఎస్సీ నిర్వహించే ఈ నియామక పరీక్షా ఏటా జూన్ లేదా జులై లో నిర్వహించబడుతుంది.

ఈ పరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థులు గ్రూపు A స్థాయి అధికారిక హోదాతో, దాదాపు 55 ప్రభుత్వ మంత్రిత్వ శాఖల పరిధిలో దేశ ఆర్థిక మరియు స్టాటిస్టికల్ కార్యకలాపాలు నిర్వర్తించే ప్రధాన సాంకేతిక మరియు కార్యనిర్వాహక అధికారులుగా విధులు నిర్వహిస్తారు.

IES/ISS Exam ఎలిజిబిలిటీ

  • జాతీయత: ఇండియా, భూటాన్, నేపాల్ దేశాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. 1962 కు ముందు ఇండియాకు వచ్చి స్థిరపడిన టిబెటియన్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • భారత్ లో శాశ్వతంగా స్థిరపడేందుకు వచ్చిన పాకిస్తాన్, శ్రీలంక, బర్మా మరియు కెన్యా, ఉగాండా, జాంబియా దెసలకు చెందిన వారుకూడా అర్హులు.
  • అసిస్టెంట్ కంమాండెంట్ పోస్టులకు స్త్రీ, పురుషులు ఇద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • వయోపరిమితి:  అభ్యర్థుల వయసు 21 నుండి 30 ఏళ్ళ మధ్య ఉండాలి. రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులకు 2 నుండి 5 ఏళ్ళ సడలింపు ఉంటుంది.
  • విద్య అర్హుత: ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఎకనామిక్స్, అప్లైడ్ ఎకనామిక్స్ / బిజినెస్ ఎకనామిక్స్ / ఎకోనొమెట్రిక్స్ గ్రూపులలో పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. 
  • ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కు దరఖాస్తు చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి స్టాటిస్టిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్, మాథమెటికల్ స్టాటిస్టిక్స్ లలో బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
  • ఎగ్జామినేషన్ నిబంధనలు అనుచరించి అభ్యర్థులు శారీరకంగా ఫిట్ గా ఉండాలి.

IES/ISS Exam దరఖాస్తు ఫీజు

కేటగిరి దరఖాస్తు ఫీజు
జనరల్ అభ్యర్థులు 200/-
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు దరఖాస్తు రుసుము లేదు

IES/ISS Exam దరఖాస్తు విధానం

ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ మరియు ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామినేషన్  కు పోటీపడే అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్సైటు ద్వారా ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రారంభించే ముందు కావాల్సిన సమాచారమంతా అందుబాటులో ఉంచుకోండి. ప్రతి అభ్యర్థి గరిష్టంగా ఒక్క దరఖాస్తు మాత్రమే చేయాలి. దరఖాస్తు సమయంలో ఖచ్చితమైన వివరాలు అందించాల్సి ఉంటుంది. దరఖాస్తు ద్వారా అందించే తప్పుడు సమాచారంకు పూర్తి బాధ్యత మీరే వహించాలి.

వయస్సు ధ్రువపత్రం, విద్యా అర్హత ధ్రువపత్రాలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులకు చెందినవారు ఇడబ్ల్యుఎస్ సర్టిఫికేట్ మరియు  అవసరమైన వారు వయసు సడలింపు ధ్రువపత్రాలు అందుబాటులో ఉంచుకోవాలి. యుపిఎస్‌సి పరీక్షకు సంబంధించిన సమస్త సమాచారం ఇమెయిల్ మరియు మొబైల్ ఫోన్లకు పంపిస్తుంది. ఇమెయిల్ మరియు మొబైల్ అందుబాటులో ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత అభ్యర్థులదే.

తెలుగు రాష్ట్రాలలో ఎగ్జామ్ సెంటర్లు
హైదరాబాద్ చెన్నై బెంగుళూరు

IES/ISS ఎగ్జామ్ నమూనా

ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ మరియు ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామినేషన్ రెండు దశలలో జరుగుతుంది. మొదటి దశలో 1000 మార్కులకు ఆబ్జెక్టివ్ మరియు డిస్క్రిప్టివ్ పద్దతిలో రాతపరీక్ష నిర్వహిస్తారు.

ఈ రాతపరీక్షలో మొత్తం ఆరు పేపర్లు ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్ పేపర్ 1, జనరల్ స్టడీస్ పేపర్ 2 ను మూడు గంట నిడివితో 100 మార్కులకు జరుగుతాయి. పేపర్ 3 నుండి 6 వరకు ఎకనామిక్స్/స్టాటిస్టిక్స్ సబ్జక్ట్స్ సంబంధించిన స్పెషలైజ్డ్ అంశాలతో ఒక్కో పేపర్ 3 గంటల వ్యవధితో 200 మార్కులకు నిర్వహిస్తారు. మొత్తం ఆరు పేపర్లను రోజుకు రెండు పరీక్షలు చెప్పున మూడు రోజులలో పూర్తిచేస్తారు.

ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ ఎగ్జామినేషన్

పేపర్ సిలబస్ /టాపిక్ సమయం మార్కులు
పేపర్ 1 జనరల్  ఇంగ్లీష్ 3 గంటలు 100
పేపర్ 2 జనరల్ స్టడీస్ 3 గంటలు 100
పేపర్ 3 ఎకనామిక్స్ -I 3 గంటలు 200
పేపర్ 4 ఎకనామిక్స్ -II 3 గంటలు 200
పేపర్ 5 ఎకనామిక్స్ -III 3 గంటలు 200
పేపర్ 6 ఇండియన్ ఎకనామిక్స్ 3 గంటలు 200
మొత్తం మార్కులు 1000

ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామినేషన్

పేపర్ సిలబస్ /టాపిక్ సమయం మార్కులు
పేపర్ 1 జనరల్ ఇంగ్లీష్ 3 గంటలు 100
పేపర్ 2 జనరల్ స్టడీస్ 3 గంటలు 100
పేపర్ 3 స్టాటిస్టిక్స్ -I (ఆబ్జెక్టివ్ మోడ్ ) 2 గంటలు 200
పేపర్ 4 స్టాటిస్టిక్స్ -II (ఆబ్జెక్టివ్ మోడ్ ) 2 గంటలు 200
పేపర్ 5 స్టాటిస్టిక్స్ -III (డిస్క్రిప్టివ్ మోడ్) 3 గంటలు 200
పేపర్ 6 స్టాటిస్టిక్స్ -IV (డిస్క్రిప్టివ్ మోడ్) 3 గంటలు 200
మొత్తం మార్కులు 1000
  • స్టాటిస్టిక్స్ పేపర్ -I, స్టాటిస్టిక్స్ పేపర్ -II లో 80 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు 2 గంటల వ్యవధిలో సమాధానం చేయాల్సి ఉంటుంది.
  • స్టాటిస్టిక్స్ పేపర్ -III, స్టాటిస్టిక్స్ పేపర్ -IV డిస్క్రిప్టివ్ పద్దతిలో జరుగుతాయి. ఇందులో స్వల్ప సమాధానపు ప్రశ్నలు ఇవ్వబడతాయి.
  • జనరల్ ఇంగ్లీష్ మరియు జనరల్ స్టడీస్ పేపర్లు ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ మరియు ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కు ఒకే విదంగా ఉంటాయి. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ పద్దతిలో ఉంటాయి.
  • ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ పరీక్షకు సంబంధించి అన్ని పేపర్లు ఆబ్జెక్టివ్ పద్దతిలో ఇవ్వబడతాయి.

IES/ISS ఇంటర్వ్యూ (Viva Voce )

రాతపరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులను వ్యకిగత ఇంటర్వ్యూ కోసం పిలుస్తారు. ప్రతి అభ్యర్థికి నిష్పాక్షికమైన బోర్డు ఇంటర్వ్యూ చేస్తుంది. అభ్యర్థి యొక్క కెరీర్ రికార్డును, ఇతర అంశాలు ముందుగానే ఇంటర్వ్యూ బోర్డుకు అందించబడతయి.

ఇంటర్వ్యూ బోర్డు ప్రధానంగా వ్యక్తిగత, సామజిక, మానసిక, విద్య, మేధో, నైతిక, తార్కిక, నాయకత్వ సమర్థత అంశాలలో అభ్యర్థి బల, బలహీనతలను వెలికితీసే దిశలో జరుగుతుంది. ఇంటర్వ్యూకి  గరిష్టంగా 200 మార్కులు కేటాయిస్తారు. ఇంటర్వ్యూకు ఎటువంటి కనీస అర్హుత మార్కులు లేవు.

ఇంటర్వ్యూ మరియు రాతపరీక్షలో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్లు జూనియర్ స్థాయి ప్రొబెషనరీ ట్రయినింగ్ అందజేస్తారు.

Post Comment